Contents
సమయస్ఫూర్తి-1
Samayaspurthi Story in Telugu for kids ||సమయస్ఫూర్తి ||
అనగనగా గోపాలపురం అనే ఒక పెద్ద ఊరు ఉండేది, ఆ ఊరిలో ఉన్న న్యాయాధిపతి కొన్ని అనారోగ్య కారణాల వల్ల ఆకస్మికంగా మరణించడం వలన వెంటనే వేరే ఒక న్యాయాధిపతిని ఎన్నుకోవాల్సిన అవసరం ఆ వూరి గ్రామాధికారికి వచ్చింది. గ్రామాధికారి ఊరిలో చాటింపు వేయించాడు ,ఎవరన్నా న్యాయాధిపతి హోదాకి పోటీ చేయాలనుకుంటే వారందరూ తన దగ్గరకు వచ్చి కలవాలని చాటింపు వేయించాడు.
చాటింపు ప్రకారం
ఊరిలో అర్హత ఉన్న వ్యక్తులందరూ గ్రామాధికారి వద్దకు వచ్చి కలిశారు,గ్రామాధికారి మిగిలిన అనుభవజ్ఞులైన మరికొందరి సహాయం తీసుకొని ఒక్కొక్కరిని పరీక్షించడం మొదలుపెట్టాడు. అలా ఒక్కొక్కరిని పరీక్షించిన తర్వాత చివరకు ఒక ఇద్దరు వ్యక్తులు మిగిలారు . వారిద్దరూ ఊరిలో చాలా పలుకుబడి ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వారి లో ఎవరిని ఎన్నుకోవాలని గ్రామాధికారి తర్జనభర్జన పడుతున్న సమయంలో అనుకోకుండా గ్రామ సభలోకి ఊరిలో వారు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు.
అతను తాళ్లతో కట్టబడి చాలా బలహీనంగా ఉన్నాడు చూడడానికి కానీ, అతని చూపులు మాత్రం చాలా కోపంతో ఉన్నాయి. గ్రామాధికారి ఊరి వారిని ఏమైంది అని ప్రశ్నించగా, ఊరి ప్రజలు అయ్యా ఈ వ్యక్తి మన కరణం గారి ఇంటి ధాన్యపు గోదాము నుంచి నాలుగు బస్తాలు దొంగిలిస్తున్నాడు ,ఆ సమయంలో మేము ఇతనిని పట్టుకున్నాము అని చెప్పారు. వారి మాటలు విన్న గ్రామాధికారి అక్కడ పోటీలో ఉన్న ఇద్దరిని మీరు ఇతనికి ఎటువంటి శిక్ష విధిస్తారు అని అడగగా . వారిలో మొదటి వ్యక్తి ఇతను చేసినది చాలా పెద్ద నేరం కానీ చూడటానికి చాలా పేదవానిలా , బలహీనంగా ఉన్నాడు కనుక ఇతనికి కేవలం యాభై కొరడాదెబ్బలు మాత్రమే ఇవ్వాలని జాలిగా తీర్పు ఇచ్చాడు.
రెండో వ్యక్తి…
అతనిని పరిశీలనగా చూసి అసలు ఇతను ఎటువంటి దొంగతనం చేయలేదు అని అన్నాడు ,ఊరిలో వారందరూ ఆశ్చర్యపోయి ఏవిధంగా చెబుతున్నావు అని అంటే . అప్పుడు రెండో వ్యక్తి ఈయన ఎంత బలహీనంగా ఉన్నాడు అంటే పూర్తిగా నీళ్ళ తో నిండిన ఒక బిందె ను కూడా పైకి ఎత్తలేడు, అటువంటి వ్యక్తి ఏ విధంగా పూర్తిగా నింపబడిన బియ్యం బస్తాను మోయగలడు పైగా అతని ఒక కాలు సరిగ్గా పని చేయలేని స్థితిలో ఉంది అటువంటి వ్యక్తి అంత బరువైన నాలుగు బియ్యం బస్తాలు తీసుకొని ఏ విధంగా గోడ దాటగలడు అని చెబుతూ చిన్నగా నవ్వుతూ అదీగాక ఈయన మన గ్రామాధికారి ఇంట్లో పనిచేసే రాముడు.
ఇతనికి మారువేషం వేసి తయారు చేసి మన అందరి ముందు నిల్చోబెట్టారు అని చెప్పాడు. ఆ వ్యక్తి మాటలకు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ గ్రామాధికారి వైపు చూడడంతో , గ్రామాధికారి అసలు విషయం చెబుతాడు అవును ఇతను చెప్పింది అక్షరాల నిజం ఎవరైనా న్యాయాధిపతి తీర్పు ఇచ్చే ముందు ఒక వ్యక్తిని విచారించాలి తర్వాత వారి మీద ఒక తీర్పు ఇవ్వాలి .అలానే నీవు కూడా అసలైన అధికారి ఏ విధంగా ప్రవర్తించాలో అదే విధంగా ప్రవర్తించావు. కాబట్టి మేము మరియు గ్రామ ప్రజలు అందరం ముక్తకంఠంతో నిన్ను గ్రామా న్యాయాధికారిగా నియమిస్తున్నాం అని చెప్పారు .
సమయస్ఫూర్తి-2
అనగనగా ఒక ఊరిలో రంగమ్మ అనే ఒక ముసలమ్మ ఉండేది,ఆమె పిల్లలందరూ పక్కనున్న గ్రామం లో స్థిరపడడం వలన ఈమె ఒక్కర్తే ఈ చిన్న ఊర్లో ఉండేది. చిన్నతనం నుంచి తనకున్న పరిజ్ఞానంతో రాట్నం తో బట్టలు తయారుచేసిది , అలా వారానికి ఒకటో రెండో తయారు చేసి వాటిని పక్కన ఉన్న ఇళ్లలో అమ్మి కొంత సొమ్ము సంపాదించేది . తాను వృద్ధాప్యంలో ఉన్నందువలన ఎక్కువ అవసరాలు లేనందువలన, డబ్బు ఎక్కువగా ఖర్చు అయ్యేది కాదు . దానితో కొద్దిగ కొద్దిగగా దాచిన సొమ్ము యిప్పుడు తనను ఊరిలో డబ్బులున్న మనిషిని చేసింది .
రంగమ్మ దగ్గర డబ్బు బాగా ఉంది అన్నవిషయం ఆ చెవిన ఈ చెవిన పడి ఊరంతా పాకింది . అది పాత కాలం కావడం వల్ల కొంత మంది దొంగలు ఎప్పడూ రకరకాల మారువేషాల్లో తిరిగి ,ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయో ఆరాతీసి ,అర్ధరాత్రి వారి ఇంటి మీద దాడి చేసి దొరికింది దొరికినట్లు దోచుకొని వెళ్లేవారు .
అదే విధంగా ఒకరోజు ఒక ముగ్గురు దొంగలు మారువేషం లో చిలకడ దుంపల బండిని తీసుకొని ఊరిలోకి వచ్చి, ప్రతి ఇంటికి వెళ్లి వాటిని అమ్ముతూ, ఆ ఊరిలో ఎవరు ధనవంతులో ఎవరు ఇల్లు దొంగతనానికి వీలుగా ఉన్నాయని గమనించసాగారు. ఆ సందర్భంలోనే వారికి రంగమ్మ దగ్గర బాగా డబ్బులు వున్నాయి అనే విషయం వారి చెవిన పడింది .
అనుకున్న ప్రకారం
దొంగలు అదే రోజు అర్ధరాత్రి రంగమ్మ ఇంటికి దొంగతనానికి వచ్చారు , ఆ సమయంలో ఇంట్లో రంగమ్మ నిద్రపోతుతుంది అనే ఆలోచనతో ముగ్గురు దొంగలు ఇంటి లోకి నెమ్మదిగా ప్రవేశించారు. కానీ ఆ సమయంలో రంగమ్మనిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ కదులుతూ ఉంటుంది . దొంగలు ఇంటిలోకి ప్రవేశించిన అలికిడిని రంగమ్మ పసిగట్టి వారి నుంచి తనను తాను కాపాడుకోవాలి అని ఉద్దేశ్యం తో తన దగ్గర ఉన్న పనిముట్లకు రకరకాల పేర్లు పెట్టి తన రాట్నాన్ని ఉద్దేశించి రాముడూ నువ్వు ఏం చేస్తున్నావ్ ఇంకా నిద్ర పోలేదా అని అడిగింది, వెంటనే తన గొంతు మార్చి నేను పడుకుంటున్నాను అని చెప్పింది. వచ్చిన దొంగలు ఓహో ఈమె ఇంటిలో ఒక కొడుకు కూడా ఉన్నాడు అని అనుకున్నారు తరువాత తన దగ్గర ఉన్న దారం కండెని ఉద్దేశించి దానయ్యా నువ్వు రేపు పొద్దున్నే ప్రయాణానికి సిద్ధమా అని అడిగింది ,వెంటనే గొంతు మార్చి అవునమ్మా… నువ్వు ఇద్దరు అన్నయ్యలు పట్నం వెళ్ళడానికి బండిని సౌకర్యంగా సర్దాను అన్నాడు .
అప్పుడు..
ఆమె తన దగ్గర ఉన్న కర్రను ఉద్దేశించి కామయ్యా … చీకట్లో ప్రయాణం అవ్వాలి అంటే మనం ముందె నిద్ర లెగాలి నువ్వు సిద్ధమా అంది , ఆమె మళ్లీ గొంతు మార్చి సిద్ధంగా ఉన్నాను అమ్మ యిప్పుడే లెగుస్తున్నాను అన్నాది . ఆ మాట వినగానే అక్కడ ఉన్న దొంగలకు చాలా భయం వేసింది ,అమ్మో ఈమెకు ముగ్గురు కొడుకులు ఉన్నారా… అది కాకుండా వీరందరూ ఈ ఇంటిలోవున్నరా యిప్పుడు వాళ్ళు మనలను చూస్తే మన పరిస్థితి ఏంటి!! అని చాలా భయపడి అక్కడ నుంచి నెమ్మదిగా వెంటనే జారుకున్నారు . వాళ్ళు బయటికి వెళ్ళడం చూసిన రంగమ్మ ఇంటిలో దీపాన్ని వెలిగించి బయటకు వెళ్లి ప్రక్కింటివాళ్లకు జరిగిన విషయం చెప్పింది ,వారు అందరు కలసి దొంగలను పట్టుకొని దేహశుద్దిచేసి ,దొంగలను సమయస్ఫూర్తితో పట్టించిన రంగమ్మ ను మెచ్చుకున్నారు. (ఈ కథ సేకరించింది )
For more moral stories please follow:https://telugulibrary.in/stories-for-kids-in-telugu
Samayaspurthi Story in Telugu for kids ||సమయస్ఫూర్తి ||