Contents
సమయస్ఫూర్తి
Animal moral stories in Telugu this article explains how animals cleverly behaved in their trouble time.
ఒక పక్షుల జంట వేరే ప్రాంతం నుండి వలస వచ్చి ఒక తోటలో ఒక పెద్ద చెట్టు మీద గూడుకట్టు కున్నాయి. ఆ చెట్టు క్రింద ఒక పాము చాలా కాలంగా నివసిస్తూ ఉండేది ఆ విషయం ఈ పక్షులు గమనించలేదు. ఒక రోజు పక్షులు తమ గూటిలో వాటి గుడ్లను ఉంచి ఆహారం కోసం వెళ్లాయి ,అవి తిరిగి వచ్చేసరి కి పాము ఆ గుడ్లను తినేసి ఉంటుంది . పక్షులు చాలా బాధపడతాయి ,తరువాత చాలా సార్లు పాము అదే విధంగా వాటి గుడ్లను తినేస్తూవుంటుంది .
పక్షులకు పాము పై చాలా కోపం వస్తుంది దీనిని ఎలాఅయినా చంపివేయాలి లేక పోతే మనలాగే వేరే పక్షులను కూడా బాధపెడుతోంది ఈ పాము అనుకున్నాయి . ఒక చక్కని ఉపాయం చేశాయి , దాని ప్రకారం వీరు నివసిస్తున్న చెట్టు రాణి వాసాని కి కొంత దగ్గరగా ఉంటుంది , ఒక రోజు రాణి తన నగలు అన్ని గట్టుమీద ఉంచి తటాకం లో స్నానం చేయడాని కి దిగుతుంది .
అదను కోసం ఎదురు చూస్తున్న పక్షి రాణి నగ ఒకటి తీసుకొని ఎగురుకుంటూ వెళుతుంది దానిని చూసిన భటులు పక్షిని వెంబడిస్తారు . పక్షి అలా ఎగురుకుంటూ వెళ్లి ఆ నగను పాము పుట్టలో జార విడుస్తుంది,అది చూసిన భటులు నగ కోసం పాముపుట్టను తవ్వుతారు . దానిలో వున్న పాము బుస్సని బయటకు వస్తుంది , దానిని భటులు కర్రలతో కొట్టి చంపివేస్తారు .. రాణి నగను తీసుకువెళతారు.ఇది అంతా ప్రక్కనుండి గమనిస్తున్న పక్షులు,తమను ఇంతకాలం పట్టి పీడిస్తున్న పాము చనిపోయినందుకు ఆనందిస్తాయి.
Moral :చిన్న ఆలోచన కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది
తెలివి తక్కువతనం
ఒక ఊరి లో ఒక రైతు ఉండేవాడు అతని వద్ద ఒక గాడిద ఒక కుక్క ఉండేవి . గాడిద రైతు కు పొలం లో,ప్రయాణాలలో బరువు లో మోయడాని కి సహాయం చేసేది . కుక్క రోజంతా ఇంటిలో ఉండేది,ఇల్లు కాపలా కాసేది కానీ ఏ పని చేసిది కాదు . కానీ యాజమాని ఎప్పుడూ కుక్కనే ప్రేమగా చూసేవాడు , ఈ విషయం గాడిదకు అస్సలు నచ్చేది కాదు. రోజంతా కష్టపడేది నేను కానీ యజమానికి ఆ కుక్క అంటే నే ఇష్టమా! ఎందుకు?
నేనూ యజమాని కి ఇష్టం అయ్యేలా వుంటాను అనుకుంది గాడిద. ఆ రోజు రాత్రి రైతు ఇంటికి దొంగతనానికి దొంగలు వచ్చారు ,ఆ విషయం గమనించిన గాడిద,కుక్క ఎక్కడ వుందో చూసింది అది మంచి నిద్రలో వుంది . అప్పుడు గాడిద ఇదే మంచి సమయం నన్ను నేను నిరూపించు కోవడాని కి అనుకుంది ,వెంటనే తన గార్ధభం కంఠం తో గట్టిగ అరిచింది ,గాడిద అరుపులతో నిద్ర లేచిన రైతు కోపంతో ఏమి ఆలోచించకుండా గాడిదను కర్రతో చితక్కొట్టాడు . ఆ పరిణామం ఆలోచించని గాడిద నివ్వెరబోయింది .
Moral :ఎవరి పని వాళ్ళే చేయాలి
దైర్యం
ఒక అడవిలో ఒక సింహం ఉండేది ,అది ఒకరోజు నక్కను పిలిచి “ఓయ్ నక్క ఈరోజు నాకు చాలా ఆకలిగా వుంది , ఆహారం గా ఏ జంతువు దొరకలేదు నువ్వు వెళ్లి ఏదయినా జంతువుని నాకు ఆహారం గ తీసుకు రా .. లేకపోతే ఈ రోజు నా ఆకలికి నువ్వు బలైపోతావ్ “అన్నది . ఆ మాటలకు నక్కకు చాలా భయం వేసింది ఏ దో విధంగా సింహం ఆకలి తీర్చాలని అడవంతా గాలించింది. చివరకు ఒక కుందేలు దాని కంట పడింది ,హమ్మయ్య ఇప్పటి కన్నా ఒక జంతువు దొరికింది దీనిని ఎలా అయిన సింహాని కి ఆహారం చేయాలి అనుకుంది. నక్క ,కుందేలు దగ్గరకు వచ్చి అయ్యో !ఇక్కడ వున్నావ్ ఏంటి .. సింహం ఆహారం కోసం వేటకు బయలు దేరింది ఈ మార్గం నుండే వెళ్తుంది నువ్వు ఎక్కడున్నా వెళ్లి దాక్కో లేకపోతే సింహాని కి ఆహారం అయిపోతావ్ అంది . అప్పుడు కుందేలు నువ్వు నాకు ఎందుకు సహాయం చేస్తున్నావ్ అంది ,అప్పుడు నక్క నాకు సింహాని కి పడదు పైగా నువ్వు మంచి దానిలా వున్నావ్ అందుకే సాయం చేస్తున్నాను అంది .
కుందేలు దాక్కోడా ని కి ఒక గుహ కూడా చూపించింది, అక్కడ కుందేలును పారిపోకుండా ఉంచి వెంటనే సింహం దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి సింహాన్ని గుహ దగ్గరకు తీసుకు వచ్చింది. గుహ బైట సింహాన్ని నక్కని గమనించిన కుందేలుకు విషయం అర్థమైనది . ఎలాయినా ఈ ఆపదనుండి తనకు తానూ కాపాడు కోవాలి అనుకుంది,ఒక ఆలోచన చేసింది .. తన గొంతు మార్చి వేరే జంతువులాగా మాట్లాడడం మొదలు పెట్టింది “ఏంటి కుందేలు, నువ్వు నా గుహలోకి వచ్చావ్ నువ్వు నాకు ఆహారంగా ఏవిధంగా సరిపోవు ,నిన్ననే నేను ఒక పులిని తిన్నాను ఈ రోజు నాకు సింహాన్ని ఆహారంగా తీసుకోవాలి అనిపిస్తుంది” అని గంభీరమైన కంఠం తో అంది .
ఇది అంతా గుహ బయట వుండి వింటున్ననక్కకు,సింహాని కి చెమటలు పట్టాయి. గుహ లోపల ఎదో భయంకరమైన పెద్ద జంతువు ఉందని భావించి ఒక్క ఉదుటున పరుగు అందుకున్నాయి. ఇది అంతా చాటుగా గమనిస్తున్న కుందేలు తన తెలివిని తానే మెచ్చుకుంటూ ,దేవుడా బ్రతికాను అనుకుని ఊపిరి పీల్చుకుంది.
Moral :అపాయం లో ఉపాయం చేసినవాడే తెలివైనవాడు .
నక్క తెలివి
ఒక అడవి లో ఒక నక్క ఉండేది దానిని ఎవరు లెక్క చేసే వారు కాదు,నక్క కి ఏమో తనను అందరు గొప్పగా చూడాలి అనిపించేది . ఒక రోజు నక్క ఒక ఊరి చెరువు దగ్గరకు వెళ్ళింది అక్కడ బట్టలు ఉతికే వాళ్ళు ఉంచిన నీలిమందు వున్న కుండలో అనుకోకుండా పడింది. ఆ కుండలోనుంచి ఎంతో కష్టపడి బయటకు వచ్చింది,మళ్ళీ తిరిగి అడవి లోనికి వెళ్లి పోంది.
అక్కడ నక్కను తనను చూసి చిన్న చిన్న జంతువులు భయపడి పారిపోవడం చూసింది ,చాలా ఆనందం గా అనిపించింది . ఎందుకా అని ప్రక్కనున్న చెరువులో తనకు తానూ చూసుకుంది ,ఆశ్చర్యం! తన శరీరం అంతా నీలం రంగులో వుంది . అప్పుడు నక్క కి తనని చూసి
అన్ని జంతువులు ఎందుకు పారిపోతున్నాయో అర్థం అయింది. ఈ మార్పుని తనకి అనుకూలంగా మార్చు కోవాలి అనుకుంది. అన్ని జంతువులు వున్న చోటుకు కి వెళ్లి,నేను ఈ అడవిని పాలించడాని కి కొత్తగా వచ్చాను నా మాట వినని వాళ్ళను చంపివేస్తాను అని అంటుంది … ఆ మాట విని ,దాని రూపం చూసి అన్ని జంతువులు భయపతాయి . నక్క చెప్పిన విధంగా అన్ని నడచుకుంటూ వుంటాయి . నక్క అడవికి రాజై పోతుంది ,తన ఇష్టానుసారంగా జంతువులను యిబ్బంది పెడుతూవుంటుంది .. అలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు పెద్ద వర్షం వస్తుంది , వర్షం వలన నక్క శరీరం మీదవున్న నీలిరంగు అంతా పోయి మామూలుగా అయి పోతుంది . నక్క మోసాన్ని కనిపెట్టిన అన్ని జంతువులు నక్కని చంపివేస్తాయి .
Moral : మోసం ఎల్లకాలం నిలువదు.
Animal moral stories in Telugu this article explains how animals cleverly behaved in their trouble time.