Moral stories in Telugu for kids
Spread the love

 

Contents

స్నేహం కోసం

Moral Stories in Telugu for Kids||స్నేహం కోసం||పగటి కలలు|| this article explains how moral stories influences our life

 

Moral Stories in Telugu for Kids

అనగనగా ఒక చిన్న ఊరు ఉండేది ఆ వూరిలో ఎక్కువ జనాభా ఉండేది కాదు ఇళ్ళు కూడా అక్కడక్కడా ఉండేవి . ఆ ఊరిలో ఒకరైతు తన ఇల్లుని  తన పొలాని కి దగ్గరగా ఉంటుందని ,పొలం లో ఒక పక్కకి కట్టుకున్నాడు . అతని వద్ద ఎప్పటి నుంచో ఒక పిల్లి ఉంటుంది,అది ఇల్లు అంతా  తిరిగి ఎక్కడ ఎలుకలు కనిపించిన వాటిని చంపుతూ ఉండేది.

ఆ ఇంటిలో చాలా కాలం నుంచి ఒక ఎలుక , ఈ పిల్లి కంటికి కనబడకుండా జాగ్రత్తగా దాక్కొని ఉంటుంది . ఆ ఇంటిలో వేరే ఏ  ఎలుకా ఉండదు,ఈ ఎలుక మాత్రమే ఒంటరిగా ఉంటుంది . అందుకు ఎలుకకు  చాలా ఒంటరితనం గా వుండి  ఎవరైనా స్నేహితులు ఉంటే  బాగుణ్ణు అనుకుంటుంది ,కానీ ఆ ఇంటిలో యజమాని కుటుంబం ,పిల్లి తప్ప ఎవరు వుండరు. ఎలుక ఎలాగైనా పిల్లి తో స్నేహం చేయాలి అనుకుంటుంది, అది అంత సులభమైన విషయం  కాదు పైగా ప్రాణసంకటం .. అయినా  సరే ఎలుక ,పిల్లితో ఎలాయినా స్నేహం చేయాలి అని ధృడంగా  నిశ్చయించుకుంటుంది .

ఒక రోజు..

ఎలుక పిల్లికి ఇష్టమైన పదార్థాలు అన్ని, ఒక చోట  పిల్లికి కనబడే విధంగా వుంచి పిల్లి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలో పిల్లి వస్తుంది ,ముందు అక్కడ వున్న తిండి పదార్థాలు అన్ని చూస్తుంది. యజమాని అసలే తిండి సరిగ్గాపెట్టాడేమో ,వాటినుంచి తల తిప్పుకో లేక పోతుంది.తినడం మొదలు పెడుతుంది ,అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎలుక భయంగా నెమ్మదిగా పిల్లి ముందుకు వస్తుంది . ఒక్కసారి ఎలుకని చూడడం తో పిల్లి ఉల్లిక్కి పడుతుంది ,వెంటనే దాడి చేయడాని కి సిద్ధం అవుతుంది.

అప్పుడు ఎలుక ధైర్యానంత కూడగట్టుకొని పెద్దగా  ఆగు  మిత్రమా  అంటుంది ,అప్పుడు పిల్లి ఒక్క నిమిషం ఆగి ఏంటి మిత్రమాన  నేను  నీకా అని గట్టిగ నవ్వుతుంది . అప్పుడు ఎలుక చూడు మిత్రమా నాకు నీతో స్నేహం చేయాలని వుంది అందుకే నీకు ఇష్టమైన పదార్థాలు అన్ని ఇక్కడ ఏర్పాటు చేశాను నీకోసం అంటుంది,ఆ మాట విని పిల్లి ఈ పదార్థాలు కన్నా నాకు ఎలుకను తినడం అంటే చాలా ఇష్టం నీకు తెలీదా అని ఎటకారం గా  అంటుంది . అప్పుడు ఎలుక,అలా  కాదు మిత్రమా నీవు నాతో స్నేహం చేస్తే నీకు నచ్చిన పదార్థాలు రోజు నేను నీకోసం తెస్తాను అంటుంది. అప్పుడు పిల్లి మనసులో ఈ ఎలుక ఏ మైనా పిచ్చిదా నాతో స్నేహం అంటుంది, అయినా రోజు ఇష్టమైన పదార్థాలు తినడం నాకు ఇష్టమే . కుదిరినన్ని రోజులు ఇలా ఇష్టమైన ఆహారం తిందాం కుదరని రోజు ఎలుకని తిందాం అని అనుకొని ,మనసులో నే నెమ్మదిగా నవ్వుకుంటుంది . అప్పుడు ఎలుకతో పిల్లి సరే మిత్రమా ఈ రోజు నుండి మనం మిత్రులం అంటుంది.ఎలుక అనుకున్నది సాధించినందుకు తన లో తాను మురిసిపోతుంది .

అప్పటి నుంచి..

రోజు ఎలుక ఆహారం తేవడం, పిల్లి ఆ ఆహారం తింటున్నంతసేపు ఎలుకతో మాట్లాడేది. పిల్లి ఆహారం కోసం ఎలుకతో స్నేహం మొదలు పెట్టింది కానీ ,రోజు రోజు కి పిల్లి కి ఎలుక పై ఇష్టం పెరుగుతూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడచిన తర్వాత ఒక రోజు పిల్లి వచ్చేసరి కి ఆహారం సిద్ధంగా లేదు, ఎలుక కూడా ఎక్కడా కనబడలేదు. పిల్లి కి మనసు అంతా బాధగా అనిపించింది ,అప్పుడు పిల్లి ఏంటి నాకు ఎలుక పై కోపం రావాలి కదా మరి బాధ కలుగుతుందేంటి ,అంటే నేను ఎలుకను స్నేహితుడిగా నిజంగా భావిస్తున్నాను అన్నమాట అనుకుంది .

మరి ఇప్పుడు నా స్నేహితుడు ఏ ఆపదలో వున్నాడో తెలుసు కొని అతడిని కాపాడాలి అనుకుంది వెంటనే ఎలుక కోసం వెతకడం ప్రారంభించింది. ఒక మూల కాలు విరిగి ,నీరసించి పోయి వున్న ఎలుకని చూసింది.. దానిని నోటకరచి జాగ్రత్తగా ఇంటిలోని కి తీసుకు వచ్చి ఎలుకకు కావలసిన ఆహారం అందించింది,కొన్ని రోజులకి ఎలుక కోలుకుంది. తరువాత మళ్ళీ..  రోజూ  పిల్లి ,ఎలుకలు  కలుసు కొనేవారు ఒకరి కోసం ఒకరు ఆహారం ఇచ్చుకొనేవారు , మాట్లాడు కొనేవారు ఆనందంగా గడిపేవారు. వారి స్నేహబంధాన్ని అలా కొనసాగించారు.

Moral:సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తే శత్రువుతో కూడా స్నేహం చేయవచ్చు ,నిలబెట్టుకోవచ్చు .

Sireesha.Gummadi

Moral Stories in Telugu for Kids||స్నేహం కోసం||పగటి కలలు|| this article explains how moral stories influences our life

For suspense stories please click here


పగటి కలలు

Moral Stories in Telugu for Kids

అనగనగా  ఒక ఊరిలో రంగయ్య  అనే  ఒక అతను  ఉండేవాడు ,రంగయ్య కు కొంచం ఆశ ఎక్కువ ఏ పని స్థిరంగా చేసేవాడు  కాదు,అందుకు ఎవ్వరు అతనికి చెయ్యడాని కి పని యిచ్చేవారు  కాదు. అలాగే ఒకరోజు ఏ  పని లేక ,తిండిలేక ఖాళీగా కూర్చొని వున్నాడు మార్గం పక్కన. అప్పుడు ఒక నూనె వ్యాపారి రంగయ్యని చూసి జాలి పడి ,అతనిని పిలిచి నీకు ఒక పనియిస్తాను చేస్తావా అంటాడు అప్పుడు రంగయ్య ఏం పని  అంటాడు . అప్పుడు వ్యాపారి నీకు నేను ఒక కుండ నిండుగా నువ్వుల నూనె ఇస్తాను నువ్వు దానిని ప్రక్క ఊరి లో వున్న సంతలో అమ్ముకు రావాలి , అందుకు  గాను నేను నీకు కొంత డబ్బు ఇస్తాను ,ఆహారం కూడా పెడతాను అన్నాడు .

వ్యాపారి మాటలు రంగయ్య కి నచ్చాయి ,సరే అని నూనె కుండ తీసుకొని ప్రక్క ఊరి కి బయలు దేరాడు రంగయ్య. ఒక చేతి తో తలమీద వున్న కుండ పట్టుకున్నాడు ఇంకో చేతి తో దారిలో సాయంగా  ఉంటుందని ఒక కర్రను పట్టుకున్నాడు . అలా కొంత దూరం వెళ్ళాక , కుండ పట్టుకున్న చేతి కి ఎదో  తగిలింది . ఏంటా అని జాగ్రత్తగా తడిమాడు,అవి రెండు  నువ్వు గింజలు అని గుర్తించాడు. నువ్వులు మర పడుతున్నప్పుడు అంటుకొని ఉంటాయి అనుకున్నాడు .

ఇంకా కొంత దూరం…

నడిచాక ఒక ఆలోచన వచ్చింది , ఈ రెండు నువ్వు గింజలను భూమి లో వేద్దాం అప్పుడు రెండు మొక్కలు వస్తాయి . ఆ మొక్కలకు చాలా నువ్వులు వస్తాయి ,వాటిని ఒక ఖాళి స్థలం లో వేద్దాం .. అప్పుడు చాలా నువ్వుల మొక్కలు వస్తాయి ,వాటి కి చాలా నువ్వులు వస్తాయి . వాటి ని నేను కూడా సంత  లో అమ్ముతాను ,అప్పుడు డబ్బు లు వస్తాయి .ఆ డబ్బు తో  మళ్ళీ  నువ్వులు కొంటాను, మళ్ళీ నువ్వులు పండిస్తాను … ఇలా చాలా సార్లు చేసి బాగా డబ్బు సంపాదిస్తాను .

అప్పుడు ఊరి లో పెద్ద జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను , జమీందారు కూతురి తో రోజు సేవలు చేఇంచు కుంటాను. ఆమె చెప్పిన పని చేయక పోతే పెద్ద కర్రతో ఇలా కొడతాను, అని తన చేతిలో వున్న కర్ర పైకి లేపాడు ఆ కర్ర వెళ్లి తలమీద వున్న నూనె కుండకు తగిలి కుండ పగిలి పోయింది …

నూనె అంతా మొహం మీద పడేసరికి రంగయ్య పగటి కలలోంచి బయటకు వచ్చాడు . జరిగిందంతా తలచుకొని తన తెలివితక్కువ తనాన్ని తానే తిట్టుకుంటూ ,ఆకలి  తో ఖాళీ చేతులతో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు .

Moral : కలలకు ప్రయత్నం తోడైతేనే అది వాస్తవం అవుతుంది ,లేక పోతే అది పగటి కలలా ఉండిపోతుంది.

కథ నచ్చిందా.. ,నచ్చితే కామెంట్ చేయండి . మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ బాక్స్ లో అడగండి 🙂

Moral Stories in Telugu for Kids||స్నేహం కోసం||పగటి కలలు|| this article explains how moral stories influences our life

error: Content is protected !!