Bethany Hamilton story
Spread the love

Bethany Hamilton story:

Contents

విధితో పోరాడి విజేతగా నిలచిన బెథానీ హామిల్టన్…

ఇదే నా లక్ష్యం ఇదే నా జీవితం అని నిర్ణయించుకున్న తర్వాత అది తలక్రిందులైతే జీవించాలి అనిపిస్తుందా??

ఖచ్చితంగా అనిపించదు …

కానీ అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ‘బెథానీ హామిల్టన్’ అందరిలా ఆలోచించలేదు! ఆశకొల్పోలేదు! పోరాడింది గెలిచి చూపించింది…

బెథానీ హామిల్టన్ యునైటెడ్ స్టేట్స్ లోని హవాయ్ అనే ప్రాంతం లో జన్మిచింది. ఆమె తండ్రి ఒక రెస్టారెంట్ లో సర్వర్ గా పనిచేసే వాడు తన కూతురి జీవితం తనకన్నా మెరుగ్గా ఉండాలనే ఉదేశ్యంతో సర్ఫింగ్ నేర్పించాడు. బెథానీ హామిల్టన్ కూడా చాలా కష్టబడి సర్ఫింగ్ లో నైపుణ్యం సంపాదించింది.
13 ఏళ్ల వయస్సులో సర్ఫింగ్ స్టార్‌గా గొప్పపేరు సంపాదించింది ఇంక తానూ జీవితంలో ఎంతో గొప్ప స్థాయికి వెళ్తుంది అని అందరూ భావిస్తున్న సమయంలో… ఆమె ఒకరోజు తన స్నేహితులతో కలిపి ఎప్పుడూలాగే సర్ఫింగ్ చేయడానికి సముద్రానికి వెళ్ళింది. అక్కడ 14 అడుగులు వున్న ఒక టైగర్ షార్క్ ఆమె ఎడమ చేతిని కొరికి వేసింది. అనుకోని సంఘటనకి భయభ్రాంతులకు గురైన ఆమె గట్టిగా అరుస్తూ అక్కడ షార్క్స్ ఉన్నాయని తన స్నేహితులందరినీ జాగ్రత్తపరిచింది. కానీ.. తాను మాత్రం తన ఎడమ చేతిని పూర్తిగా కోల్పోయింది.

అయినప్పటికీ తనలోని ధైర్యాన్ని పట్టుదలని వదల్లేదు నెలరోజుల్లో మళ్లీ సర్ఫింగ్ చేయడానికి సిద్ధపడింది. ఈమె ధైర్యాన్ని చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, వాళ్ళ ఆశ్చర్యాన్ని రెండింతలు చేసేలా బెథానీ ఆ పోటీలో నెగ్గి విధితనను ఓడించినా జీవితంలో తాను ఓడిపోలేదని నిరూపించింది.

మళ్ళీ మళ్ళీ గెలిచింది. ఎందరో నిస్సహాయులకు ఆశాదీపాన్ని చూపించింది. నిరాశలో ఉన్నా ఆశయానికి ఎలా ఊపిరి పోయొచ్చు చేసి చూపించింది.

 

sireesha.G

Bethany Hamilton story:

More inspirational Stories…

 

భవిష్యత్ తరాలకై గగనంలో అలుపెరగని పోరాటం చేసిన సామాన్యురాలి కథ

Short Inspirational and Motivational Stories with Morals in Telugu

Valasa cooli Telugu inspirational Story

Inspirational women in Indian history in Telugu

 

 

 

error: Content is protected !!