Contents
Inspirational women in Indian history
ఝాన్సీలక్ష్మి భాయ్
Inspirational women in Indian history in Telugu,This article explains to you about Jhansi Laxmi Bhai’s story in short.
ఝాన్సీలక్ష్మి భాయ్ ఈమె నే మనికర్ణిక అనే పేరుతో పిలిచేవారు, ఝాన్సీలక్ష్మి భాయ్ చాలా ధైర్యం, పట్టుదల కలిగిన స్త్రీ . ఈమె ఝాన్సీరాజ్యాని కి రాణి ఇది ఉత్తర భారత దేశం లో వుంది. లక్ష్మి భాయ్ కి ఆమె భర్త అయిన ఝాన్సీరాజు గంగాధర రావు కి పిల్లలు లేరు,అందువలన వారు దామోధర్ అనే బాబును దత్తత తీసుకున్నారు.
అప్పటి లో మన భారత దేశం బ్రిటిష్ వారి అధికారం లో ఉండేది ,బ్రిటిష్ అధికారులు దామోదర్ ని ఝాన్సీ వారసుడు గా అంగీకరించలేదు .దానితో లక్ష్మి భాయ్ రాజ్యాని కి బ్రిటిష్ వారి కి చాలా గొడవలు జరిగాయి వారు లక్ష్మి భాయ్ ని చాలా ఇబ్బంది పెట్టారు . అదే సమయం లో బ్రిటిష్ వారి కి వ్యక్తిరేకం గా మన భారతీయ సైనికులు తిరుగుబాటు చేయడం ప్రారంభించారు,ఈ అవకాశం లక్ష్మి భాయ్ వినియోగించుకుంది బ్రిటిష్ వారి పై పోరాటం మొదలు పెట్టింది దీనికి చుట్టు ప్రక్కల రాజ్యాలు సహకరించాయి.
దానితో లక్ష్మి భాయ్ ఝాన్సీ రాజ్యాన్ని కాపాడు కో గలిగింది కానీ బ్రిటిష్ వారి వద్దనుండి తనకు ప్రమాదం ఉందని గుర్తించి బ్రిటిష్ సైన్యాన్ని మరో వైపు మళ్లించింది ,అప్పుడే మరో సమర యోధుడు తాంతియాతోపే,లక్ష్మి భాయ్ తో చేతులు కలిపారు తన సైన్యాన్ని లక్ష్మి భాయ్ సైన్యం తో కలిపాడు,వారు ఇద్దరు కలిపి బ్రిటిష్ వారి ఆద్వర్యం లో వున్న గ్వాలియర్ కోటను ఆక్రమించారు. దానితో బ్రిటిష్ వారు లక్ష్మి భాయ్ సాహసాని కి భయపడ్డారు ఈమెను ఎలాయినా అంతంచేయాలి అని ఎక్కువ సైన్యం తో ఒకేసారి దాడిచేశారు ,లక్ష్మి భాయ్ వీరోచితంగా పోరాడింది కానీ బ్రిటిష్ వారి సైన్యం వారి ఆయుధాలు ఎక్కువ కావడం తో వారిని ఎక్కువసేపు ఎదిరించలేక తన ఆఖరి శ్వాసవరకు పోరాడి పోరాడి వీర మరణం పొందింది.చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయింది…
ఇంకొంచం వివరంగా ….
జననం : 1828,నవంబర్ 19 (కాశీ )
మరణం : 1858(గ్వాలియర్ )
తల్లి : భగీరధీ భాయ్
తండ్రి : మోరోపంత్ తాంబే
భర్త : గంగాధర రావు
కొడుకు : దామోదర్ రావు
అప్పటి భారత గవర్నర్ జెనరల్: లార్డ్ డల్హౌసీ
రాణి రుద్రమ్మ దేవి
Inspirational women in Indian history in Telugu,this article explains to you about Rani Rudramma Devi’s story in short.
రాణి రుద్రమ్మ దేవి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే గణపతిదేవుని కుమార్తె ,గణపతి దేవుని కి ఇద్దరు కుమార్తెలు కావడం తో రుద్రమ్మ దేవిని మగపిల్లవాడిలా పెంచారు అన్నియుద్ధ విద్యలు నేర్పించి ఎటువంటి పరిస్థితుల్లోఅయినా ఎవరినైనా ఎదిరించగలిగే విధంగా గొప్ప పరాక్రమశాలిగా పెంచారు. అప్పటి కాలం లో ఒక స్త్రీ రాజ్యాధి కారం చేపడుతుంది అంటే ఎవ్వరు అంగీకరించరు కనుక రుద్రమ్మదేవి పరిపాలనని అంగీకరించని చాలా మంది సామంత రాజులు రుద్రమ్మదేవికి వ్యక్తితిరేకంగా పోరాటం చేశారు వారు అందరి తో వీరోచితంగా పోరాడి విజయం సాధించింది రుద్రమ్మదేవి.
కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొదటి మహిళగా చక్రవర్తి గా నిలచింది,తరువాత ఇరవై ఏడు సంవత్సరాలు అలుపెరగకుండా నిర్విరామ పోరాటాలు చేసి కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరింపచేసింది. రుద్రమ్మదేవి పరిపాలనలో కాకతీయ సామ్రాజ్య వైభవం అద్వితీయంగా ఉండేది . రాజ్యం అంతటా చెరువులు త్రవ్వించింది దీని వలన వ్యవసాయ రంగ బాగా అభివృద్ధి చెందింది,గ్రామాలలో ఆసుపత్రులు నిర్మించింది ప్రజలను తన సొంత పిల్లలుగా చూసుకొనేది,ఈ విధంగా సమర్ధవంతంగా కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది.
రుద్రమ్మ దేవి భర్త నిడదవోలు రాజయిన చాళిక్య వీరభద్రేశ్వరుడు వీరికి ఇద్దరు కుమార్తెలు,వారసుడు లేక పోవడం తో రుద్రమ్మ పెద్దకూతురు కొడుకు అయిన ప్రతాప రుద్రున్ని దత్తత తీసుకొని రాజుని చేసింది .
రుద్రమ్మ చేతిలో ఎన్నో సార్లు ఓడిపోయిన అంబదేవుడు రుద్రమ్మ దేవిని అంతం చేయడానికి చుట్టుప్రక్కల రుద్రమ్మ కి వ్యతిరేకంగ వున్న సామంత రాజులు అందరిని ఏకం చేసి ఒకేసారి తిరుగుబాటు చేసాడు దీనితో రుద్రమ్మ స్వయంగా తానే యుద్ధం లోకి దిగింది, తన ఎదుటవున్న ఒక్కక్క శత్రువుని చాకచక్యంగా మట్టుబెడుతూ తన పోరాటం సాగించింది.శత్రువులు దొంగదెబ్బతీయడం తో యుద్ధరంగం లో వీరమరణం పొందింది…
ఇంకొంచం వివరంగా ….
పేర్లు :రుద్రాంబ ,రుద్రదేవుడు
తండ్రి : గణపతిదేవుడు
భర్త : చాళిక్య వీరభద్రేశ్వరుడు
కొడుకు : ప్రతాప రుద్రుడు
పరిపాలించిన కాలం : 1262-1289
రుద్రమదేవి కాలం లో పేరిణి నృత్యం సృష్టించబడింది
ఒక ఆడపిల్లను తమ తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల లా కట్టుబాట్లతో కాకుండా ఒక వ్యక్తిలా ఎటువంటి భేదభావం లేకుండ… మానసికంగా,శారీరకంగా దృడంగా పెంచుతే వారు మన వీర వనితలైన ఝాన్సీ లక్ష్మిభాయ్ ,రాణి రుద్రమ్మదేవి లాంటి వారిలాగా సమాజం లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా దైర్యంగా ఎదుర్కుంటారు. సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తారు.
చిన్నమాట :ఒకరి చరిత్రని క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం,కానీ మన చరిత్రలోవున్న గొప్ప గొప్ప వాళ్ళను చిన్న పిల్లలకు పరిచయం చేయాలి అనే ఉదేశ్యం తో చిన్న కధలా రాయడం జరిగింది .
For more stories please visit:కనువిప్పు