GANDHI MAHATMA" Why do we call ?
Spread the love

Contents

రాగి నాణెం విలువ

GANDHI MAHATMA

జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారు చాలా గొప్పవారు ఆయనను మహాత్మా అని పిలవడానికి అనేక కారణాలున్నాయి దానిలో ఒక దానిని కథ రూపంలో చెబుతాను.

ఒకసారి గాంధీ గారు పేద ప్రజలకు సహాయం కోసం  కావలసిన నిధులు సేకరించడానికి  వివిధ నగరాలకు గ్రామాలకు ప్రయాణిస్తున్నారు. పలు ప్రాంతాలు తిరుగుతూ చివరకు ఒరిస్సా చేరుకున్నారు ఒరిస్సాలో ఆయన కోసం అక్కడి ప్రజలు ఒక సభ ఏర్పాటు చేశారు .ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ మీరందరూ మీకు తోచినంత లో పేద ప్రజల కోసం నిధులు ఇవ్వాలని కోరారు.

ఆయన ప్రసంగం ముగిసే సమయానికి ఒక వృద్ధ మహిళ దూరం నుంచి ఆదరాబాదరాగా రావడం గమనించారు ఆవిడ వయసు ప్రభావం వల్ల వంగిపోయి తెల్ల జుట్టు తో ముడతలు పడిన శరీరంతో చిరిగిన దుస్తులు ధరించి ఉంది.

ఆమె గాంధీ వద్దకు రావడం చూసిన సభ వాలంటీర్లు ఆమెను అడ్డుకున్నారు అయినప్పటికీ ఆమె వారితో పోరాడి అక్కడనుండి గాంధీగారిని చేరుకుంది.ఆమె గాంధీ పాదాలను తాకి ఆయనకు నమస్కరించి ఆమె చీర కొంగులో ముడి వేసిన ఒక రాగి నాణాన్ని భద్రంగా తీసి ఆయనకు అందించి అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోయింది.

Mahatma Gandhi గారు…

ఆ నాణాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుని తన వద్ద ఉంచుకున్నారు అప్పుడు డబ్బునంతా కూడా ఒకదగ్గర పెడుతున్న కోశాధికారి గాంధీ గారి వద్దకు వచ్చి అయ్యా.. నాకు ఆ రాగి నాణెం ఇస్తారా నేను దానిని మిగిలిన డబ్బుతో జమ చేస్తాను అని అడిగాడు .

అప్పుడు గాంధీ గారు లేదు ఇది నా దగ్గరే ఉంచుకుంటాను అని అన్నారు అప్పుడు కోశాధికారి కొంత భాదగా అనిపించింది అప్పుడు అతను అయ్యా నేను వేల రూపాయల డబ్బులను ఎన్నాళ్లనుంచో నా దగ్గర భద్రంగా దాస్తున్నాను అటువంటి నన్ను మీరు ఈ రాగి నాణెం విషయంలో నమ్మరా అని తన బాధ వెళ్లబుచ్చుతున్నాడు.

అప్పుడు గాంధీ గారు చిన్నగా నవ్వుతూ మీరు ఇప్పుడు వరకు లక్షలు సంపాదించిన వాళ్ళు కొన్ని వేలు విరాళంగా ఇవ్వడం చూశారు వేలు సంపాదించే వాళ్లు కొన్ని వందలు విరాళంగా ఇవ్వడం చూశారు కానీ ఈ మహిళ తన వద్ద ఏమీ లేనప్పటికీ తనకు ఉన్న ఒకే ఒక రాగి నాణాన్ని పేద ప్రజల సహాయం కోసం సమర్పించింది కాబట్టి అందరూ ఇచ్చిన వేలు కంటే ఇది చాలా విలువైనది అని చెప్పారు.

అవును కదా అన్ని కలిగినవాడు సహాయం చేయడం కంటే ఏమీలేని వాడు సహాయచేయడం గొప్పవిషయం. ఇటువంటి విషయాలు ఎప్పుడో అరుదుగా వింటాం అతువంటిదే ఈ “రాగినాణెం విలువ ” కథ .

Gandhi Jayanti….

అక్టోబర్ 2 గాంధీగారి జన్మదినం, ఆ రోజున మనం అందరం “”గాంధీ జయంతి జరుపుకుంటాం.

 

 

 

 

For more inspirational stories please visit: INSPIRATIONAL WOMEN IN INDIAN HISTORY

For Elon Musk Story : Who is Elon Musk ? How he inspired the people

Faith Moral Story in Telugu : Faith

Friend ship Related  moral story : Chinnari Sneham

Panchatantra Stories: పంచతంత్ర

Telugu Story for students with moral: ఆ రోజు

Elders related story with moral: ముందుచూపు

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!