Contents
ఎలాన్మస్క్ (ది రియల్ ఐరన్ మెన్ )
జీవితం లో ఏదన్నా సాధించాలి అంటే జీవితం సాఫీగా ఉండాలి అప్పుడే ఏదన్నా సాధించగలం, అనే ఆలోచన తప్పు అని నిరూపిస్తూ ఎన్ని అవాంతరాలు వున్నా వాటిని దైర్యంగా ఎదుర్కొని అనుకున్న గమ్యాన్ని విజయవంతంగా చేరుకున్న వాళ్ళు ఎందరో మహానుభావులు మనకు ఉదాహరణలు గా నిలిచారు.
Who is Elon musk ? how he inspired the people? in telugu :this article explained you about Elon Musk
అటువంటి వారిలో ఒకడు ఎలాన్మస్క్ ,ఒక సాధారణ వ్యక్తి తన అద్భుతమైన ప్రతిభతో ఒక శక్తి గా మారి ప్రపంచాన్ని తన ఆధునిక ఆలోచనలతో ఎలా ఆశ్చర్యపరుస్తున్నాడో,ఎలా అభివృధి చేస్తున్నాడో తెలుసు కుందాం.
ఎలాన్మస్క్ 1971 లో సౌత్ ఆఫ్రికా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంభం లో జన్మించాడు. అతనికి ఎనిమిది సంవత్సరాల వయస్సు వున్నప్పుడే అతని తల్లి, తండ్రి విడిపోయారు ఎలాన్మస్క్ తన తండ్రితో ఉండడానికి నిర్ణయించు కున్నాడు . కానీ అది మంచి నిర్ణయం కాదు అని తరువాత పశ్చత్తాపడ్డాడు,ఎందువలన అంటే మస్క్ తండ్రి తనకు ఏవిధంగాను సహకరించే వాడు కాదు.పైగా మస్క్ కి ఇతరులతో కలవడం మాట్లాడడం అంటే చాలా ఇబ్బంది గా,భయంగావుందడే ది … స్కూల్ లో కూడా తనను తన తోటి విద్యార్థులు బాగా ఏడిపించే వారు,కొట్టేవారు.
అందువలన తాను ఎవరితో ను కలవకుండా తన ఒంటరి తనాన్నిపోగొట్టు కోవడానికి పుస్తకాల తో ఎక్కువ సమయం గడిపేవాడు .
ఒక మంచి పుస్తకం ఒంటరి తనాన్ని పోగొడుతుంది,జ్ఞానాన్ని ఇస్తుంది,ఆలోచనా నైపుణ్యాన్ని పెంచుతుంది, మంచి స్నేహితుడు గా ఉంటుంది .అని మన అందరికి తెలుసు కదా అదే విధంగా పుస్తక పఠనం ఎలాన్మస్క్ ని ప్రభావితం చేసింది.
పన్నెండు సంవత్సరాల వయసులో ఎలాన్మస్క్ బ్లాస్టర్ అనే పేరుతో ఒక వీడియో గేమ్ ను తయారు చేసి దాన్ని 500డాలర్స్ కి అమ్మాడు అది తన తొలి విజయం.పదిహేడు సంవత్సరాల వయసు లో తనని తాను నిరూపించు కోవాలని అవకాశాలను వెత్తుకుంటూ సౌత్ ఆఫ్రికా నుంచి కెనడా వెళ్ళాడు అక్కడ రెండు సంవత్సరాలు కింగ్స్టన్ క్వీన్స్ యూనివర్సిటీ లో చదివాడు ,ప్రతి విషయం ఎంతో ఏకాగ్రత తో ,మూలాలు తెలుసుకోవాలి అనే ఉత్సుకత తో చదివే వాడు తర్వాత అమెరికా వెళ్ళాడు అక్కడ ఫిజిక్స్ మరియు ఎకనామిక్స్ లో పట్టా పొందాడు.
ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో Phd చేద్దాం అని యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాడు కానీ అతని ఆలోచనలు ఎప్పుడు బిసినెస్ మీదే ఉండేవి అందుకే Phd కి రెండవ రోజు నే స్వస్తి చెప్పాడు.
జిప్2:
1995 లోఎలాన్మస్క్ సోదరుడు తో కలసి జిప్2 అనే ఒక కంపెనీ స్టార్ట్ చేసాడు ఇది మ్యాప్స్ ,ఆన్లైన్ డైరెక్షన్స్ చూపిస్తుంది దీనిని అప్పటిలో చాలా పేరుపోందిన రెండు వార్త పత్రికలూ దీని సీవలు తీసుకున్నాయి ,ఇది అనుకున్నా విధంగా విజయం సాధించింది.
ఎలాన్మస్క్ జిప్2 కి CEO అవ్వాలి అనుకున్నాడు కానీ దాని లో ఇన్వెస్టర్స్ అంగీకరించక పోవడం తో నిరాశ చెందాడు .1999 లో బోర్డు ఈ కంపెనీ ని వేరే కంపెనీ కి 307 మిలియన్ డాలర్స్ కి అమ్మేసింది దీని లో మస్క్ వాటా 22 మిలియన్ డాలర్స్ .
ఎక్స్.కమ్:
అదే సంవత్సరం జిప్2 నుండి వచ్చిన డబ్బులో 10మిలియన్ డాలర్స్ తో ఎక్స్.కమ్ అనే ఆన్లైన్ బ్యాంకింగ్ కంపెనీ మొదలుపెట్టాడు,తరువాత దీనిని Pay Pal కు అమ్మేశాడు ,కొన్నాళ్ళు Pay Pal కు CEO గా వ్యవహరించాడు ఆ విదంగా CEO అవ్వాలి అనే తన కోరిక తీరింది ,తర్వాతా ఈ కంపెనీ ని e-bay సొంతం చేసుకుంది ,దీని ద్వారా 165 మిలియన్ డాలర్స్ వచ్చాయి .
స్పేస్ ఎక్స్:
ఆ విధంగా దినదినప్రవృధిమానం గా తాను ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నప్పటి కి ఇంకా ఏదో చేయాలి అనే ఆలోచన లో మస్క్ వుండేవాడు దానికి రూపాంతరమే మార్స్ ఒయాసిస్ ,దీని ముఖ్య ఉదేశ్యం భూమి కి ప్రత్యాన్మయం గా అంగారకుడి పైన గ్రీన్ హౌస్ ని నిర్మిచాలి అని అనుకున్నాడు ,
అనుకున్నదే తడవుగా అంగారకుడి మీదకు వెళ్లడాన్ని కి అవసర మై న రాకెట్ కొనుగోలు చేయడాని కి రష్యా వెళ్ళాడు కానీ అక్కడ రాకెట్ విలువ అధికంగా ఉండడం తో వెనుతిరిగాడు ,అప్పుడు అక్క డి వాళ్ళు” ఏ రాకెట్ కొనడాని కి డబ్బులు లేవా అప్పు కావాలా” అని అవహేళన చేశారు అప్పుడు ఎలాన్మస్క్ దృఢనిశ్చయం తో లేదు మా రాకెట్స్ మేమే తయారు చేసుకుంటాం అని చెప్పి తిరిగి వచ్చేసాడు .
కానీ తన మనసులో లో ఒకటే ఆలోచన ఏదో విధంగా అంగారకుని చేరుకోవడాని కి రాకెట్ తయారు చేయాలి అనుకున్నాడు .బయట మార్కెట్ లో విచారించాక మస్క్ కి అర్థమైన విషయం ఏమిటంటే ,మార్కెట్ లో దొరికే రాకెట్ విలువలో మూడు శాతానికి అత్యంత చౌకైన రాకెట్ చేయవచ్చు అనుకున్నాడు ఆ ఆలోచనల కు ప్రతి రూపమే స్పేస్ ఎక్స్,దీనిలో తక్కువ ఖర్చుతో రాకెట్స్ తయారు చేసే వారు ,దీనిలో 2006,2007,2008 సంవత్సరం లో చేసిన ప్రయోగాలు అపజయాలు చవిచూశాయి అయినా ఎలాన్మస్క్ అధైర్య పడలేదు
తర్వాత సెప్టెంబర్ లో 2008 వ సంవత్సరం లో నాల్గవసారి చేసిన ప్రయోగం విజయవంతం అయ్యింది ,ఆర్బిట్ ని చేసురుకున్న మొదటి ప్రైవేట్ రాకెట్ ఇదే. ఇప్పుడు స్పేస్ఎక్స్ ,నాసా కోసం రాకెట్స్ ని స్పేస్ లోనికి పంపిస్తుంది.
టెస్లా:
వాతావరణం లో వున్న కాలుష్యం తగ్గించాలీ అని దాని కి కారణమైన ఇంధనం వినియోగం తగ్గించాలని అనే ఆలోచనతో టెస్లా అనే కంపెనీ ని 2003 లో ప్రారంభించాడు, దీని లో అత్యంత తక్కువ పెట్టుబడి తో ఎలక్ట్రిక్ కార్ లను తయారు చేస్తారు .
రోడ్ స్టార్ అనే కార్ ను తయారు చేశారు విజయం సాధించారు,టెస్లా కార్ ఒక్క ఛార్జ్ తో 394 కి మీ వెళ్ళేలాగా డిజైన్ చేశారు . ఇది పర్యావరణాన్ని కే కాదు,డ్రైవ్ చేసే వారి కి కూడా చాలా రక్షణ కలిగిస్తుంది అందుకే ఈ కార్ కు నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ వాళ్లు 5స్టార్స్ యిచ్చారు.
న్యూరాలింక్:
న్యూరాలింక్ ,2019 న స్టార్ట్ చేసాడు ఈ కంపెనీ లో వాడే టెక్నాలజీ మనిషి బ్రెయిన్ కి సూపర్ పవర్ ని ఇస్తుంది .అంటే మన మెదడులో ఒక చిప్ అమరుస్తారు అది మన ఆలోచన లకు అనుగుణంగా మనం టచ్ చేయకుండా కంప్యూటర్లు, రోబోట్స్ పనిచేసే లా చేస్తుంది,అంతేకాక మెదడు కి సంబంధించిన వ్యాధులను తగ్గించడం లో సహకరిస్తుంది.
సోలార్ సిటీ:
సోలార్ సిటీ ని కొని దీనిలోలో సోలార్ పానెల్స్ ను డిజైన్ చేసి ఇన్స్టాల్ చేస్తారు యిప్పుడు యఇ దే అమెరికా లో అతి పెద్ద సోలార్ కంపెనీ .
తర్వాత ,ది బోరింగ్ కంపెనిని ప్రారంభించాడు దీని ద్వారా భూగర్భ టన్నెల్స్ ఏర్పాటు చేస్తారు ,వీటిని ఒకదాని కి ఒకటి అనుసందానం చేస్తారు.ఈ టన్నెల్స్ ను ఉపయోగిచుకొని రవాణా జరుగుతుంది దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు అధికమించ వచ్చు.
స్టార్ లింక్ అనే మరో సంస్థ స్థాపించాడు దీని ద్వారా ఇంటర్నెట్ ని కేబుల్ ద్వారా కాకుండా శాటిలైట్ ద్వారా అందిస్తాడు .దీని వల్ల మారుమూలప్రాంతాలకు ఇంటర్నెట్ సేవలు అందుతాయి ఇది 2030 కి పూర్తి అవుతుంది .ఇది ఇప్పటి కే కొన్ని దేశాలలో అందు బాటులో వుంది.
హైపర్ లూప్ స్థాపించాడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే పెద్ద పెద్ద పైపులు ఏర్పాటు చేస్తారు దీని ద్వారా హైపర్ లూప్ ప్రయాణం చేస్తుంది ఇది విమానం కంటే ఎక్కువ వేగం తో ఒక చోట నుండి ఇంకో చోటి కి ప్రయాణించ వచ్చు.
ఒక సామాన్యుడు ప్రపంచానికి ఉపయోగ పడే ఇన్ని ఆవిష్కరణలు చేయగలడా అంటే ,అవును అని నిరూపించిన గొప్పవాడు ఎలోన్ మస్క్. ఎలాన్మస్క్ స్ఫూర్తి తో ఎన్ని సమస్యలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని అనుకున్నది సాధించే వరకు పోరాడుదాం విజయం సాధిద్దాం .
Sireesha.Gummadi
Who is Elon musk ? how he inspired the people? in telugu :this article explained you about Elon Musk career growth
Very inspiring biography! Thank you for sharing.
Thank you too..