Contents
చిన్నారి స్నేహం ..
చిన్ననాటి కథ….
Chinnari Sneham moral story explains actual love in friendship
చింటూ,నాని చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు వారి ఇళ్లు కూడా ప్రక్క పక్కనే ఉండేవి . చింటూ,నాని ఒకటే క్లాస్ , వారు ఇద్దరు కలసి చదువు కొనేవారు కలసి ఆడుకొనే వారు .వారి ఇళ్ల ప్రక్కన ఒక ఖాళీ స్థలం ఉండేది ఆ స్థలంలో ఒక పెద్ద చెట్టు దాని క్రింద ఒకప్పటి పాత ఎడ్లబండి ఉండేది. చింటూ,నాని ఎక్కువ సమయం అక్కడే గడిపేవారు.
రోజులాగే ఆరోజు కూడా బాగా ఆడుకొని అలసి పోయి ఇద్దరు ఇంటికి వచ్చారు ,అప్పటి కే ఇంటిదగ్గర పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి ఎవరా అని చుస్తే చింటూ వాళ్ళ అమ్మ ,నాని వాళ్ళ అమ్మ చాలా గట్టిగా.. చుట్టుప్రక్కల వాళ్ళు వినేలా దెబ్బలాడుకుంటున్నారు . మొదటి లోఇద్దరికి ఆ సన్నివేశం చూసి చాలా భయం వేసింది,అదేంటి మా అమ్మ, మీ అమ్మ మంచి స్నేహితులు కదా మరేంటి ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకున్నారు.
అంతలో చింటూ వాళ్ళ అమ్మ చింటూ లోపలి కి వెళ్ళు..
అని గట్టి అరిచేసరికి ఇద్దరు భయపడిపోయి వారి వారి ఇళ్ళలోకి వెళ్లి పోయారు.
Friendship Stories In Telugu
ఆ రోజు రాత్రి…
చింటూ, వాళ్ళ నాన్నఇద్దరు భోజనం చేస్తున్నప్పుడు.. చింటూ వాళ్ళ అమ్మ, “చూడు చింటూ ఇప్పుడే చెపుతున్నా రేపటి నుండి నువ్వు ఆ నానితో ఆటలు ఆడితే ఊరుకోను” అన్నది .
ఆ మాటకి చింటూ ఎందుకు అమ్మ. అన్నాడు అమాయకంగా ,అందుకు అమ్మ నేను చెప్పానా.. వాళ్లు మంచి వాళ్ళు కాదు మాట్లాడకు అంది . ఆ మాట విని చింటూకు చాలా బాధ అనిపించింది, అంటే నేను రేపటి నుండి నాని తో ఆడుకో కూడదా అని తలచుకుంటేనే ఏడుపు వచ్చేసింది చింటూకి అలాగే ఆలోచిస్తూ నెమ్మది గ నిద్రలోకి జారుకున్నాడు.
మరుసటి రోజు ఉదయం నిద్ర లేస్తూనే రాత్రి అమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి చింటూకి అస్సలు బయటి కి వెళ్ళాలి అనిపించలేదు. కొంత సేపటికి నాని ఏంచేస్తున్నాడో చూద్దాం అని ఇంటి బయటకు వెళ్ళాడు, చెట్టు క్రింద ఎడ్ల బండి మీద నాని ఒక్కడే కూర్చోని వున్నాడు . వెంటనే చింటూ ఇంటిలోకి వెళ్లి అమ్మ బయటకు వెళ్ళింది అని నిర్దారించు కున్నాడు ,అంతే ఒక్క పరుగున నాని దగ్గరకు వెళ్ళాడు.
చింటూని చూసి నాని ఏ రా.. ఇంతసేపు పట్టింది బయటకు రావడానికి అన్నాడు…
వెంటనే చింటూ అదేంటి రా నిన్ను మీ అమ్మ నాతో ఆడుకోవద్దు అనలేదా అన్నాడు.. లేదు రా అన్నాడు నాని ,
అప్పుడు చింటూ మరి మా అమ్మ నాతో, నాని తో ఆడుకో వద్దు అని చెప్పింది రా అన్నాడు.తరువాత యిద్దరు కొంచం సేపు ఆడుకొని వారి వారి యిళ్ళకు వెళ్లి పోయారు .
కానీ తరువాత ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం పూర్తిగా మానేశారు,నాని వాళ్ళ అమ్మ కూడా చింటూతో మాట్లాడేది కాదు .కాని చింటూ,నాని రోజు బయట ఆడుకొనే వారు..
కానీ ఆ రోజు ఆ గొడవ ఎందుకు జరిగిందా అని వీరిద్దరూ రోజు చాలా బాధపడేవారు.
Chinnari Sneham moral story
కొన్నిరోజుల తర్వాత …
ఒకరోజు నాని ఆడుకుందాం అని బయటకు వచ్చాడు కానీ ఎంత సేపటికి చింటూ బయటకి రాక పోయే సరికి ఇంటి లోపలికి వెళ్లి పోయాడు,ఆ రోజంతా చింటూ బయటకు రాలేదు. తరువాత రోజు కూడా చింటూ కనబడక పోయేసరికి నానికి చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనిపించింది కానీ చింటూ వాళ్లమ్మ గుర్తుకు వచ్చి వెళ్ళాలి అంటే భయం వేసింది. తరువాత ప్రక్కింటి ఆంటీ నాని వాళ్ళ అమ్మ తో చెపుతుంటే విన్నాడు నాని , ‘చింటూకి చాలా జ్వరం వచ్చిందని కళ్ళు కూడా తెరవ లేక పోతున్నాడని’ చెప్పింది , ఆ మాట వింటూనే నానికి చింటూని చూడాలి అనిపించింది.
వెంటనే నాని చింటూ వాళ్ళ ఇంటికి వెళ్లి చింటూ అని పిలిచాడు,చింటూ వాళ్లమ్మ వచ్చి చింటూకి బాగోలేదు అని గట్టిగ చెప్పి వెళ్ళిపోయింది.. దానితో నానికి భయం,బాధ రెండు వేశాయి,కొంచెంసేపు ఆగి కొంచందైర్యం తెచ్చుకొని మళ్ళి నెమ్మది గా చింటూ.. అనిపిలిచాడు ,మళ్లి వాళ్ళ అమ్మ వచ్చింది ఈ సారి మరీ గట్టిగ ఏంటీ.. అన్నాది.
అప్పుడు నాని ఆంటీ నేను ఒక్కసారి చింటూని చూడవచ్చా అన్నాడు ,అప్పుడు చింటూ వాళ్ళమ్మ సరే కొంచంసేపే అన్నది . ఆ మాటతో నాని కి చాలా సంతోషం గా అనిపించింది వెంటనే చింటూ వున్న రూమ్ లోకి వెళ్ళాడు .. ,చింటూ మంచం మీద చాలా నీరసంగా పండుకొని వున్నాడు. నాని చింటూని చూసి నెమ్మదిగ చింటూ.. అని పిలిచాడు,నాని గొంతు వినగానే చింటూ కళ్ళు తెరిచాడు,చిన్నగా నవ్వాడు .
ప్రక్క నుంచి ఇదంతా గమనిస్తున్న చింటూ వాళ్ళమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి ,రెండు రోజుల నుండి కళ్ళు తెరవని చింటూ కళ్ళు తెరిచేసరికి ఆమె కి చాలా సంతోషం వేసింది. ఆ రోజునుంచి ఆమె నాని ని వాళ్ళ ఇంటికి వస్తే ఎప్పుడూ ఆపలేదు ,రోజూ నాని చింటూ వాళ్ళ ఇంటిలో చాలా సేపు ఉండేవాడు.చింటూ కూడా చాలా తొందరగా జ్వరం నుంచి కోలుకున్నాడు. మళ్ళి వీళ్లిద్దరు ఆదుకోవడం మొదలు పెట్టారు … ఎప్పటిలాగే .
ఒకరోజు ఇద్దరు ఆడుకొని వచ్చేసరికి చింటూ వాళ్ళమ్మ, నాని వాళ్ళమ్మ నవ్వుతూ మాట్లాడు కోవడం కనిపించింది . వీరిద్దరి మొహాలు ఆనందంతో నిండిపోయాయి, హమ్మయ్య అనుకున్నారు మనసులో…
నిష్కల్మషమైన స్నేహం ఎన్ని అడ్డంకులు వున్నా ఎన్నిఇబ్బందులు వున్నానిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది…
అదే విధంగా వీరిద్దరి స్నేహం వారి తల్లి దండ్రుల లో మార్పు తెచ్చింది ,వీరి స్నేహాన్ని నిలబెట్టింది.
Sireesha.Gummadi
Audio story
Chinnari Sneham moral story explains what great things we learn from others..
for more friendship related stores :friendship moral story