small moral stories for kids in telugu
Spread the love

Contents

Small moral stories for kids in Telugu

 

నిజమైన ఆనందం

small moral stories in Telugu

 

Small moral stories for kids in Telugu this article explains to you how important moral values in life

తేజ ఏడు  సంవత్సరాల అబ్బాయి ,అతనికి చాకోలెట్స్ అంటే  చాలా ఇష్టం రోజులో పదికన్నా ఎక్కువ చాకోలెట్స్ తినేవాడు అమ్మ ఎంత  వద్దు అని చెప్పిన వినేవాడు కాదు. ఒక రోజు తేజాకి బాగా పంటి నొప్పివచ్చింది భరించలేనంత, అమ్మ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది,డాక్టర్ తేజాని బాగా పరీక్షించి తీపి పదార్ధాలు తినడం తగ్గించమన్నాడు లేకపోతె పన్ను తీసివేయాలి అన్నాడు .

తేజాకి చాలా భయం వేసింది ఇంక  చాకోలెట్స్ తినడం తగ్గించాలి అనుకున్నాడు, కానీ అది చాలా కష్టమైన  విషయం అని తేజాకి తెలుసు అయినా  ప్రయత్నిద్దాము అనుకున్నాడు . అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు ,ఎప్పుడైతే ఎవరన్నా తనకు థాంక్స్ చెపుతారో అప్పుడు ఒక చాకొలేట్ తిందాం లేక పోతే  ఆ రోజు చాకొలేట్ తినకూడదు అనుకున్నాడు.

తరువాత రోజు ….

ఉదయం నిద్ర లేస్తూనే,ఈ రోజు ఎవరితో ఎలా  థాంక్స్  చెప్పించు కోవాలి అనుకుంటూ లేచాడు . ప్యాంటు జేబులో రెండు చాకోలెట్స్ వేసుకొన్నాడు,ఈరోజు ఇవి అలాగైనా తినాలి అనుకున్నాడు . స్కూల్ కి వెళ్ళాడు ,స్కూల్ లో మార్నింగ్ ప్రేయర్ అయిపోగానే క్లాస్ రూమ్ లోకి గబగబా వెళ్ళాడు .అందరికన్నా ముందు క్లాస్ టీచర్ కి  కావలసిన టెక్స్ట్ బుక్ టేబుల్ మీద పెట్టాడు  ,థాంక్స్  చెప్పించు కోవడం కోసం. క్లాస్ అయిపోయింది కానీ టీచర్ థాంక్స్ చెప్పలేదు… ఫ్రెండ్ బుక్ క్రింద పడిపోయింది బుక్ తీసి యిచ్చాడు కానీ వాడు ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు థాంక్స్ చెప్పాలే ,లంచ్ టైం లో ఇంకో ఫ్రెండ్ బాక్స్ తీయడం రాక పొతే తీసి యిచ్చాడు , వాడు భలే తీసావురా అన్నాడు  కానీ థాంక్స్ చెప్పాలే …

ఉదయం నుంచి ఒక్క చాకొలేట్ కూడా తినలేదు పైగా ఎవ్వరు థాంక్స్ కూడా చెప్పడం లేదు ,తేజాకి దుఃఖం తన్నుకు వచ్చింది. లంచ్ పూర్తి అయ్యాక చేతులు కడుకుందాం అని వెళుతుంటే గ్రౌండ్ లో పగిలిన గాజు ముక్కలు కనిపించాయి ,అయ్యో ఇవి ఎవరికైనా గుచ్చుకుంటాయి అని తీసి జాగ్రత్తగా డస్ట్ బిన్ లో వేసి చేతులు కడుక్కో ని క్లాస్ రూమ్ కి వెళ్లి పోయాడు.

ఆ రోజు సాయంత్రం …

అందరు సాయంత్రం ప్రేయర్ కోసం గ్రౌండ్ లో వున్నారు ,అప్పుడే స్టేజి మీద వున్న ప్రిన్సిపల్ మేడం తేజా  స్టేజ్ మీద కి రావాలి అన్నారు . అప్పుడు తేజ నేను కాదు వేరే క్లాస్  అబ్బాయి అనుకున్నాడు .. మళ్ళి మేడం 7వ తరగతి తేజ అన్నారు ,తేజా కి చాలా భయం వేసింది చాలా కంగారుగా స్టేజి మీద కు వెళ్ళాడు. అప్పుడు మేడమ్ అందరు తేజ కి థాంక్స్ చెప్పండి అన్నారు ,తేజ కి చాలా ఆశ్చర్యం గా  అనిపించింది .

అప్పుడు మేడం ఈరోజు తేజ గ్రౌండ్ లో పడివున్న గాజు పెంకులు తీసి డస్ట్ బిన్  లో వేశాడు ,అందువలన మనలో ఎవరికి అవి గుచ్చుకో లేదు అందుకే మనం అందరం తేజాకి థాంక్స్ చెప్పాలి,అలాగే  అందరు  ప్రక్కవారి గురించి ఆలోచించాలి అన్నారు,అప్పుడు గ్రౌండ్ లో వున్నఅందరు చప్పట్లు కొట్టారు . ఆ మాటలు విని తేజాకి చెప్పలేనంత  ఆనందం వేసింది,ఇంకొకరికి సహాయం చేస్తే ఇంత  ఆనందం వుంటుంద అనిపించింది ఆ ఆనందం లో చాకొలేట్ తినాలి అనే విషయమే గుర్తు రాలేదు … అప్పటి నుండి తేజ చాకొలేట్ కోసం కాకుండా ఇతరుల మంచి  కోసం సహాయం చేసేవాడు.

చాకోలెట్స్ తినడం కూడా తగ్గించాడు అనుకోండి… 🙂

Moral : పరోపకారం లోనే నిజమైన ఆనందం వుంది

 

నిజమైన ఆనందం Audio story

 

Sireesha.Gummadi

 


ఐకమత్యమే బలం

small moral stories in Telugu

 

Small moral stories for kids in Telugu this article is especially for kids.

వీరవరం అనే ఒక చిన్న ఊరు  ఉండేది ఆ ఊరు  లో చాలా తక్కువ  ఇళ్ళు ఉండేవి . ఆ ఊరు  లో వుండే పిల్లలు ఆటలతో కంటే టీవీలు మొబైల్ ఫోన్ లతో ఎక్కువ సమయం గడిపేవారు.వారిలో చాలా మందికి తమ ప్రక్కింటి వారి పేరు కూడా తెలీదు . ఒక సంవత్సరం దసరాకు అన్ని గ్రామాల వాళ్ళు కలసి పిల్లల ఆటలపోటీలు నిర్వహిస్తాం అని చాటింపు వేశారు. అప్పుడు వీరవరం గ్రామపెద్ద అందరిని పిలిచి మన ఊరి తరపున కొందరు ఆటలు ఆడాలి ఆటలో మొదట వచ్చిన  వారికి ఒక్కోక్కరికీ  ఒక్కొక్క క్రికెట్ బాట్ ,రెండవ స్థానం లో వచ్చిన వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రికెట్ బాల్ ప్రకటించారు అంటాడు .

ఊరిలో అందరు పెద్దలు పిల్లల్ని ని టీవీ కి ఫోన్ కి కొంత దూరం పెడదాం అనే ఉద్దేశ్యం తో అందరు తమ తమ పిల్లల్ని ఆడటానకి ఒప్పిస్తారు. అందరి ని క్రికెట్ గ్రౌండ్ కి తీసుకు వెళ్ళి ఒకరికి ఒకరిని పరిచయం చేశారు కానీ పిల్లలు ఎవరికి ఆటలు ఆడటానికి ఆసక్తి లేదు అయినా పెద్దలు ఏమంటారో అనే భయం తో సాధన చేశారు.

ఆటలపోటీ రోజు …

అన్ని గ్రామాల వారు ఏంతో ఉత్సాహం తో ఆటల  పోటీలో పాల్గొన్నారు  కానీ వీరవరం  వారు సరిగ్గా సాధన చేయక పోవడం వలన ఆట మంచిగా ఆడలేక పోయారు,వారికి ఆటల పోటీలో రెండవ బహుమతి వచ్చింది. మొదటి స్థానం వచ్చిన వారు బ్యాట్ లు బహుమతి గా  తీసుకుంటుంటే వీరవరం పిల్లలకు చాలా బాధగా అని పించింది ,మేము ఇంకొంచం బాగా ఆడివుంటే మాకు బ్యాట్ లు వచ్చేవి కదా అనుకున్నారు. వాళ్ళు బాధ పడడం చూసిన ఒక పెద్దాయన వాళ్ళ దగ్గరకు వచ్చి బాధపడ కండి మళ్ళి ఇంకోసారి కలసి  మెలసి  సమిష్టిగా ఏకాగ్రతతో  సాధన చేయండి విజయం సాధిస్తారు అన్నాడు. అప్పుడు పిల్లలు అందరు సరే ఈసారి మేము ఖశ్చితంగా  బాగా సాధన చేస్తాం అన్నారు .

మరుసటి సంవత్సరం దసరా ఉత్సవాల్లో వీరవరం పిల్లలు మళ్ళీ  ఆటల్లో ఎంతో  ఉత్సాహంగా పాల్గొన్నారు మొదటి బహుమతి సాధించారు. ఐకమత్యం కలిగి ఉంటే ఏదన్నా సాధించవచ్చు అని గుర్తించారు.

Moral : ఐకమత్యం గా ఉంటే ఏమన్నా సాధించవచ్చు .

                                                                             ఐకమత్యమే బలం Audio story

 

Sireesha.Gummadi


విలువ

small moral stories in Telugu

Small moral stories for kids in Telugu this article explains to you how moral values affect our personality.

ఒక ఊరి లో బాగా డబ్బున్న ఒక వజ్రాల వ్యాపారి ఉండేవాడు,ఒక రోజు అతని ని  అదే ఊరిలో  ఒక పెద్ద బట్టల వ్యాపారి అతని ఇంటిలో జరిగే విందు కి వజ్రాల వ్యాపారిని ఆహ్వానించాడు. విందు వున్నరోజు  వజ్రాల వ్యాపారి కి ప్రక్కనున్న  ఊరిలో పనివుండడం తో ఆ పని పూర్తి చేసుకొని వచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికే విందు కు వెళ్లే సమయం అయిపోయింది… విందుకు వెళదాం అంటే వజ్రాల వ్యాపారి దుస్తులు ప్రయాణం వలన బాగా పాడైపోయిన వున్నాయి,అప్పుడు వ్యాపారి  అయినా  కూడా పర్వాలేదు లే మనిషి ముఖ్యం కాని  దుస్తులది ఏముంది అనుకొని విందు కి వెళ్ళాడు.

విందు లోకి ప్రవేశించినప్పటి నుండి ఏ  ఒక్కరు తనని పలక రించ లేదు సరి కదా గుర్తించలేదు కూడా . తెలియని వారు కొంచం చిన్నతనంగా కూడా చూసారు . వజ్రాల వ్యాపారి కి చాలా అసహనం గాను కోపంగాను అనిపించింది వెంటనే  తన ఇంటికి వెళ్లి  ధగ ధగా మెరిసిపోయే ఒక కోటును ధరించి మళ్ళీ విందుకు వచ్చాడు … ఈ సారి తాను విందు లో ప్రవేశించడం తోనే అందరు తనని  గుర్తించి పలకరించడం ప్రారంభించారు.

అప్పుడు వజ్రాల వ్యాపారి ఇంతకూ ముందు నేను మాసిన బట్టలతో వచ్చినప్పుడు నన్ను ఎవరు గౌరవంగా చూడలేదు ఇప్పుడు ఆర్బాటం గా ఖరీదైన బట్టల్తో వస్తే అందరు గౌరవిస్తున్నారు. అంటే మీరు మనిషి కన్నా మనిషి వేసుకొనే బట్టలకు ఎక్కువ విలువ ఇస్తున్నారు ,మనిషి ని మనిషిగా గౌరవించడం లేక పోతున్నారు. ఇటువంటి ఆలోచన విధానం కలిగిన వారితో సహవాసం నాకు ఇష్టం లేదు అనిచెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు వజ్రాల వ్యాపారి.

 

Moral :విలువ అనేది మనిషి ప్రవర్తన బట్టి ఇవ్వాలి వారి వేషధారణ  బట్టి కాదు. 

                                                                                       

                                                                                                         విలువ Audio story

 

For more stories please visit: Telugukathalu

error: Content is protected !!