Contents
అతితెలివి
చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు ,అతని దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పటికీ ఎవ్వరికీ ఎటువంటి సహాయం చేసేవాడు కాదు , డబ్బు విషయంలో చాలా పిసినారిగా ఉండేవాడు. ఒకరోజు ఆ వ్యక్తి తన ఊరు నుంచి వేరే ఊరికి కాలినడకన వెళుతూ ఉంటే మార్గమధ్యంలో అతనికి ఒక ఖర్జూరపు చెట్టు ,దాని నిండా పళ్ళతో చాలా నిండుగా కనిపించింది . అతనికి ఆ పళ్ళను చూసేసరికి నోరూరి వాటిని తినాలి అనిపించి ఆ చెట్టు ఎంత ఎత్తు ఉందో కూడా ఆలోచించకుండా బిరబిరా చెట్టుపైకి ఎక్కేశాడు.
చెట్టు పైకి వెళ్ళాక అక్కడ ఉన్న ఖర్జూరాలను కోద్దాం అనుకుంటూ ఒక్కసారి కిందకు చూసాను అప్పుడు గానీ అతనికి తను ఎంత ఎత్తులో ఉన్నది అర్థం కాలేదు . ఒక్కసారిగా భయం మొదలైంది అమ్మో… నేను ఇప్పుడు ఇక్కడ నుంచి కింద పడిపోతే ఏమిటి నా పరిస్థితి అని అనుకుంటూ గజగజ వణకడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఆ ధనవంతుడు దేవుని తలుచుకుంటూ దేవుడా నన్ను ఇక్కడనుంచిజాగ్రత్తగా కిందికి దించి నట్లయితే నేను వెయ్యిన్నొక్క బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని మనసులో దేవునితో విన్నవించుకున్నాడు.
నెమ్మదిగా అక్కడ్నుంచి మరి కొంచెం కిందకి దిగాక కొంచెం పరవాలేదు అనిపించి దేవుడా ఇక్కడ నుంచి నేను క్షేమంగా దిగిన అట్లయితే ఐదువందల ఒక్క బ్రాహ్మణులకు భోజనం పెడతాను అని మళ్ళీ అనుకున్నాడు. అక్కడ నుంచి మరి కొంచెం కిందకి జారగానే భగవంతుడా నేను ఇక్కడినుంచి నేలపైకి జాగ్రత్తగా దిగి నట్లయితే నూట ఒక్క బ్రాహ్మణులకు భోజనాలు పెడతాను అనుకున్నాడు .
అక్కడి నుంచి అతను క్షేమంగా నేలపైన అడుగుపెట్టాక భగవంతుడా నన్ను క్షేమంగా నేలపైకి దించావు కాబట్టి నేను ఒక్క బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనం పెడతారు అని మళ్ళీ దేవునికి విన్నవించుకున్నాడు.
అతను అక్కడ నుంచి తన ఇంటికి వెళ్లి తన భార్యతో జరిగిన విషయాన్ని అంతా వివరించి నేను మనకు బాగా తెలిసిన చందు లాల్ అనే వ్యక్తికి భోజనం పెడదామని నిర్ణయించుకున్నాను నీవు ఆ వ్యక్తికి తృప్తిగా భోజనం పెట్టి నా దేవుని మొక్కు తీర్చు అని భార్యకు చెప్పి అతను ఇంటి నుండి బయటికి వెళ్లాడు. అదే సమయంలో జరిగిన విషయమంతా కిటికీ పక్క నుంచి విన్న చందు లాల్ . ధనికునికి ఏ విధంగా అన్న బుద్ధి చెప్పాలని నిర్ణయించి ఒక పథకం వేశాడు.
తర్వాత….
చందు లాల్ ధనవంతుని భార్య వద్దకు వచ్చి ఒక చిట్టి ఇచ్చి దీనిలో ఉన్న ఆహారపదార్థాలను నేను భోజనం లో తింటాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు . భర్త చెప్పిన మాట ప్రకారం అతను సంతృప్తిగా బోజనం చేయాలి అనే ఉద్దేశంతో ధనికుని భార్య చందు లాల్ ఇచ్చిన చిట్టి లో ఉన్న ఆహార పదార్థాలను తయారు చేసింది.
భోజన సమయానికి ఇంటికి వచ్చిన చందు లాల్కి ఆమె ఆహార పదార్ధాలు అన్ని వడ్డించింది, అప్పుడు చందు లాల్ ఆమెతో అమ్మ మీరు మీ భర్త గురించి మొక్కు తీర్చుకుంటున్నారు కాబట్టి మొక్కు ప్రకారం ఒక బంగారు నాణెం కూడా నా విస్తరిలో ఉంచాలి అని చెప్పాడు . ఆమె అతను చెప్పిన విధంగానే ఒక బంగారు నాణాన్ని అతని విస్తరిలో ఉంచింది, అతను జాగ్రత్తగా ఆ నాణాన్ని తీసుకొని తన సంచిలో వేసుకొని .
ఆమెను మరొకసారి పిలిచి మీరు బ్రాహ్మణులకు భోజనం పెడుతున్నారు కనుక నా వంతుగా నాకొక బంగారు నా నాణాన్ని ఇవ్వాలి అని మళ్ళీ అడిగాడు ఆమె భర్త చెప్పిన మాటలు గుర్తు చేసుకొని అతనికి ఎటువంటి ఆపదా కలగకూడదనే ఉద్దేశంతో ఇంకొక బంగారాన్ని తీసుకువచ్చి చందు లాల్ కి ఇచ్చింది . చందు లాల్ ఆ బంగారు కూడా తన సంచిలో వేసుకుని భోజనం చేసి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళాడు.
కొంతసేపటి…
తర్వాత ధనవంతుడు ఇంటికి వచ్చి జరిగిన విషయం అంతా భార్య దగ్గర తెలుసుకొని చందు లాల్ ని మందలించాలి అనే ఉద్దేశంతో చందు లాల్ ఇంటికి బయలుదేరాడు. దూరంగా ధనికుడు రావడం గమనించిన చందు లాల్ అతని భార్యతో నేను నీకు ఒక ఉపాయం చెబుతాను దాని ప్రకారం నీవు నటించినట్లు అయితే మనకు చాలా ధనం వస్తుంది అని చెప్తాడు.. ఆమె చందు లాల్ మాటలకు సరే అని ఒప్పుకుంటుంది కొంతసేపటికి ధనికుడు చందు లాల్ ఇంటికి వచ్చేసరికి చందు లాల్ భార్య గట్టిగా అరుస్తూ ధనికుని వైపు చూసి మీరు నా భర్తను ఇంటికి పిలిచి భోజనం పెట్టారు ఆ భోజనం సరైనది కానందు వలన నా భర్త ఇంటికి వచ్చినప్పటినుండి ఈమిమాట్లాడకుండా కళ్ళు తిరిగి పడిపోయాడు .
ఆయన ప్రాణానికి ఏమన్నా ఆపద సంభవిస్తే దానికి పూర్తి కారణం మీరే అంటూ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు పెట్టింది. ఆమె మాటలు విని భయపడిన ధనికుడు అతను వచ్చిన పని మర్చిపోయి అమ్మ… నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు పది బంగారు నాణాలు ఇస్తాను వాటితో నువ్వు చందు లాల్ కి వైద్యం చేయించవచ్చు అని చెప్పి ఆమెను తన ఇంటికి తీసుకు వెళ్లి ఆమెకు పది బంగారు నాణాలు సమర్పించి ,భగవంతుడా… కాపాడు అనుకుంటూ దేవుడి పటం ముందు నుంచొని దేవుడా చందు లాల్ ఆరోగ్యం బాగుపడితే వెయ్యిన్నొక్క మంది బ్రాహ్మణులకు భోజనం పెడతానీ అని మళ్ళీ మొక్కుకున్నాడు.
నీతి :ఎప్పుడూ మనమే తెలివైన వారమని భావించకూడదు ,భగవంతుడు మనలను గమనిస్తూవుంటాడు.
For more Panchatantra stories please visit: పంచతంత్ర కథలు