Children story in Telugu
Spread the love

Children story in Telugu

Contents

తెలివితేటలు అంటే ?

వేసవి సెలవుల్లో పొద్దుట పొద్దుటే పెరట్లో ఏదో గొడవవుతున్నట్టుగా అనిపించి లక్ష్మమ్మ అటుగా వచ్చి చూసింది, అక్కడ గోవర్ధన్ గాడు శీనుని గట్టిగా వీపుపై కొడుతూ కనిపించాడు. లక్ష్మమ్మ పరుగు పరుగున వస్తూ ఒరేయ్… గోవర్ధన్ ఎందుకురా అలా కొడుతున్నావ్ అంది అప్పుడు గోవర్ధన్ చూడు నానమ్మ ఈ ఇంట్లో అందరికన్నా నేనే తెలివైన వాడిని కదా నాకే మంచి మార్కులు వస్తాయి కదా ఈ శీను గాడేమో నేను చెప్పింది వినడం లేదు, డబ్బాలో ఒకటే లడ్డు ఉంది అది తెలివైన వాళ్ళే తినాలి కాబట్టి నేనే తినాలి అని చెప్తున్నాను కానీ శీను గాడు ఒప్పుకోవడం లేదు అన్నాడు కోపంతో .
వాళ్ల గొడవేంటో అర్థమైన లక్ష్మి సరే ఎవరు తెలివైన వాళ్ళో నేను చెప్తాను గాని ముందు మీరు నేను చెప్పేది వినండి. మీరిద్దరూ రాధమ్మ పిన్ని ఇంటికి వెళ్లి అక్కడ మామిడి మొక్కకి వున్న రెండు మామిడికాయలు తీసుకొని వస్తూ.. వస్తూ.. దారిలో గోపి మామ ఇంటికి వెళ్లి అక్కడ కోడిపుంజు నాలుగు గుడ్లు పెట్టిందట వాటిని తీసుకొని వస్తే కూర వండుతాను.
ముందుగా ఎవరు వాటిని తెస్తారో వాళ్లే తెలివైన వాళ్ళు అని చెప్పింది.
ఆ మాట వినంగానే వెంటనే శీను నానమ్మ ఇంకోసారి చెప్పవా అన్నాడు. అది విన్న గోవర్ధన్ అందుకేరా.. నన్ను తెలివైన వాడిని అనేది అని చెప్పి అక్కడి నుంచి పరుగున రాధ పిన్ని ఇంటికి బయలుదేరాడు.

Children story in Telugu

చాలాసేపటికి…

గోవర్ధన్ రెండు మామిడి పండ్లు, నాలుగు గుడ్లు పట్టుకొని వచ్చాడు కానీ ఇంటిముందు క్రికెట్ బ్యాట్ తో ఆడుకుంటున్న శీనుని చూసి ఏరా నువ్వు ముందే వచ్చేసావ్ అన్నాడు. అప్పుడు శీను నవ్వుతూ తన ఆట తాను ఆడుకుంటున్నాడు .

ఇంతలో లక్ష్మి వచ్చి ఏరా.. గోవర్ధన్ తెచ్చావా అన్నాది. అందుకు గోవర్ధన్ ఇప్పుడన్నా ఒప్పుకుంటావా నేను తెలివైన వాడినని అన్నాడు.
లక్ష్మి నవ్వుతూ అసలు నేను ఏం తెమ్మన్నానురా అని అడిగింది. ఏం చెప్పావ్ మామిడి మొక్క నుంచి రెండు మామిడికాయలు మధ్యలో వస్తూ మామయ్య ఇంటికి వెళ్లి కోడిపెట్ట దగ్గర నుంచి నాలుగు గుడ్లు అన్నావు అన్నాడు గోవర్ధన్ .
అవునా.. సరే మామిడి మొక్కకి ఇంతకీ కాయలు కాస్తాయా అన్నాది? లక్ష్మి.
గోవర్ధనకి ఏమీ అర్థం కానట్టుగా చూసాడు
మరి కోడిపెట్ట గుడ్లు పెడతాదా? అన్నాది,
అప్పుడు గోవర్ధన్ అంటే..! నువ్వు తప్పు చెప్పావు ఏమో అనుకున్నాను నానమ్మ అన్నాడు.
లక్ష్మి అది కాదురా.. విషయం నువ్వు సరిగ్గా వినలేదు అని చెప్పు
ఏమీ అర్థం కానట్టుగా అమాయకంగా చూశాడు గోవర్ధన్ లక్ష్మిని.
అప్పుడు లక్ష్మి తెలివి అంటే చెప్పింది బట్టికొట్టి ఉన్నది ఉన్నట్టుగా రాసి మార్కులు తెచ్చుకోవడం కాదు, చెప్పిందానిలో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో అర్థం చేసుకొని సరైన దాన్ని మాత్రమే నేర్చుకునే వాళ్ళు తెలివైన వాళ్ళు అంటారు. మార్కులు వచ్చిన వాళ్ళందరూ తెలివైన వాళ్ళు కాదు తెలివితేటలకి మార్కులకి సంబంధం ఉంది కానీ తెలివితేటల వల్ల మార్కులు వస్తాయి కానీ తెలివితేటలు లేని మార్కుల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
నేను చెప్పిన వెంటనే నువ్వు విషయం అర్థం చేసుకోకుండా పరిగెత్తావు కానీ… శీను మాత్రం విడమర్చి అడిగి తెలుసుకొని అది సాధ్యం కాదు కాబట్టి ఇక్కడే ఉన్నాడు .
కాబట్టి తెలివితేటలు పెంచుకోవడానికి ప్రయత్నించు. మార్కులు తెచ్చుకోవడానికి కాదు అంది .
అయినా ఈ లడ్డు మీ ఇద్దరిదీ కాదు నాది ఎందుకంటే మీ ఇద్దరి కన్నా నేనే తెలివైన దాని కాబట్టి అని లడ్డూని నవ్వుతూ నోట్లో వేసుకొని వెళ్లిపోయింది.

నీతి: తెలివితేటలు లేని మార్కులు సువాసన లేని ప్లాస్టిక్ పూలతో సమానం అవి చూడడానికి తప్ప ఎందుకు పనిచేయవు.

 

చందమామకథలు

Short inspirational story

Small moral story for kids

సింహం తోడేలు

Telugu small Story with Moral

 

 

error: Content is protected !!