telugu story to read
Spread the love

Contents

ప్రయత్నం

Prayatnam Telugu Story To Read || ప్రయత్నం||

అనగనగా ఒక అడవిలో ఒక కొండ శిఖరం మీద చాలా మధురమైన,రుచికరమైన పదార్ధం ఉందని కొన్ని పక్షుల ద్వారా తెలుసుకున్న చీమలు ఎలా అయినా దానిని తినాలి అని నిర్ణయించుకొని అన్ని కలసి కొండ ఎక్కడం ప్రారంభించాయి .
కొన్ని చీమలు చాలా ఉత్సాహంగా వేగంగా ఎక్కుతున్నాయి ,కొన్ని ఎలాగన్న శిఖరాన్ని చేరుకోవాలని ఆవేశంగా ఎక్కుతున్నాయి, కొన్ని ఇతరులకు సహాయం చేస్తూ వెళ్తున్నాయి .
కానీ ఒకటి మాత్రం నిదానంగా వెళ్తూ వుంది దానిని దాటి అన్ని ముందుకు వెళ్లి పోతూ వున్నాయి కానీ అది మాత్రం అన్నిటికన్నా నెమ్మదిగా వెళ్తుంది ,దానికి అన్ని తనని దాటి వెళ్ళి పోతుంటే చాలా భాదగా అనిపించింది .
కొంత సేపటికి దాని కన్నా ఇంకా నెమ్మదిగా నడుస్తున్న ఒక చీమ దాని కంట బడింది అది చాలా బాలహీనం గా వుండి కొండ ఎక్కలేక పోతుంది దానిని చూసి జాలి పడిన చీమ ,బలహీనం గా వున్నచీమకు సహాయం చేసి దానిని ముందుకు పంపించింది. అప్పుడు సహాయం తీసుకున్న (బలహీనంగా వున్నచీమ) చీమ నెమ్మదిగా వెళ్లే చీమతో నువ్వు నాకు చాలా సహాయం చేసావు అందుకు నీకు కృతజ్ఞతలు అంటుంది .

అప్పుడు…

నెమ్మదిగా నడిచే చీమ బలహీనంగా వున్నచీమ తో నేను చాలా సేపటి నుండి ఈ కొండ ఎక్కుతూనే వున్నాను కానీ నాతరువాత వచ్చిన వారెందరో నన్ను దాటి ముందుకు వెళ్లి పోతూనే వున్నారు , నేను మాత్రం ఇంకా ఇక్కడే నడుస్తూవున్నాను అంటుంది . అప్పుడు బలహీనంగా వున్నచీమ అవును నువ్వు” చాలా సేపటినుండి నడుస్తూనే వున్నావ్ ఆగిపోకుంగా ” ఆ విషయం గుర్తించావా అంటుంది.
ఆ మాటలు విన్నాక నెమ్మదిగా నడిచే చీమలో ఆలోచన మొదలవుతుంది ‘ అవును నన్ను దాటివెళ్లిన వారిలో కొందరు అలసి పోయి సగం దారిలోనే ఆగిపోయారు ,మరికొందరు వారు వెళ్లిన దూరం తో తృప్తి చెంది ఇంకా వెళ్లలేమని నిర్నయిన్చుకొని వెనుదిరిగారు మరికొందరు వెళ్ళి వెళ్ళి నీరసించి కృశించి పోయారు కానీ నేను నిర్విరామంగా నా ప్రయత్నం ఆపకుండా నడుస్తూనే వున్నాను , నా ప్రయత్నం లో ఎటువంటి లోపం లేకుండా కొనసాగిస్తూనేవున్నాను’ అనుకుంటూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నడిచింది కొండ శిఖరాగ్రాన్ని చేరుకుంది అందరికంటే ముందు ఆ మధురమైన పదార్ధాన్ని రుచి చూసింది .
తన నిర్విరామ ప్రయత్నం తో విజయం సాధించింది .

“ప్రయత్నమే తొలివిజయం” అనే మాట ప్రకారం మనం మన ప్రయత్నం అనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడే తొలి విజయం సాధించినట్టు. కానీ ఆ ప్రయత్నానికి ఫలితాన్ని వెంటనే ఆశించి, ఆవేశపడి ,బాధపడి సహనం లేక మధ్యలోనే ఆపేస్తున్నాం .
ఏదన్నా సాదించాలి అంటే నిరంతర ప్రయత్నం వుండాలని గమ్యం చేరేవరకు ప్రయత్నం ఆపకూడదని అప్పుడే మనం మన విజయ శిఖరాన్ని చేరుకుంటాం అని గుర్తిద్దాం .

For more Telugu stories please follow: Telugu stories for kids with Audio

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!