raadhakka story about self confidence
Spread the love

Raadhakka story about self-confidence in Telugu ||రాధక్క||: This story will inspire us a lot.

Saying a positive word to others and living positively in regular life is quite common for Anybody.

But in abnormal situations and critical times staying strong and positive is an extraordinary thing.

Only some special people can do this, those people were inspirational for all of us.

Contents

రాధక్క …

 

నాకు చిన్నప్పటినుండి రాధక్క అంటే చెప్పలేనంత అభిమానం అంతకంటే ఎక్కువ ధైర్యం ,ఎందుకంటే అక్కకు ఎప్పుడూ భయం ,నిరాశ,నేను చేయలేను అనే పదాలు నచ్చవు తాను ఎప్పుడూ చెప్పదు కూడా .
ఎప్పుడూ ఉత్సాహంగా అందరితో మాట్లాడుతూ ,ఆట్లాడుతూ ,నవ్విస్తూ ఉంటుంది అందుకే ఎప్పుడూ ఆటల్లో నేను అక్క జట్టులోనే వుండేదాన్ని .
మాది చాలా పెద్ద కుటుంభం మా నాన్నగారికి నలుగురు అన్నదమ్ములు ,ఇద్దరు అక్కలు . అందరు వారి వారి ఉద్యోగరీత్యా వేరు వేరు ఊర్లలో స్థిరపడినప్పటికీ పండుగ వచ్చిందంటే మాత్రం అందరం మా నానమ్మ గారి వూరు వచ్చి చేరే వాళ్ళం.
మా పిల్లల సైన్యం ఏమీ తక్కువ వుండేది కాదు ,అందరం కలసి పదిహేను మందిమి ఉండేవాళ్ళం. పండగకు అందరం వచ్చి చేరాం అంటే చిన్నసైజు పెళ్ళి లా ఉండేది .
రాధక్క మా పెద్ద పెద్దనాన్న గారి అమ్మాయి చాలా బాగా చదివేది, ప్రపంచం లో వున్న మంచి లక్షణాలు అన్ని తనకే వున్నాయి ఏమో అనిపించేది మాకు ,అందుకే అందరు మమల్ని రాధక్కను చూసి నేర్చుకోండి అని చెప్పేవారు .అందరు సరే అని మొహమాటం గా చెప్పేవారు కానీ నేను మాత్రం అక్కను ఫాలో అవ్వడానికి శతవిధాలా ప్రయత్నించే దాన్ని .
అక్క అనుకున్నవిధంగానే మంచి మార్కులతో ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ లో జాబ్ లో స్థిరపడింది . తనకు నచ్చిన వ్యక్తిని ఇష్టపడి ఇంటిలో వారందరిని ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంది .అక్క సెలక్షన్ అంటే ఎవ్వరు కాదంటారు మరీ…
అక్క సలహా తోనే నేను పీజీ పూర్తిచేసి మంచి ఉద్యోగం లో స్థిరపడ్డాను అమ్మావాళ్లు చూసిన సంబంధం చేసుకుని వేరే ఊర్లో ఉండే దాన్ని. అక్కతో అప్పుడప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఫోన్లో మాట్లాడుతూ ,ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కరించాలో తన సలహా తీసుకుంటూ ఉండేదాన్ని.

అలా కొన్ని సంవత్సరాలు…

గడిచాయి, నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం తో వారి స్కూల్ ,నా ఉద్యోగం ,నా కుటుంభం అంటూ రోజులు ఎలాగడుస్తున్నాయో కూడా గమనించలేనంత బిజీ అయిపోయింది జీవితం.
ఒక రోజు సాయంత్రం అమ్మ ఫోన్ చేసి ఏడుస్తూ రాధక్కకు కేన్సర్ అంటే… అని చెప్పింది ,ఆ మాట వింటూనే నా కాళ్ళ క్రింద భూమి కదిలినట్లు అనిపించింది ,అక్కకు గత కొన్ని నెలలుగా కేన్సర్ అని ,ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అందరూ పెద్దవాళ్ళు అవ్వడం వలన ఎవ్వరితో చెప్పలేదని . వారం క్రితం పెద్దమ్మ వాళ్ళు చెప్పకుండా అక్క ఇంటికి వెళ్లడం వలన తెలిసిందని చెప్పి అమ్మ బోరున ఏడ్చింది. నాకు అమ్మతో ఏమి మాట్లాడాలో అర్థం కాక వుంటాను అని ఫోన్ పెట్టేసానే కానీ …. శరీరమంతా తెలియని నిస్సత్తువు ఆవహించింది .. దానిని భయం అనాలో ,భాద అనాలో కూడా .. తెలియడం లేదు.

అక్కను, అక్క పిల్లల్ని ,బావగార్ని తలచుకుంటే ఏడుపువచ్చిది .అప్పుడు గుర్తు వచ్చింది ,అదేంటి నెలక్రితం అక్కకు మా బాబు వినయ్ గాడు సరిగ్గా చదవడం లేదు అని ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా వాడితో చాలా సేపు మాట్లాడి నచ్చచెప్పింది . ఆ రోజునుండి వాడు పెద్దమ్మ చెప్పినట్టు నేను డాక్టర్ అవుతా అని చాలా శ్రద్దగా చదువుతున్నాడు. అప్పుడు కూడా అక్క తన విషయం నాకు చెప్పలేదు . అంటే నన్ను పరాయి దానిలా అనుకుందా లేదా ఇది నాకు ఏమి సహాయం చేస్తుంది లే అనుకుందా అని రకరకాలుగా ఆలోచిస్తుంటే మావారు అప్పుడే ఆఫీసునుండి వచ్చారు , ఆయనకు జరిగిన విషయం చెప్పి అక్క దగ్గరకు ఒక్కదాన్నే బయలు దేరాను .
బయలు దేరడం బయలు దేరాను కానీ అక్కను ఏవిధంగా ఓదార్చాలో తెలియడం లేదు . అక్క ఎంత నిరాశతో బలహీనంగా ఉండి వుంటుందో , నాకు జీవితం లో ఎన్నో సందర్భాల్లో ఎన్నోవిధాలుగా ఏంతో ధైర్యాన్నిచ్చిన అక్కకు ఇప్పుడు నేను అండగా ధైర్యం గ ఉండాలి అనుకుంటూ హాస్పిటల్ లో అడుగు పెట్టాను .

రూమ్ బయట బావగార్ని చూసి దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసాను , ఆయన నన్ను చూసి ఏమీ కాదు భయపడకు ముందు వెళ్ళి అక్కను చూడు అని ఓదార్చారు . ఆయన మాటలు వింటుంటే నామీద నాకు కోపం వచ్చింది ,నేను ఏమి చేద్దాం అని వచ్చాను ఏమి చేస్తున్నాను అని . నేను వారికి ధైర్యాన్ని ఇవ్వకుండా నేను ఏడుస్తున్నాను ఏమిటి! అనుకొని కొంచం ధైర్యం తెచ్చుకొని అక్క రూమ్ లోకి వెళ్ళాను .

అక్కడ…

దృశ్యాన్ని చూసి నాకళ్ళను నేనే నమ్మలేక పోయాను ,అక్కహాస్పిటల్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద కూర్చొని లాప్టాప్ లో ఏదో చేస్తుంది ,తన చేతికి మాత్రం ఏవొ సెలైన్ లు ఎక్కుతూవున్నాయి. అక్క నన్ను చూసి నవ్వుతూ రావే… చిట్టీ ఎలావున్నావ్ నీకూ చెప్పేశారా విషయం అంది . అక్క మాట వినేసరికి నాకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకు వచ్చింది ,గట్టిగా ఏడ్చాను అప్పుడు అక్క మెల్లగా నాచేయి పట్టుకొని ,భయపడకు ఏమి కాదు నాకు వచ్చింది చాలా పెద్ద సమస్యే కానీ దాన్ని చాలా ధైర్యంగా ఎదుర్కొన్నాను పోరాడాను గెలిచాను ,నాకు మీ బావగారు పిల్లలు చాలా సహకరించారు . ఇంకొన్ని రోజుల్లో ఇంటికి వచ్చేస్తాను ,మీ అందరితో నా అనుభవాన్ని పంచుకుంటాను .
అయినా మీ అందరి ప్రేమ ఉండగా నాకు ఏమవుతుందే … చెప్పు . రేపు నా కూతురి స్కూల్లో ఏదో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉందంట ఆ పనిలో వున్నాను అంది.
అక్క మాటలు వింటుంటే నాకు ఆనందంగా ఆశ్చర్యం గాను అనిపించింది . ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇంత నిబ్బరంగా ధైర్యంగా ఉండొచ్చా… అవును ఉండొచ్చు, అని అక్క నిరూపించింది.

ఎవరైనా సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి అని చెప్పడం సులభం కానీ నిజంగా ఆ సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా వుండి దానిని అధికమించడం ఎంత గొప్ప విషయం .

నాకు మళ్ళీ అక్క ఒక కొత్త పాఠం నేర్పింది,ఎటువంటి సమస్య లోను కృంగిపోకూడదు అని దృడంగా ఉండాలి అని … అందుకే అక్క నా “హీరో”

 

(శిరీష గుమ్మడి)

 

 

 

For more Telugu stories  please visit:పెంపకం

 

2 thoughts on “Raadhakka story about self confidence in Telugu ||రాధక్క||”
  1. ఎలాంటి సమస్య వచ్చిన గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు అని తెలిపిన విధానం బాగుంది 👍👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!