Contents
పొడుపుకథలు
Riddles in Telugu with answers || పొడుపుకథలు-4 ||
Riddles :
1.ఒక బాలుడు వంద అడుగుల నిచ్చెనపై నుండి పడిపోయాడు, కానీ అతను గాయపడలేదు. ఇది ఏవిధంగా సాధ్యం?
2.నాట్యం చేయడానికి నాకు కాళ్లు లేవు కానీ నాట్యం చేస్తాను , ఊపిరి పీల్చుకోవడానికి నాకు ఊపిరితిత్తులు లేవు కానీ నాకు గాలి కావాలి , జీవించడానికి నాకు ప్రాణం లేదు కానీ నేను మరణిస్తాను ఇంతకీ ఎవరునేను ?
3.నన్నువృధా చేసాకే, మీకు నా విలువ తెలుస్తుంది . నేను ముందుకువెళ్తున్న కొద్దీ మీరు నన్ను కోల్పోతారు ఇంతకీ ఎవరునేను ?
4.మిస్టర్ మరియు మిసెస్ శరత్ లకు ఆరుగురు కుమార్తెలు మరియు ప్రతి కుమార్తెకు ఒక సోదరుడు ఉన్నారు. శరత్ కుటుంబంలో ఎంత మంది ఉన్నారు?
5.”అవును” అని ఏ ప్రశ్నకు ఎప్పుడూ.. సమాధానం ఇవ్వలేరు?
6.మీరు నన్ను నీటిలోన చూడవచ్చు, కానీ నేను ఎప్పుడూ తడిగా ఉండను. ఎవరునేను ?
7.మేఘం నా తల్లి, గాలి నా తండ్రి, నా కొడుకు చల్లని ప్రవాహం, ఇంద్రధనస్సు నా మంచం, భూమి నా చివరి విశ్రాంతి స్థలం ,నేను ఎవరు?
8.నాకు రెండు చేతులు ఉన్నాయి, కానీ అవి నాకు ఉపయోగపడవు ,ఎవరునేను?
More…
9.నన్ను కొనలేరు , కాని చూపుతో నన్ను దొంగిలించవచ్చు. నేను ఒకరికి దగ్గర ఉంటే విలువ లేనిదానిని , కానీ ఇద్దరికి మధ్య ఉంటే అమూల్యమైనదానిని . నేను ఎవరు ?
10.నేను పెద్ద షిప్పులను(ఓడ) పగులగొట్టేంత బలంగా ఉన్నాను, కానీ నేను సూర్యునికి చాలా భయపడుతూవుంటాను. ఎవరు నేను ?
11.మీరు దానిని కొనుగోలు చేసినప్పుడు నలుపు, మీరు దానిని ఉపయోగించినప్పుడు ఎరుపు మరియు మీరు దానిని పడవేసినప్పుడు అది బూడిద రంగు ,ఏమిటి అది ?
12.ఇద్దరు తండ్రులు, ఇద్దరు కొడుకులు ఒకరోజు చేపల వేటకు వెళ్లారు. వారు రోజంతా అక్కడే ఉన్నారు మరియు 3 చేపలను మాత్రమే పట్టుకున్నారు. వారిలో ఒక తండ్రి అన్నాడు, ఇవి చాలు మనందరికీ,ఒకొక్కరికి ఒక్కొక్కటి వస్తుంది అన్నాడు . ఇది ఎలా సాధ్యమవుతుంది?
13.ఒక బాలుడు ఒక ఎక్సిబిషన్ లో ఉన్నాడు అతను అక్కడ ఒక చోటుకి వెళ్లాడు, అక్కడ ఒక వ్యక్తి బాలుడితో ఇలా అన్నాడు, “నేను ఈ కాగితంపై మీ ఖచ్చితమైన బరువును వ్రాస్తే మీరు నాకు 50/- రూ . ఇవ్వాలి, కానీ నేను రాయ లేకపోతే, నేను మీకు 50/- రూ చెల్లిస్తాను. ” అన్నాడు .
అప్పుడు బాలుడు ఎవరూ చూడకుండా తన బరువుని చూసుకొని,ఒక వేళ ఆ వ్యక్తి తన బరువు ఖచ్చితంగా చెబితే తప్పని అబద్దం చెబుదాం అనుకున్నాడు ,కానీ చివరికి బాలుడు ఆ వ్యక్తికి 50/- రూ చెల్లించి అక్కడనుండి వెళ్ళాడు . అస్సలు ఆ వ్యక్తి పందెం ఎలా గెలిచాడు?
14.ఒక మహిళ ఆమె భర్తను షూట్ చేసి నీటిలో కొంతసేపు ముంచి తర్వాత ఒక తాడుకు ఉరితీసింది ,తర్వాత ఆమె ,ఆమె భర్త కలసి ఒక పార్టీకి వెళ్లారు … అదేలా సాధ్యం?
Scroll Down for Answers…..
.
.
.
.
.
.
Answers:
- అతను నిచ్చెన మొదటి అడుగులో మాత్రమే ఉన్నాడు.
- అగ్ని.
- నేను సమయం.
- కుటుంబంలో తొమ్మిది మంది వున్నారు . ప్రతి కుమార్తె ఒకే సోదరుడిని పంచుకుంటుంది కాబట్టి, ఆరుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి మరియు మిస్టర్ అండ్ మిసెస్ శరత్లు ఉన్నారు.
- మీరు నిద్రపోతున్నారా? ప్రశ్నకు
- ఒక ప్రతిబింబం.
- వర్షం.
- ఒక గడియారం.
- ప్రేమ.
- మంచు.
- బొగ్గు.
- తండ్రి, అతని కొడుకు మరియు అతని కొడుకు కొడుకు ఉన్నారు. వీరిలో ఒక తాత ,ఒక తండ్రి ,ఒక కొడుకు వున్నారు .
- ఆ వ్యక్తి అతను చెప్పినట్లే చేశాడు , కాగితంపై “మీ ఖచ్చితమైన బరువు” అని వ్రాసాడు.
- ఆమె ,ఆమె భర్తను కెమెరా తో షూట్ చేసి ,తీసిన ఫిల్మ్ ను కడిగి ఆరబెట్టింది (హాస్యానికి )
Riddles in Telugu with Answers ( మీరు చెప్పగలరా??) : పొడుపుకథలు -1
Riddles in Telugu with Answers (మీరూ ప్రయత్నించండి ఒక్కసారి) : పొడుపుకథలు -2
Riddles in Telugu with answers (మీకు తెలుసా…?? ): పొడుపుకథలు -3