Contents
పొడుపుకథలు
Telugu Podupu Kathalu
Riddles with Answers in Telugu ||మీరు చెప్పగలరా..||
Riddle 1:
కొందరు ఒక వ్యక్తిని ఒక చిన్న గదిలో బంధించారు . ఆ గది నుండి అతను బయటకు వెళ్ళడానికి ఒక చిన్న కిటికీ తప్ప ఎటువంటి దారి లేదు ఆ కిటికీ అతను నుంచున్న నేల నుంచి చాలా ఎత్తులో ఉంది .
ఆ గదిలో అతనితోపాటు ఒక పార మాత్రమే ఉంది, అతనిని ఆ గదిలో రెండు రోజులు మాత్రమే బంధించాలని వారు నిర్ణయించారు తర్వాత అతనిని చంపి వేయాలని నిర్ణయించుకున్నారు . అతను ఆ గదిలో ఉన్న మట్టి నేలను తవ్వి సొరంగం చేసుకుని పారిపోదాం అంటే అది రెండు రోజుల కన్నా ఎక్కువ సమయం పడుతుంది.
అతను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి మీరు ఏమన్నా సహాయం చేయగలరా….
Riddle 2:
ఒక జపాన్ నావ సముద్రంలో వెళుతూ ఉంది ,ఆ నావ యజమాని నావకు చిన్న రిపేర్ రావడంతో దానిని బాగు చేయాలనే ఉద్దేశంతో తన చేతికున్న వజ్రపు ఉంగరాన్ని నావ లో ఒకచోట ఉంచి ఆ పని పూర్తి చేసి ఉంగరం విషయం మర్చిపోయి వెళ్ళిపోయాడు.
కొంతసేపటికి ఉంగరం గుర్తు వచ్చి చూసే సరికి అక్కడ ఆ వజ్రపు ఉంగరం లేదు, దానిని ఎవరు దొంగిలించారో కని పెడదామని ఆ నావలో ఉన్న మిగిలిన ముగ్గురిని పిలిచాడు.
వారిలో మొదటివాడైన వంటవాడు అయ్యా !!నేను ఆ సమయంలో వంట గదిలో మనం తినడానికి కావలసిన ఆహారం తయారు చేస్తున్నాను అని చెప్పాడు .
రెండో వ్యక్తి అయిన నావ నడిపే అతను అయ్యా!! నేను మన పడవ కు అమర్చిన జెండా తలక్రిందులుగా ఉండడంతో దానిని సరి చేయడానికి వెళ్లాను అని చెబుతాడు
మూడో వ్యక్తి అయిన ఇంజనీర్ అయ్యా!! నేను ఇంజన్ రూములో ఏదో సమస్య గా అనిపించి దానిని బాగు చేయడానికి వెళ్లాను అని చెబుతాడు.
Riddle 3:
ఒక వ్యక్తి తన ఇంటిలో దొంగతనం జరిగిందని దొంగలు వచ్చి తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకు పోయారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు.పోలీసు వారు ఆ ఇంటిని సోదా చేయడానికి వచ్చి ఆ ఇంటిలో పగిలిపోయి ఉన్న కిటికీ గాజు పెంకులు, ఇంట్లో విరిగిపోయిన కుర్చీలను, ఇంటిలో చిందర వందరగా ఉన్న ఇతరత్రా వస్తువులను అన్నిటినీ బాగా పరీక్షించి, ఆ ఇంటి యజమానే కావాలని తన ఇంట్లో దొంగతనం చేసి పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టాడని రుజువు చేసి అతనిని అరెస్టు చేస్తారు.
Scroll Down for Answers…..
Answer 1: అతను, అతని క్రింద ఉన్న మట్టిని అంతా పారతో తవ్వి కిటికీ ఎత్తు చేరేవరకు గుట్ట లాగా ఏర్పరిచి ఆ గుట్ట ఎక్కి కిటికీ ద్వారా పారిపోవచ్చు.
పొడుపుకథ Answer 2:నావ యజమాని, నావను నడిపి నావికున్ని దొంగగా నిర్ధారించి ఆయన దగ్గర ఉన్న వజ్రపుటుంగరాన్ని తీసుకుంటాడు. ఎందుకు అంటే జపాన్ వారి జెండా తలక్రిందులుగా ఎటువైపు చూసినా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మార్చవలసిన అవసరం లేదు.
Answer 3 :అంటే ఆ వ్యక్తి ఇంటి లోపల నుంచి కిటికీని పగలగొట్టాడు కాబట్టి ఆ గాజు ముక్కలు ఇంటి బయట పడి ఉన్నాయి. ఇంటి లోపల ఉన్న వ్యక్తి యజమాని కనుక అతని దోషిగా నిర్ధారించారు
Riddles in Telugu with Answers ( మీరు చెప్పగలరా??) : పొడుపుకథలు -1
Riddles in Telugu with Answers (మీరూ ప్రయత్నించండి ఒక్కసారి) : పొడుపుకథలు -2