short stories on foolishness
Spread the love

 

Contents

తెలివితక్కువ తనం

Short Stories On Foolishness||తెలివితక్కువతనం ||:this article explains how foolishness destroys lives.

కథ 1

నలుగురు మిత్రులు పులి

ఒక రాజ్యం లో  నలుగురు స్నేహితులు ఉండేవారు ,వారు చిన్నతనం  నుండి చాలా  కలసి మెలసి ఉండేవారు వారిలో ముగ్గురు మిత్రులు చాలా విద్యాధికులు అయ్యారు కానీ నాల్గవవాడు చదువు విషయం లో వెనుకబడి ఉండడం వలన తను తన చదువు పూర్తి  చేయలేక పోయాడు . తాను సరిగ్గా చదువుకోలేక పోయాడు కనుక అందరు తనని తెలివితక్కువ వానిగా హేళన చేసేవారు .

ఒకరోజు నలుగురు మిత్రులు కలసి ప్రక్క గ్రామం లో ఒక వివాహానికి బయలుదేరారు వారు మార్గమద్యంలో ఒక అడవి దాటవలసి వచ్చింది . అడవిలో వారికి ఒక మృత కళేబరం కనిపించింది ,దానిని చూసిన వారు అది ఒక పులి కళేబరంగా గుర్తించారు . దానిలో ఒకడు నేను దీని ఎముకలను అన్ని జతపరచి పులి కళేబరాన్ని మళ్ళి  పునర్ నిర్మించగలను అంటాడు . రెండవవాడు ఆ కళేబరానికి  నేను పులి శరీర ఆకృతుకి కావలసిన మాంసాన్ని సృష్టించగలను అంటాడు, మూడవవాడు నేను ఆ  పులి దేహానికి ప్రాణం పోయగలను అంటాడు, వీరి మాటలు విని నాల్గవవాడు మిత్రులారా మళ్ళీ  పులికి జీవం పోయడం ప్రమాదం తో కూడుకున్న పని అంటాడు . కానీ మిగిలిన ముగ్గురు ఇతనిని తెలివితక్కువ వాడిగా భావిస్తున్నారు  కనుక ఎవ్వరు అతని  మాటలని  లక్షపెట్టరు .

వారు అనుకున్నదే చేయాలి అని నిర్ణయించుకుంటారు ,మొదటి వాడు ఎముకలన్నీ జతపరచి పులి శరీరాకృతి లో కళేబరాన్ని అమర్చు తాడు ,రెండవ వాడు ఆ కళేబరానికి మాంసాన్ని జతపరుస్తాడు ,మూడవ వాడు ఆ శరీరానికి ఆయుష్షు పోస్తాడు ఇది అంతా జరగడం చూస్తున్న నాల్గవవాడు భయం తో ప్రక్కనే వున్న వృక్షము పైకి ఎక్కి  కూర్చొని ఉంటాడు . ఇంతలో పులికి జీవం వస్తుంది , అసలే ఇంతకాలం ఆకలితో వున్న పులి కి ముగ్గురు మిత్రులు కళ్ళఎదురుగా కనబడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముగ్గురిని అమాంతం చంపివేస్తుంది . పై నుండి ఇదంతా చూస్తున్న నాల్గవవాడు భయం తో వణుకుతూ తన తెలివితక్కువ తనమే తనని ఈ రోజు ఆపద నుండి కాపాడింది అనుకుంటాడు . అవును మరి తెలివిలేక పోవడం వల్లనే కదా తనకు విపరీత  ఆలోచనలు రాలేదు తన ప్రాణానికి ముప్పురాలేదు  .

 

Moral : అధిక తెలివితేటలు  అనర్థాలకు దారితీస్తాయి .

 


కథ 2

తెలివి తక్కువ మేక

ఒక రోజు ఒక నక్క అడవిలో ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ ఆదమరచి పైన క్రిందా చూసుకోకుండా నడుస్తూ ఉంటుంది , దాని దారిలో బావి ఉండడం కూడా గమనించదు  అలా వెళుతూ వెళుతూ చూసుకోక బావిలో పడిపోతుంది . అదృష్టం ఆ బావి లోతు ఎక్కువగా ఉండదు కానీ నక్క ఎంత ప్రయత్నించినా పైకి ఎక్కలేక పోతుంది ,దానికి ఏమి చేయాలో తోచదు చాలా సేపు అలాగే బావి లో నిస్సహాయం గా ఉండిపోతుంది . అప్పుడే అక్కడకు ఒక మేక వస్తుంది దానిని చూడగానే నక్క బుర్రలో ఒక చక్కటి ఆలోచన మెదులుతుంది . నక్క ,మేకను చూసి ఈ రోజు నాకు కలిగిన అదృష్టం ఇంకెవరికి కలుగదు అంటుంది ,ఆ మాట విని మేక అవునా ఏమిటా అదృష్టం అంటుంది .

అందుకు నక్క నేను చాలా కాలం నుండి కాలి నొప్పితో  బాధ పడుతున్నాను అప్పుడు ప్రక్క అడవిలో వున్న ఒక సాధువు ఇక్కడ ఒక బావి వుంది అని దాని నీరు త్రాగితే ఎటువంటి అనారోగ్య సమస్య అయినా చిటికలో తీరిపోయితుంది అని చెప్పాడు అందుకే నేను ఈ రోజు ఈ బావి నీళ్లు తాగడానికి వచ్చాను త్రాగాను నా కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గించుకున్నాను అని చెపుతుంది . నక్క తెలివిగా కల్పించి చెప్పిన అబద్దపు కధని నమ్మిన మేక తనకి కూడా చక్కటి ఆరోగ్యం కావాలి అని చెప్పి వేరే ఆలోచన ఏమిలే కుండా బావిలోకి  దూకుతుంది ,బావి నీరు తాగుతూ ఉంటుంది .

అదనుకోసం ఎదురుచూస్తున్న నక్క వెంటనే మేక వీపు మీద ఎక్కి బావి లోంచి బయటకు వస్తుంది . జరిగిన విషయం ఏమీ అర్థం కానీ మేక ఏమైంది అంటుంది ,అప్పుడు నక్క నవ్వుతూ ఈ బావి నీరు  నిజంగా అంత మహిమ గలదే అయితే యిప్పటికే నీకు నీ తెలివితక్కువతనం తెలిసివుండేది, నా కట్టుకథని గుర్తించ గలిగేది అంటూ వెళ్ళిపోయింది . జరిగిన  విషయం అర్థమైన మేక ఆ బావి లోంచి ఎలా బయటకు రావాలో తెలీక సతమతమై పోతూవుంది .

Moral : ఏదయినా పనిచేసేముందు ఒక్క క్షణం అయినా  ఆలోచించాలి అది తప్పా ఒప్పా అని  .


కథ 3

రాజు -కోతి

ఒక రాజు గారికి  తనమీద తనకు అమిత  విశ్వాసం ,ఎటువంటి వారికి అయినా తానూ శిక్షణ ఇవ్వగలను అని ప్రయోజకుల్ని చేయగలను అని తన సభలో అందరిముందు గర్వంగా చెపుతాడు . సభలో వున్న ఒక మంత్రి రాజుగారికి ఎలా అన్న బుద్దిచెప్పాలి అనే ఉద్దేశ్యంతో,మహారాజా ఒకమనిషి ఇంకో మనిషికి శిక్షణ ఇవ్వడం సర్వసాధారణం కానీ ఒక మనిషి ఒక జంతువుకు శిక్షణ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైన విషయం ఎవ్వరూ చేయలేరు అంటాడు ,ఆ మాటలకు కోపోద్రేకుడైన రాజు నావల్ల కానిది అంటూ ఏమీ లేదు నేను ఎటువంటి జంతువుకైనా శిక్షణ ఇవ్వగలను అంటాడు . అప్పుడు మంత్రి నిజమా మహారాజా అంటాడు … అందుకు రాజు నేను ఒక కోతికి శిక్షణ యిచ్చి అది మనిషికన్నా తెలివైనదిగా నిరూపిస్తాను అంటాడు .

మరుసటి రోజు ఒక కోతి ని తెచ్చి దానికి శిక్షణ ఇస్తాడు , కొన్ని రోజుల తర్వాత దానిని సభలో ప్రవేశపెట్టి దానికి మనుషులతో సమానంగా కొన్ని పరీక్షలు పెట్టి కోతిని తెలివైనదిగా నిరూపిస్తాడు ,అంతటితో ఊరుకోక ఆ కోతిని తన స్వీయ రక్షకుడిగా నియమిస్తాడు . రాజు గారి ఆలోచన చూసి సభలో  అందరు తమలో తామే నవ్వుకుంటారు .

ఆ రోజు రాత్రి రాజుగారు కోతి తో నేను నిద్రపోతాను ఎవరైనా బయటివారు వస్తే ఈ ఖడ్గం తో నరికివేయి అని ఆజ్ఞ ఇస్తాడు నిద్రకు ఉపక్రమిస్తాడు . రాజుగారు నిద్రలో వుండగా ఒక ఈగ వచ్చి రాజుగారి పై వాలుతుంది అది చూసిన కోతికి చెప్పలేని కోపం వస్తుంది. రాజు గారిని కాపాడదాం అనే ఉద్దేశ్యం  తో ఖడ్గం తెస్తుంది అంతలో ఈగ రాజుగారి కంఠం పై వాలుతుంది . కోతికి ఇంక పట్టాలేనంత కోపం  వస్తుంది . ఒక్క వేటుతో రాజుగారి మెడపై వున్న ఈగను నరికి వేస్తుంది, అలాగే రాజుగారి కంఠం కూడా  రెండు ముక్కలవుతుంది . ఆ విధంగా తెలివిగలవాడిని అని భావించే రాజుగారు , తన తెలివితక్కువతనం తో తన చావును తానే కొనితెచ్చుకుంటాడు .

Moral : తెలివి తో పాటు కొంచం ఇంగిత జ్ఞానం  కూడా ఉండాలి.

 


కథ 4

సింహం-కుందేలు

అడవిలో ఒక సింహం ఉండేది అది రోజూ  అడివిలోవున్న జంతువులను అన్నిటిని వేటాడి  దొరికిన దాన్ని వదలకుండా చంపితినేది . సింహం వేటని తలచుకొని ఏ  రోజు ఎవరిని తింటుందో తెలీక మిగిలిన జంతువులన్నీ భయంతో జీవిస్తూ ఉండేవి . ఒకరోజు అన్ని జంతువులు కలసి సింహం వద్దకు వెళ్ళి మహారాజా  మీరు ఏ  రోజు ఎవరిని వేటాడి చంపుతారో తెలీక మేమందరం రోజూ భయంతో జీవిస్తున్నాం కనుక మా  విన్నపం ఏమంటే ప్రతిరోజు మాలో ఎవరో  ఒకరం మీవద్దకు ఆహారంగా వస్తాం . అప్పుడు మీకూ  వేటాడవలసిన అవసరం ఉండదు ,మాకూ  రోజూ భయపడుతూ బ్రతకవలసిన బాధ  వుండదు అంటాయి .

ఆ మాటలు సింహానికి కూడా నచ్చడంతో సరే మీఇష్టం కానీ ఏ  రోజు నా ఆహారం నా దగ్గరకు రాదో ఆ రోజు నుండి మళ్ళి  నేను నా వేటను ప్రారంభిస్తాను అంటుంది ,అందుకు అన్ని జంతువులు అంగీకరిస్తాయి .రోజూ ఒక జంతువు సింహం ఆహారంగా వెళ్ళి చనిపోతూవుంటుంది , ఒక రోజు కుందేలు వంతు వస్తుంది . కుందేలుకి సింహం ఆహారంగా మారడం అస్సలు ఇష్టం లేదు ఈ ప్రమాదం నుండి ఎలాగైనా తనని తానూ  రక్షించుకోవాలి అనుకుంటుంది . సింహం వద్దకు చాలా ఆలస్యంగా వెళ్తుంది , అసలే  ఆకలిగా వున్న సింహానికి కుందేలు ఒక్కటే రావడం ఇంకా కోపం  తెపిస్తుంది . ఇంత చిన్న ప్రాణివి నువ్వు ఒక్కదానివే నాకు ఆహారం గా ఎలా సరిపోతావ్ అనుకున్నావ్ అంటుంది కోపంగా .

దానికి కుందేలు క్షమించండి మహారాజా   , నేను ఇంకా కొంతమంది కలసి మీకు ఆహారంగా బయలుదేరాం కానీ మార్గమద్యం లో ఇంకో సింహం వుంది అది మిగిలిన వారిని చంపి తినేసింది అంటుంది . ఆ మాటలు విని సింహానికి కోపం వచ్చి ఇంకో సింహ మా ఎక్కడ వుంది అంటుంది . అందుకు కుందేలు నేను మీకు చూపిస్తానని అని సింహాన్ని తీసుకొని ఒక బావి దగ్గరకు వెళ్తుంది . ఇదిగో మహారాజా ఇందులో వుంది ఆ సింహాం అంటుంది , అసలే  కోపంగా వున్న సింహానికి బావిలో తన ప్రతిబింబం చూసి అది వేరే సింహం అనుకొని గట్టిగా గర్జిస్తుంది , అవతలి నుంచి కూడా అదే శబ్దం రావడంతో కోపోద్రికురాలై  లోన  వున్న సింహాన్ని చంపాలి అనే ఉద్దేశ్యం తో  బావిలోకి  దూకుతుంది . అంతే బావి నీటిలో ఊపిరి ఆడక చనిపోతుంది . ఆ విధంగా కుందేలు తన తెలివితో సింహాన్ని చంపి మిగిలిన జంతువుల ప్రాణాలు  కూడా కాపాడుతుంది .

 

Moral :అపాయం లో ఉపాయం చేసినవాడే తెలివైనవాడు .

Short Stories On Foolishness||తెలివితక్కువతనం ||:this article explains how cleverly rabbit behaved in their trouble .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!