Story in Telugu "బాధ్యత " చిన్న కథ
Spread the love

Contents

భాద్యత

Telugu Kathalu…

Story in Telugu “బాధ్యత ”

 

ది రాము నాలుగో పుట్టినరోజు రాము వాళ్ళ నాన్నగారు రాముతో పొలంలో ఒక చోట చిన్న కొబ్బరి మొక్క నాటించారు, నటిస్తూ రాముతో రామూ నువ్వు ఈ మొక్కకి రోజు నీరు పోయాలి ఏ రోజు మర్చిపోకూడదు అన్నారు, రాము సరే నాన్నగారు అని చెప్పాడు.
ఆ రోజు నుంచి రాము రోజు చెట్టుకు నీరు పోస్తూ ఉన్నాడు ,రాము ఎలా ఎదుగు తున్నాడో రాముతో పాటు కొబ్బరి చెట్టు కూడా పెరుగుతూ వస్తూ ఉంది. ఒకరోజు రాము ఉదయాన్నే నిద్ర లేచి పొలం గట్టుకు వెళ్లేసరికి కొబ్బరి చెట్టుకి కొబ్బరి పూత వచ్చి ఉంది అది చూసి రాము ఆనందంగా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్లి నాన్న కొబ్బరి చెట్టుకి పువ్వులు వచ్చాయి అంటే తొందర్లోనే కాయలు వస్తాయి కదా అని అడిగాడు, అప్పుడు రాము వాళ్ళ నాన్నగారు అవును నాన్న ఏమిటి మీ స్కూల్లో చెప్పారా వెరీ గుడ్ అన్నారు.

Story in Telugu “బాధ్యత “

అలా…

కొన్ని రోజులు గడిచేసరికి చెట్టు నిండుగా కొబ్బరి బోండాలు వచ్చాయి రాము వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కొబ్బరి నీళ్లు తాగారు రాముని పొగిడారు కూడా… , రాముకి చెట్టుని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది . ఫ్రెండ్స్ అందరికీ చెట్టుని చూపించి ఇది నా చెట్టు ,నేనే పెంచాను అని చెప్పేవాడు.
అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి చెట్టు చేతికి అందనంత ఎత్తు ఎదిగిపోయింది, ఆ చెట్టుకొచ్చే బోండాలు రాము తన స్నేహితులకి ఇస్తూ ఎక్కువ సమయం అక్కడే గడిపేవాడు. అలా ఇంకొన్ని సంవత్సరాలు గడిచాక రాముకి కూడా పెళ్లయింది , పిల్లలు పుట్టారు చెట్టు మాత్రం అదే ఎత్తులో ఉండి అంతే ధీమాగా ఉంది.
కానీ గత కొన్ని రోజులుగా చెట్టుకి కాపు కాయడం మానేసింది, రాము రోజూ ఆ చెట్టును చూస్తూ ఇదేంటి కాయలు కాయడమే మానేసింది పైగా దారికి చాలా అడ్డుగా ఉంది అని అనుకున్నాడు.
మళ్ళీ రెండు సంవత్సరాలు గడిచాక రాముకి ఆ చెట్టుని చూస్తే చాలా చిరాగ్గా అనిపించేది ఎటువంటి ఉపయోగం లేకుండా ఈ చెట్టు ఎందుకు దారికి అడ్డంగా రేపో మాతో మనుషులను పెట్టి దీన్ని కొట్టించేద్దాం అని అనుకున్నాడు.

అంతలోనే…

రాము వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా గుండెపోటు వచ్చి చనిపోయారు అప్పుడు గాని విషయం తెలియలేదు రాముకి ఉమ్మడి లో ఉన్న వారి ఆస్తి ఇంకా పంచుకోలేదని . యిప్పుడు రాము సాగుచేస్తున్న పొలం రాము బాబాయ్ తనదే అంటున్నాడని . రాము ఒక్కడే కొడుకు అవడం వల్ల తనకీ ఆ పొలానికి ఎటువంటి సంబంధం లేదంటూ అందరి ముందు చెప్పాడని తెలిసింది . ఆ మాట వినేసరికి రాముకి చాలా బాధగా అనిపించింది అదేంటి ఇన్ని రోజులు నేను తిరుగుతున్న పొలం నాది కాదా అంటే రేపొద్దున నా పిల్లలకి ఎటువంటి ఆస్తి లేదా అని చాలా బాధపడ్డాడు . ఆరోజు ఇల్లంతా ఏదన్నా పొలానికి సంబంధించిన ఆధారం దొరుకుతుందేమో అని మొత్తం వెతకడం మొదలుపెట్టాడు అనుకోకుండా పాత ట్రంక్ పెట్టెలో ఒక కాగితం కనిపించింది.
ఆ కాగితంలో రాము వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయ్ సంతకాలు కనిపించాయి రాముకి చూడంగానే ఆశ్చర్యంగా అనిపించింది పైనేముందో అని చదవడం మొదలెట్టాడు. ఇక్కడున్న పొలంలో గట్టుమీద ఉన్న కొబ్బరి చెట్టు వరకు రాము ఆస్తి అని అందుకు ఒప్పుకుంటున్నట్లుగా రాము వాళ్ళ బాబాయ్ సంతకం చేసిన కాగితం అది చూడంగానే రాముకి ఆనందంగా అనిపించింది అదే క్షణం గుండెఝల్లుమంది అయ్యో నేను కనుక ఆ కొబ్బరి చెట్టు కొట్టేసుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నాకు నా కుటుంబానికి ఆధారమైన పొలం నా చేతికి చిక్కేది కాదు కదా అనుకుంటూ బాధపడ్డాడు పరిగెత్తుకుంటూ కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్లి దాన్ని గట్టిగా పట్టుకొని బోరుమని ఏడ్చాడు ఇన్ని సంవత్సరాలు నువ్వు నాతోనే ఉన్నావు కానీ ఇప్పుడు నా అవసరం తీరిపోయిందని నిన్ను నరికేద్దాం అనుకున్నాను అయినా కూడా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు జీవితంలో ఎప్పుడు నేను నీకు అపకారం చేయను అనుకుంటూ ఆ కాగితాలు పట్టుకుని ఊరి పెద్దల దగ్గరికి వెళ్ళాడు.

Story in Telugu “బాధ్యత “

మనం కూడా అంతే కదా….

మన అవసరాలు తీరేవరకు మన తల్లిదండ్రులని ఉపయోగించుకొని మన అవసరాలు తీరిపోంగానే వారిని భారంగా అడ్డుగా అనుకుంటూ ఉంటాం కానీ వారు లేనిదే ఈ జీవితం లేదని ఈ ఆనందం లేదని మన కుటుంబం లేదని ఆలోచించం , అంతే కాకుండా భవిష్యత్తులో మన పరిస్థితి కూడా మన తల్లిదండ్రుల పరిస్థితి లాగే అవుతుందని అస్సలు ఆలోచించం .

మన భాద్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తే ,మన పిల్లకు మనం మార్గదర్శకంగా ఉంటాం.

కొంచెం విచక్షణతో ఆలోచిస్తే మనం చేస్తున్న తప్పులేంటో మనకే అర్థమవుతాయి.

 

For more stories please visit:జ్ఞాపకం

error: Content is protected !!