Telugu Indian Idol Season 4
Spread the love

Telugu Indian Idol Season 4 : సరి కొత్త సమ్మోహన పరిచే గాత్రాలతో సంగీత ప్రయాణం ప్రారంభించిన ఇండియన్ ఐడల్ సీజన్ 4

Contents

Telugu Indian Idol Season 4

“ఇండియన్ ఐడల్ ఎవ్రీథింగ్ ఈస్ మోర్” అనే కాప్షన్‌తో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఈసారి 2025 ఆగస్టు 29న ప్రారంభంకానుంది. ఆగస్టు 23న యూట్యూబ్‌లో విడుదలైన లాంచ్ ప్రోమో ఇప్పటికే అభిమానుల్లో ఉత్సాహం నింపింది. అద్భుతమైన ప్రతిభ కలిగిన సింగర్స్ , హృదయాన్ని తాకే పాటలు, థమన్ పండించిన సందర్భోచిత హాస్యం ఇది కదా కావలసింది అనేలా ఉంది ప్రోమో.

ప్రోమోలో ఏముంది ??

విక్రమ్‌లో కమలహాసన్ రేంజ్‌లో మిషన్ గన్‌తో ఎంట్రీ ఇచ్చిన థమన్ , థమన్‌తో పాటు జడ్జిలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ గాయని గీతా మాధురి, పాపులర్ సింగర్ కార్తీక్ .

ఈ సారి యాంకరింగులో శ్రీ రామ్ చంద్రతో పాటు జతకట్టిన సింగర్, యాక్టర్, యూట్యూబర్ అయిన బ్యాంకాక్ సమీర. దీనితోనే షో ఎంత హాస్య భరితంగా ఉంటుందో చెప్పవచ్చు,

ఇంకా…

ప్రోమోలో సింగర్స్ పాడిన పాటలు అత్యద్భుతంగా.. షో వెంటనే చూసేయాలి అనేలా వున్నాయి. ఇంకా చాలా ట్విస్టులు, భావోద్వేగాలు, సెటైర్లు అన్నీ కలగలిపి ఉన్నాయి .

Telugu Indian Idol Season 4:

ఈ షో ఎందుకు చూడాలి అంటే ?

  • అనుదినం అనేక ఒత్తిళ్లతో అసహనంతో వున్న మనకు ఈ సంగీతం చక్కటి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని ఇస్తుంది.
  • సరి కొత్త గొంతులు వినే అవకాశాన్ని ఇస్తుంది.
  • శ్రీరామ చంద్ర , సమీరాలు చేసే యాంకరింగ్ మనలను ఉత్సాహ పరుస్తుంది అనడంలో సందేహం లేదు.
  • పోటీకి వచ్చిన గాయకులు చెప్పే వ్యక్తిగత కథలు, కష్టాలు, విజయాలు మనలను స్ఫూర్తి పరుస్తాయి.

    కొసమెరుపు: మన కందరికీ ఇష్టమైన గాయకుడు పవన్ కళ్యాణ్ దీనిలో పాల్గొనడం షో ని మరింత మధురంగా మార్చుతుంది.

 

మీ క్యాలెండర్‌లో గుర్తించుకోండి…

2025 ఆగస్టు 29న ప్రారంభమవుతున్న సీజన్ 4, గత సీజన్ల కంటే మరింత గొప్పగా, మధురంగా మాయాజాలంలా ఉండబోతోంది.

మీరు ఒక గొప్ప సంగీతాభిమాని అయినా, పాటను ప్రాణంగా ఇష్టపడే వారైనా ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ తప్పక మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అని ఆశిస్తున్నాను.

 

Telugu Indian Idol Season 4 :PROMO LINK

 

మంచి వేదిక సిద్ధమైంది, వెలుగులు వెలిగాయి, ఇప్పుడు తెలుగు సంగీత చరిత్రలో కొత్త అధ్యాయం రాయబడబోతోంది!

 

తెలుగు కథలు

error: Content is protected !!