telugu moral stories for 10th class
Spread the love

 

Contents

కొత్త పరిచయం

Telugu Moral Stories for 10th class

 

telugu moral stories for 10th class

రేవంత్ డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరాడు తనకు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చిన కారణంగా రేవంత్ వాళ్ళ నాన్నగారు చక్కని స్మార్ట్ ఫోన్ ఒకటి బహుమతిగా ఇచ్చారు. ఆ బహుమతి రేవంత్ జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి రేవంత్ ప్రపంచం అంతా మారిపోయింది.

ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు రేవంత్ పూర్తిగా తన మొబైల్ ఫోన్ కు  అంకితమై పోయాడు . తన ప్రవర్తనను చూసి తల్లిదండ్రులు ఎన్నిసార్లు హెచ్చరించిన రేవంత్ వారి మాటలు పట్టించుకునేవాడు కాదు పైగా వయసు ప్రభావం ఏమో! కానీ వారు అంటే తనకు చాలా విసుగుగా అనిపించేది.   రోజు కాలేజీకి వెళ్లేవా డే కానీ తన క్లాసులో ఒక మిత్రుడిని కూడా సంపాదించలేక పోయాడు కారణం రోజంతా మొబైల్ ఫోన్ లో కొత్త కొత్త స్నేహాలు ఏర్పరుచుకోవడం వారితో చాట్ చేయడం వారిలో ఎవరైనా నచ్చితే వారితో ఇంకొంత కొంత సమయం మాట్లాడడం ఒకవేళ ఎవరైనా తనకు నచ్చనట్లయితే వారిని బ్లాక్ చేయడం ఇది రోజు రేవంత్ దినచర్య అందువల్ల తనకు కాలేజీలో గాని క్లాస్ లో గాని ఎటువంటి స్నేహితులు లేరు.

ఒక రోజు….

కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున ఆ రోజు రేవంత్ కాలేజ్ నుంచి చాలా లేటుగా బయలుదేరాడు అప్పుడు సమయం రాత్రి ఏడున్నర అయింది.  రేవంత్ తన బైక్ స్టార్ట్ చేసి హెల్మెట్ ను ధరించి బయలుదేరాడు, అలా కొంత దూరం వెళ్ళాక ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక అజ్ఞాత స్నేహితుని మెసేజ్ ఫోనులో వచ్చేసరికి ఫోన్ లో మెసేజ్ ఓపెన్ చేద్దాం అనే ఆత్రంలో తన ఎదురుగా వస్తున్న ఆటోను పట్టించుకోకుండా వెళ్లేసరికి ,ఆటో వచ్చి రేవంత్ బైక్ కు బలంగా తగిలింది ఆ కుదుపు తట్టుకోలేక  రేవంత్ వెళ్లి రోడ్డు మీద బలంగా పడ్డాడు తలకు హెల్మెట్ ఉన్న కారణంగా తలకి ఎటువంటి దెబ్బ తగల్లేదు కానీ అతని మోచేతులు మోకాళ్ళు రోడ్డుకు రాసుకు పోయి రక్తసిక్తం అయిపోయాయి . రేవంత్ చీకట్లో ఏమైందో అర్థం కాక నెమ్మదిగా ఓపిక చేసుకొని పైకి లేచి చూసేసరికి ఒక పక్కన తన మొబైల్ ఫోన్ రోడ్డు మీద పడి ముక్కలు అయిపోయింది మరోవైపు తన బైక్ రోడ్డు మీద పడిపోయి బైక్ కు వున్న చక్రం ఊడిపోయి దూరంగా పడి ఉంది.

రేవంత్ కి ఏం చేయాలో పాలుపోలేదు ఎవరినైనా సహాయం అడుగుదామని నెమ్మదిగా రోడ్డు మీదకు వచ్చి నుంచున్నాడు.  రేవంత్ పరిస్థితి చూసి ఒక బైక్ అతను  ఆగి ఏమైంది అని అడిగాడు అప్పుడు రేవంత్ జరిగిన పరిస్థితి వివరించి తనకు ఒకసారి ఫోన్ ఇచ్చినట్లయితే తన వారికి ఫోన్ చేస్తాను అని అడుగుతాడు .   రేవంత్ పరిస్థితి అర్థమైన అతను జాలిపడి రేవంత్ కి ఫోన్ ఇస్తాడు , ఫోన్ కీప్యాడ్ ఓపెన్ చేసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేద్దాం అని అనుకుంటే  రేవంత్ కి  వాళ్ళ నాన్న గారి మొబైల్ నెంబర్ గుర్తుకు రాదు ఎంత ప్రయత్నించినా తనకు సంబందించిన ఒక్కరి ఫోన్ నెంబర్ కూడా తనకి గుర్తు రాలేదు . అవును రోజూ  మొబైల్ లో దాచి ఉన్న పేర్లు  నొక్కడం అలవాటైన ఎవరికైనా సమయానికి అవసరానికి నెంబర్లు గుర్తు రావు కదా. రేవంత్ పరిస్థితి రేవంత్ అర్థమై మాట్లాడకుండా ఫోన్ అతనికి యిచ్చివేసి మౌనంగా ఉండిపోతాడు .

10th Class Story

అప్పుడు…

అతను నేను మిమ్మల్ని హాస్పిటల్ కి తీసుకు వెళతాను వస్తారా అని అడుగుతాడు అందుకు రేవంత్ ఇక్కడ నా బైక్ ని రోడ్డు మీద వదిలేసి నేను రాలేను అని రేవంత్ అతనికి చెబుతాడు ,అతను  చేసేది ఏమీ లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

రేవంత్ నీరసంగా నొప్పితో రోడ్డు పక్కన కూర్చొని ఉంటాడు అప్పుడు నలుగురు వ్యక్తులు రెండు బైకులు మీద వచ్చి రేవంత్ పక్కన ఆగి ,ఏరా…! ఏమైంది ?ఎలా అయింది ? అని అడుగుతారు వారెవరో రేవంత్ గుర్తుపట్టలేక పోతాడు . వారు రేవంత్ ని నెమ్మదిగా చేతులతో పైకి లేపి, రేవంత్ బైక్ ను రోడ్డుకు పక్కగా తీసుకు వస్తారు రేవంత్ వారిని చూసి మీకు నేను తెలుసా! అని అడుగుతాడు. అప్పుడు వారు యాక్సిడెంట్ వలన రేవంత్ మర్చిపోయాడు అని భావించి,  మేము నీతో పాటు క్లాసులో చదువుతాము నీ వెనకాల బెంచీల్లో కూర్చుంటాం అని చెప్తారు.

అది విని రేవంత్ నేను వీళ్ళను ఎప్పుడూ చూడలేదే   అని మనసులో అనుకుంటాడు. వారు రేవంత్ ను ఒప్పించి తమతోపాటు హాస్పిటల్ కి తీసుకు వెళ్తారు, మిగిలినవారు రేవంత్ బైక్ బాగుచేయించి తీసుకువస్తామని రేవంత్ చెప్తారు. రేవంత్ కి కూడా  వారి మాటలు నమ్మే విధంగా ఉండటంతో తను కూడా వారిని అనుసరిస్తాడు.

స్నేహితులు రేవంత్ ని హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి కట్టు కట్టించి ఇంటికి తీసుకొని వస్తారు,రేవంత్ ని చూసి తల్లిదండ్రులు చాలా బాధపడి వారు స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతారు.

 ఆ రోజు రాత్రి…

రేవంత్ నిద్ర పోదామని అనుకుంటుండగా తనకి తన మీదే చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది కారణం ఎంతో తెలివిగా ఉండే తనకు తన ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా గుర్తు లేకపోవడం ఒక కారణమైతే తన క్లాసులో తనతోపాటు సంవత్సరకాలంగా చదువుతున్న స్నేహితులు కూడా తనకి తెలియక పోవడం తన మీద తనకి చాలా కోపంగా అనిపిస్తుంది .

మరుసటి రోజు రేవంత్ నిద్రలేచేసరికి తన హాల్ లో చాలా వస్తువులు కొత్తగా ఉండటం చూసి అమ్మ దగ్గరికి వెళ్లి అమ్మా…  నిన్న ఈ వస్తువులన్నీ కొన్నారా అని అడుగుతాడు అప్పుడు అమ్మ లేదురా ఈ వస్తువులన్నీ మార్చి 6 నెలలు పైగా అవుతుంది అని చెబుతోంది. తర్వాత రేవంత్ ఇంటి ముందు ఉన్న వాళ్ళ నాన్న గారి దగ్గరికి వెళ్తాడు ఆయన చూడడానికి చాలా నీరసంగా బలహీనంగా కనబడతారు, రేవంత్ వాళ్ళ నాన్నతో నాన్న మీకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ నాన్న నాకు రెండు నెలలుగా బిపి చాలా ఎక్కువగా ఉంటుంది రా అందుకే ఇంత నీరసంగా ఉన్నాను అని చెప్తారు. ఆయన మాటలు విన్న రేవంత్ కి దుఃఖం తన్నుకొస్తోంది అంటే నేను ఇన్నాళ్ళుగా ఇంట్లో వీరితో కలిసి ఉంటున్నాను గానీ ఇంట్లో ఉన్న ఈ ఒక్క సమస్య నాకు తెలియకుండా నేను బతుకుతున్నాను అన్నమాట అని అనిపించి చాలా బాధపడతాడు.

అదే సమయంలో రేవంత్ ఒక నిర్ణయం తీసుకుంటాడు ఫోన్ అనేది తనకు అవసరమైనప్పుడు తప్ప అనవసరమైన సమయాల్లో ఉపయోగించకూడదని అనుకుంటాడు,తర్వాత అదే విషయాన్ని ఆచరలో పెడతాడు.  అప్పటి నుంచి కుటుంబంతో,తోటి స్నేహితులతో  ఎక్కువ సమయం గడుపుతూ తన జీవితాన్ని ఆనందమయం చేసుకుంటాడు.

Moral : అధునాతన సాంకేతికతను అవసరం లో ఉపయోగించు కోవాలి కానీ  దానికి బానిస కాకూడదు.

For More moral stories please follow : కనువిప్పు 

 

Sireesha.Gummadi

 

ప్రశంస

Telugu Moral Stories for 10th class

 

telugu moral stories for 10th class

రాము, తన డిగ్రీ పూర్తయి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఎటువంటి ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటాడు .తన తోటి స్నేహితులందరూ అందరూ ఉద్యోగాల్లో స్థిరపడి పోవడంతో రాము తల్లిదండ్రులు ఎప్పుడూ రాముని బాధ్యతారాహిత్యంగా ఉన్నావ్ అని తిడుతూ ఉంటారు.

అలా రోజులు గడుస్తున్న కొద్దీ రాములో  నిరాశ మరీ ఎక్కువైపోతుంది,అనేక చోట్ల తన విద్యార్హత కన్నా తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగాల కోసం వెతికినా కూడా, అది కూడా దొరకక  చాలా అసహనానికి లోనవుతూ ఉంటాడు.

తనను అమితంగా ప్రేమించే వాళ్ళు ,గౌరవించే వాళ్ళు కూడా తనని మనిషిగా చూడకపోయే సరికి, తనకి విలువ ఇవ్వక పోయేసరికి రవికి చెప్పలేనంత బాధగా అనిపించి .ఈ జీవితం జీవించడం నాకు అవసరమా నేను ఎవరికీ ఉపయోగకరంగా లేను పైగా నా తల్లిదండ్రులకు నేను చాలా భారంగా ఉన్నాను … ఇటువంటి జీవితం నాకు జీవించడం ఇష్టం లేదు అనుకొని ఒక నిర్ణయానికి వచ్చి రైలు పట్టాల వైపు అడుగులు వేస్తూ ఉంటాడు .

ఒక్కొక్క అడుగు వేస్తూన్న కొద్దీ జీవితంలో జరిగిన అవమానాలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ముందుకు వెళ్తూ భగవంతుడు నా మొర ఆలకించి నాకు ఒక దారి చూపెడితే ఎంత బాగుంటుంది, అని ఆశ మళ్లీ మళ్లీ కలుగుతూ ఉంటుంది .

ఇంకా ముందుకు…

నడుస్తున్న  కొద్దీ అతను చిన్నతనం నుంచి ఎంత కష్టపడి చదివింది ,ఎంతమంది తనను ప్రశంసించింది అన్ని గుర్తుకు తెచ్చుకొని ఆకాశం వైపు చూస్తూ భగవంతుడా నువ్వు నాకు కొంచెం సాయం చేసివున్నట్లైతే  నాకు ఈ దుస్థితి వచ్చేది కాదు, ఎందుకూ చేతగాని వానిగా నన్ను ఎందుకు పుట్టించావు అని గట్టిగా ఏడుస్తూ… ఇక చేసేది ఏమీ లేదు అనుకొని అక్కడి నుంచి మరొక రెండు అడుగులు ముందుకు వేస్తాడు  .  అప్పుడు అతనికి రాము…  అని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనుకకు తిరిగి చూస్తే ఒక వ్యక్తి కనిపిస్తాడు, రాము ఆ వ్యక్తిని గుర్తుపట్టలేక పోయాడు  , అప్పుడు ఆ వ్యక్తి రాము దగ్గరకు వచ్చి రాము…  నేను ఎవరో గుర్తుపట్టారా అని అడుగుతాడు… లేదండి అని అంటాడు రాము  .

అప్పుడు అతను నేను నువ్వు చదువుకున్న కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను అని చెపుతాడు. అప్పుడు రాము అవునండి నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది అంటాడు. అందుకు ఆ వ్యక్తి నువ్వు మొన్న మీ ఫ్రెండ్ పెళ్లి లో పాడిన పాట విని ,ఆ పెళ్ళికి నాతో పాటు వచ్చిన నా పదేళ్ల కొడుకు నీ దగ్గర సంగీతం నేర్చుకుంటానని పట్టుపట్టాడు ,నెలరోజుల నుంచి నీకోసం నేను వెతకని ప్రదేశం లేదు ఎన్నాళ్ళకు నువ్వు నాకు దొరికావు అని ఆనందంగా అంటాడు  .

Moral Stories For 10th Class

అప్పుడు…

రాము అయ్యో నాకు సంగీతం రాదండి అని చెపుతాడు, ఆ మాటవిని  అతను ఏమిటీ! సంగీతం రాకుండా నువ్వు అంత శ్రావ్యంగా పాట ఎలా పాడను గలిగావు అంటాడు.అందుకు  రాము నాకు చిన్నతనం నుంచి పాటలు అంటే చాలా ఇష్టం ,ఇష్టం కొద్దీ నేర్చుకున్నాను అని చెప్తాడు.

అప్పుడు ఆ వ్యక్తి  ఇంత బాగా పాటలు పాడగలిగే వాడివి ఎంత అదృష్టవంతుడివి, నీ అంత అద్భుతమైన కంఠం ఎవరికన్నా జీవితంలో ఉంటే వారు ఎంత ఎత్తైనాఎదుగుతారు.నిన్ను కూడా నేను ఆ స్థానంలో చూస్తానని చాలా నమ్ముతున్నాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

అతని మాటలు విన్నాక రాము శరీరం అంతా చల్లగా అయిపోతుంది , అంతసేపు బాధతో విరక్తితో ఉన్న రాము శరీరమంతా ఆయన అనుకూలమైన  మాటతో తేలికబడుతుంది.

రాము అక్కడే ఉన్న పెద్ద బండరాయి మీద కూర్చుండి , ఒక్క క్షణం నేను ఆలోచించకపోతే ఎంత అద్భుతమైన జీవితాన్ని చేజార్చుకునే వాడిన, నాలోనూ అంత ప్రతిభ ఉందా… , నేనూ ఇతరులను ప్రభావితం చేయగలనా…. నా లో వున్న ప్రతిభ ఏంటో ఇతరులు చెబితేగాని తెలియనిస్థితి లో నేను ఉన్నానా…

నేను ఈ అద్భుతమైన జీవితాన్ని ఎంత తేలిగ్గా తీసుకుని దాన్ని అంతం చేద్దామని నిర్ణయించుకున్నాను.  అని తనలో తానే అనుకుంటూ ఉంటే ఒక్క క్షణం భయంతో శరీరమంతా ఓణికి పోతుంది ,  అప్పుడు  ఆకాశంవైపు చూస్తూ భగవంతుడా నువ్వు ఉన్నావు…  ఈ క్షణంలో నువ్వు నన్ను కాపాడావు, నాకు కనువిప్పు కలిగించి నా జీవితానికి చక్కని మార్గాన్ని చూపించావు  అని మనసులో దేవునికి  కృతజ్ఞతలు తెలియజేసి , అక్కడి నుంచి సంగీత నేర్చుకుందామ నే  ఆలోచనతో ఇంటి వైపు నిశ్చయంగా అడుగులు వేస్తాడు రాము.

Telugu Moral Stories for 10th class

Moral : ఒక ప్రశంస ఆ మనిషి జీవితాన్ని మార్చకపోవచ్చుకాని,అతనిలో ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఖచ్చితంగా పెంచుతుంది .

Sireesha.Gummadi

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!