Contents
రుచి
Telugu neeti katha Ruchi :this article says the taste of hunger.
వాహిని అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ,ఆ రాజ్యాన్ని వాసుదేవుడు పాలించేవాడు . వాసుదేవుడు మంచి బోక్త , అతనికి వివిధ రకాలైన రుచులు ఆస్వాదించడం అంటే మహా ఇష్టం . తన పాకశాలలో వంటవాళ్లు చేసే రక రకాలైన వంటకాలు ఇష్టంగా తింటూ వారిని సత్కరిస్తూ ఉండేవాడు . కొన్ని రోజులకు వాసుదేవునికి ఎటువంటి ఆహారం తిన్నా రుచించేదికాదు ,వంటవాళ్ళను ఇంకా రుచిగా ఆహారం చేయమని మొదట్లో ఆజ్ఞాపించేవాడు . వారు ఎంత రుచిగా చేసినా నచ్చకపోయే సరికి కోపంతో వారిని చెరసాలలో భందించమని ఆజ్ఞాపించాడు .
మంచి రుచిగల ఆహారం చేసిన వారికి చక్కటి నగదు బహుమతి ఉంటుందని రాజ్యంలో ప్రకటించాడు .రాజుగారికి ఆహారం మీదవున్న ఆశ చూసి రాజ్యం లో ప్రజలు అందరూ నవ్వు కొనేవారు . రోజూ ఇతర రాజ్యాలనుండి కూడా వంటగాళ్లు వచ్చి రాజుగారి కి రుచిగా వండిపెట్టేరువారు అన్ని వంటకాలు అయిష్టం గానే రుచి చూసేవాడు , రాజుకి ఏ వంటకం నచ్చేదికాదు .
రాజు ఈ ఆహారం ధ్యాసలో పడి రాజ్యవ్యవహారాలు నిర్లక్ష్యం చేసేవాడు. ఒక రోజు ప్రక్క రాజ్యం వారు వాహిని రాజ్యం పై దండయాత్రకు వస్తున్నారని తెలిసి వాసుదేవుడు సైన్యంతో దండయాత్రకు బయలు దేరాడు . రాజ్యం పొలిమేరల్లో దట్టమైన అడవులలో శత్రువులతో రెండు రోజులు భీకరమైన యుద్ధం జరిగాక ఎటువారు అటు చెల్లా చెదురయి పోయారు . వాసుదేవుడు దారితప్పి ఒంటరిగా మిగిలాడు , కటిక చీకటి లో దట్టమైన అడవిలో ఎటు వెళ్లాలో తెలియక తన సైన్యం జాడలేక అలసిపోయి తన గుర్రం తో నెమ్మదిగా నడుస్తున్నాడు . ఇంతలో తన శరీరం లో ఇదో నిస్సత్తువు నీరసం అలుముకుంది , తన ఉదరం లో చెప్పలేని నొప్పి రాసాగింది. ఇంతకు ముందెన్నడూ ఇటువంటి బాధ అనుభవించని వాసుదేవునికి ఇదే తన ఆఖరిరోజు అని ,ఇకపై తాను జీవించను అనిపించింది. అలా భాదపడుతూ వెళుతుంటే అక్కడో చిన్న దీపం వెలుగు కనిపించింది , వాసుదేవుని ప్రాణం లేచి వచ్చింది … వారిని సహాయం అడిగి తనను తానూ ఈ కష్టం నుండి కాపాడు కోవాలి అనుకున్నాడు .
నడుచుకుంటూ వెళితే…
అక్కడ ఒక చిన్న గుడిసె కనబడింది , దాని ముందు నిల్చొని ఓపికనంతా కూడదీసుకొని ,ఎవరన్నా వున్నారా అన్నాడు .. . అంతలో గుడిసె లోనుంచి ఒక ముసలి అవ్వ బయటకు వచ్చింది, అప్పుడు వాసుదేవుడు తానూ ఎవరు అనేది ,తాను ఇక్కడకు ఎందుకు వచ్చింది ,తానూ ఎలా తన మనుషుల నుండి విడిపోయింది నీరసం వలన ముక్తసరిగా చెప్పాడు . అప్పుడు అవ్వ మహారాజా నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడిగింది , అందుకు రాజు అమ్మా ఎప్పుడూ లేనిది ఈ రోజు నా శరీరాన్ని ఇదో నిస్సత్తువు ఆవరించింది ,నా ఉదరం లో చెప్పలేని భాదగా వుంది నువ్వు ఏమన్నా సహాయం చేయగలవా అని దయనీయంగా అడిగాడు . అప్పుడు అవ్వ మహారాజా మీ భాదకు నాదగ్గర మందు వుంది , దయచేసి మీరు కొంత సేపు విశ్రాంతి తీసుకుంటే నేను యిప్పుడే వస్తాను అని చెప్పి రాజు గారికి తన గుడిసెలో ఆశ్రయం ఇచ్చి .. తానూ గుడిసె బయటకు వెళ్ళింది .
కొంత సేపటికి రాజు గారికి ఆహారం సిద్ధం చేసి రాజుకి వడ్డించింది , వాసుదేవుడు చాలా ఆత్రంగా ఆహారం తిన్నాడు … ఆశ్చర్యం తానూ ఇంతవరకు ఇంత రుచికరమైన ఆహారం తినలేదు ,కడుపారా బోజనం చేశాడు శరీరానికి ఏదో శక్తి ఆవహించినట్టుగా అనిపించింది వాసుదేవునికి . తెల్లవారుతుండగానే అవ్వకు కృతజ్ఞతలు తెలిపి తన బంగారు ఆభరణాలన్ని అవ్వకు బహుమతిగా ఇచ్చి ,తన రాజ్యానికి పయనమయ్యాడు .
రాజ్యం చేరిన అప్పటి నుండి…
వాసుదేవుడు అవ్వ చేసి పెట్టిన కూర రుచి మరచిపోలేక పోయాడు, అది కాక ఆ కూర తనకు అద్భుతమైన శక్తిని ఎలాయిచ్చిందో అని రోజు తలచుకొనేవాడు . తన వంట వాళ్ళను అందరిని పిలిచి ఆ కూర రుచిని వర్ణించి ,అదే కూర చేయవలసింది గా చెప్పేవాడు . రాజు గారి ఆజ్ఞకు భయపడిన వంటవాళ్లు ,కూరకు అదే రుచి రాకపోతే రాజు గారు తమను కూడా బందిస్తారని చెప్పి మంత్రి దగ్గరకు వెళ్లి వేడుకున్నారు . మంత్రి వారిని కాపాడదాం అనే ఉద్దేశ్యంతో రాజు గారి వద్దకు వెళ్లి ,మహారాజా ఈ వంటవాళ్ళందరూ ఎంత కష్టపడినా ఆ అవ్వ చేసిన అదే రుచి లో కూర వండలేరు కనుక మనం ఆ అవ్వను మన రాజ్యానికి తీసుకు వచ్చివీరందరికి వంటలో శిక్షణ అందిద్దాం అన్నాడు తెలివిగా . రాజుగారికి ఈ ఆలోచన చాలాబాగా నచ్చింది , ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవ్వను రాజ్యానికి తీసుకు రావలసిందిగా మంత్రికి ఆజ్ఞ యిచ్చాడు .
మరుసటి రోజు జరిగిన విషయం అవ్వకు చెప్పి అవ్వను , రాజుగారి ముందు హాజరు పరిచారు మంత్రి . రాజు గారిని సింహాసనం లో చూడగానే అవ్వ శరీరం భయంతో వణికి పోయింది ,రాజు గారు అవ్వను చూసి అమ్మ ఆ రోజు నువ్వు నాకు ఒక కూరను ఆహారంగా ఇచ్చావు అది అమృతం లా వుంది . అంతేకాక అది నాకు అమితమైన శక్తి నిచ్చింది అది ఏమి కూరో మా వంటవాళ్లకు కొంచం నేర్పిచగలరా అని వినయంగా అభ్యర్దించాడు . అప్పుడు అవ్వ మహారాజా మీరు నన్ను క్షమించగలరు , ఆ రోజు మీరు నాదగ్గరకు వచ్చేసరికి యుద్ధం వలన అలసిపోయి ఆహారం లేక నీరసించి వచ్చారు . నేను కటిక పేదరికం లో వున్నదానను , ఆ సమయం లో మీ ఆకలి ఏ విధంగా తీర్చాలో అర్థం కాలేదు .
నా పెరడులో వున్న గడ్డితో నాకు వచ్చిన విధముగా కూర వండి మీకు వడ్డించాను, నన్ను క్షమించండి అని వేడుకుంది . ఆమె మాటలకు ఆశ్చర్యపోయిన రాజు మరి ఆ ఆహారం వలన నా శరీరానికి శక్తి ఎలా వచ్చింది అన్నాడు , అందుకు అవ్వ మహారాజా మీరు జన్మతహః రాజులైనందున మీకు ఆకలి అనేది ఎలావుంటుందో తెలీదు . ఆ రోజు మీరు చెప్పిన నీరసం ,నిస్సత్తువ మరియు క్షుద్బాధ అన్ని ఆకలి వల వచ్చినవని నేను గ్రహించి మీకు వెంటనే ఆహారం ఏర్పాటు చేశాను . ఆహారం మీ శరీరం లోకి వెళ్లి మీకు శక్తిని అందించింది అని చెప్పింది .
కనువిప్పు…
అవ్వ మాటలు వింటూ వున్న రాజు గారికి తనకు ఇంతకాలం ఏ ఆహారం ఎందుకు రుచిగా అనిపించలేదో ,అవ్వ కూర ఎందుకు రుచిగా అనిపించిందో అర్థం అయింది.
అది ఆకలి వలన వచ్చిన రుచి అని , ఆకలి ఆహారానికి ఎంత రుచిని ఇస్తుందో తెలిసివచ్చింది . తానూ ఇంతకాలం ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో తనకు అర్థం అయింది , అనవసరంగా బంధించిన అందరు వంటవాళ్ళను విడుదల చేయమని ఆజ్ఞయిచ్చాడు . అవ్వను తమతో పాటు తమ రాజ్యం లో వుండవలసిందిగా కోరాడు.
అప్పటినుండి ఆహారం మీద ధ్యాస తగ్గించి రాజ్య పరిపాలనపై దృష్టి సారించాడు,ఆకలి విలువ తెలిసింది కనుక తన రాజ్యం లో ఎవరు ఆ భాద పడకూడదనే ఉద్దేశ్యంతో
రాజ్యాన్నిఅన్నివిధాలుగా అభివృధి పరిచాడు మన వాసుదేవుడు .
Moral :ప్రతి అనుభవం ఒక కొత్తవిషయం నేర్పిస్తుది .
Telugu neeti katha Ruchi :this article explains humanity is everywhere.