Telugu Stories with Moral and Pictures
Spread the love

Telugu Stories with Moral and Pictures

Contents

చిలుక జోస్యం

పూర్వకాలం ఒక  చిన్న రాజ్యం లో కనకయ్య అనే  ఒక చిలుక జ్యోతిష్యుడు ఉండేవాడు అతను చాలా స్వార్దపరుడు. ఎంతసేపూ తన సంపాదన మీద ఆశే గాని చిలుకకు కడుపునిండా సరైన ఆహారం పెట్టేవాడు కాదు .

జ్యోతిష్యుడు:అమ్మో! దీనికి కడుపు నిండుగా ఆహారం పెడితే నా మాట అస్సలు వినదు ,అందుకే దీన్ని రోజంతా అర్దాకలితో ఉంచుతున్నాను

చిలుక: అబ్బా…  ఈ ఆకలి బాధ భరించలేక పోతున్నాను ,ఎలా అయినా మంచి ఉపాయం అలోచించి తెలివిగా ఇతని నుండి తప్పించుకొని పోవాలి .

(ఆలోచించింది)

ఆ…  ఒక ఆలోచన వచ్చింది , చాలా కాలం క్రితం జ్యోతిష్యుడు నాకు  మాటలు నేర్పించాడు కానీ నేను  మాటలు మాటలాడినా  కూడా అతను నాకు సరిపడా  ఆహారం పెట్టడు కాబట్టి నేను నాకు  మాటలు రానట్టుగా నటించాను . ఇప్పుడు ఆ మాటలను ఉపయోగించి జ్యోతిష్యుడి నుండి తప్పించుకుంటాను. (అనుకుంది మనసులో )

మరుసటి రోజు ఒక ఇద్దరు ముగ్గురు వున్న సమయం చూసి

చిలుక( మాట్లాడడం మొదలు పెట్టింది): “అయ్యా..  మీరు చాలా అదృష్టవంతులు మీకు త్వరలో ధనయోగం కలుగుతుంది అని అంది ”

Telugu Stories with Moral and Pictures

చిలుక మాటలు విని కనకయ్య తో సహా అందరూ ఆశ్చర్య పోయారు .

జాతకం చెప్పించుకోవడానికి కూర్చున్న వ్యక్తి: అబ్బా.. ఎంత వింత చిలుక మాట్లాడడమా ,అదీ కాక నాకు ఇంత మంచి జాతకం చెప్పడమా … ఇదుగో  కనకయ్యా నువ్వు అడిగిన డబ్బుకంటే ఎక్కువేయిస్తున్నాను .

జ్యోతిష్యుడు:చాలా ఆనందమయ్యా

ఇదంతా గమనిస్తున్న చుట్టుప్రక్కల వాళ్లంతా మాట్లాడే చిలుకతో జోస్యం చెప్పించుకోవడానికి బారులు కట్టారు .

జ్యోతిష్యుడు(చిలుకతో):ఈ  రోజుతో నా  దశ తిరిగింది వద్దన్నా డబ్బులు వచ్చి పడ్తున్నాయి.

చిలుక: ఇప్పటికన్నా నాకు మంచి ఆహారం ఇవ్వచ్చు కదా

జ్యోతిష్యుడు:అమ్మో .. నీకు సరిపడా ఆహారం పెడితే నా మాట అస్సలు వినవు ,నీ సంగతి నాకు తెలుసు

చిలుక(మనసులో అనుకుంది): నాకు మంచి అవకాశం వచ్చేవరకు నీ ఆటలు ఇలాగే సాగుతాయి

కొన్ని రోజుల్లో  చిలుక మాట్లాడుతూ చెప్పే జోస్యం గురించి ఆ రాజ్యం లో రాజుగారికి తెలిసి  కనకయ్యను పిలిపించారు.

రాజు:

ఏంటి కనకయ్యా.. నీ మాట్లాడే చిలుకతో నాకు కూడా జోతిష్యం చెప్పిస్తావా

జ్యోతిష్యుడు: చిత్తం ప్రభువా

జ్యోతిష్యుడు (చిలుకతో నెమ్మదిగా) :అందరిలాగే రాజుకి కూడా మంచిగా జాతకం చెప్పు ,లేక పోతే మనం ఇద్దరం రాజు చేతిలో చచ్చిపోతాం  జాగ్రత్త !!

ఇటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న చిలుక ఈ సందర్భాన్నిఎలాఅయినా ఉపయోగించుకోవాలి అని అనుకుంది.

చిలుక  (రాజుతో):  “మహారాజా మన రాజ్యానికి చాలా ముప్పు పొంచివుంది కానీ మీరు నా సహాయంతో ఆ సమస్యనుండి బయట పడతారు”

చిలుక మాటలకు ఆశ్చర్య పోయి

రాజు (గట్టిగా నవ్వుతూ ): ముప్పు ఉందా అదీ..  నీ  సహాయం తో బయట పడతానా …  సరే రాజ్యానికి ముప్పు అంటున్నవ్ కాబట్టి నీ మాట నమ్ముతాను, నేనేమి చేయాలి చెప్పు .

చిలుక(రాజు గారి భుజం  పై వాలి) :మహారాజా …ఈ రాజ్యం లో ఉన్నవారి సమస్యలన్నీ నాకు తెలుసు ,వాటిని మీరొక్కటొక్కటిగా పరిష్కరిస్తే మీ ముప్పు తప్పుతుంది
Telugu Stories with Moral and Pictures

రాజు :సరే నువ్వు చెప్పిన విధంగానే అందరి సమస్యలు తీరుస్తాను

రాజు  చిలుక మాటలకు ఒప్పుకొని రాజ్యం లో అన్ని సమస్యలు తీర్చాడు, ప్రజల మనస్సుకు ఇంతకుముందుకన్నా బాగా దగ్గరయ్యాడు.

ప్రజలు:మన రాజుగారు మనకు దేవుడితో సమానం ,మన మందరం ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉండాలి

అనుకోని విధంగా ప్రక్క రాజ్యం రాజు వీరి రాజ్యం పై దండెత్తాడు ,

యుద్ధం అకస్మాత్తుగా అయినప్పటికీ రాజుగారి పాలన వలన తృప్తిగా వున్న ప్రజలందరూ ఒక్కటిగా నిలబడి వారి రాజ్యాన్ని కాపాడుకున్నారు .

ఈ సంఘటనతో చిలుక రాజుగారికి మరింత చేరువయ్యింది కానీ దాని శ్రమవలన వచ్చిన యోగంతో కనకయ్య రాజభోగాలు అనుభవించడం చిలుకకు అస్సలు నచ్చలేదు

చిలుక:ఛీ !! కష్టమంతా నాది ,కానీ.. కనకయ్య మాత్రం రాజా భవనంలో నా వల్ల ఆనందం అనుభవిస్తున్నాడు. ఎలా అయినా కనకయ్య నాకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష అనుభవించేలా చేయాలి .

చిలుక(రాజు తో ):“మహారాజా నన్ను క్షమించండి, మా జ్యోతిష్యుడు ప్రక్కరాజ్యం రాజుతో మంతనాలు చేసి మిమ్మల్ని ఓడించడానికి నన్ను అక్కడకు తీసుకువెళదాం అనుకుంటున్నాడు” (అని అబద్దం చెప్పింది)

రాజు (తన భటులతో ):రాజా ద్రోహం క్రింద వెంటనే కనకయ్యను భందించి చెరసాలలో వేయండి.

Telugu Stories with Moral and Pictures

చిలుక: హమ్మయ్య ఇన్నాళ్లకు నా పగ తీరింది . ఇప్పటికైనా తృప్తిగా ఆహారం తినవచ్చు.

 

నీతి :తెలివితేటలతో ఎటువంటి సమస్య నుండైనా బయట పడొచ్చు , మన చిలుకలా

 

చందమామ కథలు

Kids Moral Stories in Telugu

Real friend short-story for kids in Telugu

Kids-stories-in-Telugu

 

error: Content is protected !!