Contents
ఆ రోజు…
చాలా మత్తుగా ఉండి అస్సలు కళ్ళు తెరవాలి అనిపించడం లేదు కానీ…ఒళ్ళంతా ఏంటో, వేడిగా మండుతుంది పండుకున్న చోటంతా ఏదో గుచ్చుకుంటున్నట్టు చిరాకుగా వుంది ,అస్సలు ఏమైంది అనుకుంటూ కళ్లుతెరిచాను ,ఒక్కసారిగా గుండె జల్లుమంది .
ఎక్కడో ఒక పొలంలో మండుటెండలో గడ్డిమీద పడుకొని వున్నాను. ఏంటి ఇక్కడ ఉన్నాను! … అస్సలు ఎక్కడ వున్నాను! … అమ్మ నాన్న ఎక్కడ వున్నారు ?
అనుకుంటూ గట్టిగా అమ్మా … నాన్నా … అని పిలిచాను కానీ కనుచూపుమేరా ఎవ్వరూ కనబడలేదు ,చుట్టూ పచ్చని పొలాలు ఒక్క మనిషి కూడా లేడు .
మెల్లగా గుండెల్లో భయం మొదలయింది ,దుఃఖం తన్నుకొచ్చింది . మళ్ళీ గట్టిగా ఏడుస్తూ అమ్మా … అని పిలిచాను ,ఎవ్వరూ రాలేదు ,పలకలేదు .
అక్కడ ఉండాలంటే భయంవేసి ఎటువెళ్ళాలో తెలియనప్పటికీ పరుగు పెట్టడం మొదలుపెట్టాను … కనబడిన దారాల్లా పరిగెత్తాను . కొంతదూరం వెళ్ళాక కాలు ఎందుకో నొప్పిగా అనిపించి క్రిందకు చూసాను ,కాలంతా రక్తం తో నిండిపోయి వుంది.
కాలుకి చెప్పులు లేకుండా పరిగెత్తడం వలన ఏదో గుచ్చుకొని కాలు రక్తం కారుతూనే వుంది … ఇంకా ఏడుపు తన్నుకొచ్చింది ,ఏంచేయాలో తెలీక నొప్పి భరించలేక ప్రక్కనే వున్న నీటి గుంటలో కాలు పెట్టాను ,కొంతసేపటికి రక్తం కారడం తగ్గింది నొప్పికూడా తగ్గింది .
మళ్ళీ నెమ్మదిగా నడవడం ప్రారంభించాను ,ఎండ నడినెత్తిన వుంది తల తిరుగుతుంది ,దాహంగా వుంది అప్పుడే ఆకలి కూడా మొదలయింది.మళ్ళీ గట్టిగా అమ్మా … అని అరుస్తూ ఏడుస్తూ నడుస్తూ వున్నాను . అలా చాలా దూరం నడిచాక ఆకలివల్ల నీరసం వచ్చి ఒక్క అడుగుకూడా వేయలేక ఒక చెట్టుక్రింద కూర్చున్నాను . అప్పుడు గమనించాను నేను ఒక చిరిగిన షర్ట్ పొట్టి నిక్కరు వేసుకొని వున్నాను . ఏంటీ … నేను ఇంత దీనంగా వున్నాను ? అసలు నాకు ఏమైంది అనుకుంటుండగా మళ్ళీ ఆకలి మొదలయింది .
దేవుడా …
కాపాడు అనుకుంటూ ప్రక్కకు చూసాను అక్కడ ఒక బావి మీద ఇరవై బకెట్ల నీరు తోడి పొలానికి వేస్తే ఒక పూట బోజనం ఇస్తాం అని రాసివుంది . వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ఓపికనంతా కూడగట్టు కొని ఎలా నీరు తోడాలో ప్రయత్నించి ప్రయత్నించి నేర్చుకొని ఆఖరుకు ఇరవై బకెట్ల నీరు తోడి పొలానికి వేసాను,చేతులు ఒకటే మంటలు కళ్ళుతిరిగేలాగా వున్నాయి, అప్పుడే ఒక మనిషి వచ్చి చేతిలో పెరుగు అన్నం పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు .ఏడుస్తూ కంగారుగా అన్నం తింటున్నాను … ఇంతలో ఎవరో గట్టిగా వాసూ అని పిలుస్తున్నట్టు అనిపించి … బలవంతంగా కళ్ళు తెరిచాను … కళ్ళనిండుగా నీళ్లు ఏమీ స్పష్టంగా కనబడం లేదు ప్రక్కనుండి అమ్మ అరుపులు వినిపిస్తున్నాయి “వాసూ స్కూల్ టైం అవుతుంది నిద్రలెగూ” అని .
వెంటనే కళ్ళు తుడుచుకొని చుట్టూ చూసాను ,అవును! నేను నా రూమ్ లో మా ఇంట్లో వున్నాను అని నిర్థారణకు వచ్చి పరిగెత్తుకుంటూ రూం నుండి బయటకు వచ్చి ,కిచెన్ లో వున్నఅమ్మ ను గట్టిగా పట్టుకొని ఏడుస్తూ వున్నాను . అమ్మ నన్ను ముద్దుపెట్టుకొని ఏంటి ఏమన్నా పీడకల వచ్చిందా నాన్నా … అని అడిగింది . అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు వచ్చింది ఒక పిచ్చి ,భయంకరమైన కల అని.
అమ్మ దగ్గరనుండి మళ్ళి రూంకి వెళ్లి కూర్చొని ఆలోచించాను , ఏంటి ఒక మనిషికి తనకంటూ ఎవ్వరూ లేకపోతే అంత భయపడుతూ ఉంటాడా ,సరైన బట్టలు లేకపోతే అంత అవమానంగా ఉంటుందా . ఇల్లు లేకపోతే.. కనీసం చెప్పులు కూడా లేకపోతే పరిస్థితి అంత దారుణంగా ఉంటుందా . ఒకపూట తిండి తినాలి అంటే అంత కష్టపడాలా అని తలచుకుంటుంనే మళ్ళీ ఏడుపువచ్చింది నాకు.
ఈ రోజు…
ఈ కల వలన నాకు ఈ రోజు జీవితం విలువ ,మనుషుల విలువ ,వస్తువుల విలువ ఇంకా అన్నం విలువ కూడా బాగా తెలిసి వచ్చింది అదీ కాకుండా ఇవి లేకుండా ఎందరో మనుషులు ఎన్నికష్టాలు పడుతున్నారో స్వయంగా అర్థమైనది .
మన చేతిలో వున్నప్పుడే కాలానికి , మనుషులకు ,వస్తువులకు విలువనిచ్చి కాపాడుకోవాలని చేయి జారాక బాధపడి ప్రయోజనం లేదని తెలిసివచ్చింది.
మరి మీకు …
వాసు ,8Th క్లాస్
Sireesha.gummadi
Telugu story for Students with Moral|| “ఆ రోజు” ||
More…
For more moral stories please visit: పెంపకం
For kids Related stories please visit: తంబులిన
For riddles in Telugu please visit: పొడుపుకథలు
For inspirational stories please visit: నీరజ్ చోప్రా
For history related stories please visit: who is Cheguvera ? Why he is famous ?
For famous stories please visit: famous stories in Telugu
For famous stories please visit: famous stories in Telugu volume 2
For famous stories please visit: famous stories in Telugu volume 3
For Vemana Padyaalu please visit: Vemana padyaalu in Telugu with Bhavam
For Sumathi Sathakam please visit: Sumathi sathakam in Telugu with Bhavam
For kids related problems please visit: how to deal with kids behavior problems