Contents
అసలైన నాయకుడు
Very Short Moral Stories in Telugu to write with moral
అనగనగా విశ్వసేనుడు అని ఒక రాజు ఉండేవాడు, ఆయన తన దేశాన్ని చాలా బాగా పరిపాలించేవాడు కానీ తన సైన్యం చాలా బలహీనంగా ఉందని, సైన్యాధిపతి సరైన వాడు లేకపోవడం వల్ల సైన్యాన్ని నడిపించే వారు ఎవరూ లేరనే విషయం మంత్రి ద్వారా తెలిసింది . ఏ విధంగా అన్నా తన రాజ్యానికి ఉత్తముడైన సైన్యాధ్యక్షుడు నియమించాలని నిర్ణయించుకున్నాడు . రాజ్యంలో ఎవరికైతే సైన్యాధ్యక్షుడు అవ్వాలని అభీష్టం ఉందొ వాళ్లందరినీ పోటీలో పాల్గొనవలసిందిగా చాటింపు వేశారు. రాజ్యంలో ఉన్న వేలాది మంది యువకులు పోటీలో పాల్గొన్నారు వారికి చాలా విడతల్లో అన్నీ పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆఖరికి ఆరుగురిని ఎంపిక చేశారు. ఎంపికైన ఆరుగురికి రేపు మీకు శరీర దారుఢ్యానికి సంబంధించిన ఆఖరి పరీక్ష ఉంటుందని ఆరుగురికి చెప్పారు వారందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Very Short Moral Stories in Telugu to write with moral
ఆ తర్వాత రోజు…
ఆ ఆరుగురిని సభలో ప్రవేశపెట్టారు ఈ లోపు మంత్రిగారు రాజుగారి దగ్గరికి వచ్చి మహారాజా వేగులవారు నుంచి మనకి ఒక సమాచారం వచ్చిందిప్రక్క దేశపు రాజు మన రాజ్యం మీద దండెత్తాలని నిర్ణయించుకున్నారని సమాచారం వచ్చింది అని చెప్పాడు. అప్పుడు రాజుగారు ఆ రాజు ఎప్పుడూ ఓడిపోలేదు అందువలన మనము చాలా దృడంగా , సంసిద్ధంగా ఉండాలి అని రాజుగారు చెప్పారు ,ఆ మాట విన్న ఎంపికైన వారిలో ఇద్దరు మేము ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నామని నెమ్మదిగా జారుకున్నారు .
వారిని చూసి మహారాజు చిన్నగా నవ్వుకున్నాడు. తర్వాత మహారాజు, మహామంత్రీ …. యుద్ధంలో చనిపోయిన సైన్యాధ్యక్షుడు ని కుటుంబానికి సరిపడా బంగారాన్ని వారికి బహుమతిగా ఇస్తానని ముందే మీరు వారికి తెలియజేయండి అని చెప్పి అన్నారు. ఆ మాట విని నలుగురు లో మరో ఇద్దరు మహారాజా మేము ఈ యుద్ధానికి సిద్ధంగా లేము అని వారు కూడా వెళ్ళిపోయారు అప్పుడు మహారాజు మిగిలిన ఇద్దరు తో నేను ఈ యుద్ధం లో పాల్గొనడం లేదు నా శరీరం ఎందుకో చాలా బలహీనంగా ఉంది కాబట్టి మీరు మాత్రమే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి విజయం సాధించాలి అని చెప్పారు ఆ మాట వినడంతో మిగిలిన ఇద్దరిలో ఒకడు మహారాజా మీరు లేకుండా ఈ యుద్ధాన్ని ఎలా నడిపించాలి అది నా తరం కాదేమో మీరు ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ యుద్ధాన్ని నడిపించగల ను అని చెప్పాడు అందుకు మహారాజు లేదు లేదు నేను ఈసారి యుద్ధం లో పాల్గొనడం లేదని చెప్పారు ఆ మాట విని అతను మహారాజా మీరు లేని యుద్ధంలో నేను పోరాడ లేను అని చెప్పి వెళ్ళిపోయాడు .
ఇంకా మిగిలిన అతను ,మహారాజా మీరు విశ్రాంతి తీసుకోండి నేను శత్రువు తో పోరాడి విజయం సాధించి మీ దగ్గరికి వస్తాను అని చెప్పాడు . మహారాజు ఆయన మాటలు విని ఆయనను ఆలింగనం చేసుకొని ఇకపై ఈ రాజ్యానికి సైన్యాధ్యక్షుడివి నీవే, నీవు యిప్పుడు ఎటువంటి యుద్ధం చేయవలసిన అవసరం లేదు నేను మీలో ఉన్న ధైర్యాన్ని పరీక్షించడానికి ఒక చిన్న నాటకం ఆడాను అని మహారాజు గారు సభలో ఉన్న అందరికీ చెపుతాడు .
Moral :నాయకుడు అంటే ముందుకు నడిపించేవాడు ,ఇతరుల సహాయం కోసం ఎదురుచూసేవాడు కాదు .
Sireesha.Gummadi
బంగారు బిందె
అనగనగా పాండురంగాపురం అనే ఒక చిన్న పల్లెటూరు ఉండేది ,ఆ ఊరు ఒక నది ఒడ్డున ఉండేది, ఆ ఊరిలో నివసించే వారందరూ రైతులు చిన్న చిన్న వ్యాపారస్తులు. వారందరి నిత్యావసరాలకు పంటలు పండించడానికి మంచినీటికి నదిని విరివిగా వాడేవారు . ఆ చుట్టు పక్కల నీటి వసతులు ఏమి లేనందున అందరూ నది పైనే ఆధారపడి జీవించేవారు .
ఒక రోజు ఉదయం నది వెంబడి ఒక పెద్ద బంగారు బిందె కొట్టుకుంటూ వచ్చింది దానిని చూసి నది ఒడ్డున ఉన్న వారిలో ముగ్గురు రామయ్య ,భీమయ్య ,సోమయ్య అనే ముగ్గురు ఆ బిందను నదిలోనుండి బయటకు తీసుకొని వచ్చారు . అది చూసి ఊర్లో వారందరూ అక్కడ గుమిగూడారు, ఈ నది ఊరి మొత్తానిది కావడం వలన ఈ బిందె కూడా ఊరందరికీ సొంతమవుతుందని అందరూ అనుకున్నారు కానీ వీరు ముగ్గురు మాత్రం మేమే కష్టపడి నదిలో దిగాం కాబట్టి మా ముగ్గురికి మాత్రమే చెందుతుంది అని వాదించ సాగారు .
ఈ వాదన ఇలా సాగుతూనే ఉంది కొంతసేపటికి విషయం తెలుసుకొని ఊరి పెద్ద అక్కడికి వచ్చారు ,వారు ముగ్గురు ఊరి సొంతమైన ఈ బంగారుబిందెను ఏ విధంగా వారి సొంతం చేసుకోవాలను అతనికి అర్ధమయ్యి ఎలాఅయినా వారి ముగ్గురికి బుద్ది చెప్పాలని నిర్ణయించు కున్నాడు ,
అప్పుడు ఊరి పెద్ద ప్రజలందరితో , ఈ బిందె వీరి ముగ్గురికి దొరికింది కాబట్టి ఈ బిందె రక్షణ బాధ్యత వీరిదే రాబోయే పది దినాలు వీరు ఈ బిందెను సురక్షితంగా కాపాడుకో గలిగితే తర్వాత ఈ బిందె ఈ ముగ్గురు సొంతం అయిపోతుంది అని చెప్పారు . అంతే కాకుండా ఊరి ప్రజలు ఎవ్వరూ వారి ముగ్గురికి ఏవిధంగానూ సహాయం చేయొద్దని ఊరు పెద్ద ఊరు జనాలందరికీ ఆజ్ఞాపించాడు . తీర్పుకు ఊరి జనాలు కూడా అంగీకరించారు ముగ్గురు కూడా సంతోషించారు.
Very Short Moral Stories in Telugu to write with moral
తరువాత….
వారు ముగ్గురు తమ తమ ఇళ్ళు చాలా చిన్నవి గనుక వాటిలో ఇంత విలువైన పెద్ద బిందెను దాచలేరు కనుక వీరు ముగ్గురు కలిపి రామయ్య పొలంలో గడ్డి తో ఒక ఇంటిని నిర్మించుకుని దాంట్లో నివాసం ఉందామని నిర్ణయించుకున్నారు . వీరు ముగ్గురు పగలనక రాత్రనక నిద్రపోకుండా మొదటి నాలుగు రోజులు కాపలా కాశారు కానీ అప్పటికే వారిలో నిస్సత్తువ ఆవహించింది . ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది అందరూ బంగారు బిందెను ఏదో విధంగా తమ సొంతం చేసుకుందామని ఎదురుచూడసాగారు .
ఒకరోజు పక్క ఊరు నుంచి ఒక దొంగల ముఠా బిందె దొంగతనానికి వచ్చి దొంగతనం చేద్దామని వీరి ముగ్గురుని కర్రలతో కొట్టారు కానీ వారు కూడా బాగా ప్రతిఘటించి బిందెను కాపాడుకున్నారు . తర్వాత అదే విధంగా రెండు మూడు సార్లు వేర్వేరు ప్రాంతాల నుంచి దొంగలు వచ్చి వీరి మీద దాడి చేశారు అసలే నిద్ర లేకపోవడం మరియు ఈ దొంగల చేతిలో దెబ్బలుతినడం వలన వారి శరీరాలు తట్టుకోలేకపోయాయి .
ఆ విధంగా ఎనిమిది రోజులు గడిచాయి అప్పుడు వారు ఈ ఆఖరి రెండు రోజులు మనం బిందెను కాపాడుకుంటే ఇది ఇంక మన సొంతం అయిపోతుంది ,ఏ విధంగా అయినా ఓపిక పట్టి ఈ ఆఖరి రోజులు మనం చాలా ధైర్యంగా ఉండాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు .
ఆరోజు రాత్రి….
ఒకేసారి 20 మంది దొంగలు కలిసి వచ్చి వారి మీద దాడి చేద్దామని నిర్ణయించుకున్నారు అందరూ కలిసి ఒకేసారి వారి మీద దాడి చేయడం ప్రారంభించారు… ఓపికలేని ముగ్గురు వారిని ఎదుర్కోలేక పోయారు . వారితో పోరాడి పోరాడి అలిసిపోయారు ఈ రోజు ఆఖరి రోజు ఇంక మనం బ్రతకం అని వారిలో వారే అనుకొని విలపించారు, బంగారం కోసం ఆశపడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాం అనుకున్నారు .
ఇంతలో ఊరి ప్రజలు కర్రలతో గుంపుగా వచ్చి దొంగల మీద దాడి చేశారు , దొంగలు వారి దెబ్బకు తాళలేక వారి దారిన వారు పారిపోయారు అప్పుడు స్పృహలోకి వచ్చిన ముగ్గురు ఊరి ప్రజలను చూసి వారివల్లనే తమా ముగ్గురు ప్రాణాలు నిలబడ్డాయి అని తెలుసుకుని క్షమించమని కోరారు.
ఇది మొత్తం ఊరికి సంబంధించిన సొమ్ము కానీ మేమే మా సొంతానికి కాజేద్దాం అనుకున్నాం , కానీ దేవుడు మాకు మంచి బుద్ధి చెప్పాడు మాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది అని చెప్పారు.
అప్పుడు ఊరిపెద్ద మనం ఈ బిందెను కాపాడడం కన్నా, ఈ బిందే మనల్ని కాపాడే విధంగా మనం ఒక చక్కటి నిర్ణయం తీసుకుందాం అని చెప్పాడు దానికి ఊరి ప్రజలందరూ అంగీకరించారు. ఆ తర్వాత బిందె అమ్మగా వచ్చిన డబ్బులతో ఆ ఊరిలో ఒక పెద్ద ఆసుపత్రిని ఒక పాఠశాలను కట్టించారు ఆ విధంగా బిందె పాండురంగాపురం ని కాపాడింది.
Moral : దురాశ దుఃఖానికి చేటు .
Sireesha.Gummadi
Very Short Moral Stories in Telugu to write with moral
విలువ
అనగనగా అనగనగా ఒక రోజు ఒక కుందేలు అడవిలో దాని స్నేహితులతో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటుంది,
మాటల మధ్యలో అడివిలో అందరి కంటే మనమే బలహీనమైన జీవులం మనలను చూసి ఎవ్వరూ భయపడరు మనమే అందరినీ చూసి భయపడాలి, అసలు మనం ఇంత పిరికి వాళ్ళం అనిపించుకోవడం కంటే చనిపోవడం చాలా బాగుంటుంది అని బాధగా మిగిలిన కుందేళ్ళ తో అంటుంది.
అప్పుడు మిగిలిన కుందేళ్ళు కూడా అవును నువ్వు చెప్పింది నిజమే మన లాంటి వాళ్ళం ఈ అడవిలో జీవించ కూడదు అని అన్ని నిర్ణయించుకొని. అన్నీ కలిసి ఒకేసారి నదిలో దూకి చనిపోదాం అని నది వైపు వెళ్ళాయి.
అన్నీ ఒకేసారి గుంపుగా నది వద్దకు వచ్చేసరికి ,నది ఒడ్డున ఉన్న కప్పలన్నీ కుందేళ్ళ అలికిడి విని భయంగా నీటిలోకి దూకి వేశాయి. కప్పల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయిన కుందేళ్ళు అదేంటి మనల్ని చూసి కూడా భయపడే జీవులు ఈ అడవిలో ఉన్నాయా! మనకంటే బలహీనమైన జీవులు ఉన్నాయా! అని తమలో తాము అనుకున్నాయి. అప్పుడు ఒక కుందేలు వచ్చి అవును ఇంత చిన్న జీవులు ఇంత ఆనందంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు జీవించలేము , మనం కూడా జీవిద్దాం.
ఎప్పుడూ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవద్దు ఇంకెప్పుడూ ఇటువంటి ప్రయత్నం చేయొద్దు అని అందరూ మూకుమ్మడిగా నిర్ణయించుకొని ఆనందంగా వారు ఉండే చోటికి వెళ్లారు.
ఎవరూ తక్కువకాదు ,ఎవరూ ఎక్కువకాదు …విలువ అనేది మన ప్రవర్తనుబట్టి నిర్ణయించబడుతుంది , శరీర ఆకృతిని బట్టి కాదు…
Moral : ఎవరి విలువ వాళ్లకు ఉంటుంది , దానిని తగ్గించుకోకూడదు .
వింత కోరిక
అనగనగా ఒక రాజు గారు ఉండేవారు, ఆయన ప్రవర్తన చాలా వింతగా ఉండేది. రోజు ఎవరో ఒకరిని ఆయన సభకు పిలిచి సభలో అందరి ముందు వింత వింత కోరికలు కోరేవారు ఆ కోరికలు వారు నెరవేర్చ నట్లయితే వారిని శిక్షించేవాడు ఈయన ప్రవర్తన చూసి రాజ్యంలో ఉన్న వారందరూ ఎప్పుడు ఎవరిని ఏమి కోరతాడు దానికి ఎవరు ఏవిధంగా శిక్షింపబడతారో అని అనుక్షణం భయపడుతూ ఉండేవారు.
ఒక రోజు తన రాజ్యంలో ఒక సైనికుని తన వద్దకు పిలిచి నీకు రాజు గారు అంటే ఎంత అభిమానమో నువ్వు నిరూపించుకోవలసిన సమయం వచ్చింది నీవు నాకు ఇష్టమైన ఎగిరే గుర్రాన్ని రేపటికల్లా తీసుకురాకపోతే శిక్షకు గురి అవుతావ్ అని ఆజ్ఞాపిస్తాడు .
రాజుగారి కోరిక విని భయపడిపోయిన సైనికుడు మంత్రి వద్దకు వెళ్లి , మంత్రి గారు నేను ఏ విధంగా ఎగిరే గుఱ్ఱాన్ని తీసుకొని రాగలరు ఏవిధంగా రాజుగారి మన్ననలు పొందగలను మీరే నన్ను ఈ గండం నుంచి కాపాడాలి అని వేడుకున్నాడు. అప్పుడు మంత్రి నేను కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాను ,అని సైనికునికి ధైర్యం చెప్పి.. నేను చెప్పిన విధంగా నువ్వు చేయి అని చెబుతాడు .
Very Short Moral Stories in Telugu to write with moral
మరుసటి రోజు…సభలో రాజుగారు చేతికి కాళ్ళకి దెబ్బలు తగిలి కట్లు కట్టి ఉన్న సైనికుని చూసి ఏమైంది నీకు నేను నిన్ను గుర్రాన్ని తీసుకు రమ్మన్నాను ,తీసుకు వచ్చావా అని అడుగుతారు . అప్పుడు సైనికుడు మహారాజా మీకోసం కుర్రాన్ని ఎగురుకుంటూ తీసుకు వస్తుంటే చెట్టు చిటారు కొమ్మ తగిలి గుర్రము నేను ఇద్దరం నేలపైన పడిపోయాం, అందువల్లనే నాకు ఈ దెబ్బలు తగిలాయి అని చెబుతాడు అది విని రాజుగారు కోపంతో… ఏమిటి!! నువ్వు రాజుగారు ముందు ఉన్నావు అని కూడా భయం లేకుండా అబద్ధాలు చెబుతున్నావా అని చెప్పి అంటాడు .
అప్పుడు సైనికుడు లేదు మహారాజా నేను చెప్పేది నిజం అంటాడు. అప్పుడు రాజుగారు కోపంతో ఊగిపోతూ అసలు రెక్కల గుర్రం అనేది ఈ సృష్టిలోనే లేదు నువ్వు రెక్కల గుర్రాన్ని ఏవిధంగా తీసుకువస్తున్నాను అని చెపుతున్నావ్ అని అంటాడు. అప్పుడు మంత్రి వచ్చి మహారాజా ఈ సృష్టిలోనే లేని రెక్కల గుర్రం మీరు బహుమతిగా అల్పుడైన సైనికుని నుండి ఎలా ఆశించారు అని అడుగుతాడు.
మంత్రి మాటలకు సిగ్గు పడిన మహారాజు ,అవును నేను నా మూర్ఖత్వంతో ఇన్నాళ్ళు చాలా మందిని బాధపెట్టాను అందుకు క్షమించమని అందరినీ సభాముఖంగా కోరి ఇకమీదట అటువంటి తప్పులు జరగవని అందరికీ మాట ఇస్తాడు మహారాజు యొక్క ప్రవర్తన లో మార్పు చూసిన అందరూ సంతోషించి మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతారు.
Moral :తెలివితో ప్రతి సమస్యను పరిష్కరించవచ్చు .
Sireesha.Gummadi
For more moral stories please click: Telugu chinnapillala kathalu
Very Short Moral Stories in Telugu to write with moral
మోసం
రామయ్య, సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు, అది చూసిన భటులు వారిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు . అక్కడ కూడా వాళ్లు మాట్లాడుకుంటూనే ఉన్నారు, రాజుకు కోపం వచ్చి విషయం ఏమిటి అని గద్దించాడు… నేను గుర్రంమీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు ,అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయ తలచి గుర్రం ఎక్కించుకున్నాను . దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు .
మహారాజా! ఆ గుర్రం నాది నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను తీరా ఇప్పుడు గుర్రం తనదంటూ ,నేను మోసంచేసాను అని నిందలు వేస్తున్నాడు చెప్పాడు రామయ్య .
రాజు వెంటనే మంత్రిని పిలిచి సమస్యను పరిష్కరించండి అని చెప్పి రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకు వెళ్ళమని చెప్పి వారిని పంపించాడు .
మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రం అశ్వశాల లో ఉంది వెళ్లి తెచ్చుకోండి అన్నాడు. ఇద్దరూ తోడురాగా మొదట సోమయ్య అశ్వశాల కు వెళ్ళాడు అక్కడ వెయ్యి గుర్రాలకు పైగా ఉన్నాయి తనది అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహం తో తిరిగి వచ్చాడు. తర్వాత అశ్వశాల కు వెళ్ళిన రామయ్య రాజా… రాజా… అని పిలిచాడు యజమాని గొంతు వినగానే గుర్రం పరిగెత్తుకు వచ్చింది ఆ గుర్రం రామయ్య దనీ సోమయ్య అబద్దం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు ,ఈ విషయాన్ని మహారాజుకు వివరించాడు దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి , రామయ్య ను వదిలేశాడు.
Moral : నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది
(ఈ కథ సేకరించినది)
డబ్బు- స్నేహం
కళింగపట్నంలో రామస్వామి అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు, అతడు విదేశాల్లో విలువైన వస్తువులు కొని తెచ్చి అమ్మేవారు ఒకసారి అత్యంత విలువైన వస్తువులతో వస్తోన్న అతడి పడవ తీరం చేరకముందే తుఫాన్ ప్రమాదంలో కొట్టుకు పోయింది, దాంతో అతడికి తీవ్ర నష్టం కలగడం తో పాటు కొంత మంది పని వాళ్ళు కూడా చనిపోయారు .
చనిపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తన దగ్గరవున్న మిగిలిన డబ్బు ఇచ్చేసాడు రామస్వామి .
చివరికి అతని చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది మనుగడ కోసం ఒక విదేశీ వ్యాపారి దగ్గర సహాయకుడిగా చేరాడు రామస్వామి పనిచేస్తూనే సొమ్ము కూడబెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు .
పని చేస్తాడని మంచిగా ఉంటాడని రామస్వామిని ఆ దేశంలో అందరూ గౌరవించే వారు ,తమ వాడిగానే భావించేవారు కొన్నాళ్ళు తర్వాత ఒక పండగ రోజున రామస్వామికి సొంత ఊరు వెళ్ళి తన వాళ్లను కలుసుకోవాలని పించింది అవకాశం ఉంటే అక్కడికి తన వ్యాపారం కేంద్రాన్ని మార్చుకుందాం అనుకున్నాడు.
తన సేవకుల సహాయం తీసుకుని కళింగపట్నానికి బయలుదేరాడు, మూడు రోజులు ప్రయాణించడం వల్ల నిద్ర సరిగా పోలేదు ఆహారం తీసుకోలేదు. రామస్వామి అతడు సహాయకులు కళింగపట్నం చేరేసరికి మాసిన బట్టలతో దీనంగా వున్నారు .
ఆ సమయానికిఅక్కడే ఉన్నా రామస్వామిని అందరూ చూస్తున్నా , ఎవ్వరూ పలకరించలేదు వారి తీరుకు ఆశ్చర్యపోయాడు రామస్వామి ని ఆ దుస్తుల్లో చూసి రామస్వామి ఇంకా కష్టాల్లో ఉన్నాడని భావించి ఊరి వారంతా రామస్వామిని అతని సహాయకుని ఇంటికి పిలిస్తే ఏ సహాయం అడుగుతాడో అని ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.
Very Short Moral Stories in Telugu to write with moral
రామస్వామి కి నెమ్మదిగా పరిస్థితి అర్థమైంది కాసేపటికి తను తెచ్చిన విలువైన బంగారు ఆభరణాలు బయటికి తీశాడు వాటిని గమనించి ఒక్కొక్కరు అతని దగ్గరికి రావడం మొదలుపెట్టారు కొడుకు తమ్ముడు అంటూ మాట్లాడడానికి ప్రయత్నించారు తనను కాకుండా తన దగ్గర డబ్బుకి విలువ ఇస్తున్నారు అని రామ స్వామి కి అర్థం అయింది , మా ఊర్లో ఉండడం కంటే తనను ఎంతో గౌరవించే దేశంలో వ్యాపారం చేయడం ఉత్తమం అనుకుని తన సహాయకుల తో సహా మళ్లీ ఆ దేశానికి కి వెళ్ళిపోయాడు.
(ఈ కథ సేకరించినది)