what is depression
Spread the love

 

What is depression ? How to overcome it ? || నిరాశ||

ఈ రోజుల్లో మన  దైనందిన జీవితం లో తరచుగా వినబడుతున్న మాట డిప్రెషన్ , అంటే నిరాశ . డిప్రెషన్ అనేది ఒక అనారోగ్య సమస్య అని గత దశాబ్దం వరకు మనలో చాలా మందికి తెలీదు ,నిజం చెప్పాలి అంటే దాని గురించి తెలిశాకే మనం మన జీవితాలలో దానిని ఇనుమడింప  చేసుకున్నాం ఏమో  అనిపిస్తుంది . అంతే కదా లోకం తెలియని  చిన్న పిల్ల వాడికి నువ్వు మొండివాడివి అని పదే పదే చెప్పి వాడికి మొడితనం నేర్పించినట్టు ,మనం కూడా మనకు తెలిసిన నిరాశ అనే ఒక భావాన్ని పెంచి పోషించి రంగులద్ది డిప్రెషన్ అనే  ఒక ఆరోగ్య  సమస్యగా చేసుకున్నాం .

Contents

అసలు ఈ డిప్రెషన్ అంటే ఏమిటి ?

ఇది ఒక మానసిక సమస్య అంతే కాకుండా ఇది శారీరకంగా కూడా సంభందం కలిగివుంటుంది. మనం శారీరకంగా బలహీనంగా గాని అనారోగ్యం తో గాని ఉంటే మానసికంగా నిరాశకు లోనవుతాం . కానీ ఎటువంటి కారణం లేకుండా మనం నిరాశకు గురి ఐతే దాని నుండి బయటకు రావడానికి మనం ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ముందు మనం ప్రయత్నించాలి కదా !!

What is depression ?

నిరాశ లక్షణాలు:

 • డిప్రెషన్ అంటే కారణం వున్నా లేకున్నా బాధపడుతూ ఉండడం.
 • అతిగా ఆలోచించడం.
 • ఏదన్నా పని చేయాలంటే ఉత్సాహం లేకపోవడం,ఆలోచనా విధానం మందగించడం.
 • తిండి సరిగ్గా సహించకపోవడం ,నిద్రపట్టకపోవడం.
 • నిత్యం శారీరకం గా బలహీనంగా ఉన్నట్టు ఊహించుకోవడం .
 • ఏదో తప్పు చేశామన్న భావన తో జీవించడం.
 • ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలగడం.

 

నిరాశ ఎందుకు వస్తుంది?

నిరాశకు శారీరక సమస్యలు కూడా కారణం కావచ్చు ,చాలాకాలం గా మనందరికి తెలిసిన విషయం అన్ని సమస్యలకు మూలకారణం ఉదరం అని . మనం మన జీర్ణ వ్యవస్థ సవ్యంగా ఉంచుకుంటే ఎనబైశాతం అనారోగ్య సమస్యలు తగ్గించవచ్చు అంటారు.

 • ఈ శారీరక అనారోగ్య వలన మనం మానసికంగా ఒత్తిడికి లోనయ్యి డిప్రెషన్ కి గురి అవుతూవుంటాం.
 • మనం యితరుల నుండి ఆశించింది మనకు దొరకనప్పుడు
 • మన ఆలోచనలకు మన ఆచరణకు పొంతన లేనప్పుడు,ఆలోచనలో స్పష్టత లేనప్పుడు .
 • సరైన నిద్ర లేనప్పుడు , అతిగా ఆలోచించుటం వలన ..
 • మనకు ఆర్థిక స్వాతంత్రం లేనప్పుడు ,మనం డిప్రెషన్ కి లోనవుతాం.

అంతేకాకుండా శారీరకంగా మన మెదడులో మనకు ఉత్సాహాన్నిచ్చే కొన్ని కెమికల్స్ విడుదల కాకపోవడం వల్ల మానసికంగా నిరాశకు గురిఅవుతాం ఇదొక కారణం . మనం  ఈ సమస్య గురించి డాక్టర్ ని సంప్రదించినప్పుడు అతను మందుల ద్వారా ఆ కెమికల్స్ విడుదల అవ్వేలా చేస్తాడు.

ఇలా ఎన్నాళ్ళు మందులమీద జీవిస్తాం. పై గా ఆ మందులు వాడుతున్న కొద్దీ కొన్నాళ్ళకు అవి పని చేయక వాటి పరిమాణం పెంచవలసి ఉంటుంది. అంతే కాకుండా ఈ మందులు అత్యుత్సాహం కలిగిస్తాయి. అత్యుత్సాహం అనేది అనర్ధదాయకం అని మన అందరికి తెలుసు .

What is depression ?

నిరాశనుండి ఎలా బయట పడాలి ?

ప్రస్తుత సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చదువుకొనే చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితచరమాంకం లో వున్న అందరిలో నిరాశ ఉంటుంది . దీనినుంచి ఎలాబయట పడాలి…

 • ఆలోచన సమస్య కాదు కాని అతి ఆలోచన ప్రమాదాన్ని కలిగిస్తుంది , దానిని తగ్గించాలి.
 • ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ,మనల్ని మనం కించపరుచుకోకూడదు .
 • మన తాహతుకు మించి ఆర్ధిక భారాన్ని పెంచుకో కూడదు ,ఖర్చులకు మన సంపాదనకు పొంతన ఉండాలి.
 • మనం ఇతరులనుండి ఆశించడం తగ్గించుకోవాలి,మనమే ఇతరులకు ఇచ్చే స్థితి లో ఉండేలా మనల్ని మనం మలుచుకోవాలి. ఎందుకంటే ఆశ భయంకరమైన నిరాశను కలిగిస్తుంది.

మన శరీరానికి అందవలసిన ఇంధనం అందక పోవడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి.

 • ఇంధనం అంటే ఆహారం మాత్రమే కాదు సరిపడా నీరు(అంటే మనం శరీరానికి తగినంత నీరు అందించాలి ,రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని త్రాగాలి).
 • సరైన వెలుతురు ( శరీరానికి సరైన వెలుతురు అందాలి ,మనం ఎప్పుడూ చీకటిలో ఉంటే ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటే మన ఆలోచన విధానం  లో సానుకూలత(positiveness ) ఎలావస్తుంది )
 • స్వచ్ఛమైన గాలి (ప్రస్తుత ఈ కాలుష్య పర్యావరణం లో స్వచ్ఛమైన గాలి ఖచ్చితంగా దొరకదు కాబట్టి అది దొరికే చోటుకి మనమే వెళ్ళాలి)
 • మన శరీరానికి హాని కలిగించే నాలుగు తెల్లని పదార్ధాలు తినడం తగ్గించాలి. అవి పంచదార,మైదా ,ఉప్పు,బియ్యం . వాటికి బదులు ప్రత్యామ్యాయాలు ఉపయోగించాలి .

ఈ ఇంధనాన్ని మనం సవ్యంగా తీసుకోవడం వలన, మనం ఆరోగ్యంగా ఉంటాం.

 

మనం ఏంచేయాలి?మనం ఏంచేయ కూడదు ?

 • మొదట సమస్య మొదలైనప్పుడే ఆ సమస్యను నిర్లక్యం చేయకుండా దానికి సంబందించిన అవగాహన పెంచుకోవాలి.
 • మన సమస్యలు ఏమిటో ఒక పేపర్ మీద రాయాలి,అప్పుడు మనకు మన సమస్యలపై ఖచ్చితమైన స్పష్టత వస్తుంది.
 • మన సమస్యలు ఇతరులవి అనుకొని ఆలోచిస్తే పరిష్కారం  తొందరగా వస్తుంది.
 • సమస్య గురించి ఒక అర్థగంట సమయం ఆలోచించి ఆ సమయం లో ఏమి పరిష్కారం వస్తుందో దానినే పాటించాలి. ఎందుకంటే అంతకన్నా మంచి పరిష్కారం మనం పొందలేము కాబట్టి.
 • రెండు రకాల సమస్యలు ఉంటాయి ఒకటి పరిష్కరించేది రెండు పరిష్కరించ లేనిది

పరిష్కరించ లేని దానిగురించి ఆలోచించాలి.

పరిష్కరించే దాని గురించి వెంటనే ప్రయత్నం మొదలుపెట్టాలి .

మనం ప్రపంచాన్ని మార్చలేము  మనం మాత్రమే మారాలి ,ఆ విషయం గమనించండి.

 • మనలను మనం ఎప్పుడూ బిజీగా ఉంచుకోవాలి,మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి . సమాజం లో కలవాలి
 • గతం గురించి ఆలోచిస్తూ నిరాశ చెంద కూడదు ,గతం నుండి మనం పాఠం నేర్చుకోవాలి .

What is depression ?

నిరాశకు మందు ఉందా ?

ఖచ్చితంగా వుంది ,మొదట మన ప్రయత్నం మనము చేసాక . అయినా  కూడా సమస్య పరిస్కారం కాకపోతే నిస్సందేహంగా ప్రకృతి వైద్య శాలలకు వెళ్లి కొంత సమయం అక్కడ గడిపితే మన సమస్య ఖచ్చితంగా పరిష్కారం  అవుతుంది .

మన అందరిని దేవుడు ఒకేవిధంగా పుట్టించాడు కానీ మన చెడ్డ ఆలోచనలతో ,మన చెడ్డ అలవాటల్తో మనల్ని మనమే నాశనం చే సుకుంటున్నాం. మనలో వున్న జీవాన్ని మనమే చంపుకుంటున్నాం.

అంతే కాకుండా మనవంతు ప్రయత్నం కూడా మనం చేయాలి . ఎందుకంటే ఏది చేయాలి అన్నా ఏమి  సాదించాలి అన్నా మనం ఆరోగ్యం గా ఉండడం ముఖ్యం కదా.

నిరాశలో వున్న వారితో మనం ఎలా ప్రవర్తించాలి !

మీ వారు లేదా మీ చుట్టుప్రక్కల వున్నవారు ఎవరైనా డిప్రెషన్ కు గురైనట్టు మీరు గమనిస్తే ,మీరు తప్పనిసరిగా వారికి అండగా వుండండి . ఎందుకంటే ఇది నిర్లక్ష్యం చేసేఅంత చిన్న సమస్య కూడా కాదు ,పరిస్థితి మరీ విషమిస్తే వారికి ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి,కనుక వారు ఈ సమస్యనుండి బయట పడేవరకు సహనంగా వారితో మెలగండి .

నిరాశ  కొటేషన్లు/ Quotations:

 • ఇతరులను సంతృప్తి పరచడం కోసం మన అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం వ్యర్థం
  ఎందుకంటే …!!
  ప్రపంచంలో ఏ  మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా సంతృప్తి పరచలేడు.
 • ఆచరణ లేని ఆలోచన భూమిలో నాటని విత్తనంతో సమానం అది ఎన్నటి కీ ఫలించదు .
 • వాస్తవంలో జీవించే వారికి ప్రతి ఎదురుదెబ్బ ఒక పాఠం నేర్పిస్తుంది,
  కాని ఊహాలోకం లో బ్రతికేవారికి  ఎదురయ్యే ప్రతి వాస్తవం ఒక కుంగుబాటు నిస్తుంది…
 • మహా ప్రళయం లోనూ ప్రశాంతత వెతుక్కొనే సత్తా మనిషి మెదడుకి మాత్రమే కలదు, ప్రయత్నిద్దాం  …
 • మీలో సంతోషం లేకపోతే మీరు ఇతరులకు సంతోషం పంచగలరా.
 • ఒక మనిషికి తన బలం గురించి తెలిసినా తెలియక పోయినా పర్వాలేదు
  కానీ తన బలహీనత గురించి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి
  ఆపదలో బలం కచ్చితంగా సహాయం చేస్తుంది
  కానీ గుర్తించని బలహీనత అదః పాతాళానికి తొక్కేస్తుంది.

What is depression ?

For more Telugu Articles :how to deal with kids behavior problems.

 • నీ ఆశయమనే రెక్కలు గెలుపు గమ్యాన్ని చేరే వరకు గమనంలో అండగా ఉండేది నీలోవున్న ఆశ మాత్రమే….ఆ ఆశాదీపాన్ని ఆరిపోనీకు….
 • నీలో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించగలిగే వైద్యుడు,నువ్వే…
 • కష్టం లో కూడా మంచి వుంది
  అది ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తుంది
  మన లోని  ధైర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది
  ముఖ్యంగా … మనవారు ఎవరో పరాయి వారెవరో స్పష్టంగా తెలియజేస్తుంది .
 • ఒక మనిషి నిరాశ తనను మాత్రమే నాశనం చేస్తుంది .
 • కానీ దురాశ మాత్రం తన చుట్టూ వున్న వాళ్ళందరిని నాశనం చేస్తుంది .
 • ఇతరులను అనుకరిస్తూ మన సహజత్వాన్ని మనమే కించపరచ కూడదు .
 • గతం నీడలో గమనం ఉంటే ,గమ్యం చేరుకోగలమా …?
  గతం గురువులా ఉండాలి ,గుదిబండలా కాదు …
 • ఈ నిమిషం మళ్ళీ కొత్తగా జన్మించవచ్చు … ప్రయత్నిస్తే .
  ప్రయత్నం అనేది చాలా చిన్న విషయం మన  కొత్త జీవితం తో పోలిస్తే…
 • ఆచరణ లేని ఆలోచన భూమిలో నాటని విత్తనంతో సమానం అది ఎన్నటి కీ ఫలించదు.

Sireesha.Gummadi

 

error: Content is protected !!