Contents
కాకి-కుందేలు
కథ-1
అది వేసవికాలం మిట్ట మధ్యాహ్నం ఎండ మండుతూ ఉంది, అడవిలో ఉన్న జంతువులన్నీ అబ్బా!! ఈ ఎండ తట్టుకోవడం ఎలా అంటూ నీడకై చెట్టుకి పుట్టుకి చేరాయి . ఇంతలో మెల్లగా చల్లగాలి వచ్చి చిన్న చిన్న చినుకులు పడడం మొదలు పెట్టాయి, సన్నగా చినుకులు పడుతూ ఉంటే అక్కడ ఉన్న జంతువులన్నిటికీ ఎంతో హాయిగా అనిపించింది.
అంతసేపు చెట్ల ఆకుల మధ్యన దాక్కున్న కాకి ఒక్కసారిగా వచ్చి కొమ్ము మీద వాలి పాడడం మొదలెట్టింది. అలా పాడుతూ ఉంటే దాని గొంతు దానికే చాలా బాగా అనిపించింది,!! ఆహా ఎంత బాగా పాడుతున్నాను అనుకుంటూ ఏమాత్రం ఆపకుండా పడుతూనే ఉంది .
కొంతసేపటికి …
కాకి గొంతుకు విని భరించలేక చుట్టుపక్కలున్న జంతువులు చాలా పక్కగా తప్పుకున్నాయి కొన్నేమో ఇంక ఆపు మిత్రమా భరించలేనట్టుగా ఉంది నీ గొంతు అన్నాయి . అందుకు కాకి నేను ఇంత చక్కగా పాట పాడుతున్నానని మీ అందరికీ చాలా కుళ్ళు గా (అసూయ గా ) ఉంది. మీరు చెప్పినంత మాత్రాన నా పాట నేను ఆపను అంటూ అది పాడుతూనే ఉంది .
ఇదంతా పక్క నుంచి గమనిస్తున్న కుందేలు ఈ సమస్యకు ఏదన్నా పరిష్కారమ్ వెతకాలి అనుకుంటూ, కాకి పాట పాడుతున్న చెట్టు కిందకు వెళ్లి గట్టిగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టింది . కాకి కి కుందేలు ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించింది, ఓయ్… ఎందుకు చప్పట్లు కొడుతున్నావ్ అని కాకి అడిగింది. అందుకు కుందేలు లేదు కాకి బావా నువ్వు చాలా బాగా పాడుతున్నావ్ నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు మా కాకి తాత గుర్తొచ్చాడు అని చెప్పింది. కాకి తాతా అది ఎవరు అని అడిగింది , అందుకు కుందేలు ఆయన కూడా చాలా బాగా పాటల పాడేవారు ఆయన పాటలు విని అడవిలో మేము అందరం కలిసి సన్మానం కూడా చేశాము అని చెప్పింది .
ఆ మాట…
వినంగానే కాకికి చాలా ఆనందం వేసింది అవునా… అలా సన్మానం కూడా చేస్తారా, ఇంతకీ యిప్పుడు మీ కాకి తాత ఏం చేస్తున్నాడు అని అడిగింది అందుకు కుందేలు ఆయనా హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పింది. అదేమిటి పాటలు పాడడం లేదా అని అడిగింది కాకి ,అందుకు కుందేలు ఓహో!! నీకు అసలు విషయం చెప్పలేదు కదా ఆయన ఆపకుండా నీకులాగే పాటలు పాడి పాడి తను గొంతు పోగొట్టుకున్నాడు వైద్యుడుకు చూపిస్తే ఆపకుండా పాడడం వల్ల గొంతు పోయిందని చెప్పాడు ,ఇప్పుడైతే ఎటువంటి బాధ లేకుండా హాయిగా పాడకుండా కూర్చొని ఉన్నాడు అని చెప్పింది.
అందుకు కాకి గుండె జల్లుమంది అదేంటి పాటలు పాడుతుంటే గొంతు పోతుందా అని అడిగింది అది కాదు బావా పాటలు పాడొచ్చు కానీ ఆపకుండా పాడిన వాళ్ళకి గొంతు పోతుంది అంట నాకు వైద్యుడు చెప్తే గాని తెలియలేదు అంది . ఆ మాట వినంగానే కాకికి గొంతు ఎత్తాలంటే భయమేసింది నిశ్శబ్దంగా అక్కడ నుంచి వేరే చెట్టు మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
కుందేలు చేసిన తెలివైన పని చూసి చుట్టుపక్కల ఉన్న జంతువులన్ని కుందేలును మెచ్చుకున్నాయి.
నీతి: అతి ఎప్పుడూ ప్రమాదకరమే.
కథ-2
అనగనగా ఒక అడవిలో ఒక కాకి చెట్టుమీద అలాగే కదలకుండా ఏ పని చేయకుండా కూర్చుని ఉంది.
దానిని చాలాసేపటి నుంచి గమనిస్తున్న కుందేలు కాకి బావ నువ్వు ఏమిటి… ఏం పని చేయకుండా అలా కూర్చున్నావు అని అడిగింది .
అందుకు కాకి అవును నాకు పని చేయాలని లేదు… అందుకే నేను చేయట్లేదు అంది .
అప్పుడు కుందేలు సరే నేను కూడా నీకు లాగా ఏ పని చేయకుండా కదలకుండా కూర్చోవచ్చా అని అడిగింది . అందుకు కాకి నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయి అంది.
ఆ మాట కుందేలు కు కూడా నచ్చి కాకి కూర్చున్న చెట్టు క్రింద నేలపైన అలా కదలకండ కూర్చుని ఉంది, కొంత సేపటికి అటుగా వస్తున్న పులి కుందేలును చూసి ఒక్క ఉదుటన దాని మీద దూకి దాన్ని చంపి తినేసింది.
నీతి :
మనం ఎప్పుడన్నా ప్రశాంతంగా కదలకుండా ఏ పని చేయకుండా కూర్చోవాలంటే మనం ఇతరులు అందుకోలేనంత ఉన్నత స్థితిలో ఉండాలి అప్పుడే ఇదంతా సాధ్యం లేకపోతే మనం కూడా కుందేలు లాగా వేరొకరికి బలైపోవాల్సి ఉంటుంది.
“కాకి-కుందేలు” Small moral story with moral
For small moral stories please visit: Small stories
Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam
Stories for kids to read: Aanandam
Success full people stories: Neeraj Chopra
Riddles For Every one: Riddles 1
Kids Riddles For Every one: Riddles 2
small Riddles For Every one: Riddles 3
Riddles For Every one: Riddles 4
For more kids stories please visit: YES and NO Story
For more stories please visit: బహుమతి
more stories please visist: లోపం