Contents
ఒక విజేత కథ (నీరజ్ చోప్రా )
Neeraj Chopra success story in Telugu: Story of a winner.
గెలుపు నీకు తెలిసిన ప్రపంచాన్నే కొత్తగా చూపిస్తుంది…. ఇది నిజం
ప్రతిమనిషి విజయం కోసం ఆరాటపడుతూ ,ఆశపడుతూ ఉంటాడు కానీ ఆచరణ లేని ఆలోచన భూమిలో నాటని విత్తనంతో సమానం అది ఎన్నటికీ పఃలించదు
మన లోని లోపాలకు కృంగి పోకుండా వాటిని సరిదిద్దుకుంటూ , దిన దినం మార్పు చెందుతూ సాధనచేస్తూ ప్రపంచంమే మన విజయాన్ని చాటించేవరకు మన ఉనికిని గర్వంగా చూపించేవరకు మౌనముగా ఉండడం ఎందరికి సాధ్యం….
ఇంత సాదించాలి అంటే ప్రయత్నం ఫలించేవరకు, విజయం సాధించేవరకు పోరాడే ఓపిక ,పట్టుదల మనలో ఎంతమందికి ఉంటుంది…
అలా అద్భుతమైన తన విజయంతో దేశాన్ని మొత్తం తనవైపు తిప్పుకున్నఒక సామాన్యుడు మన నీరజ్ చోప్రా
దేశానికి సైనికుడిగా సేవనందించడమే కాకుండా 13సంవత్సరాలుగా దేశం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న స్వర్ణ పతకాన్ని, జావెలిన్ త్రో ఆట ద్వారా టోక్యో ఒలంపిక్స్ లో అందించి దేశం యొక్క ప్రతిష్టను నిలబెట్టాడు.
అసలు కథ…
హరియాణా లో ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంభం లో పుట్టిన నీరజ్ ,చిన్నతనం లో అంటే 12 సంవత్సరాల వయసులో అధిక బరువు తో బాధ పడేవాడంట . నీరజ్ బరువుతగ్గడానికి ఎటువంటి వ్యాయామం చేసేవాడు కాదంట, తోటి పిల్లలు అందరు అతని శరీరాకృతిని చూసి అవహేళన చేసేవారంట . నీరజ్ కుటుంభసభ్యులలో ఒకరైన భీం చోప్రా నీరజ్ ఎలా అయినా బరువు తగ్గాలి అనే ఉద్దేశ్యం తో అతనిని రోజు జాగింగ్ కి తీసుకు వెళ్లేవారు, అక్కడ నీరజ్ జావలింగ్ త్రో ఆటపై ఆసక్తి చూపడంతో జై చౌదరి అనే వ్యక్తి నీరజ్ కు ఈ ఆట లో జన్మతః ప్రతిభ ఉందని గుర్తించి శిక్షణ ఇచ్చాడు .
నీరజ్ ఈ ఆటకోసం కఠోర శ్రమ పడ్డాడు ,జావలిన్ త్రో లో నైపుణ్యం సాధించాడు . వారి కుటుంబ సభ్యులకి సైతం ఎవరో వార్తాపత్రికల్లో నీరజ్ గురించి వార్త వచ్చింది అని చెపితే కానీ వారికి నీరజ్ ప్రతిభ గురించి తెలియ లేదు. ఆటగురించి తెలియక పోయినా, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ నీరజ్ కుటుంభం అతని ఆట శిక్షణ విషయం లో ఆర్థికంగా చాలా సహాయం చేశారు.
2011 నుండి నీరజ్ చదువుకుంటూనే జావలిన్ త్రో లో శిక్షణ పొందేవాడు … తరువాత ప్రపంచ యూత్ ఛాంపియన్ షిప్ ,ఆసియన్ ఛాంపియన్ షిప్ అలాచాలా క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభ కనబరిచేవాడు . తరువాత అతనికి నేషనల్ క్యాంపు నుండి పిలుపు వచ్చింది అక్కడ నైపుణ్యతతో కూడిన శిక్షణ పొంది ఎన్నో స్వర్ణ పతకాలు గెలిచాడు .
ఈ విజయాలు ఇలా కొనసాగుతుండగా 2019 లో నీరజ్ భుజానికి గాయం కారణం గా అతను ఒక ఏడాది ఆడలేక పోయాడు ,గాయం నుండి కోలుకోగానే మళ్ళీ శిక్షణ కొనసాగించి . 2021 లో జరిగిన ఒలంపిక్స్ లో పోటీలో తన ఇదివరకటి రికార్డు 87. 43మీటర్ల మైలురాయిని తానే అధికమించి 88. 07 మీటర్ల దూరం లో జావళిన్ ని విసిరి స్వర్ణం సాధించి సామాన్యుడు అసమాన్యుడు గా నిరూపించుకున్నాడు .
మళ్ళీ ఇంకోసారి బంగారుపతాకం మన నీరజ్ సొంతమైంది…..
Neeraj Chopra Gold Medal 2023
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ 2023 లో పురుషుల జావెలిన్ త్రో ఫైనల్ లో మన నీరజ్ చోప్రా ఏంతో అద్వితీయమైన బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
88.17 మీటర్ల దూరం లో జావళిన్ ని విసిరి బెస్ట్ త్రోను నమోదు చేశాడు. ఒలింపిక్ ఛాంపియన్ ప్రపంచ మీట్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు మన నీరజ్
ఏ ….
ఈ విజేతకు అభినందనలు తెలుపుతూ జీవితం లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిద్దాం .
ఒక చిన్న మాట …
మనం విజయం సాధించక పోవడానికి ఎన్నో అవాంతరాలు కారణాలు చెపుతాం,నిజం చెప్పాలి అంటే మనకి అడ్డుపడే శత్రువులు మనలోనే వున్నారు అవి బద్ధకం, పట్టుదల లేకపోవడం…ముందు వాటిని అంతం చేసి సాధన చేస్తే విజయం దానంతట అదే వస్తుంది . నీరజ్ జీవితం లో కూడా అధిక బరువు ,పేదరికం , గాయం యిలా ఎన్నో అవాంతరాలు వచ్చాయి కానీ అతను తన కర్తవ్యం మరచిపోలేదు విజయం సాధించేవరకు పోరాడాడు విజేతగా నిలిచాడు .
Sireesha.Gummadi
For more Successful people Stories please visit: Why Ratan tata is a great man?