Contents
గ్రీకు వీరుడు
“గ్రీకు వీరుడు” ఒక ప్రేమ కథ |A Love Story in Telugu|
ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది నాకు రాజేష్‌కి లతకి ఒకటే ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది,మేము అందరం మళ్ళీ కలసి స్కూల్‌కి వెళ్తున్నాం … అయ్యో !! కాదు… కాదు… కాలేజికి వెళ్తున్నాం . చిన్నప్పటి నుండి స్కూల్‌లో కలసి చదువుకున్నాం కదా .. అది అలవాటైపోయి…!
ఫస్ట్ డే కాలేజీ కదా కొత్తడ్రెస్ వేసుకొని బయలుదేరాను ,మేము ముగ్గురం ఒకటే కాలేజీ కానీ.. నాది ఒక బ్రాంచ్ వాళ్ళిద్దరిది ఒకటే బ్రాంచ్, ఏంచేద్దాం… సీట్స్ అలానే వచ్చాయి. క్లాసులు అన్ని అపోయాక రోజూ.. క్యాన్టీన్‌లో కలుద్దాం అనుకున్నాం, అనుకున్నట్టుగానే సాయంత్రం క్యాన్టీన్‌లో చేరాం ముగ్గురం .
స్కూల్ సంగతులు, ఈ రోజు క్లాస్ సంగతులు మాట్లాడుకుంటుంటే వెనకనుండి “నన్ను ఫారెస్ట్ లో వదిలేస్తే హ్యాపీ గా ఎంజాయ్ చేస్తా “అనే మాట వినపడింది, వెంటనే వెనుకను తిరిగి చూసా ఎవరా.. అని. ఎవరో అబ్బాయి పొడుగ్గా ఉంగరాల జుట్టుతో కోలముక్కు వేసుకొని ఫిట్ వున్నాడు . నేను అలాగే చూడడం చూసిన లత మెల్లగా నా చేతి పై గిచ్చి ఏయ్ … ఇటు తిరుగు వాళ్ళు చుస్తే బాగోదు అంది, తిరుగుదాం అనే అంతలో ఎవరో చెప్పిన మాటకు అతను ఒక్క సారిగా నవ్వాడు , కన్ను రెప్పవేయలేక పోయాను అతని నవ్వు చూసి, అంత బాగుంది!! .
ఈ సారి ఇంకొంచం గట్టిగా గిల్లింది లత ఇంక తప్పదు అనుకొని ఇటు తిరిగాను, నన్ను కోపంగా చూస్తూ ఏమే! ఎవరన్నా అడవి అని గాని జలపాతం అనిగాని అంటే అలా మైమరచిపోతావ్ ఏంటే అంది లత .
అవును లతా నాకు నేచర్ అంటే చచ్చే ఇష్టం అందుకే ఎవరు నేచర్ లవర్స్ అని చెప్పినా వాళ్ళతో మాట్లాడాలని పిస్తుంది అన్నాను. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే రాజేష్ మాత్రం ఫోన్ ఓపెన్ చేసి క్లాస్మేట్స్ నంబర్లన్నీ కలపి గ్రూప్ క్రియేట్ చేస్తున్నాడు సీరియస్ గా..
వీడే అసలైన ఫ్రెండ్ అంటే ఏమన్నా హెల్ప్ కావాలంటే ఎందుకు? ఇప్పుడా.. అని అడగకుండా చేస్తాడు అంతే గాని నీలా అటుచూడకు ఇది చేయకు అని అస్తమాటూ నసపెట్టడు అన్నాను ,అందుకు లత ఇంకో చిన్న దెబ్బ వేసింది నవ్వుతూ…
“గ్రీకు వీరుడు” ఒక ప్రేమ కథ |A Love Story in Telugu|
రాత్రికి నిద్ర పోదాం అని మంచం ఎక్కాక మళ్ళీ పొద్దున చూసిన అతని నవ్వు గుర్తొచ్చింది ప్రక్కన పడుకొని సండే మ్యాగజైన్ చదువుతున్న అమ్మతో ,అమ్మా … ఈ రోజు క్యాన్టీన్లో ఒకబ్బాయిని చూసాను, అతని నవ్వు ఎంత బాగుందో తెలుసా అన్నాను . అపుడు అమ్మ నన్ను చూసి నేనూ చాలా బాగా నవ్వుతాను ఎప్పుడన్నా నా నవ్వు బాగుంది అన్నవా అంది చిరుకోపం ప్రదర్శిస్తూ… ఆమాటకి ఇద్దరం నవ్వుకున్నాం .
ఎందుకో ఈ రోజు కాలేజీ కి తొందరగా వెళ్ళాలి అనిపిస్తుంది అందుకే నాన్నని హడావిడి చేసి మరీ అరగంట ముందు వెళ్ళిపోయా .
ఇంకా ఎవ్వరూ రాలే కాలేజీకి .లత బయలుదేరిందో లేదో కనుక్కుందామని కాల్ చేయబోయా ఇంతలో ఆ స్మైలీ బాయ్ మళ్ళీ కనబడ్డాడు ఫ్రెండ్ తో బైక్ పై వస్తున్నాడు నా పక్కనే చెట్టుక్రింద బైక్ పార్క్ చేసి నన్ను చూసి ఫ్రెషరా అన్నాడు అవును అన్నాను,నా పేరు సూర్య థర్డ్ ఇయర్ కాలేజీ లో ఏమన్నా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పు అని చెప్పి వెళ్ళిపోయాడు . నాకు అతని మాటలు ఆశ్చర్యం గా అనిపించాయి ,ఏంటి ! నేనెవరో తెలియకుండానే ఇంత కేరింగ్ గా మాట్లాడాడా అని ఆలోచిస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపించింది.
ఇంతలో లత వచ్చింది ,లతతో జరిగిందంతా చెప్పాను ,అవునే అతను కాలేజ్ ఎలక్షన్స్ లో పోటీచేస్తున్నడంట అందుకే నిన్న మా క్లాస్ కి వచ్చి మా అందరితో ఇదేమాట చెప్పాడు అంది లత . ఆ మాట వింటూనే నా ఆనందమంతా ఆవిరైపోయింది , కానీ… ఎంత బాగా నవ్వుతాడో అంత బాగా మాట్లాడుతున్నాడు కదా సినిమా హీరోల అనుకున్నాను మనసులో .
ఆ రోజునుంచి సూర్య నామస్మరణ ఎక్కువయ్యింది నాకు అతను ఎక్కడ ఉంటాడా అని రోజు వెతకడం ,అతని ఆలోచనలతోనే రోజు గడపడం ,ఎప్పుడు మాటలాడే అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూడడం… ఈ ఊహల్లోనే నారోజులు గడిచిపోతున్నాయి .
“గ్రీకు వీరుడు” ఒక ప్రేమ కథ…
అప్పుడే ఫస్ట్ సెమిస్టరు మార్కులు వచ్చాయి నాకు అన్ని సబ్జెక్టులో యావరేజ్ మర్క్స్ వచ్చాయి, నాన్న అడిగితే సర్ లు సరిగ్గా లెసన్స్ చెప్పడం లేదు అని అబద్దం చెప్పను కానీ… లతను నమ్మించడం అంత ఈజీ కాదు కదా ..
ఎప్పటినుండో గమనిస్తున్నటుంది ఆ రోజు అడిగేసింది ‘ఏమే నువ్వు ఏంచేస్తున్నావో తెలుస్తుదా ఆ సూర్య అంత మంచివాడేమి కాదు నువ్వు చదువు వొదిలేసి ఆలోచించే అంత ‘అంది . ఆ మాటకి నాకు చెప్పలేనంత కోపం వచ్చింది అయినా నీకు నేను ఏంచేసినా తప్పులానే అనిపిస్తుంది అదేంటో !! ఎవరన్నా ఫ్రెండ్ ఎవరినన్నా ఇష్టపడుతుంది అంటే ఎంకరేజ్ చేస్తారు నువ్వేమో నా శత్రువులా బిహేవ్ చేస్తున్నావ్ అన్నాను ,నా మాటలకు కోపం వచ్చినట్టుంది అక్కడనుండి వెళ్లి పోయింది . మళ్ళి ఎప్పుడూ నన్ను కలవలేదు మాట్లాడలేదు .
మధ్యలో రాజేష్ ఎంత కలుపుదామని ట్రై చేసినా నాకు మాట్లాడాలని అనిపించక మాట్లాడేదాన్ని కాదు(మళ్ళీ మాటలాడితే సూర్య విషయం లో అడ్డొస్తుందని) .
మార్క్స్ తక్కువ వస్తన్నయ్ అని నాన్న రాజేష్ వాళ్ళ ఇంటిదగ్గర వున్న ట్యూషన్ లో జాయిన్ చేశారు .
ఒకరోజు…
ట్యూషన్ నుంచి వస్తుంటే ఒక ఇంటిముందు సూర్య కనబడ్డాడు చాలా ఆనందం అనిపించింది ,కొంత సేపు అలానే గమనిస్తూ వున్నాను అప్పుడు అర్థమైంది అది అతని ఇల్లని . చెప్పలేనంత ఆనందం వేసింది వేంటనే రాజేష్ కి ఫోన్ చేసి ఒరేయ్ సూర్య యిల్లు మీ ఇంటిదగ్గరని ఎప్పుడూ చెప్పలేదేంటిరా అన్నాను . అప్పుడు రాజేష్ అవునే! నాకు తెలుసు వాళ్ళు కొంచం తేడా అంట ఇక్కడ అందరూ అంటారు అన్నాడు.
వాడి మాటలకు ఒళ్ళు మండి పోయింది లత గుర్తుకు వచ్చింది వీడికి లత చెప్పిందేమో అనుకోని బాయ్ కూడా చెప్పకుండా ఫోన్ కట్ చేశా.. ఇంకెప్పుడూ వీడితో సూర్య టాపిక్ మాటలాడ కూడదని డిసైడ్ అయ్యా..
ఒక రోజు కాలేజీ బయట సూర్య ఫ్రెండ్స్ తో కలసి సిగరెట్ తాగడం కనిపించింది నాకు చాలా ఏడుపు వచ్చింది ,కొంత సేపటికి సరేలే ఫ్యూచర్ లో ఎలాయినా చెప్పి సిగరెట్ తాగడం మానిపిస్తా,ఈ ఫ్రెండ్స్ ని కూడా దూరం పెట్టమంటా అనుకుని సర్దిచెప్పుకున్నాను.
రోజులు గడుస్తున్నాయి లతలాగే రాజేష్ ని కూడా దూరం పెట్టా ,కానీ వాడు రోజు ఏదో వంకన కాల్ చేసేవాడు నాకు అస్సలు మాట్లాడాలి అనిపించేదికాదు.
Next….
ఒకరోజు ట్యూషన్ నుండి వస్తుంటే సూర్య వాళ్ళ ఇంటిలో పెద్ద గొడవ వినపడి అందరితో పాటే నేను నిలబడి చూస్తున్నా
ఎవరూ ఒక పెద్దావిడ ఒక అమ్మాయిని చెయ్యి పట్టుకొని బయటకు లాక్కొచ్చి రోడ్ పై పడేసింది ఇంతలో ఒక పెద్దతను వచ్చి ఆ పెద్దామను చెంపై కొట్టబోయాడు ఇంతలో ఇంటిలోనించి సూర్య పరుగుపరుగున వచ్చి ఆ పెద్దాయన చెంప పై గట్టిగా కొట్టి ‘నీకు కూతురిని సరిగ్గా పెంచడం రాదు… ఇస్తానన్న కట్నం ఇవ్వడం రాదు… అల్లుణ్ణి గౌరవించడం రాదు పై గా మా అమ్మతో కోడలితో మంచిగా ఉండమని చెబుతావా అని ఇంకోదెబ్బ వేసాడు . రోడ్ మీద పడిన ఆ అమ్మాయి ని చూపిస్తూ నీ కూతురిని తీసుకుపో మా అన్నకు ఇంకో పెళ్ళి చేస్తాం అన్నాడు గట్టిగా అరుస్తూ.
ఇదంతా చూస్తుంటే నాకు తల తిరిగినట్టు అనిపించింది ,ఇంతలో ప్రక్క వాళ్ళు రోజూ వీళ్ళ గొడవతో చచ్చిపోతున్నాం పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని పోలీస్ కంప్లైన్ట్ యిద్దాం అనుకుంటున్నారు.
నాకు ఒక్క క్షణం సూర్యని చూస్తే భయం వేసింది ,అలాగే బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళాను ,టైం అయినా ఇంకా ఇంటికి రాకపోయే సరికి నాన్న ఇంటి ముందు నుంచొని వున్నారు .
నాన్నను చూసేసరికి చెప్పలేనంత ఏడుపు వచ్చింది నాన్నను పట్టుకొని గట్టిగా ఏడుస్తున్నాను ఆ సౌండ్ కి అమ్మ కంగారుగా బయటకు వచ్చి ఏమైంది అని అడిగింది . వాళ్లిద్దరూ నాకు ఏదో అయ్యిందని కంగారు పడుతున్నారు అనిపించింది వెంటనే ఏడుపు ఆపుకుంటూ ఏమి లేదు నాన్నఎగ్జామ్స్ లో తక్కువ మార్కులు వచ్చాయి అని అబద్దం చెప్పను .వాళ్లిద్దరూ స్థిమిత పడి ఏంకాదులేమ్మా యిప్పుడు నిన్ను మేమేమి అనలేదు కదా… ఈ సారి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకో అన్నారు.
ఆ రోజునుండి వారం రోజులు ఒంటిలో బాగోలేదనే వంకతో కాలేజీ మానేసాను ,రూంలో కూర్చొని గంటలు గంటలు ఏడుస్తూనే వున్నాను . నేను ఇష్టపడిన వ్యక్తి ఇంత చెడ్డవాడా ,పెద్దవాళ్ళంటే అస్సలు గౌరవం లేదా.. అదే ఆ ప్లేస్ లో మా నాన్న ఉంటే అమ్మో అని తలచుకుంటూ ఉంటే ఏడుపు అస్సలు ఆగేది కాదు. ఇటువంటి వాడి గురించి అలోచించి నా క్లోజ్ ఫ్రెండ్స్ ని దూరం చేసుకున్నాను ఆరు బ్యాక్ లాగ్ లు వుంచుకున్నాను అని తలచుకుంటే నామీద నాకే అసహ్యం వేసింది .
“గ్రీకు వీరుడు” ఒక ప్రేమ కథ…
ఇంతలో ఎవరో వచ్చినట్టు అనిపించి వెళ్ళి పేస్ కడుగుకున్నాను ,అమ్మ పిలిస్తే హాల్ లోకి వెళ్ళాను ఎదురుగా రాజేష్ లత వాళ్లిద్దరినీ చూస్తే ఏడుపువచ్చింది . లతను గట్టిగా పట్టుకొని ఏడ్చాను ,లత కంగారుపడుతూ ఏం కాదే! హెల్త్ బాగోపోతే ఎవరైనా ఏడుస్తారా అమ్మవాళ్ళు కూడా భయపడుతున్నారు చూడు అంది . అప్పుడు చూసా అమ్మవాళ్ల మొహం చాలా నీరసించిపోయి బాధగా వున్నారు ,అవును రోజూ నేను తినకుండా వీళ్ళు కూడా తినరు కదా ఆవిషయం నేనెందుకు మర్చిపోయా అనుకుంటూ అమ్మా … ఈ రోజు ఏం కూర చేశావు బాగా ఆకలివేస్తుంది అందరం కలసి తిందాం అన్నాను .
నేను రాజేష్ లత అమ్మ నాన్న అందరం కూర్చొని తిన్నాం . ఎదో జరిగిందని అందరికి అర్థమైనా ఎవ్వరూ నన్ను అడగలేదు.
తరువాత నేనెప్పుడూ చదువు నెగ్లెట్ చేయలేదు సూర్య ఆలోచన కూడా రానివ్వలేదు. రోజూ దేవుని పటం ముందు నుంచొని దేవుడా నేను ఆ నరక కూపం లో పడకుండా నువ్వే కాపాడావు అని దండం పెట్టుకొనేదానిని.
కొన్ని సంవత్సరాలు గడిచాయి….
నేను మా వారు కలసి బైక్ పై వెళుతుంటే మావారు నాతో “ఓయ్ గ్రీష్మ నీ గ్రీకువీరుడి ఇంటిలో ఏదో గొడవ జరుగుతున్నట్లుంది వెల్దామా అన్నారు” . నేను ఆయనను గట్టి గా గిచ్చుతూ రాజేష్ నీకు వీపుపగులుద్ది అన్నాను .
అవునండి చిన్ననాటినుండి నేనేంటో తెలిసిన ,నన్నెతో ఇష్టపడే… నాకు బాగా తెలిసిన నా స్నేహితున్నిచ్చే నాకు పెళ్లి చేశారు మానాన్న.
A Love Story in Telugu…
చిన్న మాట …
ఎవరినన్నా ఇష్టపడే ముందు ,మనం జీవితాంతం కలసి ఉండవలసిన వారి కుటుంబాన్ని వారి అలవాట్లను గురించి కూడా ఆలోచించాలి .
అన్ని ఆలోచిస్తే అది ప్రేమ ఎలాఅవుతుంది అంటే ??
ప్రేమలో వున్నప్పుడు వుండే ఆనందం పెళ్లి తరవాత కూడా ఉండాలి అంటే … తప్పదు మరి
(మన ఆనందం కోసం వారిని వారి కుటుంబం నుంచి వేరుచేయలేం కదా..)
Gummadi.Sireesha
“గ్రీకు వీరుడు” ఒక ప్రేమ కథ |A Love Story in Telugu|
For more stories please visit:సత్య కథ