కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|
Spread the love

Contents

కాకి కథ

కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|

అనగనగా రామవరం అనే ఊరిలో వుండే రైతులకు ఒక సమస్య వచ్చింది.అదేంటంటే…

ఆ ఊరిలో వున్న ఎలుకలు అన్ని వచ్చిన వారి పంటను నాశనం చేస్తున్నాయి . ఈ సమస్య నుండి ఎలాబయట పడాలో తెలియని వూరి రైతులు అందరూ ఆలోచిస్తుండగా… వారిలో ఒక రైతుకి ఒక ఆలోచన వచ్చింది, మనం మన చిన్నప్పటినుండి కాకులను చాలా తెలివైనవని వాటికి అవసరమైతే ఏమైనా చేయాడానికి వెనుకాడని వింటున్నాం కదా…

యిప్పుడు మనము వాటి సహాయం తో ఈ ఎలుకల బారినుండి ఏమన్నా బయటపడగలమేమో ఒక్కసారి ఆలోచించండి అన్నాడు .

అప్పుడు మిగిలిన వారందరు కూడా అవును మనం కాకుల సహాయం తీసుకుందాం అన్నారు.
అందరు కలసి కాకుల దగ్గరకు వెళ్ళి వారు ఎలుకల వల్ల ఎదుర్కొంటున్న సమస్య గురించి చెప్పారు . అప్పుడు కాకులు మీరు ఎంతో కాలంగా మా అందరికి అవసరమైన ఆహారం పండిస్తున్నారు దానివలన మేము అందరం ఇంత ఆనందంగా వున్నాం అటువంటి మీకు మేము తప్పకుండా సహాయం చేస్తాం అన్నాయి.

కాకి కథ నీతి కథ|Telivaina kaki story in Telugu writing|

మరుసటి రోజు కాకులన్ని ఎలుకలు వుండే కలుగులు దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా అరవడం మొదలు పెట్టాయి వాటి అరుపులు విని భయపడిన ఎలుకలు బయటకి వస్తే కాకులు వాటిని తినేస్తాయేమో అని బయటకు రాకుండా కలుగులోనే దాక్కున్నాయి.
అది చూసిన కాకులు ఇక సమస్య తీరిపోయింది అనుకోని అక్కడనుండి వాటి గూటికి వెళ్లి పోయాయి.

మరుసటి రోజు వచ్చి చూసే సరికి మళ్ళీ సమస్య మొదటికి వచ్చింది అని అర్థమైంది.
ఈ సారి ఇంకొంచం గట్టిగ ప్రయత్నించాలని నిర్ణయించుకున్న కాకులు ఎలుకల కలుగుల చుట్టూ పదునైన ముళ్లపొదలు ఉంచాయి … వాటిని దాటి బయటకి రాలేని ఎలుకలు వేరే దారిలేక ఇంకో మార్గం చేసుకొని ఊరి బయటకు పరిగెట్టాయి.

కాకులు చేసిన మేలుకు ఆ ఊరివారు కాకులకు మంచి ఆహారం అందేలాగా జొన్న కంకులను పొలం లో కట్టారు.

నీతి :అప్పుడప్పుడూ చెడ్డ ఆలోచనలు కూడా మంచి పని కోసం అవసరానికి వస్తాయి.

 

 

మనకు ఎన్నో నీతి కథలు తెలుసు అందులో తెలివిగల కాకి తన తెలివితో తన సమస్య నుండి ఎలా బయటపడిందో కూడా తెలుసు , మీకు ఆ కథ కాకి కథ తెలియక పోతే క్రిందవున్నLink Press చేయండి.

For more Crow stories please visit: Chandamaama kathalu

 

For Old/Famous/Known Stories please visit: Famous stories

Please visit this link for “Chinna Pillala Neetikathalu” in Telugu to read :చిన్న పిల్లల నీతికథలు 

 

మంచి కథ అనేది పిల్లలలో ఆలోచనా శక్తిని పెంచుతుంది,ఏది చెడో ఏది మంచో తెలియచేస్తుంది .

అందుకే తప్పని సరిగా పిల్లలకు నీతికథలు పరిచయం చేయండి..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!