Short moral stories for kids in Telugu 2024
Contents
Short moral stories for kids in Telugu
These stories are short and inspirational also.
stories say…
- Kind-hearted people are equal to god.
- Good behavior lasts forever, But beauty never lasts.
- Once Mistake is done, it is considered a mistake if it is big or small.
- Parent’s love is more precious than anything.
If ant body doesn’t have time for the Reading story, for those people I am providing Audio story also. please go through it…
దయ
Short moral stories for kids in Telugu 2024
Kindness Story in Telugu:
ఒక రోజు సాగర్ స్కూల్ కి వెళుతున్నాడు దారిలో కరెంటు తీగ మీద చిక్కుకు పోయినా ఒక పావురాన్ని చూసాడు ,అది కదలలేని స్థితి లో వుంది అయ్యో అనుకుంటూ స్కూల్ కి వెళ్ళాడు . మళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయాని కి పావురం అదే స్థితి లో వుంది,వెంటనే గబ గబా పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్నగారికి పరిస్థితి వివరించాడు. వాళ్ళ నాన్న గారిని తీసుకొని పావురం వున్న దగ్గరకు తీసుకు వెళ్ళాడు.
దానిని కాపాడడాని కి సాగర్ వాళ్ళ నాన్నగారు శతవిధాలా ప్రయత్నించారు,కానీ ఫలితం లేక పోయింది. అప్పుడు ఆయన కరెంటు వాళ్ళు మాత్రమే దీనిని కాపాడ గలరు అన్నారు . అప్పుడు సాగర్ వెంటనే కరెంటు ఆఫీస్ కి వెళ్ళాడు, అక్కడ వాళ్లకు జరిగిన విషయం చెప్పాడు అందరు జాలి పడ్డారు కానీ ఎవ్వరు సాయం చేయలేదు.
అప్పుడు అక్కడ వున్నఒక వ్యక్తి సాగర్ ని పిలిచి చూడు బాబు పావురాన్ని కాపాడాలి అంటే కొంత సమయం ఆ ప్రాంతం లో కరెంటు ఆపుచేయాలి, అది అంత సులువైన విషయం కాదు మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నాడు .ఇప్పుడు నువ్వువెళ్ళిపో ,వెళ్ళే ముందు నీ అడ్రెస్స్ ఇచ్చి వెళ్ళు అవసరమైతే నిన్ను సంప్రదిస్తాం అన్నాడు.ఆ మాట విన్నాక సాగర్ కు చాలా నిరాశగా అనిపించింది ,పావురాన్ని తలుచుకుంటూ ఇంటికి వెళ్లి పోయాడు .
Short moral stories for kids
ఆ రోజు రాత్రి .. Short moral stories for kids in Telugu(తెలుగు)
సాగర్ మంచి నిద్రలో వున్నప్పుడు ఎవరో సాగర్ సాగర్ అని పిలుస్తున్నట్టు అనిపించి మెలఁకువ వచ్చింది సమయం చూసాడు అద్దరాత్రి ఒంటిగంట అయింది. ఎవరా అని కిటికీలోంచి చూసాడు అక్కడ యిద్దరు వ్యక్తులు వున్నారు ,వారిలో ఒకరు సాయంత్రం తనతో కరెంటు ఆఫీస్ లో మాట్లాడిన వ్యక్తి . వెంటనే సాగర్ వాళ్ళ నాన్నగారిని తీసుకొని వారి వద్దకు వెళ్ళాడు .
ఆ వచ్చిన వ్యక్తి ఇప్పుడు కరెంటు తీసినా అంత ఇబ్బంది ఏమీ ఉండదు, ఇప్పుడు మనం ఆ పావురం వున్న ప్రదేశాని కి వెళదాం పద అన్నాడు సాగర్ తో .సాగర్ చాలా ఉత్సాహంగా కదిలాడు,ఆ ప్రదేశానికి వెళ్లేసరికి పావురం అదే స్థితి లో వుంది దానిని నెమ్మది గా క్రిందికి దించారు.. సాగర్ చేతిలో ఉంచారు దానిలో ఎటువంటి కదలిక లేదు ,సాగర్ కి దుఃఖం తన్నుకు వచ్చింది. సాగర్ వాళ్ళ నాన్నగారు దాని పై కొంచం నీరు జల్లారు అది ఒక్కసారిగా సాగర్ చేతిలోనుండి ఎగిరిపోయింది . సాగర్ కు చెప్పలేనంత ఆనందం కలిగింది.
సాగర్ కరెంటు ఆఫీస్ వ్యక్తులకు ధన్యవాదాలు చెపుతాడు ,అప్పుడు వాళ్ళు లేదు చిన్న వాడివి అయినా మూగజీవాల పట్ల నీకున్న దయకు మేమె నీకు ధన్యవాదాలు చెప్పాలి అంటారు.
Moral : ప్రాణం అనేది మనుషులదైనా మూగజీవుదైనా ఒక్కటే.
దయను ఆభరణంగా కలిగిన వాడు దైవంతో సమానమవుతాడు …
Audio Story:
అందం
Short moral stories for kids in Telugu 2024
this article explains about beauty is not everlasting..
Beauty Story in Telugu:
అడవి లో ఒకసారి అన్ని జంతువులు కలసి అందాల పోటీలు నిర్వహించాయి. వాటిలో ఒక కోతి ప్రథమ బహుమతి గెలుచుకుంది ,ఆ గెలుపు కోతి లో చాలా గర్వాన్ని పెంచింది ఈ మొత్తం అడవిలో నాకన్నా అందగత్తె లేదు అనుకుంది . చిన్న చిన్న జంతువులతో మాట్లాడం మానేసింది,కనపడిన వారినల్లా అవహేళన చేసేది.
ఈ కోతి అడవి కి అందగత్తె కదా అందుకు దీనిని చూడడాని కి చుట్టుప్రక్కల అడవులలో వున్న జంతువు లన్ని వచ్చేవి,వస్తూ వాటితో పాటు కోతి తినడానికి రక రకాల పళ్ళు తీసుకు వచ్చేవి . కోతి, దొరికిందే భాగ్యం అనుకుంటూ ఆ ఫలాలు అన్ని బాగా తినేది .
మరుసటి సంవత్సరం మళ్ళి అందాలపోటీ ప్రకటిస్తాయి ,కోతి మళ్ళి పోటీలో పాల్గొనడాన్ని కి వెళుతుంది . అక్క జంతువులు నీకు పాల్గొనే అర్హత లేదు అంటాయి ,కోతి కి చాలా కోపం వస్తుంది ఎందుకు అంటుంది. అప్పుడు జంతువులు నీ రూపం ఎంత భారీగా ఉందో చూసుకున్నావా,ఇలా శరీరదారుఢ్యం లేని వాళ్ళు అందాల పోటీలో పాల్గొనరాదు అంటారు .
అప్పుడు కోతి ఒక్కసారి తన శరీరాన్ని చూసుకుంటుంది ,అవును వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటుంది. ఇంతకాలం తాను చేసిన తప్పులు దానివలన తనకు జరిగిన నష్టం తలచుకొని సిగ్గుపడి తలదించుకుని అక్కడనుండి వెళ్లి పోతుంది కోతి .
Moral :మంచి ప్రవర్తన ఎప్పటికి నిలుస్తుంది,అందం ఎన్నటికి శాశ్వతం కాదు
Audio Story:
తప్పు
Short moral stories for kids in Telugu 2024
this article explains how small mistakes became a curse.
Mistake Story in Telugu:
ఒక రోజు రాజు స్కూల్ నుంచి వస్తూనే అమ్మా నేను ప్రక్కింటి వాళ్ళ ఇంటి నుంచి వాళ్లకు తెలియకుండా తోటకూర తీసుకు వచ్చాను అంటాడు ,రాజు వాళ్ళ అమ్మ చాలా సంతోషిస్తుంది . తరువాత చాలా రోజులకి రాజు, అమ్మా నువ్వు నాకు కథల పుస్తకం కొనను అన్నావ్ కదా నేను వెంకట్ గాడి బ్యాగ్ లోనుంచి వాడికి చెప్పకుండా బుక్ తీసుకోని వచ్చాను అంటాడు ,అప్పుడు అమ్మ చాలా మంచి పనిచేసేవ్ నాకు ఖర్చు తగ్గించావ్ అంటుంది . రాజు తానూ చేసిన పనికి చాలా గర్వంగా అనుభూతి చెందుతాడు.
కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత..Short moral stories for kids in Telugu(తెలుగు)
ఒకరోజు రాజు వాళ్ళ అమ్మకు జైలు నుంచి ఒక ఉత్తరం వస్తుంది, దాని లో మీ అబ్బాయి రాజు పెద్ద దొంగతనం చేసింనందు కు అతనికి జైలు శిక్ష విధించారు.. అతను దొంగతనం చేయడానికి కారణం మా అమ్మ అంటున్నాడు అందు కే మిమల్ని ఒక్క సారి జైలు కు రావలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాం అని వుంది .
ఆ ఉత్తరం చదువు తూనే రాజు వాళ్ళ అమ్మ కి బాధ గాను ,కోపం గాను అనిపించింది. వీడు తప్పుచేయడమే కాకుండా నా పేరు చెపుతున్నాడు అనుకుంటూ కోపంగా జైలు కి వెళ్ళింది. అక్కడ రాజు జైలు అధికారులతో నేను ఈ తప్పులు చేయడానికి ముఖ్య కారణం మా అమ్మే ,ఎందుకంటే చిన్నతనం లో నేను తోట కూర దొంగిలించి నప్పుడే నేను చేసింది తప్పు అని ఉంటే అది తప్పు అని నాకు తెలిసేది తరువాత బుక్ దొంగతనము చేసినప్పుడు మందలించి ఉంటే దొంగతనము ఎంత పాపమో తెలిసేది కానీ తను దానిని సమర్ధించింది . అందువలన దొంగతనం అనేది ఒక చేయకూడని పని అని నాకు మా అమ్మ నేర్పలేదు పైగా మెచ్చుకొంది అందుకే నేను నా జీవితం లో ఇన్ని తప్పులు చేసాను అన్నాడు .
అప్పుడు రాజు వాళ్ళ అమ్మకు తానూ చేసిన తప్పులు ఒకొక్కటిగా గుర్తుకువచ్చాయి తాను రాజు ఎదుగుదలలో ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో గుర్తుకు వచ్చిబాధ పడింది. రాజు జీవితాన్ని తానే నాశనం చేశాను అని తెలుసుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. కానీ అప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది …
Moral :తప్పు చిన్నదైనా పెద్దదైన తప్పుతప్పే
Audio Story:
అమూల్యం
Short moral stories for kids in Telugu 2024
Precious Story in Telugu:
సౌర్య చీకట్లో కోపంగా వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ వడి వడిగా నడుస్తున్నాడు కానీ తాను ఎటువైపు వెళుతుంది ఏమిచేయడానికి వెళుతుంది తనకీ తెలీదు . నడుస్తున్న కొద్దీ చీకటి చిక్కబడుతూ వస్తుంది నెమ్మదిగా భయం మొదలయ్యింది ,ఒక్కసారిగా ఆగి చుట్టూ చూసాడు ఎటుచూసినా చిమ్మటి చీకటి,తన చేతికి వున్నవాచ్ లో టైం ను కష్టబడి చూసాడు ,టైం రాత్రి పది కావస్తుంది అంటే తాను ఇంటినుండి బయలుదేరి యిప్పటికి రెండు గంటలు అయ్యింది ,అప్పటినుండి నడుస్తూనే వున్నాడు కాబట్టి చాలా నీరసంగా ఇంకా ఆకలిగా కూడా వుంది .
ఎక్కడినుండో కమ్మనైన నూడుల్స్ వాసన సౌర్య ముక్కుని తాకింది, ఎక్కడ అని చుస్తే తన ప్రక్కనుండి ఒకవ్యక్తి సైకిల్ పై వెళ్తున్నాడు అతని దగ్గరనుండి అయివుండొచ్చు అనుకొని ఆకలి వల్ల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ మరి కొంత ముందుకు నడిచాడు . అక్కడ సౌర్య కి ఒక నూడుల్స్ బండి కనబడింది బాగా రాత్రి అవ్వడంతో అక్కడ యజమాని తప్ప ఎవ్వరూ లేరు . సౌర్యకి నూడుల్స్ తినాలనిపించింది ఆగాడు కానీ తనదగ్గర ఒక్క రూపాయి కూడా లేదని గుర్తువచ్చి అక్కడ నుండి వెళదాం అనుకుంటుండగా ఆ బండి యజమాని పిలిచి నీకు నూడుల్స్ కావాలా? అని అడిగాడు అప్పుడు సౌర్య నాదగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులేదు అన్నాడు . అందుకు యజమాని నువ్వు నాకు డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు అని సౌర్య కి నూడుల్స్ ఇస్తాడు .
సౌర్యకు…
నూడుల్స్ ని చూడగానే చెప్పరానంత దుఃఖం వచ్చి ఏడుస్తూ ఉంటాడు అది గమనించిన యజమాని ఏమైంది అంటే సౌర్య మీరు ఈ సమయం లో నా నుండి ఏమీ ఆశించకుండా నా ఆకలి తీరుస్తున్నారు నేను ఏ విధంగా అయినా మీ ఋణం తీర్చుకుంటాను కానీ మా అమ్మకూడా మీలాగా నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుండేది అంటాడు . అసలు ఏమైంది అని యజమాని అడుగుతాడు,అప్పుడు సౌర్య నాకు పరీక్షలలో మార్కులు తక్కువ వచ్చాయి అని అమ్మ నన్ను చాలాసేపు తిడుతూనే వుంది. టెన్త్ క్లాస్ చదువుతున్న నాకు ఎలా చదవాలో తెలీదా అందుకే కోపం వచ్చి ఇంటిలోనుంచి బయటకు వచ్చేసాను అని భాదపడుతూ చెపుతాడు.
ఆ మాటలు విన్న యజమాని సౌర్య తో, నీకు ఒక్క పూట ఆకలి తీర్చినందుకు నువ్వు నాతో రుణపడి వున్నాను అన్నావ్… కానీ మీ అమ్మగారు నువ్వు పుట్టిన క్షణం నుంచి నీనుండి ఏమీ ఆశించకుండా నీ మంచి చెడులు అన్ని చూసుకుంటున్నారు పైగా ఇప్పుడు నిన్ను తిట్టింది కూడా నీ భవిష్యత్తు కోసమే . మరి అలాంటి అమ్మకు నువ్వు ఎంత రుణపడి ఉండాలి అన్నాడు . యజమాని మాటలు అర్థం చేసుకున్న సౌర్య ,తనను అమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకొనేది గుర్తువచ్చి బండి యజమానికి థాంక్స్ చెప్పి అక్కడనుండి పరుగుపరుగున ఇంటికి వెళతాడు, ఇంటి గుమ్మంలో ఏడుస్తూ ఎదురుచూస్తున్న అమ్మ సౌర్య ని చూడగానే దగ్గరకు తీసుకొని నీకోసం ఎంత భయపడ్డానో తెలుసా ! ఇంకెప్పుడూ నాకు చెప్పకుండా వెళ్ళకు . నేను నీకోసం నీకు ఇష్టమైన వంట చేసాను అని సౌర్య ను ఇంటిలోపలికి తీసుకు వెళ్తుంది . అమ్మను తాను ఎంత బాధపెట్టానో అర్థమైన సౌర్య ,ఇంకెప్పుడు అమ్మను బాధపెట్టకూడదని నిర్ణయించుకుంటాడు .
Moral : ఎటువంటి ఆపేక్షలేని తల్లిదండ్రుల ప్రేమ అమూల్యమైనది .
Audio Story:
For more stories please click: Telugu stories for kids