ఎందరో వీరులు, మహనీయులు వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి కుటుంబాలను వదలి మన స్వేచ్ఛ కోసం పోరాడి ఆ పోరాటంలో అసువులు బాశారు వారిలో కొందరు మహనీయులను మనం గుర్తు చేసుకుందాం.
Contents
Balagangadar Tilak /బాలగంగాధర్ తిలక్ (23 జులై 1856 – 1 ఆగష్టు 1920)
“స్వరాజ్యం నా జన్మ హక్కు మరియు నేను దానిని కలిగి ఉంటాను “అనే నినాదంతో వేలాది మంది లో స్ఫూర్తిని నింపిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు బాల గంగాధర్ తిలక్ . ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు వాటిలో ముఖ్యంగా పాఠశాలలు స్థాపించడం మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వార్తాపత్రికలను ప్రచురించడం. త్రిమూర్తులు అని పిలవబడే లాల్ బాల్ పాల్ త్రయంలో ఈయన ఒకరు. ప్రజలు ఈయనను అమితంగా ప్రేమించే వారు మరియు తమ నాయకుడిగా మనస్పూర్తిగా అంగీకరించారు అందుకే ఈయనను లోకమాన్య తిలక్ అని పిలిచేవారు.
B R Ambedkar/బి ఆర్ అంబేద్కర్(14 ఏప్రిల్ 1891 – 6 డిసెంబర్ 1956)
బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ దళితులకు సాధికారత కల్పించడం లో కీలక పాత్ర పోషించారు.అనగారిన వర్గాల బతుకుల్లో వెలుగులు నింపారు. భారత రాజ్యాంగాన్ని రచించిన వారిలో ప్రముఖులు.ఆయన మరణించిన తర్వాత 1990వ సంవత్సరంలో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను భారత ప్రభుత్వం అందించింది.
C.Rajagopala Chary/సి.రాజగోపాలాచారి (10 డిసెంబర్ 1878 – 25 డిసెంబర్ 1972)
ఈయనను రాజాజీ అని పిలిచేవారు,మహాత్మా గాంధీ యొక్క ముఖ్య అనుచరుడు ఈయన సహాయ నిరాకరణ ఉద్యమంలో గాంధీ గారితో పాటు చురుకుగా పాల్గొన్నారు. ఆయన వృత్తిరీత్యా న్యాయవాది 1960 సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో చేరారు మరియు విప్లవకారులను ధైర్యంగా సమర్ధించేవారు. సి.రాజగోపాలాచారి స్వాతంత్య్ర భారతదేశపు మొదటి మరియు ఆఖరి గవర్నర్ జనరల్ గా పనిచేసారు. భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి రాజాజీ. దళితులను ఆలయంలోనికి ప్రవేశించి చట్టాన్ని ఈయన తీసుకువచ్చారు
Anibicent/అనిబిసెంట్ (1 అక్టోబర్ 1847 – 20 సెప్టెంబర్ 1933)
ఈమె లండన్‌లో జన్మించారు, ఈమె సంఘసేవకురాలు.బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం స్థాపనకు తోడ్పడ్డారు. 1913లో భారత రాజకీయం లోకి ఆమె ప్రవేశించారు. హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి, స్థానిక స్వపరిపాలన అవసరాన్ని అందరికీ తెలియజేశారు. భారత స్వతంత్ర ఉద్యమం లో ఎనలేని సేవలు అందించారు, ఈమె ప్రసంగాలతో యువతలో ఉత్తేజాన్ని నింపే వారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా 1917 లో నియమించబడ్డారు.
Kasturi Bhai/కస్తూరిబాయి గాంధీ (11 ఏప్రిల్ 1869 – 22 ఫిబ్రవరి 1944)
ఈమె జాతిపిత మహాత్మా గాంధీ గారి భార్య ఈమె గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి ఆయనతోపాటు అనేక స్వతంత్ర ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనేవారు. క్విట్ ఇండియా ఉద్యమం మరియు పలు అహింసాయుత పోరాటం లో పాల్గొనడం వలన బ్రిటిష్ వారిచే అరెస్టు చేయబడ్డారు.
Kamala Nehru/కమలా నెహ్రూ (1 ఆగష్టు 1899 – 28 ఫిబ్రవరి 1936)
ఈమె పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి భార్య అయినప్పటికీ ఆమె సొంతంగా అనేక స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనే వారు. చుట్టుపక్కల మహిళలు అందరినీ సమూహంగా చేసి విదేశీ వస్తు బహిష్కరణ సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొన్నారు ఈ ఉద్యమ పోరాటం లో ఈమె రెండు సందర్భాల్లో బ్రిటిష్ వారిచే అరెస్టు చేయబడ్డారు.
N G Ranga/ఎన్ జి రంగ (7 నవంబర్ 100 – 9 జూన్ 1995)
ఈయన అసలు పేరు గోగినేని రంగనాయకులు అందరూ ఎన్.జి.రంగా అని పిలిచేవారు. గాంధీ గారి స్వతంత్ర పోరాటం తో స్ఫూర్తి పొంది ఈయన స్వతంత్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఈయన భారత రైతాంగ ఉద్యమాల్లో విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చారు మరియు అత్యంత ప్రముఖమైన స్వాతంత్ర సమరయోధులు ఒకరుగా నిలిచారు. ఈయన కిసాన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
సుదీర్ఘకాలం ఎంపీగా కొనసాగి ఆయన గిన్నిస్ రికార్డు సాధించారు. ఈయన పేరు పై వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
Jatin Das/జతిన్ దాస్ (27 అక్టోబర్ 1904 – 13 సెప్టెంబర్ 1929)
ఈయన తన 25వ ఏట 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి మరణించారు ఈయన ఒక విప్లవకారుడు అనేక సందర్భాలలో స్వతంత్ర పోరాటంలో జైలుకు వెళ్లారు.జైలులో రాజకీయ ఖైదీలను నీచంగా చూస్తున్నారని కారణంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ఈయనను సుభాష్‌చంద్రబోస్ యంగ్ దదీచి ఆఫ్ ఇండియా అని అన్నారు.
Bipin Chandrapal/బిపిన్ చంద్రపాల్(7 నవంబర్ 1858 – 20 మే 1932)
బిపిన్ చంద్ర పాల్ భారత్ జాతీయ కాంగ్రెస్ కీలక సభ్యులలో ఒకరు మరియు ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అతను విదేశీ వస్తువులను వదలివేయడానికి సమర్థించాడు. బిపిన్ చంద్ర పాల్ లాలా లజపతి రాయ్ మరియు బాలగంగాధర్ తిలక్ కలిసి అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. ఈ కారణంగా బిపిన్ చంద్రపాల్ ను విప్లవాత్మక ఆలోచనల పితామహుడు అని పిలుస్తారు. అస్సాం టీ తోటల లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడంతో బిపిన్ చంద్ర పాల్ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైంది. ఈయన వందేమాతరం పత్రికను స్థాపించారు.
Chandra Shekar Azad/చంద్రశేఖర్ ఆజాద్(23జులై July 1906 – 27 ఫిబ్రవరి 1931)
భారతదేశంలో ధైర్యవంతులైన స్వాతంత్ర సమరయోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. భగత్ సింగ్ సన్నిహితుల లో ఒకరైన చంద్రశేఖర్ ఆజాద్ హిందుస్థానీ రిపబ్లికన్ అసోసియేషన్ పునర్వ్యవస్థీకరణ చేసి ఘనత పొందారు. బ్రిటిష్ సైనికులు చుట్టుముట్టినప్పుడు ఆయన వారిలో చాలా మందిని చంపి తన పిస్టల్ లో ఉన్న చివరి బుల్లెట్ తో తనను తాను కాల్చుకుని మరణించారు ఎందుకంటే ఆయన ఎప్పుడూ సజీవంగా బ్రిటిష్ వారికి దొరకాలని భావించ లేదు అందుకే తనను తాను చంపుకున్నారు.
Mangal Pandey/మంగల్ పాండే (19 జులై 1827 – 8 ఏప్రిల్ 1857)
1857లో జరిగిన గొప్ప తిరుగుబాటును ప్రారంభించడానికి భారతీయ సైనికులను ప్రేరేపించడం లో మంగల్ పాండే కీలకపాత్ర పోషించారని చెబుతారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సైనికుడిగా పనిచేస్తూ ఇంగ్లీష్ అధికారులపై కాల్పులు జరిపారు. 1857లో మంగళ పాండే ప్రారంభించిన సైనిక తిరుగుబాటును భారతదేశం యొక్క మొట్టమొదటి తిరుగుబాటు గా పరిగణిస్తారు.
Jawaharlal Nehru/జవహర్లాల్ నెహ్రూ(14 నవంబర్ 1889 – 27 మే 1964)
భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాన మంత్రిగా జవహర్లాల్ నెహ్రూ నియమింపబడ్డారు ఈయన స్వతంత్ర సమరయోధులు ప్రముఖుడు నెహ్రూ గారు ప్రసిద్ధ పుస్తకం డిస్కవరీ డిస్కవరీ ఆఫ్ ఇండియా ను రచించారు. నెహ్రూకి పిల్లలంటే చాలా ఇష్టం ఈ నన్ను అందరూ చాచానెహ్రూ అని పిలిచేవారు నెహ్రూ గారి నాయకత్వంలోనే భారతదేశం ప్రణాళికాబద్ధమైన ఆర్థిక అభివృద్ధి పద్ధతిని ప్రారంభించింది. ఈయన పుట్టిన రోజును పిల్లల దినోత్సవంగా జరుపుకుంటున్నాము
Dadabhai Nouroji/దాదాబాయి నౌరోజి(4 సెప్టెంబర్ 1825 – 30జూన్ 1917)
1855 లో ఇంగ్లాండ్ వెళ్లి భారతదేశం యొక్క స్థితిగతులు బ్రిటిష్ ప్రభుత్వానికి వివరించారు. ఈయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ను స్థాపించారు,మూడు సార్లు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అధ్యక్షత వహించారు. ఈయన పవర్ టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ అనే పుస్తకాన్ని రచించారు. ఈయన డ్రెయిన్ తేరి రచించారు దీనిలో భారతదేశం యొక్క సంపదను బ్రిటిష్ వాళ్ళు ఎలా దోచుకుపోయారు అనేది వివరంగా చెప్పారు, అందుకే నా రోజీ ని ఫస్ట్ ఎకనామిస్ట్ ఆఫ్ ఇండియా అని అంటారు. మరియు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదుతో పిలిచేవారు.
Laala Laja pathi Rai/లాలాలజపతిరాయ్(28 జనవరి 1865 – 17 నవంబర్ 1928)
లాలాలజపతిరాయ్ భారత స్వాతంత్రోద్యమం నాయకుడిగా న్యాయవాదిగా రచయితగా పేరు పొందారు. ఈయన పంజాబ్ కేసరి అనే బిరుదు తో ప్రసిద్ధి పొందారు. జాతీయోద్యమంలో పేరొందిన లాల్ బాల్ పాల్ అతివాద త్రయంలో లాలా లజపతిరాయ్ ఒకరు. లాలాలజపతిరాయ్ లాహోర్ లో జాతీయ కళాశాలలను ఏర్పాటు చేశారు. ఈయన రచించిన ప్రముఖ గ్రంథాలు ఆర్య సమాజ్ నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అన్ హ్యాపీ ఇండియా.1928లో సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో లాఠీఛార్జ్ తో లజపతిరాయ్ తీవ్రంగా గాయపడ్డారు మరణించారు.
Gandhi/మహాత్మా గాంధీ(2 అక్టోబర్ 1869 – 30 జనవరి 1948)
ఈయనను జాతిపిత అని పిలుస్తారు ఈయన భారత స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు మరియు బ్రిటిష్ వారి బారి నుండి భారతదేశాన్ని రక్షించి స్వతంత్రం తీసుకురావడంలో కృషి చేశారు. ఈయన అహింసను ఆయుధంగా తీసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు అనగా సత్యాగ్రహ ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేక ఉద్యమాలు చేసి ఇ స్వతంత్రం వచ్చే వరకు నిరాటంకంగా పోరాడారు.
Moulana Abdul Kalam Azad/మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్(11 నవంబర్ 1888 – 22 ఫిబ్రవరి 1958)
మౌలానా ఆజాద్ చాలా ముఖ్యమైన ఉద్యమాలలో పాల్గొన్నారు భారత జాతీయ కాంగ్రెస్‌లో చురుకైన సభ్యులు మరియు గొప్ప స్వతంత్ర సమరయోధుడు. ఈ నా సెప్టెంబర్ 1923లో కాంగ్రెస్ ప్రత్యేక సెషన్ కు అధ్యక్షత వహించాడు మరియు 35 సంవత్సరాల వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతి చిన్న వయసు గల వాడు.
Mothilal Nehru/మోతిలాల్ నెహ్రూ(6 మే 1861 – 6 ఫిబ్రవరి 1931)
ఈయన ఒక న్యాయవాది, చట్ట సభలను బహిష్కరించాలని గాంధీ పిలుపును మోతీలాల్ వ్యతిరేకించారు. ది ఇండిపెండెంట్ పత్రికను స్థాపించారు. ఈయన గాంధీ తో విభేదించి స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఈయన కుమారుడు జవహర్లాల్ నెహ్రూ. మోతిలాల్ నెహ్రూ గారి ప్రముఖ రచన వాయిస్ ఆఫ్ ఫ్రీడం. ఈయన సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు.
Sardhar Vallabhai Patel/సర్దార్ వల్లభాయ్ పటేల్(31 అక్టోబర్ 1875 – 15 డిసెంబర్ 1950)
ఈయన ప్రముఖ న్యాయవాది అయిన ప్పటికీ భారతదేశ స్వేచ్ఛ కోసం పోరాడాలని నిర్ణయించుకొన్నారు తన వృత్తిని వదులుకున్నారు. ఈయన ధైర్యసాహసాలు వల్ల ఆయనను అందరూ భారత దేశపు ఉక్కు మనిషి అని అనే బిరుదుతో పిలిచేవారు. రైతులకు మద్దతుగా బారదోలి లో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం చేపట్టి దేశ వ్యాప్తంగా పేరు పొందారు. ఈయన రాజ్యాంగ రచనలో ప్రాథమిక హక్కుల ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. పటేల్ ను అఖిల భారత సర్వీసుల పితామహుడిగా పరిగణిస్తారు.
Bhagth Singh/భగత్ సింగ్(28 సెప్టెంబర్ 1907 – 23 March 1931)
ఈయనను షహీద్ భగత్ సింగ్ అని కూడా అంటారు. భగత్‌సింగ్ చాలా చిన్న వయసులో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అనేక విప్లవాత్మక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈయన స్వతంత్రం పొందడానికి హింస మార్గాన్ని ఎంచుకున్నారు ఈయన లాలా లజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారి జాన్ సండర్ చంపారు. డిఫెన్స్ ఆఫ్ ఇండియా ఆక్ట్ కు వ్యతిరేకంగా బ్రిటిష్ అసెంబ్లీ లో బాంబు దాడి చేసి పట్టుబడి జైలు పాలయ్యారు,ఇతర నేరాలు కూడా నిరూపింప బడడం తో ఆయనతో పాటు ఆయన స్నేహితులైన సుకదేవ్,రాజగురుకి కూడా మరణశిక్ష పడింది.
Alluri Seetha Raama Raaju/శ్రీ అల్లూరి సీతారామరాజు(4 జులై 1898 – 7 May 1924)
ఈయనను మన్యం వీరుడు అని పిలిచేవారు.ఈయన 1922లో రంప తిరుగుబాటు ప్రారంభించాడు ఇది బ్రిటీష్ ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం కోసం ప్రారంభించబడిన తిరుగుబాటు.అల్లూరి సీతారామరాజు చాలామంది బ్రిటిషు సైన్యాన్ని చంపి అనేక పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు పోలీస్ స్టేషన్లో ఉన్న తుపాకులు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకొనే వారు.
Birsa Munda/బిర్సాముండా (15 నవంబర్ 1875 – 9 జూన్ 1900)
భారత దేశపు మొట్టమొదతి స్వతంత్ర సమర యోధుడు.ఈయన జార్ఖండ్ లో జన్మించాడు , ఈయన ఒక ఆదివాసీ. చిన్నతనం లో విద్య నేర్చుకోవడానికి పాఠశాలకు వెళితే బ్రిటిష్ వారు మతం మార్చుకుంటే కానీ చదువు చెప్పం అన్నారు ,చదువు మీద వున్న అభిమానం తో మతం మార్చుకున్నాడు కానీ బ్రిటిష్ వారు ఆదివాసీల పై చేసే అన్యాయాలు ,వారి భూమిని బలవంతం గా లాక్కోవడం వారు మతమార్పిడి చేసుకోవాలని ఆదివాసీలను ఇబ్బంది పెట్టడం ఇవన్నీ సహించలేక పోయిన బిర్సా బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఆదివాసీల హక్కుల కోసం పోరాటాన్ని ప్రారంభించాడు . ఈయన స్వయంపరిపాలన అనే నినాదానికి పునాది రాయి వేసిన మహనీయుడు. ఈయన కొందరు ఆదివాసీలను ప్రభావితం చేసి వారికి స్వతంత్రం విలువ తెలియజేసి వారితో ఉల్గులాన్ తిరుగుబాటు చేసాడు . బిర్సా పోరాట పటిమ చూసి భయపడిన బ్రిటిష్ వారు బిర్సాను దొంగ దెబ్బ తీసి జైలు లో బందించి చిత్రహింసలకు గురిచేసి చంపివేశారు.
Subhash Chandra Bose/సుభాష్ చంద్ర బోస్ (23 జనవరి 1897 – 18 ఆగస్టు 1945)
నేతాజీగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్, ఒరిస్సా లో ఒక ధనిక కుటుంబం లో జన్మించారు. ఈయన సివిల్ సర్వీసెస్ కి ఎంపిక అయ్యి కూడా భారత దేశానికి స్వతంత్రం తేవాలనే కాంక్షతో సివిల్ సర్వీసెస్ ని కాదనుకొని స్వతంత్ర పోరాటం మొదలు పెట్టారు. స్వతంత్రం సాధించాలంటే అహింసా మార్గం పనిచేయదని హింసా మార్గాన్ని ఎంచుకున్నారు సుభాష్ చంద్రబోస్. ఈ పోరాటంలో ఆయన 11 సార్లు ఆంగ్లేయులచే అరెస్టు చేయబడి జైలుకు వెళ్లారు. బోస్” మీ రక్తాన్ని ధార పోయండి మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అని నినాదం చేసేవారు.రెండవ ప్రపంచ యుద్ధ సమయం లో బ్రిటిష్ వారిని దెబ్బతీయడానికి ఇదే సరైన సమయం అని భావించి జపాను సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ ని ఏర్పాటు చేశారు. ఈయన తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు అని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది
Sukhadev/సుఖదేవ్ (15 మే 1907 – 23 మార్చి 1931)
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ యొక్క ముఖ్య సభ్యులలో ఒకరైన సుఖ్‌దేవ్ ఒక విప్లవకారుడు మరియు భగత్ సింగ్ మరియు శివరామ్ రాజ్‌గురు యొక్క సన్నిహితుడు. సుఖదేవ్ కూడా, బ్రిటిష్ పోలీసుఅధికారి జాన్ సాండర్స్ ను హత్య చేయడం లో పాలుపంచుకున్నారు . సుఖ్‌దేవ్, భగత్ సింగ్ మరియు శివరామ్ రాజ్‌గురులతో కలిసి పట్టుబడ్డారు మరియు 24 సంవత్సరాల వయస్సులో వీరమరణం పొందారు.
Vital Bhai Patel/విఠల్‌భాయ్ పటేల్ (27 సెప్టెంబర్ 1873 – అక్టోబర్ 22,1933)
ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అన్నయ్య,స్వరాజ్య పార్టీ సహ వ్యవస్థాపకుడు. విఠల్ భాయ్ పటేల్ తీవ్రమైన స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి . విఠల్‌భాయ్ సుభాష్ చంద్రబోస్‌కు అత్యంత సన్నిహితుడు ఈయన కూడా అహింసా పోరాటానికి వ్యతిరేకి . ఆయన తన ఆరోగ్యం క్షీణించినప్పుడు, తన ఆస్తిని మొత్తం విప్లవాత్మక కార్యకలాపాల కోసం వినియాగించమని సుభాష్ చంద్రబోస్ కు అప్పగించాడు.
Sarojini Naidu/సరోజినీ నాయుడు(13 ఫిబ్రవరి1879 -2 మార్చ్1949)
ప్రముఖ కవి మరియు రచయిత ఐన సరోజినీ నాయుడు “నైటింగేల్ ఆఫ్ ఇండియా “అని కూడా పిలువబడే వారు . ఈమె హైదరాబాద్ లో జన్మించారు. ఆమె 1915 నుండి 1918 వరకు భారతదేశమంతటా పర్యటించింది, సామాజిక సంక్షేమం, మహిళా సాధికారత మరియు జాతీయవాదం గురించి ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె భారతదేశంలోని మహిళలకు స్వతంత్రం గురించి అవసరాన్ని అవగాహనని కలిగించింది ,వారికి ప్రపంచం గురించి అవగాహన కలుగజేసింది . ఆమె 1917 లో ఉమెన్ ఇండియా అసోసియేషన్ (WIA) ని స్థాపించింది.ఈమె స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ గా మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకోబడ్డారు. ఇంగ్లీష్ లో ఎన్నో రచనలు చేశారు, ఈమె రచించిన లేడీ ఆఫ్ లైక్ చాలా ప్రసిద్ధి చెందింది.
Vijaya Laxmi Pandit/విజయ లక్ష్మి పండిట్( 18 ఆగష్టు1900 – 1 డిసెంబర్ 1990)
ఈమె అలహాబాద్ లో జన్మించారు, ఈమె మోతిలాల్ నెహ్రూ యొక్క పెద్ద కుమార్తె. భారతదేశంలో మంత్రి పదవి పొందిన మొదటి ఇండియన్ మహిళగా విజయ లక్ష్మి పండిట్ చరిత్రను సృష్టించారు. జాతీయ నిర్మాణంలో ప్రచారకర్త, మంత్రి, రాయబారి మరియు దౌత్యవేత్తగా ఇలా ఎన్నో పాత్రలు పోషించిన మహిళ ఆమె. బ్రిటిష్ కాలంలో, రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత రాజ్యాంగ పరిషత్ కోసం డిమాండ్ చేసిన మొదటి మహిళా క్యాబినెట్ మంత్రులలో ఆమె ఒకరు. ఈమె స్వతంత్ర పోరాట సమయంలో అనేక సందర్భాల్లో జైలుకు వెళ్లారు.
Kalpana Datta/కల్పన దత్త (27 జూలై 1913 – 8 ఫిబ్రవరి 1995)
సూర్య సేన్ నాయకత్వంలో చిట్టగాంగ్ దాడి చేసిన బృందంలోని ప్రముఖ సభ్యులలో కల్పన దత్త ఒకరు. ఆమె పహర్తాలి యూరోపియన్ క్లబ్ దాడిలో పాల్గొంది, ఆమెతో పాటు ప్రీతిలత వడ్డేదార్ కూడా ఉన్నారు. ఆమె ధైర్యసాహసాల చూసి అనేక సందర్భాల్లో ఆమెను అరెస్టు చేశారు.
For more stories please visit:https://telugulibrary.in/inspirational-women-in-indian-history-in-telugu/
Durga Bhai Desh Mukh/దుర్గాబాయ్ దేశ్ ముఖ్ – (15 జులై 1909 – 9 మే 1981)
ఉక్కు మహిళ ‘ఐరన్ లేడీ’ గా పిలువబడే దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ గొప్ప స్వతంత్ర సమరయోధురాలు, అంకితభావంతో పనిచేసే
సామాజిక కార్యకర్త మరియు నిష్ణాతులైన న్యాయవాది.ఈమె ఆంధ్ర ప్రదేశ్ లోని రాజమండ్రిలో జన్మించారు, ఆమె భర్త రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అయిన మొదటి భారతీయుడు.ఆమె మహాత్మాగాంధీచే తీవ్రంగా ప్రభావితమైంది మరియు స్వాతంత్ర్య పోరాటంలో పూర్తిగా మునిగిపోయింది. స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా, ఆమె అసెంబ్లీ చర్చలలో చురుకుగా పాల్గొన్నారు. ఆమె జీవితమంతా, ఆమె మహిళల హక్కుల కోసం పోరాడింది.
Laxmi Sahgal/లక్ష్మి సహగల్ (24 అక్టోబర్ 1914 – 23 జూలై 2012)
ఈమె ఒక వైద్యురాలు , కెప్టెన్ లక్ష్మిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీ సహగల్. సుభాష్ చంద్రబోస్ యొక్క ఆలోచనా విధానాలు నచ్చి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని దళంలో చేరడానికి మహిళలను ప్రోత్సహించారు. ఆమె మహిళా రెజిమెంట్ ఏర్పాటుకు చొరవ తీసుకుంది మరియు దానికి ‘రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్’ అని పేరు పెట్టింది. 1945 లో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను అరెస్టు చేయడానికి ముందు లక్ష్మీ భారత స్వాతంత్ర్యం కోసం తీవ్రంగా పోరాడింది.తరువాత కొన్ని చర్చలు సఫలమవడం తో ఈమెను విడుదల చేశారు.
Chittaranjan Dass/చిత్తరంజన్ దాస్ (5 నవంబర్ 1869 – 16 జూన్ 1925)
చిత్తరంజన్ దాస్ స్వరాజ్ పార్టీని స్థాపించారు మరియు భారత జాతీయ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. వృత్తిపరంగా న్యాయవాది అయిన చిత్తరంజన్ అరబిందో ఘోష్‌పై బ్రిటిష్ వారు క్రిమినల్ కేసు క్రింద అభియోగాలు మోపినప్పుడు విజయవంతంగా వాదించిన గెలుపు పొందారు . దేశబంధుగా ప్రసిద్ధి చెందిన చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్‌కు మార్గదర్శకంగా ఉండేవారు .
Taantiya Toope/తాంతియా తోపే (1814 – 18 ఏప్రిల్ 1859)
1857 నాటి భారత తిరుగుబాటులలో తాంతియా తోపే ఒకరు. అతను జనరల్‌గా పనిచేశాడు మరియు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారతీయ సైనికుల బృందానికి నాయకత్వం వహించాడు. అతను నానా సాహిబ్ యొక్క అనుచరుడు మరియు బ్రిటీష్ సైన్యం ద్వారా నానా వెనక్కి తగ్గవలసి వచ్చినప్పుడు అతని తరపున పోరాటం కొనసాగించాడు. బ్రిటిష్ వారిని కాన్పూర్ నుండి వెనక్కి వెళ్ళమని బలవంతం చేసింది మరియు ఝాన్సీ రాణి గ్వాలియర్‌ను కాపాడుకోవడానికి సహాయం చేసాడు .
Naana saaheb/నానా సాహిబ్ (19 మే 1824 – 1857)
1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు బృందానికి నాయకత్వం వహించిన తరువాత, నానా సాహిబ్ కాన్పూర్‌లో బ్రిటీష్ దళాలను ఓడించాడు. అతను ప్రాణం ఉన్నబ్రిటిష్ సైనికులను చంపి, బ్రిటిష్ వారికి ని హెచ్చరించాడు . నానా సాహిబ్ సమర్థవంతమైన నిర్వాహకుడిగా కూడా పిలువబడ్డాడు మరియు అనేక వేల మంది భారతీయ సైనికులకు నాయకత్వం వహించాడు.
Komaram Bheem/కొమరం భీమ్(22 అక్టోబర్ 1901- 27 అక్టోబర్ 1940)
ఈయన గిరిజన నాయకుడు, ఆదిలాబాద్ జిల్లా లో జన్మించాడు కానీ ప్రస్తుతం అది కొమరం భీమ్ జిల్లాగా మారింది.భీమ్ గోండు గిరిజనుల కుటుంబంలో జన్మించాడు మరియు ఆదివాసీల హక్కులను గురించి చెప్పినందుకు అతని తండ్రిని స్థానిక అటవీ అధికారులు చంపివేశారు అప్పుడు భీం వయస్సు కేవలం 15 సంవత్సరాలు.హైదరాబాద్ విముక్తి కోసం ఆయన నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా పోరాడారు.అతను నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలు తీసుకున్నాడు.భీమ్ “జల్, జంగిల్, జమీన్” అనే నినాదాన్ని ప్రచారం చేసాడు , దీని అర్థం నీరు, అడవి మరియు భూమి.అతని నినాదం యొక్క నిర్వచనం అడవిలో నివసించే వ్యక్తికి అటవీ వనరులపై హక్కులు ఉండాలి.తన తుది శ్వాస వరకు గిరిజనుల హక్కులకోసం పోరాడారు .