what is depression

What is Depression in Telugu

ఈ రోజుల్లో మన  దైనందిన జీవితంలో తరచుగా వినబడుతున్న మాట డిప్రెషన్ , అంటే నిరాశ. డిప్రెషన్ అనేది ఒక అనారోగ్య సమస్య అని గత దశాబ్దం వరకు మనలో చాలా మందికి తెలీదు! నిజం చెప్పాలి అంటే దాని గురించి తెలిశాకే మనం మన జీవితాలలో దానిని ఇనుమడింప  చేసుకున్నాం ఏమో…  అనిపిస్తుంది .
అంతే కదా.. లోకం తెలియని  చిన్న పిల్లవాడికి నువ్వు మొండివాడివి అని పదే పదే చెప్పి వాడికి మొడితనం నేర్పించినట్టు ,మనం కూడా మనకు తెలిసిన నిరాశ అనే ఒక భావాన్ని పెంచి పోషించి రంగులద్ది ‘డిప్రెషన్’ అనే  ఒక ఆరోగ్య సమస్యగా చేసుకున్నాం .

(కొన్నిసార్లు మనం చిన్న నిరాశలను సరిగా అర్థం చేసుకోకపోతే, అవి క్రమంగా డిప్రెషన్ లాంటి తీవ్రమైన సమస్యగా మారే అవకాశం ఉంది.)

Contents

డిప్రెషన్ అంటే ఏమిటి? (What is Depression?)

ఇది ఒక మానసిక సమస్య మాత్రమే కాదు, శారీరక పరిస్థితులతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. మనం శారీరకంగా బలహీనంగా లేదా అనారోగ్యంతో ఉంటే, అది మన మనసుపై ప్రభావం చూపి నిరాశకు దారి తీస్తుంది.

అయితే స్పష్టమైన కారణం లేకుండా మనకు నిరాశగా అనిపించినా, దాని నుండి బయటపడటానికి ప్రయత్నిస్తే తప్పకుండా మార్పు సాధ్యమే. కానీ మొదటి అడుగు మనమే వేయాలి కదా! ప్రయత్నం చేయకుండా మార్పు ఆశించడం సరైంది కాదు.(చిన్న చిన్న అడుగులు వేస్తే, నెమ్మదిగా మార్పు సాధ్యమే.)

డిప్రెషన్ లక్షణాలు (Symptoms of Depression):

  • డిప్రెషన్ అంటే కారణం వున్నా లేకున్నా బాధపడుతూ ఉండడం.
  • అతిగా ఆలోచించడం.
  • ఏదన్నా పని చేయాలంటే ఉత్సాహం లేకపోవడం,ఆలోచనా విధానం మందగించడం.
  • తిండి సరిగ్గా సహించకపోవడం ,నిద్రపట్టకపోవడం.
  • నిత్యం శారీరకం గా బలహీనంగా ఉన్నట్టు ఊహించుకోవడం .
  • ఏదో తప్పు చేశామన్న భావన తో జీవించడం.
  • ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన కలగడం.(తీవ్ర ఆలోచనలు ఉంటే వెంటనే వైద్య సహాయం పొందాలి.)

డిప్రెషన్ ఎందుకు వస్తుంది? (Causes) :

నిరాశకు శారీరక సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు. మన ఆరోగ్యం సరిగా లేకపోతే మనసు కూడా ప్రభావితం అవుతుంది. జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం, శరీర బలహీనత, దీర్ఘకాలిక అనారోగ్యం వంటి కారణాల వల్ల మనం మానసికంగా ఒత్తిడికి లోనవుతాం.

అలాగే, మనం ఇతరుల నుండి ఆశించినది దొరకకపోవడం, మన ఆలోచనలు మరియు ఆచరణ మధ్య పొంతన లేకపోవడం, ఆలోచనలో స్పష్టత లేకపోవడం కూడా నిరాశకు దారి తీస్తాయి. సరైన నిద్ర లేకపోవడం, అతిగా ఆలోచించడం, ఆర్థిక సమస్యలు లేదా ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడం వంటి పరిస్థితులు కూడా మన మనసును బలహీనపరుస్తాయి.

శారీరకంగా కూడా మన మెదడులో సంతోషం మరియు ఉత్సాహాన్ని కలిగించే రసాయనాలు (chemicals) సమతుల్యం కాకపోతే, మనం నిరాశకు గురవుతాం. ఈ సందర్భంలో వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. అవసరమైతే వారు మందులు లేదా చికిత్స సూచిస్తారు.

మందులు కొంతమందికి అవసరం అవుతాయి మరియు అవి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అయితే మందులతో పాటు జీవనశైలి మార్పులు — సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం, మంచి ఆలోచనలు — కూడా ఎంతో ముఖ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

నిరాశ నుంచి బయటపడటం ఎలా?

(How to Overcome Depression Naturally)

ప్రస్తుత సమాజంలో వయస్సుతో సంబంధం లేకుండా చదువుకొనే చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితచరమాంకంలో వున్న అందరిలో నిరాశ ఉంటుంది . దీనినుంచి ఎలాబయట పడాలి…

  • ఆలోచన సమస్య కాదు కాని అతి ఆలోచన ప్రమాదాన్ని కలిగిస్తుంది , దానిని తగ్గించాలి.
  • ఇతరులతో మనల్ని మనం పోల్చుకొని ,మనల్ని మనం కించపరుచుకోకూడదు .
  • మన తాహతుకు మించి ఆర్ధిక భారాన్ని పెంచుకో కూడదు ,ఖర్చులకు మన సంపాదనకు పొంతన ఉండాలి.
  • మనం ఇతరులనుండి ఆశించడం తగ్గించుకోవాలి,మనమే ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉండేలా మనల్ని మనం మలుచుకోవాలి. ఎందుకంటే ‘ఆశ భయంకరమైన నిరాశను కలిగిస్తుంది.’

మన శరీరానికి అందవలసిన ఇంధనం అందక పోవడం వలన కూడా ఈ సమస్యలు వస్తాయి.

  • ఇంధనం అంటే ఆహారం మాత్రమే కాదు సరిపడా నీరు(అంటే మనం శరీరానికి తగినంత నీరు అందించాలి ,రోజుకు కనీసం రెండు లీటర్ల నీటిని త్రాగాలి).
  • సరైన వెలుతురు ( శరీరానికి సరైన వెలుతురు అందాలి , మనం ఎప్పుడూ చీకటిలో ఉంటే ఎవరితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటే మన ఆలోచన విధానం లో సానుకూలత(positiveness ) ఎలావస్తుంది )
  • స్వచ్ఛమైన గాలి (ప్రస్తుత ఈ కాలుష్య పర్యావరణం లో స్వచ్ఛమైన గాలి ఖచ్చితంగా దొరకదు కాబట్టి అది దొరికే చోటుకి మనమే వెళ్ళాలి)
  • మన శరీరానికి హాని కలిగించే నాలుగు తెల్లని పదార్ధాలు తినడం తగ్గించాలి. అవి పంచదార,మైదా ,ఉప్పు,బియ్యం . వాటికి బదులు ప్రత్యామ్యాయాలు ఉపయోగించాలి .

ఈ ఇంధనాన్ని మనం సవ్యంగా తీసుకోవడం వలన, మనం ఆరోగ్యంగా ఉంటాం.

What is Depression in Telugu…

మనం ఏంచేయాలి? మనం ఏంచేయ కూడదు ?

  • మొదట సమస్య మొదలైనప్పుడే ఆ సమస్యను నిర్లక్యం చేయకుండా దానికి సంబందించిన అవగాహన పెంచుకోవాలి.
  • మన సమస్యలు ఏమిటో ఒక పేపర్ మీద రాయాలి,అప్పుడు మనకు మన సమస్యలపై ఖచ్చితమైన స్పష్టత వస్తుంది.
  • మన సమస్యలు ఇతరులవి అనుకొని ఆలోచిస్తే పరిష్కారం  తొందరగా వస్తుంది.
  • సమస్య గురించి ఒక అర్థగంట సమయం ఆలోచించి ఆ సమయంలో ఏమి పరిష్కారం వస్తుందో దానినే పాటించాలి. ఎందుకంటే అంతకన్నా మంచి పరిష్కారం మనం పొందలేము కాబట్టి.
  • రెండు రకాల సమస్యలు ఉంటాయి ఒకటి పరిష్కరించేది రెండు పరిష్కరించ లేనిది

పరిష్కారం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
పరిష్కారం ఉన్న విషయాలపై వెంటనే ప్రయత్నం ప్రారంభించండి.

మనము ప్రపంచాన్ని మార్చలేము.
కానీ మన ఆలోచనలను మాత్రం మార్చుకోవచ్చు.

  • మనల్ని మనం పనిలో బిజీగా ఉంచుకోవాలి.
  • మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి.
  • మనుషులతో కలిసిమెలిసి ఉండాలి.

గతం గురించి బాధపడకండి.గతం నుండి పాఠం నేర్చుకుని ముందుకు సాగండి.

What is Depression in Telugu…

నిరాశకు మందు ఉందా ?

ఖచ్చితంగా పరిష్కారం ఉంది. ముందుగా మనవంతు ప్రయత్నం మనమే చేయాలి. అయినప్పటికీ సమస్య తగ్గకపోతే, ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం ఎంతో ముఖ్యం. సరైన గైడెన్స్ , చికిత్స మరియు లైఫ్ స్టైల్ మార్పులతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

దేవుడు మనందరినీ ఒకేలా సృష్టించాడు. కానీ మన ఆలోచనలు, అలవాట్లు, లైఫ్ స్టైల్ మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం మనల్ని మనమే సంరక్షించుకోవాలి. మన జీవితాన్ని కాపాడుకోవడం మన బాధ్యత.

ఏదైనా సాధించాలంటే ముందుగా మనం శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నప్పుడే జీవితం లో ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు.

నిరాశలో వున్న వారితో మనం ఎలా ప్రవర్తించాలి !

మీ వారు లేదా మీ చుట్టుప్రక్కల వున్నవారు ఎవరైనా డిప్రెషన్ కు గురైనట్టు మీరు గమనిస్తే ,మీరు తప్పనిసరిగా వారికి అండగా వుండండి . ఎందుకంటే ఇది నిర్లక్ష్యం చేసే అంత చిన్న సమస్య కూడా కాదు !!

పరిస్థితి మరీ విషమిస్తే వారికి ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయి,కనుక వారు ఈ సమస్యనుండి బయట పడేవరకు సహనంగా వారితో మెలగండి. 

 

 

డిప్రెషన్ ఒక బలహీనత కాదు. అది చికిత్స పొందగలిగే ఆరోగ్య సమస్య. సరైన సహాయం మరియు జీవనశైలి మార్పులతో దీన్ని అధిగమించవచ్చు.

 

ప్రియనేస్తం…..

  1. “మీరు నిరాశను ఎలా అధిగమించారు? కామెంట్‌లో షేర్ చేయండి”
  2. “ఈ టిప్స్‌లో మీరు ఏది ట్రై చేశారు?”
  3. “ఈ పోస్ట్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి 💙”

 

 

 

 

నిరాశ  కొటేషన్లు/ Quotations:

  • ఇతరులను సంతృప్తి పరచడం కోసం మన అమూల్యమైన సమయాన్ని వృధా చేయడం వ్యర్థం
    ఎందుకంటే …!!
    ప్రపంచంలో ఏ  మనిషి ఇంకొక మనిషిని పూర్తిగా సంతృప్తి పరచలేడు.
  • వాస్తవంలో జీవించే వారికి ప్రతి ఎదురుదెబ్బ ఒక పాఠం నేర్పిస్తుంది,
    కాని ఊహాలోకం లో బ్రతికేవారికి  ఎదురయ్యే ప్రతి వాస్తవం ఒక కుంగుబాటు నిస్తుంది…
  • మహా ప్రళయం లోనూ ప్రశాంతత వెతుక్కొనే సత్తా మనిషి మెదడుకి మాత్రమే కలదు, ప్రయత్నిద్దాం  …
  • ఒక మనిషికి తన బలం గురించి తెలిసినా తెలియక పోయినా పర్వాలేదు
    కానీ తన బలహీనత గురించి మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి
    ఆపదలో బలం కచ్చితంగా సహాయం చేస్తుంది
    కానీ గుర్తించని బలహీనత అదః పాతాళానికి తొక్కేస్తుంది.

What is Depression in Telugu..

For more Telugu Articles :how to deal with kids behavior problems.

  • నీ ఆశయమనే రెక్కలు గెలుపు గమ్యాన్ని చేరే వరకు గమనంలో అండగా ఉండేది నీలోవున్న ఆశ మాత్రమే….ఆ ఆశాదీపాన్ని ఆరిపోనీకు….
  • నీలో ఉన్న చాలా సమస్యలు పరిష్కరించగలిగే వైద్యుడు,నువ్వే…
  • కష్టం లో కూడా మంచి వుంది
    అది ఒంటరి పోరాటాన్ని నేర్పిస్తుంది
    మన లోని  ధైర్యాన్ని మనకు పరిచయం చేస్తుంది
    ముఖ్యంగా … మనవారు ఎవరో పరాయి వారెవరో స్పష్టంగా తెలియజేస్తుంది .
  • ఒక మనిషి నిరాశ తనను మాత్రమే నాశనం చేస్తుంది .కానీ దురాశ మాత్రం తన చుట్టూ వున్న వాళ్ళందరిని నాశనం చేస్తుంది .
  • గతం నీడలో గమనం ఉంటే ,గమ్యం చేరుకోగలమా …?
    గతం గురువులా ఉండాలి ,గుదిబండలా కాదు …
  • ఈ నిమిషం మళ్ళీ కొత్తగా జన్మించవచ్చు … ప్రయత్నిస్తే .
    ప్రయత్నం అనేది చాలా చిన్న విషయం మన  కొత్త జీవితం తో పోలిస్తే…

 

Sireesha.Gummadi

 

error: Content is protected !!