Business Ideas in villages
Spread the love

Business ideas in villages….

హాయ్..

ప్రతి మనిషికీ సొంతంగా సంపాదించాలని వారి కాళ్ళమీద వారు నిలబడాలని చాలా ఆశగా ఉంటుంది. ఈ స్వయం ఉపాధి విషయంలో పట్టణాల్లో ఉండే ప్రజలకన్నా గ్రామాల్లో నివసించేవారికి కొంత నిరాశ ఉంటుంది కారణం, అయ్యో! మేము గాని టౌన్ లో ఉంటే ఏదో ఒక వ్యాపారం చేసుకొనే వాళ్ళము కానీ ఈ ఊరులో ఎటువంటి సదుపాయాలు అవకాశాలూ లేవు అని బాధపడుతూ వుంటారు అయితే గ్రామాల్లో ఉండేవారికి కూడా చాలా స్వయం ఉపాధి అవకాశాలు వున్నాయి అండీ!!

అవేంటో ఈ రోజు తెలుసుకుందాం…. మన సొంత సంపాదన అనే ప్రయాణంలో తొలి అడుగువేద్దాం

 

Contents

Mobile Repair Services/మొబైల్ రిపేర్ షాప్ :

ప్రస్తుతం మొబైల్ ఉపయోగించని వారు ఎవరున్నారు చెప్పండి ,అత్యవసర వస్తువుల్లో యిది మొదటి స్థానంలో వుంది. అంటే హార్ట్ డాక్టర్ కి ఎంత డిమాండ్ ఉంటుందో మొబైల్ రిపేర్ షాప్ కి అంత డిమాండ్ వుంటుంది అన్నమాట . అందుకే చిన్న మొబైల్ రిపేర్ పని నేర్చుకుంటే పెద్ద బిజినెస్ మేన్ అయిపోయినట్టే .

పెట్టుబడి :1- 2 lac (సుమారు)

దీనికి సంభందించిన సమాచారం

Handmade crafts, Pottery, Weaving, Woodworking:

Business Ideas in villages

అన్ని ఆటోమేషన్ అయిపోతున్న ఈ సమయంలో చేతిపనితో చేసిన ఏ వస్తువైనా ప్రస్తుతం చాలా విలువైనది అపురూపమైనది.
వాటిలో చేతిలో అల్లిన ,తయారుచేసిన వస్తువు ఏదయినా అమెజాన్ స్టోర్ లో లేదా  ఏ యితర ఆన్లైన్ స్టోర్ లో చాలా సులభంగా
అమ్మవచ్చు. ఆ వస్తువు మీరు చేయవలసిన పనేలేదు నైపుణ్యం తెలిసిన వారితో చేయించి ,దానిని అమ్మి ,లాభాలు మీరు వారూ పంచుకోవచ్చు .

దీనికి సంభందించిన సమాచారం

Village Grocery Store/పచారీ కొట్టు :

ఇది చాలా లాభాల తో కూడుకున్న వ్యాపారం ,మీరు చక్కటి నాణ్యత పాటిస్తే చాలు ప్రజలే మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు.

పెట్టుబడి :50,000(సుమారు)

దీనికి సంభందించిన సమాచారం

 

Local bakery or food stall with traditional snacks/పిండివంటలు:

ఇది మీకు వివరించవలసి పనిలేదు,మనకు తెలిసిన పనిని ఆ పని తెలియని వాళ్లకు ,వాళ్ళ కోసం సమయాన్ని కేటాయించలేని వాళ్లకు కొంత డబ్బు తీసుకొని చేసిపెడుతున్నాం అంతే .

అయినా రుచిగా వంట చేయడం అందరికీ రాదండీ మీలాగా … అందుకే మీ రుచిని అందరికీ పంచండి!!

దీనికి సంభందించిన సమాచారం

Organic products/Herbal products:

Business Ideas in villages

 

కెమికల్స్ తో నిండిపోతున్న ప్రపంచంలో ప్రస్తుతం మనిషికి ఊరటనిచ్చే పదం ఆర్గానిక్ (కల్తీ లేని వస్తువులు ). మీఇంటి చుట్టూ వున్న భూమిని ఉపయోగించుకొని కల్తీలేని పంటలు పండించి వాటిని అమ్మి మీరూ ఆదాయం పొందండి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించండి .

దీనికి సంభందించిన సమాచారం

Business Ideas in villages:

Tuition Center /ట్యూషన్ సెంటర్ :

మనకు తెలిసిన విద్యను ఇతరులకు పంచడమే (కానీ ఇది మాత్రం డబ్బుకోసం మాత్రమే కాకుండా పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ప్రారంభించండి ).

దీనికి సంభందించిన సమాచారం

 

Clothing Boutique/బట్టల షాప్ :

ఈ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా అవగాహన ఉండాలి . మీకు నచ్చినవి కాకుండా ఇతరులు ఇష్టపడేవి నాణ్యమైనవి మీ షాప్ లో ఉంచితే మీరు ఆశించిన లాభాలు పొందవచ్చు .
(మీ దగ్గరే ఓ నైపుణ్యం కలిగిన టైలర్ ని ఏర్పాటు చేసుకుంటే మీ వ్యాపారానికి చాలా సహాయంగా ఉంటుంది.)

దీనికి సంభందించిన సమాచారం

Milk parlour /మిల్క్ బిజినెస్ :

మీకు తెలిసిన వారి వద్ద పాలు సేకరించి నాణ్యతా ప్రమాణాలతో వాటిని అమ్మవచ్చు .

ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది ,నిపుణులతో సంప్రదించి నిర్ణయం తీసుకోండి .

దీనికి సంభందించిన సమాచారం

Xerox Shop :

మీ షాప్ లో ఒక Xerox machine ,Printer ,కంప్యూటర్ తో పాటు చిన్న చిన్న stationary అంటే పెన్ లు పెన్సిళ్లు లాటివి కూడా అమ్మితే వ్యాపారం బాగుంటుంది.

  • Photocopy/Xerox machine
  • Lamination machine
  • Spiral binding machine
  • Colour printer
  • Computer system
  • Toner/cartridge/ink
  • Different size papers like A4, A3, A2 etc.
  • Softwares like MS Word, MS Excel, MS PowerPoint, Corel Draw, Photoshop
  • Wifi Connection

 

పెట్టుబడి :30,000-50,000  (సుమారు)

దీనికి సంభందించిన సమాచారం

 

Fruit /Flower /Vegetable Shop :

మీకు అందుబాటులో వున్నవాటిని అమ్మవచ్చు.

మనం డబ్బుకోసం అమ్ముతున్నాం అని యితరులు ఆలోచిస్తారని సిగ్గుతో వెనకడుగు వేయకండి ,మనం వాళ్లకు అవసరమైన వస్తువులు అమ్మి వారికి సహాయం చేస్తున్నాం దానికి బదులుగా డబ్బుతీసుకుంటున్నాం అంతే .

దీనికి సంభందించిన సమాచారం

 

Rural Tourism/టూరిస్ట్ గైడ్/ Youtuber :

మీ గ్రామం పురాతన చరిత్ర కలిగింది అయినా లేదా మీ గ్రామంలో చాలా అద్భుతమైన కట్టడాలు గాని ప్రదేశాలుగాని ఉంటే మీరు అదృష్టవంతులే మీ గ్రామాన్ని కెమెరాలో భందించి యూట్యూబ్ ఛానల్ లో పెట్టొచ్చు లేదా కొత్తవారికి ఊరి ప్రత్యేకతలు చూపించి మీ శ్రమకు తగిన ఫలితం తీసుకోవచ్చు.

దీనికి సంభందించిన సమాచారం

 

సొంతంగా సంపాదించాలనే ఆలోచన చేసిన వారందరికీ Congrats

సొంత వ్యాపారం మొదలు పెట్టేవారికి All The Best

 

 

For Stories….

Yes And No stories in Telugu for Kids

చందమామ కథలు

Kids Moral Stories in Telugu

Real friend short-story for kids in Telugu

Kids-stories-in-Telugu

 

error: Content is protected !!