My best friend dog story
Spread the love

చిన్న పిల్లల కోసం … చిన్న కథ

పిల్లలు మనందరికి బొమ్మలు అంటే చాలా ఇష్టం కదా, మీ అందరి దగ్గర చాలా బొమ్మలు వుండివుంటాయి  అనుకుంటాను . వాటిలో మీకు చాలా ఇష్టమైన బొమ్మ ఒకటి వుండివుంటుంది కదా, అటువంటి ఇష్టమైన ఒక బొమ్మ గురించి  చిన్న కథ….

 

Contents

MY BEST FRIEND

అనగనగా ఒక వూరిలో ఒక బాబు ఉండేవాడు ఆ బాబు పేరు చెర్రీ,చెర్రీ దగ్గర చాలా బొమ్మలు వున్నాయి కానీ చెర్రీ కి చిన్నప్పటి నుండి తన డాడీ ఇచ్చిన బ్రౌన్ కలర్ కుక్కపిల్ల బొమ్మ  అంటే చాలా ఇష్టం రోజూ దానితోనే ఎక్కువ సేపు ఆడుకొనే వాడు. చెర్రీ కి తాను మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అని కుక్క పిల్ల బొమ్మ చాలా హ్యాపీ గా ఉండేది .

అలా కొన్ని సంవత్సరాలు గడిచాక..

చెర్రీ టాయ్స్ బాక్స్  లోకి చాలా కొత్త కొత్త బొమ్మలు వచ్చాయి ,కదిలేవి,మాట్లాడేవి… ఇలా చాలా . చెర్రీ వాటి తో ఎక్కువ సమయం గడిపేవాడు ,కుక్కపిల్ల బొమ్మ తో  రోజుకు ఒక్కసారి కూడా ఆడేవాడుకాదు . కుక్కపిల్ల బొమ్మ ఈ మధ్య చాలా బాధగా ఉంటుంది ,తనకు కదలడం మాట్లాడం రాదు కదా అందుకే తాను చెర్రీ కి నచ్చడం లేదు అనుకుంటుంది . కుక్కపిల్ల బొమ్మ తో పాటు వున్న ఇంకో పాత గుర్రం బొమ్మ ,కుక్కపిల్లతో బాధ పడకు ఎప్పటికైనా ప్రాణం వున్న వాటికే విలువ ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కడికి కావాలంటే  అక్కడికి వెళ్ళగలవు , ఎవరు ప్రేమిస్తే వారిని తిరిగి ప్రేమించగలవు కానీ మనం ఎక్కడ పెడితే  అక్కడ కదలకుండా ఉంటాం కదా అందుకే మనల్ని ఎవరైనా కొంతకాలమే ఇష్టపడతారు అంటుంది .

ఒక రోజు చెర్రీ కి చాలా జ్వరం వస్తుంది ,ఎన్ని రోజులు అయినా  అది తగ్గదు అతను తన మంచం కూడా దిగలేకపోతాడు అప్పుడు చెర్రీ కి తన బెడ్ ప్రక్కన వున్న కుక్కపిల్ల బొమ్మ కనబడుతుంది దానిని చేతిలోకి తీసుకొని దానిని పట్టుకొని నిద్రపోతాడు . డాక్టర్ ట్రీట్మెంట్ చేసాక కొన్ని రోజులకు చెర్రీ కి జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ  ఎప్పటిలాగే హుషారుగా అయిపోతాడు. అప్పుడు డాక్టర్ వచ్చి చెర్రీ కి జ్వరం వున్నప్పుడు వాడిన వస్తువులన్నింటిలో క్రిములు ఉంటాయి అని,  అందుకే అన్ని వస్తువులను కాల్చివేయమని చెర్రీ  తల్లిదండ్రులతో చెపుతాడు .

జ్వరం తగ్గిపోయింది కనుక చెర్రీ స్కూల్ కి వెళ్ళిపోతాడు . చెర్రీ ఇంటిలో పనిమనిషి చెర్రీ బెడ్ పై వున్న అన్ని వస్తువులతో పాటు జ్వరం వచ్చినప్పుడు వాడిన కుక్కపిల్ల బొమ్మ ని కూడా తీసుకొని కాల్చి వేయడానికి తీసుకువెళుతుంది , కానీ సరిగ్గా పట్టుకోక పోవడం వలన కుక్కపిల్ల బొమ్మ, చెర్రీ వాళ్ళ గార్డెన్ లో పడిపోతుంది . పని మనిషి మిగిలిన వాటిని కాల్చి వేస్తుంది .

for more animal related moral stories click here: http://telugulibrary.in/animal-moral-stories-in-telugu

గార్డెన్ లో…

నేలపై పడిన కుక్కపిల్ల బొమ్మకి చాలా బాధగా వుండి  ఏడుపు వస్తుంది ,అప్పుడే పెద్ద వర్షము వచ్చి కుక్కపిల్ల బొమ్మ మొత్తం నీటితో నాని పోతుంది . కుక్కపిల్ల బొమ్మ  అలాగే కొన్ని గంటలు నీటిలో తడిచిపోతూ ఏడుస్తూ వుంటుంది , బొమ్మ బాధ పడడం చూసి ఒక ఏంజెల్ ప్రత్యక్షమవుతుంది .కుక్కపిల్ల బొమ్మ తో ఎందుకు అంతగా బాధపడుతున్నావ్ అంటుంది ,అప్పుడు కుక్కపిల్ల బొమ్మ నాకు  నా ఫ్రెండ్ చెర్రీ అంటే చాలా ఇష్టం కానీ నేను యిప్పుడు ఇక్కడ వున్నాను నేను మళ్ళీ నా ఫ్రెండ్  దగ్గరకు ఎలా వెళ్ళగలను అని అడుగుతుంది .

అప్పుడు ఏంజెల్ బాధపడకు ఇప్పుడు నీకు ఏంకావాలి చెప్పు అంటుంది, అప్పుడు కుక్కపిల్లకి బొమ్మ గుర్రం అన్న మాటలు గుర్తొస్తాయి .. మనకు ప్రాణం ఉంటేనే ఎవరన్నా మనలను ఇష్టపడతారు అని ,అప్పుడు కుక్కపిల్ల బొమ్మ నాకు ప్రాణం కావాలి అంటుంది అప్పుడు ఏంజెల్ కుక్కపిల్ల బొమ్మ ని ఒక నిజమైన కుక్కపిల్లగా మార్చుతుంది . కుక్కపిల్ల బొమ్మ కి ప్రాణం వస్తుంది అది కదలగలుగుతుంది ,వెంటనే దాని దగ్గరకు అక్కడ వున్న మరి కొన్ని కుక్కపిల్లలు వస్తాయి వాటితో కుక్కపిల్ల  కి స్నేహం ఏర్పడుతుంది కుక్కపిల్ల కి  చాలా ఆనందంగా ఉంటుంది .

స్కూల్లో నుండి ఇంటికి వచ్చాక చెర్రీ ,కుక్కపిల్ల బొమ్మ కోసం ఇల్లంతా వెతుకుతాడు  కానీ బొమ్మ  కనబడదు ,చాలా బాధగా వచ్చి గార్డెన్లో కూర్చుంటాడు అక్కడ అతనికి అచ్చం  అతని బొమ్మలా వున్నఒక బ్రౌన్ కలర్ కుక్క పిల్ల  కనబడుతుంది . దానికి చేతిలోకి తీసుకొని నాకు ఎంతో ఇష్టమైన నా  బొమ్మ ని నేను మిస్ అయ్యాను అని బాధపడుతూ కుక్క పిల్లను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు చెర్రీ.

కుక్క పిల్లకు  చెప్పలేనంత ఆనందంగా ఉంది …

 

కథ బాగుందా …..నచ్చితే షేర్ చేయండి ,మీరు అభిప్రాయాలు పోస్ట్ చేయండి .

 

My Dog Is My Best Friend story for kids in Telugu : This story explains how pets show unconditional love and loyalty towards us.

One thought on “My Dog Is My Best Friend story for kids in Telugu||తెలుగు లో… ||”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!