Neethi Kathalu In Telugu Language : These stories explain how moral values make our life more beautiful.
Contents
సమయస్ఫూర్తి
గోవింద్ ఒక బంగారం వ్యాపారి, అతను చాలా కాలంగా అదే వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు ,ఒక సంవత్సరం గోవిందుకు వ్యాపారం బాగా నష్టం వచ్చి అతను వేరొక బంగారు వ్యాపారి అమర్ వద్ద వెంటనే తిరిగి ఇచ్చివేస్తానని కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు కానీ తన వ్యాపారంలో మళ్ళీ మళ్ళీ నష్టం రావడం వలన గోవింద్ అప్పు తీర్చలేక పోయాడు .
ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న అమర్ ,గోవింద్ యొక్క ఒక్కగాన్నొక్క కూతురు అపరంజిని తన మూడవ భార్యగా చేసుకుందామని నిర్ణయించుకొని ,ఒకరోజు గోవింద్ ని తన కూతురితో సహా తన ఇంటికి విందుకి ఆహ్వానించాడు . విందు ముగిసిన తర్వాత గోవిందుతో నేను నీకూతుర్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను దానికి బదులుగా నీ బాకీ మొత్తం మాఫీ చేస్తాను అంటాడు .
అమర్ యొక్క ఆలోచనకి అవాక్కయిన గోవింద్, బాబు నువ్వు నా కూతురికన్నా వయస్సులో పెద్దవాడివి పై గా వివాహమైనవాడివి అటువంటి నీకు నా కూతుర్నిచ్చి వివాహం ఎలాచేయను అంటాడు . గోవింద్ మాటలు విన్న అమర్ ఐతే నేను మీ కూతురికి ఒక చిన్న పరీక్ష పెడతాను తాను ఆ పరీక్షలో గెలిస్తే నేను మీ బాకీ మొత్తం రద్దు చేస్తాను ,ఒక వేళ అపరంజి ఈ పరీక్షలో ఓడిపోతే తాను నన్ను వివాహం చేసుకోవాలి పై గా మీ బాకీ కూడా రద్దు అవ్వదు అని కఠినంగా అంటాడు . గోవింద్ భయపడతాడు కానీ అపరంజి మాత్రం ధైర్యంగా పరీక్ష ఏంటో చెప్పండి అంటుంది ,అప్పుడు అమర్ ప్రస్తుతం తాము నిలబడి వున్న ప్రదేశం లో వున్ననలుపు తెలుపు గులక రాళ్ళలో ,ఒక చేతిలో నల్లది వేరొక చేతి లో తెల్లది పట్టుకుంటానని ,అపరంజి తెల్ల దానిని ఎంచుకుంటే వారు గెలిచినట్లని అదే నల్ల దానిని ఎంచుకుంటే వారు ఓడిపోయినట్టు అని చెపుతాడు ,అప్పుడు అపరంజి తానూ పోటీకి సిద్ధం అంటుంది .
వెంటనే అమర్ ఎవరు గమనించడం లేదు అనుకొని రెండు చేతులలో నల్ల రాళ్ళు తీసుకుంటాడు కానీ అపరంజి అమర్ చేసింది కనిపెడుతుంది ఎలా అయినా తాను గెలవాలని ,అమర్ ఒక చేతిలోని ఒక రాయిని తీసుకొని తెలియనట్టుగా క్రిందకు జార విడుస్తుంది ,క్రింద అన్నీ రాళ్ళు వున్నాయి కనుక అపరంజి జారవిడిచింది ఏ రంగురాయో ఎవరు కనిపెట్టలేక పోతారు ,అప్పుడు అపరంజి అమర్ ను తన వేరొక చేతిలో రాయిని చూపించమంటుంది ఇలా అవుతుందని భావించని అమర్ ఖంగుతిని తన చేతిలో వున్న మరో నలుపురాయి ని చూపెడతాడు అప్పుడు అందరు అపరంజి ఎంచుకున్నది తెలుపురాయిగా భావించి అపరంజి గెలిచినట్లు నిర్ణయిస్తారు . ఆ విధంగా అపరంజి తన తెలివితేటలతో అపాయం లో ఉపాయం చేసి తనను మరియు తన తండ్రి అప్పును కూడా రద్దు చేయించింది .
Moral :సమయానుకూలంగా ప్రవర్తించిన వారే సమర్థులుగా నిలుస్తారు
Neethi Kathalu In Telugu Language:
మూర్ఖపు గాడిద
అనగనగా ఒక అడవిలో…. ఒక పులి ఒక దుప్పి ని ఆహారంగా తిని ఆయాసంగా కూర్చొని వుంది ,ప్రక్కనే గడ్డి తింటున్న గాడిద, పులి తో ఈ గడ్డి భలే నీలం రంగులో వుంది కదా అంది . ఆ మాట విని పులి కాదు ఇది పచ్చగా వుంది అంది కానీ గాడిద ఆమాట ఒప్పుకోలేదు గడ్డి నీలం గానే ఉంది అని చాలాసేపు వాదించింది . గాడిద వాదనకు విసుగు వచ్చిన పులి సరే మనం ఈ అడవి కి రాజైన సింహం వద్దకు వెళదాం అంది గాడిద కూడా సరే అంది . రెండూ కలసి సింహం వద్దకు వెళ్లాయి అక్కడ మిగిలిన జంతువులు కూడా వున్నాయి .
అప్పుడు గాడిద సింహం తో మహారాజా గడ్డి నీలం రంగులో ఉంటుందని ఎంత చెప్పినా ఈ పులి వినకుండా నాతో వాదిస్తుంది అంటుంది ,అందుకు సింహం అవును నువ్వు చెప్పిందే నిజం అని చెప్పి .. పులికి నెలరోజులు అడవి అంతా కాపలా కాసే శిక్ష వేస్తుంది . అది విని గాడిద ఆనందంగా గెంతులు వేస్తూ వెళుతుంది .
పులి ఎంతో బాధపడుతూ సింహం వద్దకు వెళ్ళి మహారాజా గడ్డి నిజంగా నే నీలం రంగులో ఉందా అంటుంది ,అప్పుడు సింహం కాదు పచ్చగా ఉంటుంది అంటుంది . అందుకు పులి మరి ఎందుకు మీరు గాడిద చెప్పింది నిజం అన్నారు అంటుంది .
దానికి పులి నేను నీకు శిక్ష వేసింది రంగు గురించి కాదు ,నీ అంత శక్తివంతమైన తెలివైన ఒక జంతువు ఆ మూర్ఖపు గాడిదతో అంతసేపు వాదించి నీ విలువైన సమయాన్ని వృదాచేసుకున్నావ్ అందుకు నేను నీకు శిక్షవేశాను అంటుంది .
Moral :.మూర్ఖులతో వాదన వల్ల నష్టపోయేది మనమే
బంగారు నిధి
రమణ ఒక రైతు కుటుంబానికి చెందిన వాడు అతనికి వ్యవసాయం చేయడం అంటే అంతగా ఇష్టం ఉండేదికాదు ,ఎంత కష్టపడి పనిచేసినా తానూ ధనవంతుణ్ణి కావడం లేదని నమ్మి ,డబ్బు సంపాదించడానికి వేరే మార్గం కోసం అన్వేషిస్తూ ఒక స్వామిజీ కలిసాడు . ఆ స్వామీజీ రమణ దగ్గర దండిగా డబ్బు తీసుకొని ,నేను ఒక పూజ చేస్తాను దానివల్ల నీ పొలంలో ఒక బంగారు నిధి నీకు దొరుకుతుంది … ఈ రోజే నువ్వు వెళ్ళి నీ పొలం తవ్వి ఆబంగారం అంతా తీసుకో అని నమ్మబలుకుతాడు . రమణ తన అమాయకత్వం తో అంతా నమ్మి తిరిగి ఇంటికి వచ్చి నిధి కోసం తన పొలాన్ని తవ్వడం ప్రారంభిస్తాడు ,అలా చాలా కాలం త్రవ్వుతూనే ఉంటాడు కానీ నిధి దొరకదు.
అయినా పట్టువిడవకుండా ఇంకా లోతుగా తవ్వుతూ ఉంటాడు … భర్త పడుతున్న ఇంత శ్రమ వృధా అని తెలిసిన రమణ భార్యా ,రమణను ఎన్నోసార్లు వద్దు అని వారిస్తుంది కానీ రమణ వినడు ఇంకా తన వల్ల కాదని రమణ భార్య తన తండ్రి ని సహాయం అడుగుతుంది . రమణ మామగారు జరిగిందంతా విని నేను రమణను మారుస్తానని కూతురికి మాటిస్తాడు .
మరుసటి రోజు రమణ మామగారు ,రమణతో అల్లుడు గారు నేను మీకు ఒక విషయం చెబుదామని వచ్చాను అరటి ఆకులనుండి వచ్చిన బూడిద పొలం లో చల్లితే పొలం లో బంగారు నిధి దొరుకుతుంది అని నా మిత్రుడు చెప్పాడు వాడికి అలానే దొరికిందంట అంటాడు . ఎలాగైనా బంగారం సంపాదించాలనే దురాశతో వున్నాడు కనుక ఈ మాటలు రమణకు నచ్చుతాయి ,అప్పుడు రమణ అవునా అయితే ఎంత బూడిద కావాలి అంటాడు అప్పుడు మామగారు మన పొలం పెద్దది కదా అందుకే వంద బస్తాల బూడిద కావలసి ఉంటుంది ,అందుకే నేను మీకు అరటిపంట వేయడానికి కొంత ధన సహాయంచేస్తాను అంటాడు .రమణ కూడా సరే అంటాడు …
ఆ విధంగా రమణ కొన్ని సంవ్సత్సరాలు కష్టపడి వంద బస్తాల బూడిద సేకరిస్తాడు ,అప్పుడు ఆనందంగా మామగారి వద్దకు వెళ్లి మామగారు మనం రేపే పొలం లో ఈ బూడిద అంతా జల్లుదాం అంటాడు ,ఆ మాటలు విని మామగారు వద్దు అల్లుడు అమ్మాయి యిప్పటికే మొత్తం బంగారం సేకరించింది ,కావాలంటే చూడండి అంటూ బంగారు కాసుల తో నిండిన కొన్ని సంచులు చూపిస్తాడు , అవి చూసి రమణ ఇంత బంగారం ఎలా వచ్చింది అంటాడు . అప్పుడు మామగారు బూడిద కోసం మీరు వేసిన అరటి పంటలో బూడిద మీరు సేకరిస్తే ,వచ్చిన పంట అమ్మి అమ్మాయి ఈ బంగారం సంపాదించింది అని చెపుతాడు . మీరు ఇంతకాలం కష్టపడి వెతికిన నిధి భూమి లేదు మీకష్టం లో ఈ పంటలో వుంది అని చెప్పి రమణ కళ్ళు తెరిపిస్తాడు మామగారు .
Moral : కష్టపడి సంపాదించిన డబ్బు ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది .
for more Telugu moral stories, click here http://telugulibrary.in/moral-stories-in-telugu-for-kids/
పాఠం
ఒక వ్యాపారి దగ్గర, ఒక గాడిద ఉండేది అది అతనికి అన్ని విధాలుగా సహాయం చేసేది,ఒకరోజు వ్యాపారి వీరి ఊరినుండి వ్యాపారం చేసుకొని వస్తుండగా బాగా చీకటి పడిపోయింది ,గాడిద కూడా రోజంతా బరువులు మోయడం వలన బాగా అలసిపోయి నెమ్మది గా నడుస్తూ ఉంటుంది .
వ్యాపారి గాడిద అలసిపోయిందని గమనించి దాని పై నుండి దిగి తాను ప్రక్కనే నడుస్తున్నాడు ఇంతలో పెద్ద శబ్దం వచ్చింది … వ్యాపారి భయపడి ఏమిటా ఆ శబ్దం అని గమనిస్తే గాడిద నీటి కోసం తవ్విన లోతైన గోతిలో పడిపోయింది . వ్యాపారి దానిని బయటకు తీద్దాం అని ఎంత ప్రయత్నించినా అది పైకి రాలేక పోయింది ,దానితో నిరాశ చెందిన వ్యాపారి ఇంక గాడిదను పైకి తీసుకు రాలేమని భావించి ,ఏంతో బాధ పడి గాడిదను అక్కడే పూడ్చివేద్దాం అనుకొని కన్నీళ్లతో దానిపై మట్టి వెయ్యడం ప్రారం బించాడు .
అతను మట్టి వేస్తున్న కొద్దీ గాడిద దాని పై ఎక్కి కొంచం కొంచం పైకి రావడం ప్రారంభించింది . కొంచం సేపటికి గాడిత పూర్తి గా బయటకు వచ్చింది , యజమానికి చెప్పలేనంత ఆనందం గా అనిపించి గాడిదను గట్టి గా హత్తుకున్నాడు . గాడిద తో నన్ను క్షమించు నా అసమర్ధతతో నిన్ను చంపాలి అనుకున్నాను కానీ నువ్వు నీ సమయస్ఫూర్తి తో నిన్ను నువ్వు కాపాడుకున్నావ్ అన్నాడు.
Moral : ఓటమి లోను అవకాశం వెతుక్కొనేవాడు విజేత అవుతాడు
ఇంకొన్ని నీతికథలు మీ కోసం…
Moral stories for kids in Telugu
Neethi Kathalu In Telugu Language : These stories explain how moral values make our life more beautiful.