Contents
దురాశ
New Moral stories in Telugu for kids ||దురాశ ||: This article explains how greedy destroy the life.
దురాశ లేదా అత్యాశ అంటే, మనకు ఏదన్నా ఎంత అవసరమో అంత కావాలి అనుకుంటే అది ఆశ ,మన అవసరాన్నిమించి ఎక్కువ ఆశిస్తే దానిని దురాశ అంటాం.ఈ రోజు దురాశకు సంభందించిన కొన్ని కథలు చెపుతాను..
కథ-1
ఒక చిలుక అడవిలో తన కోసం గూడు నిర్మించు కోవడానికి మంచి చెట్టు కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు దానికి ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది దాని నిండా పండ్లు ఉంటాయి ,చెట్టుని దాని పండ్లుని చూడగానే చిలుకకు గూడు నిర్మించుకోవడానికి ఇదే మంచి చోటు అనిపిస్తుంది . వెంటనే చక్కని అందమైన గూడు నిర్మించుకుంటుంది,రోజు చెట్టుకున్న పండ్లు తింటూ ఆనందంగా గడుపుతుంది.
కాని రోజూ చెట్టు మీదకు వేరే పక్షులు కూడా వచ్చి పండ్లు తినడం చిలుకకు నచ్చేది కాదు . ఇది నా చెట్టు అన్ని వచ్చి అన్ని పండ్లు తినేస్తుంటే నాకు మిగలవు, నేనే ఏమన్న ఉపాయం చేయాలి అనుకుంది , వెంటనే చెట్టుకున్న ఒక్కొక్క పండు తెంపి తన గూటిలో దాచుకుంటూ వుంటుంది.. గూడు నిండి పోతూ ఉంటుంది.. అయినా చిలుక ఆలోచించకుండా ,పండ్లు వేరే పక్షులకు దక్కకూడదు అనే ఉద్దేశ్యంతో గూడు ఇంకా నింపుతూ ఉంటుంది… కొంత సేపటికి పండ్లు బరువు మోయలేక గూడు తెగి క్రింద పడిపోతుంది . చిలుక ఒక్కసారి గూడుపడిపోవడం చూసి ఖంగుతింటుంది, అయ్యో ఇలా అయిందేమిటి నేను పండ్లు కాపాడుకుందాం అంటే .. నేను శ్రమపడి కట్టుకున్న గూడు పడిపోయింది, నా అత్యాశ వల్ల ఇప్పుడు నాకు నిలువ నీడ కూడా లేకుండా పోయింది అని బాధపడుతూ మళ్ళీ గూడుకట్టుకోడానికి ప్రయత్నం మొదలు పెట్టింది .
కథ-2
New Moral stories in Telugu for kids ||దురాశ ||: Moral story related to greedy nature
ఒక చిన్న పల్లెటూర్లో వెంకన్న అనే ఒక వ్యక్తి ఉంటాడు ,తను రోజూ ఊరి ప్రక్కన వున్నఅడవికి వెళ్లి అక్కడ వున్న పుల్లలు ,పండ్లు ఏరుకొని వాటిని ఊరి సంతలో అమ్మి వచ్చిన డబ్బులతో జీవిస్తూవుండేవాడు . ఒకరోజు అతనిని కలవడానికి అతని చిన్ననాటి స్నేహితుడైన రమణ వస్తాడు , తనకు ఎటువంటి సంపాదన లేదని ,తనకు ఏమన్న సాయం చేయమని వెంకన్నని అడుగుతాడు రమణ . అప్పుడు వెంకన్న నాతో పాటు రోజు అడవికి రా అంటాడు.
రోజూ వెంకన్న,రమణ అడవికి వెళ్లి తమకు కావాల్సినన్ని పుల్లలు,పండ్లు తెచ్చుకుంటూ వుంటారు . ఒక రోజు వారికి అడవి మార్గ మధ్యంలో సొమ్మసిల్లి పడిపోయిన ఒక సాధువు కనబడుతాడు. వారు సాధువు కి సపర్య చేస్తారు ,సాధువు కోలుకుంటాడు .. అప్పుడు సాధువు వారితో మీరు నాకు చాలా సహాయం చేశారు అందుకు బదులుగా నేను మీకు రెండు సంచులు ఇస్తాను , ఈ సంచి లో ఏ వస్తువు వేసిన రెట్టింఫు అవుతుంది అంటాడు. అప్పుడు వెంకన్న సాధువు తో నేను మీకు రుణపడి వుంటాను అంటాడు కానీ రమణ లేదు నాకు ఇంకో వరం కావాలి అంటాడు , అప్పుడు సాధువు నవ్వుతూ ఎటువంటి వరం కావాలి అంటాడు . అందుకు రమణ ఈ సంచి లో ఏమివేసిన బంగారంగా మారాలి అంటాడు , అప్పుడు సాధువు వరం అడిగేముందు ఇంకోసారి ఆలోచించుకో అంటాడు . కానీ రమణ అదే వరం కావాలని పట్టు పడతాడు , అప్పుడు సాధువు సరే నీవు కోరుకున్నట్టే నీకు యిచ్చిన సంచిలో ఏమి వేసిన బంగారంగా మారుతుంది అంటాడు .
రమణ తన తెలివికి తానే మురిసిపోతాడు ,వెంకన్న ఎంత తెలివితక్కువ వాడో అని తన మనసులో అనుకొని నవ్వుకుంటాడు. వెంటనే తన సంచిలో ఒక్కక్క పుల్ల వేస్తుంటాడు,వేసిన ప్రతి పుల్ల బంగారంగా మారడం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. అలా సంచి నిండాక కూడా ఇంకా బంగారం కావాలి అనిపించి ఇంకా పుల్లలు నింపుతూ ఉంటాడు , సంచి చాలా బరువుగా అయిపోతుంది. బరువైన సంచిని తలమీద పెట్టుకొని మోయలేక కష్టపడి మోస్తూ దారిలో నెమ్మదిగా వెళుతూ ఉంటాడు, ఇంతలో చేయిజారి సంచి క్రింద పడిపోతుంది .. సంచిలో వున్న బంగారం అంతా క్రింద పడిపోతుంది, చెట్లు ప్రక్కన నక్కి ఇదంతా గమనిస్తున్న దొంగలు రమణను కొట్టి సంచిని బంగారాన్ని తీసుకుంటారు. రమణ వారివద్దనుండి సంచిని తీసుకోవాలని వారితో పోరాడుతాడు .ఈ పెనుగులాటలో సంచి రెండుగా చిరిగిపోతుంది , సంచి చిరిగి పోయింది అనే కోపంతో దొంగలు రమణను బాగా చితక కొట్టి బంగారం అంతా తీసుకు పోతారు. రమణ చావుదెబ్బలు తిని తన దురాశకు తగిన ఫలితం తనకు జరిగిందని అనుకుంటాడు.
కథ-3
సీత ఏడు సంవత్సరాల పాప ,తాను ఎవరిదగ్గర ఏ వస్తువు చూసినా అది తనకు కొనిచ్చేవరకు తన తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉండేది. తన ప్రవర్తన చూసి సీత తల్లిదండ్రులు విసిగి పోయారు తనకి ఎలాగైనా తన తప్పు తెలిసే విధంగా చేయాలని, సీత వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ ని వారు అభ్యర్థించారు.అప్పుడు ప్రిన్సిపల్, సీతను మంచిగా మార్చే బాధ్యత నాది అంటారు.
తరువాత రోజు ప్రిన్సిపల్ సీతని తన క్లాస్ లో ఫస్ట్ వచ్చే పద్మని ఆఫీస్ రూంకి పిలిచి, సీత ముందే పద్మకి క్లాస్ లో ఫస్ట్ వచ్చినందుకు మాట్లాడే బొమ్మని బహుమతిగా ఇస్తారు . అది చూసి సీతకు చాలా ఈర్షగా అనిపిస్తుంది ,ఎలాగైనా అలాంటి బొమ్మను తాను కూడా కొనుక్కోవాలని ఇంటికి వచ్చి గొడవపెడుతుంది. సీత వాళ్ళ తల్లిదండ్రులు జరిగిన విషయం తెలుసుకొని , అలాంటి బొమ్మ ఎక్కడ దొరుకుతుందో అడుగుదామని సీతతో పాటు ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్తారు . తాను అనుకున్న విధంగా జరిగిందని అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ ,ఏమీ తెలియనట్టు సీత తల్లిదండ్రులను అడిగి విషయం తెలుసుకుంటాడు. అప్పుడు అయ్యో ఆ బొమ్మ స్కూల్ ప్రధాన కార్యాలయం నుండి వచ్చింది , క్లాస్ లో ఎవరు మొదటి స్థానం లో వస్తారో వారికి మాత్రమే ఇస్తారు అంట అంటాడు . ఆ మాటవిని సీతకు బాధ ఇంకా ఎక్కువైపోతుంది,పౌరుషం కూడా వస్తుంది.. వాళ్ళ నాన్న గారితో నేనూ క్లాస్ ఫస్ట్ వస్తాను అప్పుడు ఆ బొమ్మ బహుమతిగా తీసుకుంటాను అంటుంది. ప్రిన్సిపల్ మనసులో నెమ్మదిగా నవ్వుకుంటారు .
సీత క్లాస్ ఫస్ట్ రావడానికి చాలా కష్టపడి చదువుతూ ఉంటుంది,లేని ఆసక్తి తెచ్చుకొని మరీ చదువుతుంది. అయినా క్లాస్ ఫస్ట్ రాదు ,మళ్ళీ ఏడుపు మొదలుపెడుతుంది… మళ్ళీ ప్రిన్సిపల్ అదే విషయం చెపుతారు ,ఈ సారి ఏ కాగ్రతతో చదివి ప్రయత్నించు అంటారు . ఈ సారి సీత బొమ్మకోసం కాకుండా పాఠం అర్థం చేసుకొని చదువుతుంది ,క్లాస్ ఫస్ట్ వస్తుంది . ప్రిన్సిపల్ బహుమతిగా బొమ్మ ఇచ్చేముందు ,నువ్వు ఎంత కష్టపడితే ఈ బొమ్మ నీ చేతిలోకి వచ్చిందో తెలుసా అంటారు . అందుకు సీత బాగా తెలుసు అంటుంది ,అప్పుడు ప్రిన్సిపల్ నీ అత్యాశ వలన నువ్వు అడిగే నీ కోరికలు తీర్చడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి వుంటారో ఆలోచించు అంటారు. అప్పుడు సీత ఇప్పటివరకు తానూ చేసిన పిచ్చి పనులు గుర్తుతెచ్చుకొని ,తానూ తన తల్లిదండ్రులను ఎంత కష్టపెట్టానో అని తెలుసుకొని ,వారిని క్షమించమని అడిగి ఇంకెప్పుడు అలా మొండిగా ప్రవర్థించను అని మాటిస్తుంది. సీత తల్లిదండ్రులు సీతలో వచ్చిన మార్పు చూసి ప్రిన్సిపల్ కి కృతజ్ఞతలు చెబుతారు .
Sireesha.Gummadi
పైన కథల వలన మనకు ఏం తెలిసింది అంటే కష్టపడేవాడికే విలువవుంటుంది ,అత్యాశ మన వ్యక్తివాన్ని దిగజారుస్తుంది.
New Moral stories in Telugu for kids ||దురాశ ||: Moral story related to greedy nature
Moral :దురాశ దుఃఖానికి చేటు