telugu bed time stories
Spread the love

Contents

Bedtime Stories In Telugu

Bedtime Stories In Telugu

Every child’s dream is that he can listen to stories before going to sleep. Bedtime stories are the best moments for every child’s life.
these stories teach us many useful things…

  • How to deal with the situation in our life
  • How to mingle with others
  • Under-estimating others is a foolish thing
  • Self-less people get miracles from god.

సహకారం

Bedtime Stories In Telugu for kids: This article explains cute and short stories.

telugu bed time stories

అనగనగ అడవిలో ఒక మామిడిచెట్టు ,ఒక నేరేడుచెట్టు ప్రక్క ప్రక్కన ఉండేవి . మామిడి చెట్టు పై అన్ని రకాల పక్షులు, చిన్న చిన్న జంతువులు నివసించేవి అదేవిధంగా చెట్టు దారిన వెళ్ళే వారందరికీ అలసట తీర్చు కోవడానికి నీడనిచ్చేది .

కానీ నేరేడుచెట్టు ఒక్క పక్షిని కూడా తన మీద వాలనిచ్చేది కాదు , ఎవరైనా నీడ కోసం వస్తే వారి పై ఎండిపోయిన కొమ్మలు ఆకులు విసిరేది. ఏ  పక్షి అయినా తన మీద గూడు కడితే తాను చూడడానికి అందంగా ఉండదని, అది అనుకోనేది .పదే పదే తాను ఎంత  అందంగా వుంటుందో అందరితో చెప్పి మురిసిపోయేది.

ఒక రోజు కొన్ని తేనె టీగలు తన మీద గూడు కట్టడానికి వస్తే , నా కొమ్మల్ని ముట్టుకోవడానికి వీలులేదు అని కఠినంగా చెబుతుంది  ,అప్పుడు మామిడి చెట్టు  తన పై గూడుకట్టుకోమని అంటుంది .తేనె టీగలు మామిడి చెట్టుపై తమ గూడు నిర్మించుకుంటాయి .

కొన్నిరోజుల తరువాత కొంతమంది కట్టెలు కొట్టే వాళ్ళు అక్కడి కి వస్తారు ,మామిడి చెట్టుని చూసి దాని కాండం  వారికి బాగా ఉపయోగ పడుతుందని, దానిని గొడ్డలితో నరుకుదాం అనుకుంటారు.

కానీ అంతలోనే దానికున్న తేనే పట్టుని చూసి అమ్మో మనం ఈ చెట్టుని కొడితే దీనికున్న ఈ తేనెటీగలు మనపై దాడిచేస్తాయి  అని భయపడి వెనకడుగు వేస్తారు.ఇప్పుడు వారిచూపు ప్రక్కనున్న నేరేడు చెట్టుపై పడుతుంది ,ఈ చెట్టు ఎంత పెద్దగా ,విశాలంగా ఎటువంటి పక్షి గూళ్ళు లేకుండా వుందో మనం నరకడాని కి ఇదే సరైనది అనుకొని నరకడం మొదలు పెడతారు… అకస్మాత్తు గా ఈ పరిణామానికి విస్తుపోయిన నేరేడు చెట్టు ఎవరైనా కాపాడండి అని అరుస్తుంది ,ఎవరు దానికి సహాయానికి రారు.

అప్పుడు నేరేడుచెట్టు “ఒంటరిగా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను కానీ నలుగురికిసాయం చేస్తే వారు  మనకు కష్టకాలం లో తోడుగా ఉంటారని తెలుసుకోలేక పోయాను” ,అందరు నన్ను క్షమించండి అని బతిమిలాడుతుంది. అప్పుడు మామిడి చెట్టు ,తేనే టీగల తో నేరేడు  చెట్టుకు సహాయం చేయమని చెపుతుంది …వెంటనే  తేనెటీగలు కట్టెలు కొట్టేవారిపై దాడిచేయడంతో, వారు భయంతో అక్కడ్నుంచి పారిపోతారు .

అప్పుడు నేరేడుచెట్టు అన్ని పక్షులకు ,తేనెటీగలు మామిడి చెట్టుకు క్షమాపణ చెపుతుంది ,ఇకమీద తాను కూడా అందరితో మంచిగా ఉంటానని మాటిస్తుంది .

Moral :ఒంటరితనం లో ప్రశాంతత ఉంటుంది గాని మంచి సహవాసం లో ఆనందం ఉంటుంది .

 

పిల్లి-ఎలుక

telugu bed time stories

ఒక వూరిలో రెండు పిల్లులు ఉండేవి ఒకటి నల్లది ఒకటి తెల్లది వాటికి ఆహారం రోజూ వెతుక్కోవడం చాలా కష్టంగా అనిపించింది. ఒకరోజు నల్లపిల్లి తెల్లపిల్లితో ఎన్నిరోజులు ఇలా కష్టపడతాం. ఒకేసారి మనకు కావలసిన ఆహారమంతా సంపాదించుకొని ,  అది అయిపోయే వరకు ప్రశాంతం గా  కూర్చొని తిందాం అంటుంది .

ఈ ఆలోచన తెల్లపిల్లికి కూడా బాగా నచ్చుతుంది , మరి ఇప్పుడు ఏంచేద్దాం అంటుంది నల్లపిల్లి తో .

అప్పుడు నల్లపిల్లి నా దగ్గర ఒక ఆలోచన వుంది దాని ప్రకారం నేను ఆహారం తెస్తాను నువ్వు సిద్ధంగావుండు అని తెల్లపిల్ల తో చెప్పి అక్కడనుండి  వెళ్తుంది …  నల్లపిల్లి ఊరిచివర వున్న పొలాల్లోకి వెళ్తుంది అక్కడైతే ఎలుకల నివాసాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి , ఎలుకలకు కనిపించేవిధంగా ఒక చోట కూర్చొని ఉంటుంది .

ఎలుకలు పిల్లిని చూసి వాటి కలుగు లోనే దాక్కుంటాయి ,అయినా  పిల్లిని గమనిస్తూనే ఉంటాయి. పిల్లి రెండు రోజులుగా అక్కడే కూర్చొని ఉంటుంది ప్రక్కనే వున్న దుంపలు ,గింజలు తింటూవుంటుంది..  పిల్లి తినే ఆహారం చూసి ఆశ్చర్యపోయిన ఎలుకలు దీనివలన తమకు ఎటువంటి ప్రమాదం లేదు అని నిర్ణయించుకొని నెమ్మదిగా పిల్లి దగ్గరకు వస్తాయి . నువ్వు ఎందుకు ఇక్కడ వున్నావ్ అని అడుగుతాయి ,

Bedtime Stories In Telugu

అప్పుడు పిల్లి ..

ఏమి లేదు నాకూ  ఊరిలో ఉంటున్న పిల్లులకు  అస్సలు పడడం లేదు, నేను పూర్తిగా శాఖాహారం తింటాను. ఆ విషయం అక్కడున్న పిల్లుల్లకు నచ్చడం లేదు అందుకే ప్రశాంతం గ ఉంటుందని ఊరిచివరకు వచ్చాను అని ఎలుకలు నమ్మేవిధంగా  ఒక కథ చెపుతుంది. అనుకున్న విధంగానే ఎలుకలు నమ్ముతాయి పిల్లితో సహవాసం చేస్తాయి  .

రోజూ  పిల్లి ఎలుకలతో ఒక అందమైన ప్రదేశం ఉందని అక్కడ ఎలుకలకు నచ్చిన రుచికరమైన గింజలు చాలా దొరుకుతాయి అని చెబుతూ ఉండేది . ఒకరోజు పిల్లి నేను ఆ గింజలు దొరికే ఆ ప్రదేశానికి వెళుతున్నా నాతో ఎవరైనా వస్తారా అని అడిగింది .. అప్పుడు ఎలుకలు మేము వస్తాం మేము వస్తాం అన్నాయి . అప్పుడు పిల్లి ఎక్కువ మంది అయితే , మిమల్ని మనుషులు చూస్తే ప్రమాదం నేను ఇప్పుడు కొంత మందిని తీసుకువెళతాను మళ్ళీ  వచ్చి ఇంకొంతమందిని తీసుకువెళతాను అంటుంది.

అప్పుడు ఎలుకలలో పెద్దయిన ఒక ఎలుక ఒక ఉపాయం నేను చెపుతాను అప్పుడు నువ్వు ఎక్కువమందిని ఎవరికీ కనబడకుండా తీసుకువెళ్లవచ్చు అంటుంది , అప్పుడు పిల్లి తానూ ఏవిధంగా అనుకున్నానో అదేవిధంగా  జరుగుతున్నందుకు ,ఎలుకలు తనను గుడ్డిగా నమ్మినందుకు తనలో తానే నవ్వుకుంది .

అప్పుడు ఎలుకలు ఒక డబ్బా తీసుకు వచ్చి పిల్లి నడుముకు కడుతూ , నీతో వచ్చే ఎలుకలు అన్ని దీనిలో వున్నాయి.. డబ్బా కొంచం బరువుగానే ఉంటుంది జాగ్రత్తగా తీసుకు వెళ్ళు అని అంటాయి .

పిల్లి డబ్బా ఇంత బరువుగా వున్నది  అంటే ఎన్ని ఎలుకలు ఉన్నాయో అని తెగ సంబరపడుతుంది . మిగిలిన ఎలుకలకు మళ్ళీ  వస్తాను అని చెప్పి బయలుదేరుతుంది. ఆనందం గా నడవడం మొదలు పెడుతుంది గాని డబ్బా బరువుకు నడుం నొప్పివచ్చి ఆనందం అంతా  ఆవిరై పోతుంది.

అలా భారంగా చాలాదూరం నడిచాక తెల్ల పిల్లి దగ్గరకు వస్తుంది , చూసావా ఎంత ఆహారం తెచ్చానో .. ఇక కొన్ని రోజులు మనం శ్రమ పడకుండా ఆహారం తినొచ్చు అంటుంది గర్వంగా .

అప్పుడు తెల్లపిల్లి  అవునా నన్ను చూడనీయ అని ఆరాటంగా డబ్బా తెరుస్తుంది దాని నిండా రాళ్లు ,చెత్తా నింపి ఉంటుంది .. అది చూసి నల్లి పిల్లి ఖంగుతింటుంది .

అప్పుడు తెల్ల పిల్లి నవ్వుతూ ,ఎప్పుడూ మనమే తెలివైన వాళ్ళం అనుకోకూడదు .. ప్రక్కవాళ్ళను తక్కువగా అంచనా వేయ కూడదు . నువ్వు ఎలుకలను నమ్మించావ్ అనుకున్నావ్ , ఎలుకలు కూడా నమ్మినట్లు నటించి నీకు బాగా బుద్ధి చెప్పాయి అని నవ్వుకుంటూ వెళ్లిపోంది .

జరిగిన విషయం అర్థం అయ్యి నల్లపిల్లి ,తన తెలివితక్కువ తనానికి తానే సిగ్గు పడింది .

Moral : ఎవ్వరిని తక్కువ అంచనా వేయకూడదు .

Sireesha.Gummadi

 

అదృష్టం

telugu bed time stories

అనగనగా ఒక ఊరిలో సాగర్, వాళ్ళ అమ్మ ఉండేవారు ,వారిది చాలా పేద  కుటుంభం . రోజూ సాగర్ వాళ్ళ అమ్మ సంతలో కూరగాయలు  అమ్మగా,  వచ్చిన డబ్బులతో వారు జీవించేవారు .

ఒకరోజు సాగర్ వాళ్ళ అమ్మ సంతకు వెళుతూ నీకు ఏమన్నా కావాలా సాగర్ అని అడిగింది , సాగర్ కు ఎన్నాళ్ళనుండో డప్పు నేర్చుకోవాలని ఆశగా ఉండేది..

అమ్మా  వచ్చే అప్పుడు నాకు డప్పు తెస్తావా అని అడిగాడు , సాగర్ అడిగిన కోరిక పెద్దది కానప్పటికీ తాను ఆమాత్రం కూడా కొనివ్వలేని స్థితిలో వుండేసరికి అమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి , అది చూసి సాగర్ నాకు ఇప్పుడు వద్దులే అమ్మా వూరికే అడిగాను అంటాడు .

సాగర్ మాటలు విని తన అసహాయతను తలచుకుంటూ ఏడుస్తూ వెళ్తూ ఉంటుంది అమ్మ .. మార్గమధ్యం లో ఒక సాధువు ఈమె ఏడవడం చూసి , అమ్మా  ఏమైంది అంటాడు . అప్పుడు అమ్మ జరిగిన విషయం  చెపుతుంది , అప్పుడు సాధువు చింతించకు నేను నీకు ఒక కర్రను ఇస్తాను ఇది నీ కొడుకు అడిగింది కాకపోవచ్చు కానీ అతనికి అవసరానికి ఉపయోగపడుతుంది అని ఒక  కర్రను ఇస్తాడు . అమ్మ ఆ కర్రను తీసుకు వెళ్ళి సాగర్ కు  యిచ్చి సాధువు అన్న మాటలు చెపుతుంది ,సాగర్ కు సాధువు మాటలు ఏ మాత్రం అర్థం కావు కానీ ఆ కర్ర తీసుకొని ఆడుతూ బయటకు వెళ్తాడు.

Bedtime Stories In Telugu

అప్పుడు..

అక్కడ  ఒక మహిళ పొగలో కళ్ళు తుడుచు కుంటూ ఉంటుంది ,ఆమె ఏడుస్తుంది అనుకొని సాగర్ ఆమె వద్దకు వెళ్ళి ఏమైంది అంటాడు.. అప్పుడు ఆమె నేను వడలు చేసి రోజూ అమ్ముతాను కానీ ఈరోజు నా కట్టెలు అన్ని మంచుకు తడిచిపోయి ఎంత వెలిగించిన వెలగడం లేదు , మంటకు బదులు పొగవస్తుంది అని అంటుంది . అప్పుడు సాగర్ నాదగ్గర ఈ కట్టె వుంది ఇది మీకు ఏమన్నా  ఉపయోగ పడుతుందా అంటాడు ,ఆమె ఆ కట్టె  తీసుకొని మంట వెలుగించు కుంటుంది .

దానికి బదులుగా సాగర్ కి నాలుగు వడలు ఇస్తుంది , సాగర్ వడలు తీసుకొని వెళుతూ ఉంటాడు .. మార్గమధ్యం లో ఒక పాప గట్టిగా ఏడుస్తూవుంటుంది , ఏమైంది అని పాప తల్లిదండ్రులను అడుగుతాడు .. అప్పుడు వారు మేము కుండలు అమ్ముదామని ఇక్కడకు వచ్చాము , పాపకేమో ఆకలి వేస్తుంది.. ఇక్కడ ఎటువంటి  తినే పదార్థాలు లేవు అంటారు భాదగా .

అప్పుడు సాగర్ తన వద్దనున్న వడలు పాపకు ఇస్తాడు ,అది చూసి సంతోషించి వారు సాగర్ కు ఒక కుండ ఇస్తారు . సాగర్ కుండ తీసుకొని వెళుతూ ఉంటే ఒక బట్టలు ఉతికే వ్యక్తి తన భార్యను తిడుతూ ఉంటాడు , సాగర్ ఏమైంది అంటాడు . అప్పుడు అతను మేము  బట్టలు ఉడకబెట్టే కుండ నా భార్య పగలగొట్టింది ,ఇప్పుడు బట్టలు ఎలా ఉతకాలి  అని అంటాడు .

తన వద్దనున్న కుండ వారికి ఇస్తాడు దానికి బదులుగా వారు ఒక మంచి చొక్కాను సాగర్ కు  ఇస్తారు , సాగర్ అలావెళ్తుండగా ఒక  వ్యక్తి బట్టలు లేకుండా దీనంగా రోడ్డు ప్రక్కన కూర్చొని వుంటాడు . సాగర్ కు ఆయనను చూసి జాలి వేసి  తన వద్దనున్న చొక్కా ఇస్తాడు ,అప్పుడు అతను అగ్ని ప్రమాదం లో తానూ అన్ని కోల్పోయాయనని  చెప్పి  ,చొక్కాకి బదులుగా సాగర్ కి గుర్రానిస్తాడు .

Bedtime Stories In Telugu

సాగర్ గుర్రం పై వెళ్తుంటే..

అక్కడ పెళ్లి వారు అందరు ఆందోళనగా ఉండడం చూస్తాడు ,ఏమైంది అంటే వారు తమ కుటుంబం లో జరిగే పెళ్లి లో పెళ్లి కొడుకు  గుర్రం ఎక్కకపోతే వారికి అశుభం అని చెపుతాడు . అప్పుడు సాగర్ వారికి తన వద్దనున్న గుర్రం ఇచ్చేస్తాడు అప్పుడు వారు  సాగర్ మంచితనం గుర్తించి నీకు ఏమి కావాలో అడుగు అంటారు అప్పుడు సాగర్ పెళ్లి మేళం వారి దగ్గర వుండే డప్పు చూపించి అది కావాలి అంటాడు ,అప్పుడు వారు సంతోషంగా సాగర్ కు డప్పు ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతారు .

సాగర్ తన చేతి లోఉన్న డప్పు ని చూసుకొని తానే ఆశ్చర్య పోతాడు , వెంటనే పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరకు వెళ్లి జరిగిన విషయం  చెప్పి డప్పుచూపిస్తాడు . అమ్మ సాగర్ ఆనందం చూసి ఎంతో సంతోషిస్తుంది . అప్పుడు సాగర్ కు సాధువు మాటల అర్థం అర్థమవుతుంది .

Moral :నిస్వార్థంగా జీవిచేవారి కి పరిస్థితులు అదృష్టంగా సహకరిస్తాయి .

Bedtime Stories In Telugu for kids: This article explains cute and short stories.

 

For more Telugu stories please visit: chinna neeti katha-short-story-in-Telugu

5 thoughts on “Bedtime Stories In Telugu”
  1. Good blog! I really love how it is simple on my eyes and the data are well written. I am wondering how I could be notified when a new post has been made. I’ve subscribed to your RSS which must do the trick! Have a nice day!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!