Oka Chinna Family Story
Spread the love

Oka Chinna Family Story..

Contents

నిస్వార్థం

ఛీ !! ఈ అమ్మ ఎప్పుడూ అంతే నా మూడ్ అంతా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. అనుకుంటూ విసురుగా వచ్చి మేడ పై వున్న బాల్కనీ లో కూర్చుంది మేఘ . నిజం చెప్పాలంటే ఒకింత ఏడుపుకూడా వస్తుంది కానీ.. గంట సేపు కష్టపడి ఇంస్టాగ్రమ్ రీల్ కోసం వేసుకున్న మేకప్ పోతుందేమో అని ఆపుకుంటుంది .

జరిగినవన్నీ తలచుకుంటుంటే కోపం భాధ అన్నీ తన్నుకొస్తున్నాయి. అసలు ఈ అమ్మ బాదేంటి చిన్నప్పటినుండి టీవీ చూస్తానంటే కళ్ళు పాడవుతాయి అంటాది ఫ్రెండ్స్ ఇంటికి వెళతానంటే వాళ్లనే మనఇంటికి తీసుకురా అంటాది సెకండ్ షో మూవీకి ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేనూ వెళ్తాను అంటే సేఫ్ కాదు వెళ్లొద్దు అంటాది అన్నీ… అడ్డులే . సరే నాన్న పర్మిషన్ తీసుకుందాం అంటే నాన్నకూ పెద్ద క్లాస్ తీసుకుంటుంది . అస్సలు నా బాధ ఎవ్వరికి చెప్పాలో అర్థం కాదు మా ఫ్రెండ్స్ అమ్మలందరూ బాగానే వుంటారు నాకే దేవుడు ఈవిడని బంపర్ ఆఫర్లో ఇచ్చాడు అని అనుకుంటూ చిరాకుగా ప్రక్కకు చూసింది.

ప్రక్కన వనజ ఆంటీ వాళ్ళ ఇంటిలో వున్న చెట్టు కొమ్మలు కొన్ని మా బాల్కనీ లోకి వచ్చివున్నాయి వారిపై ఒక పక్షి చాలా రోజులు గూడుకట్టుకుంది యిప్పుడు దానికి పిల్లలు పుట్టినట్టున్నాయి ఒకటే గొడవ కిచ కిచమంటూ .ఇంతలో వాటి తల్లి వచ్చి వాటికి ఆహారం పెడుతుంది మూడింటికి సమానంగా తినిపిస్తుంది వాటిలో ఒకటి తినలేక క్రింద పడేస్తుంటే దానికి మళ్ళీ పెడుతుంది అది మళ్ళీ పడేస్తుంటే తల్లి పక్షి మళ్ళీ పెడుతుంది . కొంత సేపటికి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఆహారం తెచ్చింది దాని పిల్లలకు తినిపించింది ఇలా ఎన్నోసార్లు తెచ్చింది తినిపించింది ఇప్పటికి అరగంట అయింది కాని పక్షి పిల్లలు ఇంకా తింటూనే వున్నాయి …
అమ్మో!! ఇంత చిన్న పిల్లలు ఇంత ఆహారం తింటాయా అయినా వాటి తల్లికి ఎంత ఓపిక ఎంతసేపునుండి పెడుతుందో అనుకుంది.

Oka Chinna Family Story…

ఇంతలో …

మేఘా.. పైన ఏంచేస్తున్నావ్ తినవా అని గట్టిగా అమ్మ అరుపు ,ఆ అరుపుతోనే మళ్ళీ రియాలిటీ లో కి వచ్చాను

అవును అమ్మ కూడా అంతే రోజంతా తినిపిస్తూనే ఉంటుంది ఈ పక్షిలా ,అది నాకు ఇష్టం కాకపోయినా కూడా తిట్టి మరీ పెడుతుంది.
అసలు రోజంతా నన్ను తిట్టడం వల్ల అమ్మకేమి వస్తుంది ? పైగా నాకు మానసికంగా దూరం కూడా అవుతుంది కదా … ఆవిషయం అమ్మకుకూడా తెలుసుకదా అయినా ఎందుకు అలా చెబుతూ ఉంటుంది.
మన మాటలు ఎదుటివారికి నచ్చవు అని తెలుస్తే మనం అవి చెప్పం పైగా వారు దూరమైపోతారేమోఅని వారికి నచ్చినవే చేస్తాం .

మరి అమ్మకు నేను దూరమైపోతానని భయంలేదా ??

అసలు నిజం చెప్పాలి అంటే అమ్మ చెప్పే విషయాలన్నీ నా మంచికే అని నా మనసుకు తెలుసు కానీ నా బ్రెయిన్ దాన్ని అంగీకరించలేక పోతుంది కారణం ఎంజాయిమెంట్ ఎక్కడ మిస్సైపోతానేమో అని కానీ దాని వెనకాలవున్న నెగిటివిటీని అమ్మ మాత్రమే చూడగలుగుతుంది అందుకే నాకు అడ్డుచెబుతుంది దానినుండి నన్ను కాపాడాలనే ఆలోచనేతప్ప నాదృష్టిలో చెడ్డదాన్ని అయి పొతానన్న బాధ గాని ఆలోచనగాని అమ్మకులేదు.నేను ఎంత నిస్వార్థం అమ్మకు!!

రేపు పేరెంట్ అయ్యాక నేనుకూడా ఇలానే బిహేవ్ చేస్తానేమో అనుకుంటుంటేనే నవ్వువచ్చింది. సరే ఇప్పటినుండి అయినా అమ్మ మీద కోపం పెట్టుకోకుండా సాధ్యమైనంతవరకు మంచి పనులే చేద్దాం అనుకుంటూ క్రిందకు దిగింది మేఘ.

 

 

Gummadi.sireesha

 

చందమామ కథలు

Kids Moral Stories in Telugu

Real friend short-story for kids in Telugu

Kids-stories-in-Telugu

 

error: Content is protected !!