Short story on self realization
Spread the love

Contents

కనువిప్పు

 

Moral story:

This Short story on self realization in Telugu explains you about self realization

అజయ్ కి ఉదయం లేచిన దగ్గర నుండి చాలా ఆనందం గా వుంది.. రోజూలా కాదు ఈ రోజు స్కూల్ కి చాలా తొందరగా తయారు అయ్యాడు, కారణం నిన్న అజయ్ వాళ్ల నాన్నగారు అజయ్ కి ఐరన్ మాన్ కొత్త బొమ్మ కొన్నారు అప్పటి నుండి అజయ్ ఆనందాని కి అవధులు లేవు . ఆ బొమ్మ ఏమీ సులువుగా రాలేదు,ఆరు నెలల నుండి అజయ్ వాళ్ళ నాన్నని చాలా అడిగితె చివరకు నీకు మంచి మార్కులు వస్తే బొమ్మ కొంటాను అన్నారు. అజయ్ ఈ ఆరు నెలలు కష్టపడి చదివాడు మంచి మార్కులు తెచ్చుకొని బొమ్మ కొనిపించు కున్నాడు,విజయం సాధించి పొందిన బొమ్మ కదా అందుకే అంత ఆనందం.

అజయ్ ఐరన్ మాన్ బొమ్మని తన స్కూల్ బాగ్ లో పెట్టుకొని స్కూల్ కి వెళ్ళాడు తన స్నేహితుల కి చూపించడానికి…స్కూల్ కి వెళుతున్నాడే గాని మైండ్ లో ఎన్నో ఆలోచనలు, ఇంకా చాలా బొమ్మలు కొనుక్కోవాలి అవెంజర్స్ టీం తయారు చేయాలి అని అనుకుంటూ స్కూల్ కి చేరుకున్నాడు.స్కూల్ లో ఫ్రెండ్స్ అందరి కి చూపించాడు అందరు చాల బాగుంది అన్నారు ,అజయ్ మనసులో చాలా గర్వంగా అనిపించింది .

అసలు కథ …

సాయంత్రం అయ్యింది స్కూల్ లో పిల్లలు చాలా మంది వారిళ్ళకు వెళ్లి పోయారు. అజయ్ కొంత మంది పిల్లలు మాత్రమే గ్రౌండ్ లో వున్నారు,ఇంకా ఇంటికి వెళదాం అని ,అజయ్ ఒక్కడే స్కూల్ బ్యాగ్ తెచ్చుకుందాం అని క్లాస్ లో కి వెళ్ళాడు.క్లాస్ లో ఎవరు లేరు తాను స్కూల్ బాగ్ తీసుకొని క్లాస్ లోంచి బయటకు వెళ్తుండగా ఒక బెంచ్ క్రింద హల్క్ బొమ్మ కనిపించింది ,ముందు ఆ బొమ్మను చుడగానే చాలా హ్యాపీ గా అనిపించింది అజయ్ కి .. అవును ఇది కిరణ్ బొమ్మ కదా ఇది కిరణ్ కి రేపు ఇచ్చేద్దాం అనుకున్నాడు,తర్వాత దానిని బాగ్ లో పెట్టు కొని ఇంటి కి వెళ్ళాడు .

ఇంటికి వెళ్ళాక ఐరన్ మాన్ ,హల్క్ బొమ్మలు రెండు పక్క పక్క న పెట్టాడు,అబ్బా చూడడాని కి ఎంత బాగున్నాయి కదా ఇది నాదగ్గర ఉంచేసుకొని ఇంకా కొన్ని బొమ్మలు కొంటె నా అవెంజర్స్ టీం పూర్తి అవుతుంది అని అనుకున్నాడు.

మసులో నేను చేసేది తప్పు కదా అనిపించింది .. కానీ నాకు ఇంకా బొమ్మలు కావాలి అంటే మళ్ళి నాన్నను అడగాలి ,నాన్న మళ్ళి మంచి మార్కులు తెచ్చుకో అంటారు. ఇలా ఐతే నాకు బొమ్మ రావడానికి చాలా రోజులు పడుతుంది..ఐనా ఈ బొమ్మ నాకు దొరికింది ఇది నాదే అను కున్నాడు మనసులో.హల్క్ బొమ్మను జాగ్రత్త గా అమ్మ కి కనిపించకుండా తన బొమ్మల మధ్యలో లో దాచాడు.

ఎవరికి అనుమానం రాకుండా తన ఐరన్ మాన్ బొమ్మను మళ్ళి తన బాగ్ లో పెట్టు కొని స్కూల్ కి వెళ్ళాడు. క్లాస్ కి వెళ్లే సరికి కిరణ్ అందరిని అడుగుతూ ప్లీజ్ రా.. నా బొమ్మ ఎవరికైనా కనిపిస్తే ఇచ్చేయండిరా అని బాధగా బ్రతిమిలాడు తున్నాడు. అజయ్ కి కిరణ్ మొహం చుస్తే చాలా జాలి అనిపించింది,బొమ్మ ఇచ్చేద్దాం అనిపించింది కానీ మళ్ళి అమ్మో అది నాది నాకు దొరికింది అనుకున్నాడు మనసు లో ..

Short story on self realization

తర్వాత..

అజయ్ సాయంత్రం ఇంటికి వెళ్ళాక హోమ్ వర్క్ అయిపోయాక ఆడుకుందామ్ అని బ్యాగ్ లోంచి ఐరన్ మాన్ బొమ్మ తీద్దామ్ అనుకున్నాడు ,కానీ బ్యాగ్ లో ఐరన్ మాన్ బొమ్మ లేదు మళ్ళి మళ్ళి వెతికాడు బొమ్మ లేదు అజయ్ కి చెప్పలేనంత దుఖం వచ్చింది,ఒక్క సారి గోడ మీద వున్న దేవుడి ఫోటో చూసాడు ..అప్పుడు ఒక్క సారి అమ్మ అన్నమాట గుర్తుకువచ్చింది,దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు మనం ఎప్పుడు తప్పుచేసిన మనల్ని శిక్షిస్తాడు అన్నాది.. ఆ మాట గుర్తుకు రాగానే అజయ్ కి దుఃఖం తన్నుకు వచ్చింది .

ఆ రాత్రి అంతా ఏడుస్తూనే వున్నాడు,ఉదయం లేచాక నాన్న తో బొమ్మ పోయింది అని చెప్పాలి అంటే భయం వేసింది అందుకే చెప్పకుండా తొందరగా తయారు అయ్యి స్కూల్ కి వెళ్ళాడు ఐరన్ మాన్ బొమ్మ వెతకడాని కి .

 

కంగారుగా…

స్కూల్ అంతా వెతికాడు గాని బొమ్మ ఎక్కడ కనపడ లేదు ,అందరిని అడిగాడు అందరూ తెలీదు అన్నారు ,అంతలోకి క్లాస్ రూమ్ లోకి శ్రీను వచ్చాడు వస్తూనే ‘ఒరేయ్ అజయ్ నిన్న నీ ఐరన్ మాన్ బొమ్మ క్లాస్ లో దొరికిందిరా అప్పటి కే నువ్వు ఇంటికి వెళ్లి పోయావ్ అందుకే నేను తీసుకు వెళ్ళాను రా , ఇదిగో తీసుకో అన్నాడు’.

అజయ్ కి శ్రీను మాటలు వినగానే ,తను కిరణ్ విషయంలో ఎంత చెడ్డపని చేశాడో, ఎంత తప్పుగా ప్రవర్తించాడో గుర్తుకు వచ్చి తన మీద తనకే కోపం వచ్చింది. శ్రీను దగ్గరనుండి బొమ్మ తీసుకొని శ్రీను కి థాంక్స్ చెప్పాడు.

ఆ క్షణం నుండి కిరణ్ బొమ్మని కిరణ్ కి ఎప్పుడు ఇస్తానా అని మనసులో బాధ పడుతూ వున్నాడు. మరుసటి రోజు అందరి కంటే ముందు స్కూల్ కి వెళ్ళి కిరణ్ కూర్చొనే బెంచ్ లో హల్క్ బొమ్మ పెట్టి తన బెంచ్ కి వెళ్లి పోయాడు.కిరణ్ రాగానే తన బెంచ్ పై బొమ్మను చూసి చాలా ఆనందించాడు,ఆ బొమ్మ చేతిలో చిన్న పేపర్ చూసి ఏమిటా అది అని ఓపెన్ చేసాడు కిరణ్ ,దాని లో Sorry అని రాసి ఉండడం చూసి ఒక చిన్న నవ్వు నవ్వాడు కిరణ్ .అది అంతా ప్రక్కనుండి గమనిస్తూ వున్న అజయ్ మనసు అప్పుడు తేలిక పడింది .

Short story on self realization

మార్పు..

ఆ ఘటనతో అజయ్ ఒక విషయం తెలుసుకున్నాడు,ఏదన్న వస్తువు పోగొట్టుకునప్పుడు మన మనసు ఎలా బాధ పడుతుందో యితరుల మనసు కూడా అలాగే బాధ పడుతుంది ,మనకి ఆ వస్తువు ఎంత ముఖ్యమో యితరులకి వారి వస్తువు అంతే ముఖ్యం .. ఎవరిని తక్కువ చూడ కూడదు ఎవరిని బాధ పెట్ట కూడదు అనుకున్నాడు. అన్నిటి కన్నా ముఖ్యం మన తప్పులు అన్ని దేవుడు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు అనుకున్నాడు.

Short story on self realization Audio Story

 

                                                                                                                                                                                                                                  Author :Sireesha.Gummadi

 

 

Story About Selfconfidance (రాధక్క)

error: Content is protected !!