telugu stories to readtelugu moral stories
Spread the love

Contents

Telugu Stories to Read Online

నిజం 

 

truth moral story in telugu

వీరన్న చాలా పేదవాడు కానీ చాలా తెలివైనవాడు . అతను ఎప్పుడూ తన పేదరికానికి బాధపడలేదు ,ఏ రోజు  ఖాళీగా ఉండకుండా ఏ పని దొరికితే అది చేస్తూ తన జీవనం సాగించేవాడు. ఒక రోజు అతను తన తలపై  మట్టితో చేసిన ప్రమిదలు వున్న గంపను పెట్టుకొని సంతలోకి వెళ్ళాడు ,అప్పుడే వ్యాపారం మొదలుపెట్టడంతో గంపలో ప్రమిదలు నిండుగా వున్నాయి … సంతలో జనాలు కూడా ఎక్కువగా వున్నారు ,ఎవరు తనకు తగిలినా గంపలో వున్న ప్రమిదలు క్రింద పడిపోతాయి ,ఆ భయంతో వీరన్న తప్పుకోండి తప్పుకోండి … అని గట్టిగా అరుస్తూ జాగ్రత్తగా తాను వ్యాపారం చేయదలచిన ప్రదేశానికి వెళ్తున్నాడు. అందరూ కూడా వీరన్నకు తగలకుండా జాగ్రత్తగా వెళ్తున్నారు కానీ అప్పుడే సంతలోకి వచ్చిన ఒక పెద్ద వస్త్ర  వ్యాపారికి ,వీరన్న మాటలు వింటే కోపం వచ్చింది ఏమిటి ప్రమిదలు అమ్ముకొనే వాడి మాటలు నేను వినాలా అనుకుంటూ వీరన్నకు ఎదురుగా వెళ్లి వీరన్నను తగిలాడు అంతే పైన వున్న ప్రమిదలు కొన్ని  వ్యాపారి తలపై పడ్డాయి కొన్ని క్రిందపడి ముక్కలు అయిపోయాయి .

ఆ సంఘటనతో వ్యాపారికి పట్టరాని కోపం వచ్చి  వీరన్నను తీసుకొని ఊరి పెద్ద వద్దకు న్యాయం కోసం వెళ్ళాడు . ఊరి పెద్ద ఎన్ని ప్రశ్నలు వేసినా ,వ్యాపారి ఎన్ని నిందలు వేసినా వీరన్న మాత్రం తన గొంతు విప్పలేదు . చాలాసేపటి విసుగు చెందిన ఊరి పెద్ద వ్యాపారితో ఊరుకోవయ్యా … మనం ఇంతమాట్లాడినా అతను ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ,అతను మూగవాడై వుంటాడు. ఇటువంటి మాటలు రానివాడిపై నేను ఎలా తీర్పు చెప్పగలను అంటాడు . అప్పుడు వ్యాపారి ఇతనికి మాటలు ఎందుకు రావు ఇందాక సంతలో  తప్పుకోండి తప్పుకోండి.. అని గట్టిగా అరిచాడు ,నాతో పాటు సంతలో అందరూ విన్నారు అంటాడు .

అప్పుడు ఊరి పెద్ద అంటే అతను తప్పుకోండి అని అన్నా  కూడా నువ్వు అతనికి అడ్డుగా వెళ్ళావ్ అంతేకాకుండా  అతని ప్రమిదలు పగిలి  పోవడానికి కూడా నువ్వేకారణం ,అందుకు నువ్వే అతనికి పరిహారం చెల్లించాలి అని తీర్పు ఇచ్చాడు ఊరి పెద్ద . అనుకోని పరిణామానికి ఖంగుతిన్న వ్యాపారి వీరన్నకి పరిహారం చెల్లించి నెమ్మదిగా అక్కడనుండి జారుకున్నాడు.

Moral :నిజాన్ని  దాచడం ఎవరి తరం కాదు.

Telugu Stories to Read Online: these stories are for school children to read

 

బద్ధకం

 Stories in Telugu to Read 

 

laziness telugu moral story

రామవరం లో శ్రీను అనే కుర్రవాడు ఉండేవాడు ,అతని తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోవడంతో ,శ్రీను తన మేనమామ వద్దనే పెరిగాడు . శ్రీను చాలా బద్ధకం గా ఉండేవాడు ఎవరు ఏ పని చెప్పనా చేసేవాడు కాదు . బడికి వెళ్ళమన్నా  వెళ్ళేవాడు కాదు . శ్రీను మారతాడని ఎన్నో సంవత్సరాలు ఎదురుచూసిన  వాళ్ళ మావయ్యకి ఇంక శ్రీను మారడని అర్థం అయ్యి ,ఇంటిలో నుంచి బయటకు పంపించి వేస్తాడు . శ్రీను వాళ్ళ చుట్టాలు ఎవరూ శ్రీనుని దగ్గరకు చేర్చుకోరు , అందుకు శ్రీను ప్రక్కవూరు వెళ్లి అక్కడ ఒక పెద్దమనిషితో తన కథ అంతా చెపుతాడు ,జరిగిందంతా విన్నాక ఆ పెద్దమనిషికి శ్రీను తన స్నేహితుని కుమారుడు అని అర్థం అవుతుంది .తనకి కూడా పిల్లలు లేకపోవడంతో ,  శ్రీను పై జాలి కలిగి అతను శ్రీనుని ఇంటిలో ఉంచుకుంటాడు  .

ఇక్కడకు వచ్చినా శ్రీను లో ఎటువంటి మార్పురాదు.  చెప్పిన పని ఏది చేయదు ,ఎక్కడకు వెళ్ళమన్న వెళ్ళడు , శ్రీను ప్రవర్తన చూసిన పెద్ద మనిషి శ్రీనుని ఏ విధంగా అయినా మార్చాలని నిశ్చయించు కుంటాడు .

మరుసటి రోజు శ్రీనును పిలచి చేనుకి వెళ్లి గంపనిండుగా కూరగాయలు తీసుకురమ్మని గట్టిగా చెపుతాడు , పెద్దమనిషి కఠినంగా చెప్పడంతో భయపడి శ్రీను చేనుకు వెళ్లి ఎంతో కష్టపడి గంపలో సగం కూరగాయలు తెస్తాడు . పెద్దమనిషి భార్య బోజనానికి రమ్మని పిలిచేసరికి వెళ్లి భోజనం ముందు కూర్చుంటాడు ఆమె పళ్లెంలో సగమే ఆహారం పెట్టి ,బాబు నువ్వు ఇవాళ తీసుకు వచ్చిన కూరగాయలను అమ్మితే వచ్చిన డబ్బుతో  ఇంతే ఆహారం వచ్చింది అంటుంది . శ్రీను చేసేది ఏమీ లేక ఆ సగం ఆహారమే తిని అర్థాకలితో పండుకుంటాడు. మరుసటి రోజు మళ్ళీ శ్రీనుని పొలానికి పంపిస్తారు ,మళ్ళీ శ్రీను బద్దకంగా కూరగాయలు కోసి గంపను సగమే నింపుతాడు . ఇంటికి వెళదాం అనుకుంటుండగా పళ్ళెం  వున్న సగం ఆహారం గుర్తొస్తుంది ,వెంటనే పొలంలోకి వెళ్లి గంప నిండుగా కూరగాయలు కోస్తాడు , ఇంటికి తీసుకు వస్తాడు . ఈ సారి పెద్దమనిషి భార్య పళ్లెం నిండుగా ఆహారం పెడుతుంది పైగా పాయసం కూడా ఇస్తుంది . శుష్టి గా భోంచేసిన  శ్రీనుకు బాగా నిద్రపడుతుంది దాని తో పాటు కష్టపడడం వలన కలిగే ఆనందాన్ని తెలుసుకుంటాడు. బద్దకాన్ని వదిలించుకుంటాడు .

Moral :ప్రయత్నిస్తే ఏ చెడ్డ అలవాటైన మార్చుకోవచ్చు.

Telugu Stories to Read Online: moral stories teach life skills, values to kids.

 

మూర్ఖపు గాడిద

 

foolish donkey telugu story

ఒక వూరిలో ఒక చిరు వ్యాపారి వద్ద ఒక గాడిద ఉండేది ,అతను గాడిదతో అన్ని బరువులు మోయించే పనులు చేయించే వాడు . గాడిదకు రోజూ అదే పని చేసి చేసి విసుగు వచ్చింది . ఒక రోజు రాత్రి అందరు నిద్రపోయాక ఒక నక్క అడవిలోంచి గ్రామం లోకి  వచ్చింది ,అది కో డిపిల్లను ఆహారంగా తిన్నాక తిరిగి వెళ్తూ కట్టివేసి గాడిదను చూసి ఆగి అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది అంది! అప్పుడు గాడిద నాకు ఏమైంది  అంది ?అప్పుడు నక్క నీవు నిజానికి గుర్రానివి కానీ నీతో  చిన్నప్పటినుండి బరువులు మోయిన్చడం వల్ల  నువ్వు గాడిదలాగా మారిపోయావు అంటుంది ,నక్క మాటలు నమ్మశక్యం గా లేనప్పటికీ వినడానికి గొప్పగా వున్నాయి కనుక గాడిద నక్క మాటలు నమ్మి తనని తానూ గుర్రంలా భావిస్తుంది. మనుషుల అలికిడి రావడం తో నక్క అక్కడినుండి అడవిలోకి పారిపోతుంది.

మరుసటి రోజు రాత్రి గాడిదకు నక్క చెప్పిన మాటలు గుర్తు వచ్చి తాన గుర్రం అని నిరూపించుకోవాలని ,గట్టి గా అరుస్తుంది దాని గార్ధభ స్వరం భరించలేని యజమాని వచ్చి కర్రతో గట్టిగా బాదుతాడు . తరువాతరోజు వ్యాపారి గాడిదతో కలసి ప్రక్క ఊరి సంతకువెళ్లి తన వ్యాపారానికి కావలసిన సరుకులన్నీ కొని గాడిద పై పెట్టి ప్రక్కకు వెళ్తాడు ,తానూ గుర్రాన్ని అన్న భావనలో వున్న గాడిద ,తానూ ఎంత వేగంగా పరిగెడతానో నిరూపించుకుందాం అని ప్రయత్నించి బరువు వలన చతికిల పడుతుంది దానితో గాడిద మీదవున్న సరుకులన్నీ క్రిందపడిపోతాయి . మళ్ళీ యజమాని వచ్చి కర్రతో చితకగొడతాడు .

ఆ రోజు రాత్రి నక్క మళ్ళీ  వచ్చి గాడిదను పలకరిస్తుంది , గాడిద ఏడుస్తూ తన బాధ అంతా నక్కతో చెప్పు కుంటుంది అప్పుడు నక్క బాధపడకు నీ యజమానికి నీ విలువ తెలీదు నువ్వు నాతో రా నీవిలువ తెలిసిన వాళ్ళ దగ్గరకు తీసుకు వెళ్తా అని అక్కడ నుండి గాడిదను తప్పించి తనతో అడవికి తీసుకువెళ్తుంది .

గాడిదను సింహం గుహ వద్ద ఉంచి  ఇది నువ్వు ఉండడానికి చక్కని చోటు ,నువ్వు ఇక్కడే వుండు నేను ఉదయం వస్తాను అని గాడిదకు బూటకపు మాటలు చెప్పి వెళ్తుంది నక్క . అసలు ఏమి జరుగుతుందో గ్రహించలేని గాడిద గుహలో  వున్న సింహానికి ఆహారమైపోతుంది.

అక్కడే పొదల చాటు దాక్కున్ననక్క సింహం దగ్గరకు వచ్చి మహారాజా మీరు కోరిన విధంగానే మీకు గాడిద మాంసం అందించాను అంటుంది . అప్పుడు సింహం ఆనందంతో అందుకే ఇప్పటినుండి నిన్ను నేను నాకు మంత్రిగా  నియమిస్తున్నాను అంటుంది .

ఆ విధంగా గాడిద తన మూర్కత్వం తో నక్కను నమ్మి ప్రాణం పోగొట్టుకుంది .

Moral :మనలను పొగిడేవాళ్ళందరూ మనవాళ్ళనే భ్రమలో వుండకూడదు .

 

For more moral stories please visit: http://telugulibrary.in/

error: Content is protected !!