Contents
సగం బహుమతి
అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక ధనికుడు ఉండేవాడు. అతను తన చుట్టుపక్కల ఉన్న వారి అందరితో చాలా మంచిగా మెలిగేవాడు, వారికి ఎటువంటి అవసరం వచ్చినా తానే ముందుండి సహాయం చేసేవాడు . ఆ విధంగా అతనికి ప్రజలు అందరిలో మంచి పేరు ఏర్పడింది . అతనికి లేక లేక పది సంవత్సరాల తర్వాత ఒక ఒక బిడ్డ జన్మించాడు,చాలా కాలం తర్వాత తనకు కొడుకు పుట్టినందుకు , తన కొడుకు పుట్టిన రోజు ఎంతో ఘనంగా చేయాలని ఆ ధనికుడు నిర్ణయించుకున్నాడు .
అందుకోసమే తన రాజ్యంలో ఉన్న వారందరినీ విందుకు ఆహ్వానించాడు. ఆ విందులో అన్ని రకాల వంటకాలు ఖచ్చితంగా ఉండాలని ధనికుడు వంట వారిని ఆజ్ఞాపించాడు . వారు అన్ని రకాల వంటలు వండలి గారు కానీ వారికి చేపలు ఎక్కడా దొరకని కారణంగా వారు చేపలతో చేసిన పదార్థాలు వండలేకపోయారు . అదే విషయాన్ని ధనికునికి తెలియజేశారు అప్పుడు ధనికుడు తన విందులు ఎటువంటి లోటు ఉండకూడదని… చేపలతో కూడా తన విందులో కచ్చితంగా ఉండాలని అనుకొని అతను ఎవరైతే తనకు విందుకు కావలసిన చేపలు తీసుకువస్తారో వారికి చక్కని బహుమతి ఇస్తానని ఆ రాజ్యంలో చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలందరూ చేపల కోసం శతవిధాలా ప్రయత్నించారు కానీ ఎవ్వరికీ దొరకలేదు వారిలో ఒకరికి మాత్రం విందుకు అవసరమైన అన్ని చేపలు దొరికాయి .
అవి అతను తీసుకొని ధనికుని ఇంటి దగ్గరికి బయలుదేరాడు . అతను ఇంటి ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఆ ద్వారానికి కాపలాగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నువ్వు ఈ చేపలు తీసుకొని లోపలికి వెళితే నీకు చక్కని బహుమతి అందుతుంది కానీ నిన్ను లోపలికి పంపించడం వల్ల నాకు ఏమి ప్రయోజనం ఉంటుంది అని ఆ వ్యక్తిని అడిగాడు. అప్పుడు చేపలు తెచ్చిన వ్యక్తి ‘ఇతను నన్ను లోపలికి వెళ్లనిచ్చేలాగా లేడు’ అనుకుని ,అతను ద్వారపాలకుని తో నేను లోపలికి వెళ్ళడానికి నీకు ఏమి చెల్లించాలి అని అడుగుతాడు. అప్పుడు ద్వారపాలకుడు నువ్వు ఏదైతే బహుమతి గా పొందుతావో దానిలో సగం నాకు ఇవ్వాలి అని చెపుతాడు.
చేపల తెచ్చిన వ్యక్తి…
ఆ షరతుకి సరే అని ఒప్పుకొని లోపలికి వెళ్తాడు . ధనికుడు చేపలను చూసి చాలా సంతోషించి నువ్వు నా విందులో ఎటువంటి లోటు లేకుండా చేసావు, నేను చాలా సంతోషంగా ఉన్నాను నీకు ఎటువంటి బహుమతి కావాలి అని అడుగుతాడు .
అందుకు చేపల తెచ్చిన వ్యక్తి మహారాజా నాకు వంద కొరడా దెబ్బలు కావాలి అని అడుగుతాడు. అతని మాటలకు ఆశ్చర్యపోయిన ధనికుడు,నువ్వు ఏమి మాట్లాడుతున్నావు అని అంటాడు… అప్పుడు చేపల తెచ్చిన వ్యక్తి మహారాజా నాకు వంద కొరడా దెబ్బలు కావాలి అదే విధంగా మీ గేటు దగ్గర కాపలా ఉన్న వ్యక్తికి యాభై కొరడా దెబ్బలు తప్పకుండా ఇప్పించగలరు అని అంటాడు . అతని మాటలకు అయోమయంలో పడ్డ ధనవంతుడు తన ద్వారపాలకుని పిలిచి అతని సమక్షంలో చేపలు తెచ్చిన వ్యక్తిని ఏమైంది? అని అడుగుతాడు . అప్పుడు చేపలు తీసుకొచ్చిన వ్యక్తి జరిగిన విషయమంతా వివరంగా అతనికి వివరిస్తాడు . విషయాన్ని తెలుసుకున్న ధనికుడు చాలా కోపోద్రిక్తుడై తన ద్వారపాలకుడికి వంద కొరడా దెబ్బలు కొట్టమని తన మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. అదేవిధంగా చేపలు తీసుకొచ్చిన వ్యక్తి కి బంగారు నాణాలు ఇచ్చి సత్కరించాడు.
Moral : దురాశ ఆపదల పాలుచేస్తుంది.
Audio Story
For more Stories please visit: Bed time stories