valasa cooli
Spread the love

Contents

వలస కూలి

Telugu Story…

Valasa cooli Telugu Story  ,This article explains the struggling life of Migration labor .

 

ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసు, గమనం ఎందాకో, గమ్యం ఎక్కడో తెలియని జీవితం నాది. నాది అంటే నేను గాలిని కాను గాలికి  కొట్టుకు వచ్చిన ఎండుటాకుతో సారూప్యమైన జీవితం నాది ,నాకు లోకమద్దిన నామకరణం వలసజీవి

నా గతం..This article explains how Important education is

నేను పేద రైతు బిడ్డను,మాకున్న చిన్న పొలం పండిస్తూ ఎండనక వాననక శ్రమిస్తూ నా తల్లిదండ్రులు నన్ను మా గ్రామం లో చదివిస్తున్నారు . నా స్నేహితులు అందరికి ఏమేమి వ్యాపకాలు వుంటాయో నాకు తెలీదు కానీ నాకు చదువే పెద్ద వ్యాపకం . రోజు బడి కెళ్ళడం ఎదో కొత్తవిషయం నేర్చుకోవడం ,మా పాఠాల్లో వున్న గొప్ప గొప్ప వారిలా ఎదగాలి   అని కలలు కనడం.

అలా ప్రశాంతంగా  సాగిపోతున్న మా జీవితాల్లో కి అనుకోని అలజడి వచ్చిపడింది, పంట పండించడాని కి తీసుకున్న అప్పు పంట తడపడాని కి కూడా చాలలేదు కాని ఆ అప్పుకు వడ్డీ అనే ఫలాలు పుష్కలంగా  కాసాయి.

ఏం  చేస్తాం చిన్న బతుకులు, పొలాన్ని వదులు కొని పొట్ట చేతబట్టు కొని ఊరు దాటవలసిన పరిస్థితి వచ్చింది,అదే ఊరులో ఉందాం అని నేను ఎంత  అడిగిన ఆత్మగౌరవం  చంపుకొని బతకలేం అన్నారు అమ్మ నాన్న .

తిండి వున్నా లేకున్నా బతకగలం గాని ఆత్మగౌరవం  లేకుండా బతకలేం అన్నారు ముక్త కంఠంతో . ఊరు దాటుతుంటే నా ప్రాణం పోతున్నంత బాధగా వుంది , నా చదువు ,నా ఆశలు ,నా ఆశయాలు అన్ని అక్కడ వదిలివెలుతున్నట్టు అనిపిస్తుంది . కానీ అక్కడో ఆశ మళ్ళీ పరిస్థితి మెరుగుపడదా అని .

చాలా ఊర్లు తిరిగాం ఏ రోజు సంపాదన ఆ రోజు కే  సరిపోయేది, అమ్మ నాన్న ఇద్దరు సంపాదించినా ముగ్గురికి మూడు పూటలా సరిపోయేది కాదు . అందుకే అమ్మ నాన్నకి ఇష్టం లేక పోయినా నేను వారితో పాటు కూలి కి వెళ్ళేవాడిని ,వేణ్ణీళ్ళకి చన్నీళ్ళు సాయంలా . రోజు రాత్రి నిద్ర పట్టేది కాదు… ,పని వల్ల వచ్చిన నొప్పుల తో అనుకునేవారు అమ్మవాళ్ళు కాని అంతకన్నా ఎక్కువ నొప్పి నా మనసు పడుతుంది అని ,చచ్చిపోతున్న నా ఆశలను బతికించు కోవడానికి నా మనసు  పడుతున్న ఆవేదన అని నేను వాళ్లకు చెప్పలేను  కదా…  చెప్పి వాళ్లను బాధ పెట్టలేను కదా.

ఈ గమనంలో స్థావరాలు  మారుతున్నాయి కానీ స్థిర ఆవాసాలు ఏర్పడం లేదు  ,మా గుర్తింపులు మాయమైపోయి  లోకం చాలా అలవోకగా అద్దిన కొత్త నామం మమల్ని వచ్చి చేరింది .

అదే “వలస కూలి “…అంటే గుర్తింపు, స్థిరత్వం లేని జీవితం అని దానర్థం .

రోజులు గడుస్తున్నా కొద్దీ చదువు కోవాలన్నతపన నాలో పెరుగుతూ వస్తుంది కానీ ఏ దారి కనపడడం లేదు ,అప్పుడు ఎవరో  మాట్లాడు కుంటుంటే వినపడింది నేను వున్న చోటుకి దగ్గరలో రాత్రి బడి ఉందని, అక్కడ ఉచితంగా చదువు చెపుతారని.. ఆ మాట వినడం  నా ప్రాణం లేచి వచ్చింది ,దేవుడా నువ్వువున్నావ్ అని దేవుణ్ణి తలచుకున్నా . అమ్మ నాన్నకు విషయం చెప్పి రాత్రి బడి లో చేరడాని కి వెళ్ళాను ,అక్కడ చేరాలి అంటే వారు నా గుర్తింపు అడిగారు (వారికి తెలీదు కదా నా ఈపోరాటం  నా గుర్తింపుకోసమే అని) .

అక్కడ ఉపాద్యాయులను అన్ని విధాలుగా బతిమిలాడి నా పరిస్థితి వివరించి నా జీవితానికి చదువు ఎంత అవసరమో  వివరించాను , నా అదృష్టం నా ప్రయత్నం ఫలించింది నన్ను ఆ పాఠశాలలో చేర్చుకున్నారు . నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందం కలిగింది,ఎవరో నా భుజం మీద చేయివేసి ఇంక నిన్ను నువ్వు నిరూపించుకో అన్నట్టు అనిపించింది.  🙂

రోజు పగలు కూలి కి వెళ్లి రాత్రులు బడి కి వెళ్లే వాడిన, ఏ  మాత్రం సమయం కుదిరిన అవసరమైన  కొత్త కొత్త విషయాలు నేర్చు కొనే వాడిని . సంవత్సరాలు గడిచేకొద్దీ గడియారాన్ని కి  అలసట వచ్చిందేమో గాని నాకు ,నా ప్రయత్నాని కి అలసట రాలేదు  .

కొన్ని సంవత్సరాల తర్వాత..

ఈ  రోజు ఉదయం నిద్రలేచే సరికి  మైక్ లో ఎవరో గట్టిగ చెపుతున్నారు “మన ఊరి లో కొత్తగా నిర్మించిన గ్రంధాలయం ప్రారంభోత్సవానికి ,మన  జిల్లా విద్యాధికారి విజయ్ వస్తున్నారు అని”

నా పోరాటం లో గెలుపు సాధించి , గుర్తింపు పొందిన  ఆ విజయ్ ని నేనే…

 

జీవితం మనకు కష్టాన్ని సుఖాన్ని రెండిటిని చూపిస్తుంది ,కాని ఎటువంటి పరిస్థితుల్లోను మనం మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు.

మన ఓటమి కి కారణాలు ఉండవచ్చు కానీ ,మనం ప్రయత్నించక   పోవడానికి కారణాలు ఉండకూడదు .

Sireesha.Gummadi

 

Valasa cooli Telugu Story  , This article explains how Important education is.

 

For more stories please visit:సత్య కథ (ఇది మనందరి కథ)

error: Content is protected !!