ratan tata
Spread the love

Contents

Ratan Tata

మన జాతిరత్నం

Why Ratan Tata is a Great man in India ? || రతన్ టాటా ||

మన భారత జాతికి దొరికిన రత్నం మన “రతన్ టాటా”

ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా యువతకు ఆదర్శప్రాయుడు. వ్యాపార విలువలు, మంచితనం, నిరాడంబరత తో ఆయన ముందుకుసాగుతున్నారు.దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేతల్లో రతన్ టాటా ఒకరు. సానుకూల ధోరణి  ఆయనను ప్రస్తుతం ఈ స్థాయికి చేర్పించింది. భారతదేశం అంటే ఎనలేని దేశభక్తి,ఒత్తిడిని అవలీలగా అధిగమించడం మరియు క్లిష్ట పరిస్థితుల్లో  ‘కీ’లక పాత్ర పోషించడం వంటి పాత్రలు పోషించడం వ్యాపార దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకే చెందుతుంది .

Ratan tata Birthday:

రతన్ టాటా 28 డిసెంబర్ 1937 సూరత్ లో జన్మించాడు.బాల్యంలో ఆయన తల్లి తండ్రులు విడిపోయారు , అమ్మమ్మ పెంచిపెద్ద చేసింది.మంచి నడవడిక, పోటీతత్వం, అంకిత భావం, ధైర్యం.. ఈ 4 లక్షణాలు రతన్‌ టాటా లో మెండుగా  ఉన్నాయి. అందుకేనమో రతన్‌ టాటాను  పుట్టుకతోనే నాయకుడిగా అభివర్ణిస్తూ ఉంటారు.  టాటా  గురించి బాగా తెల్సిన వాళ్లు ‘నాకు అలసటగా ఉంది,ఈ పని రేపు చేద్దాం’ అన్న మాటలు రతన్‌ టాటా నోట విన్నవారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో.

రతన్ టాటాకు దేశభక్తి  ఎక్కువే ….

టాటాకు దేశ భక్తి చాలా ఎక్కువే. 2011 సంవత్సరం లో ముంబైలో తాజ్ హోటల్ పై దాడి వల్ల అది బాగా దెబ్బతింది. దానిని బాగు చేయించేందుకు టెండర్లు పిలిచారు. అందులో ఓ ప్రముఖ వ్యక్తి పాకిస్థాన్ కు చెందిన వారికి అపాయిట్మెంట్ ఇవ్వాలని కోరగా, ఆయన వారిని అక్కడి నుండే తిట్టి పంపిచేశాడు.అలాగే పాకిస్థాన్ ప్రభుత్వం సుమోల కోసం పెట్టిన ఆర్డర్ ను సైతం పక్కన పెట్టేశారు. ఆ దేశానికి వాహనా లను ఎగుమతి చేసేది లేదని తేల్చిచెప్పేశారు(టాటా).

చవకైన నానో కారు:(టాటా మాటల్లో .. )

కొన్ని సంవత్సరాల  క్రితం నేను చూసిన ఒక దృశ్య మే ఈ ‘నానో’ కారుకు నాంది పలికింది . ఓ కుటుంబం ఒక రోజు స్కూటరుపై వెళ్తోంది. తండ్రి డ్రైవింగ్  చేస్తూంటే.అతని కొడుకు ముందు నిలబడ్డాడు. వెనక సీట్లో ఆయన భార్య, ఆమె ఒళ్లో ఓ చిన్నారి.అది చూశాక ఒక్కసారిగా నా మనసు చలించింది పోయింది . నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను . ఇలాంటి చిన్న ,మధ్య తరగతి కుటుంబాలు  .. ఎటువంటి  ఇబ్బంది లేకుండా.. కారులో వెళ్లాలంటే.. వారి స్తోమతకు/ఖర్చుకు  తగ్గ కారును అందుబాటులోకి తీసుకురాలేమా ..? అదే నా ప్రశ్న. రానురాను నాలో ఆ ప్రశ్న బలంగా నాటుకుపోయింది, దాని ఫలితమే లక్షరూపాయల నానో కార్.

కరోనాపై యుద్ధానికి రూ.1,000 కోట్ల భారీ విరాళం:

టాటా వారి పెద్ద మనసు మరోసారి చాటుకున్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏకంగా రూ. పదిహేనువందల (1,500) కోట్ల మేర నిధులను కరోనా కోసం  వినియోగిస్తామని తెలిపారు.

రతన్ టాటాకు అనేక అవార్డులు:

టాటాకు మన దేశంలోని అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మవిభూషణ్, పద్మభూషణ్ పురస్కారాలు  లభించాయి. యూకే గవర్నమెంట్ కూడా రతన్ టాటాకు గౌరవ నైట్ హుడ్ పురస్కారాన్ని  ఆయనకు బహుమానంగా ఇచ్చింది. వ్యాపారాన్ని కూడా సామాజిక కోణంలో చూసే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది  టాటానే.

రతన్ టాటా బిలియనీర్ల జాబితాలో చేర్చ బడలేదు, ఎందుకంటే సంపదను దాచకుండా పంచుకోవడమే రతన్ టాటా కి ఇష్టం.తన కోసం కన్నా ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచిస్తారు టాటా .రతన్ టాటా ఎంత సింపుల్ గా  జీవిస్తారంటే. ఆయన సాధించిన లాభాల్లో దాదాపు అరవై ఐదు (65%) శాతం టాటా ట్రస్టులకే విరాళం ఇచ్చేస్తారు. అలాగే ఆయన విమానాల్లో కూడా ఎకానమీ క్లాసులోనే ప్రయాణిస్తారు.

Ratan tata wife:

ఆయన వివాహం చేసుకోలేదు

Ratan tata Son :

టాటా కు పిల్లలు లేరు

Ratan Tata నిరాడంబరతను తెలియజేసే కొన్ని సందర్భాలు:

ఒక రోజు బాలీవుడ్ హీరో  వినోద్ ఖన్నా షూటింగ్ నిమిత్తం వేరే ప్రదేశానికి వెళ్ళవలసి ఉండి, ఒక లగ్జరీ ప్లైట్  బుక్ చేసుకున్నారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఆయన ఎకనామిక్ క్లాస్ ఎక్కవలసి వచ్చింది . ఆయన అఇష్టం తోటే ఫ్లైట్ ఎక్కారు, ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కేసారి  సినిమా హీరోను చూసేసరికి ఆనందం పట్టలేక అందరూ ఆయన దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు . కొంత సమయానికి ఆయన వచ్చి తన సీట్లో కూర్చున్న తర్వాత పక్క సీట్లో ఉన్న వ్యక్తి తనని అసలు పట్టించుకోకుండా పేపర్ చదవడం గమనించారు, అప్పుడు వినోద్ ఖన్నా అదేమిటి వీరందరూ నన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కానీ ఈ వ్యక్తి నన్ను పట్టించుకోవడం లేదు ఏమిటి అని మరికొంతసేపు వినోద్ ఖన్నా ఎదురు చూశారు అయినప్పటికీ ఆ వ్యక్తి  పట్టించుకో పోయేసరికి వినోద్ ఖన్నా ఆయన వైపు చూసి నేను బాలీవుడ్ హీరో మీకు తెలుసా అని అన్నారు, అందుకు అవతల ఉన్న వ్యక్తి అవునా నాకు తెలీదు అని చెప్పి మళ్ళీ తన పని తను చేసుకు న్నారు.

మరికొంతసేపటికి ఖన్నా మీరు సినిమాలు చూడరా? అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా నేను చూడను అని చెప్పి ఇంకొక పుస్తకం తెరిచి చదువు కోవడం ప్రారంభించారు. అప్పుడు వినోద్ ఖన్నా అసహనంతో మీరేం చేస్తారో తెలుసుకోవచ్చా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి నా పేరు” రతన్ టాటా” , నేను ఒక బిజినెస్ మాన్ అని చెప్పారు.  ఆ మాట వినేసరికి వినోద్ ఖన్నా కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏమిటి ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా నా ఈయన ,అందుకే ఇంత హుందాగా  ఉన్నారు.  అని అనుకొని ,ఆయన మళ్ళీ టాటా తో మీరు ఏమిటి ఈ ఎకనామిక్ క్లాస్ లో వెళ్తున్నారు అని అడిగితే, అందుకు టాటా నేను ఎప్పుడూ ఎకనామిక్ క్లాస్ లో నే వెళ్తాను నాకు సామాన్యంగా జీవించడం అంటే ఇష్టం అని చెప్పారు అంట.

గొప్పవాళ్ళ జీవనం ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటుంది.

మరొక సందర్భం (సమయానికి టాటా ఎంత విలువ ఇస్తారో తెలియజేసేది)

ఒక రోజు ఒక కారులో డ్రైవర్ కాకుండా నలుగురు వ్యక్తులు కలిసి ఢిల్లీ వైపు వెళుతున్నారు ,అనుకోకుండా కారు టైరు పంచర్ అయింది . అప్పుడు కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కిందకి దిగగా  వారిలో ఒక వ్యక్తి సెల్ ఫోన్లో మాట్లాడుతూవున్నాడు  ఇంకొక వ్యక్తి  సిగరెట్ తాగుతున్నాడు ,మూడో వ్యక్తి తనతోపాటు తెచ్చుకున్న ప్లాస్కు లో కాఫీ తాగుతున్నాడు అప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు నాలుగో వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని చూడగా ఆ నాలుగో వ్యక్తి ఒక చేత్తో స్పానర్ ఇంకొక చేతితో జాకి  తీసుకొని కారు డ్రైవర్ కి టైరు మార్చడం లో సహాయం చేస్తున్నాడు . ఆ వ్యక్తులు ఆ నాలగవ వ్యక్తి తో సర్! మీరు ఈ పని చేయడం ఏమిటి? అని అడిగినప్పుడు ,ఆయన డ్రైవరు ఒక్కడే కారు టైరు మార్చడానికి అతనికి పదిహేను నిమిషాలు పడుతుంది కానీ  నేను కూడా ఆయనకు సహాయం చేసినట్లయితే ఆ పని ఎనిమిది నిమిషాల్లో అయిపోతుంది అందువల్ల మనకి ఇంకా ఏడు  నిమిషాలు సమయం కలిసొస్తుంది అన్నారు ,ఆ నాలుగో వ్యక్తే “రతన్ టాటా”.

For more inspirational stories please click: Neeraj Chopra

రతన్ టాటా గొప్పతనాన్ని  తెలియజేసే కొన్ని సందర్భాలు:

నవంబరు 26 , 2008 లో పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా మన ముంబై నగరంలోని టాటా సంస్థ యొక్క TajHotel మీద ఆత్మాహుతి దాడి చేసి వందలమందిని చంపిన సంఘటనలో, చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలిసి ఒక్కొక్కరికీ ఇరవైఐదు లక్షల  నుండీ యాభై  లక్షల దాకా సహాయం అందించారు టాటా ; ఆ సమయం లో తమ హోటల్ లో డ్యూటీలో వుండి చనిపోయిన  , గాయపడిన ప్రతి పోలీసుకు  , ప్రతి ఇతర ఉద్యోగి కుటుంబం లో ఒక్కొక్కరికి తన సంస్థ  లో ఉద్యోగం ఇచ్చాడు , వాళ్ళ పిల్లల చదువు మరియు పెళ్ళిళ్ళ బాధ్యత ను తానే తీసుకొన్నాడు. అంత కంటే పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ అన్ని పనులనూ రతన్ టాటా గారు దాడి జరిగిన తరువాత కేవలం ఇరవై  రోజుల్లో పూర్తీచేసేసారు. అందుకే ఆయన గురించి ఒక వ్యక్తి  ఇలా రాసాడు : Don’t mess with him(Tata ) ; if you give him Deep Insults , he (Tata ) will transform them into Deep Results.

రతన్ టాటా గురించి ఒక స్ఫూర్తిదాయకమైన కల్పిత కథ :

ముంబాయ్ లోని ఒక చిన్న పారిశ్రామిక వేత్త వ్యాపార వ్యాపారం లో  బాగా నష్టపోయి.. తిరిగి కోలేకోలేని స్థితిలో ఉన్నానని.. తనకు చావే శరణ్యమని భావించి.. చనిపోవాలని నిర్ణయించుకుని… చివరగా ఒక పార్కులో భగవంతుని ధ్యానంలో మునిగిపోయాడు.. ఇంతలో అతని వద్దకు ఒక పెద్దాయన  వచ్చి కూర్చుని ఏమినాయన బాగా సమస్యలో ఉన్నట్లున్నావని అడిగాడు. వ్యాపారి తన బాధనంత చెప్పుకున్నాడు. ఆ పెద్దాయన  వెంటనే చెక్ రాసి ఇచ్చి వచ్చే సంవత్సరం తిరిగి ఇదే రోజున నాకు తిరిగి ఇవ్వు అని చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు . వ్యాపారి ఆ చెక్కు చూసి దానిలో రతన్ టాటా అని సంతకం ఉండడం చూసి ఆశ్చర్య పోయాడు… దేవుడు తనకు ఈ విధంగా మరో అవకాశాన్ని ఇచ్చాడని దేవునికి కృతఙ్ఞతలు చెప్పుకుని అక్కడనుండి  ఇంటికి తిరిగి వచ్చాక.. ఆ చెక్ వాడకుండానే  పని పూర్తయ్యేలా  చేద్దామనుకుని కొన్ని ప్రణాళికలు వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం నుండి ఆ ఆలోచనలు అమలులో పెట్టాడు.

అదేంటో గాని చెక్ తనవద్ద ఉందన్న ఆత్మవిశ్వాసంలో తాను వేసిన ప్రతి అడుగు విజయవంతం అవుతూ వచ్చింది. చాలా ధైర్యంగా తను వేసిన ముందడుగు వలన వెనుకకు తిరిగి  చూసుకునే అవకాశమే లేకుండా అన్ని బాగా కలిసొచ్చాయి. సంవత్సరం తిరిగే సరికి తన అప్పులన్ని పోను తానే మరికొందరికి పెట్టుబడి పెట్టేంత స్థాయికి చేరుకున్నాడు.

ఇచ్చిన మాట..

ప్రకారం పెద్దాయనకు  చెక్ ఇద్దామని బావించి అతను ఇచ్చిన చెక్ తో పాటు మరికొంత సొమ్ము  తీసుకుని పార్క్ కు వెళ్లి పెద్దాయన కోసం వెతకసాగాడు.. ఇంతలో ఒక నర్స్ అక్కడికి వచ్చి.. ఏమండీ ఆ పెద్దాయన ఒక మతిస్థిమితం లేని వాడు .. అతను తనకు తాను రతన్ టాటా గా భావిస్తూవుంటాడు.మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని క్షమాపణలు అడిగి, పెద్దాయనని అక్కడినుండి తీసుకు వెళ్ళింది.

వ్యాపారి ఆశ్చర్యపోయి ఆ చెక్కును పరిశీలించి.. అది ఒక చెల్లని చెక్కు అని నిర్దారణ అయ్యాక.. ఇన్నిరోజులు  దీన్ని నమ్ముకునా నేను ఇంత ధైర్యంగా ముందుకు వెళ్ళిందని మరోసారి ఆశ్చర్యపోయాడు. ఇంతకాలం తనను గెలిపించింది కేవలం ఆత్మవిశ్వాసం మాత్రమేనని గ్రహించి.. అది ఉంటె చేయలేనిదేమి లేదని తెలుసుకుని.. ఈ మాత్రం దానికేన తాను చనిపోదామనుకుందని సిగ్గుపడి.. తన జీవితానికి మార్గదర్శకంగా నిలిచిన పిచ్చివానికి మనస్సులోనె కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

నిజానికి బ్రతకడానికంటే చావడానికే ఎక్కువ ధైర్యం కావాలి.

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికాదు…

ఆత్మా విశ్వాసంతో ధైర్యంగా సమస్యలను ఎదుర్కొంటే సాధించలేనిదేమీలేదు….

(సేకరణ )

Why Ratan Tata is a Great man in India ? || రతన్ టాటా ||

 

One thought on “Why Ratan Tata is a Great man in India ? || రతన్ టాటా ||”
  1. ఒక గొప్ప వ్వక్తి గురించి చాలా బాగా చెప్పారు, good

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!