Friends stories in Telugu
Spread the love

Friends stories in Telugu..

Contents

Friends stories in Telugu

స్నేహం అంటే మనందరికీ ఇష్టం అలానే మంచి స్నేహితులు దొరకడం కూడా అదృష్టమే . అటువంటి స్నేహాన్ని గురించి తెలుసుకొనే కొన్ని మంచి కథలు మీకోసం

*స్నేహం- స్వార్ధం*

అనగనగా పర్వతాపురం అనే ఒక ఊరిలో గోపి, శ్యామ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ తెలివైనవారైనప్పటికీ చదువైన తరవాత ఏ పని చేయకుండా ఊరిలో ఖాళీగా తిరుగుతూ “మేము ఈ ఊరిలో అందరికన్నా తెలివైన వాళ్ళం… మేము అందరికన్నా గొప్పగా స్థిరపడతాం ఎప్పటికైనా…” అని గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు .

వీరి ప్రవర్తన వీరి మాటతీరు చూసి వీరి తల్లి దండ్రులతో సహా వూరిలోవారందరూ వీరిని చులకనగా చూసేవారు , మిత్రులిద్దరూ మాత్రం మనకీ ఒక అవకాశం వస్తుంది అప్పుడు మనమేంటో చూపెడదాం!! అని తమని తాము సమర్ధించుకొనేవాళ్ళు.

ఒక రోజు గ్రామపెద్ద ఊరిలో వారందరూ ఒకచోట సమావేశమవ్వాలని ,అందరం కలసి ఒక సమస్య గురించి చర్చించాలని దండోరా వేయించాడు.

అదే రోజు అందరు ఊరిమద్య వున్న మర్రి చెట్టు క్రింద సమావేశమయ్యారు…

అప్పుడు గ్రామపెద్ద ఊరి ప్రజలను ఉద్దేశించి ,చూడండి మీలో చాలా మందికి తెలిసిన విషయమే ,మన ఊరిలో చాలామంది గత కొంత కాలంగా విషజ్వారాలుతో బాధపడుతున్నారు . అది ఊరి ప్రజలందరికీ వ్యాపిస్తుంది అని మన వైద్యుడుగారు చెప్పారు అంతేకాకుండా దీనికి నివారణ కూడా వివరించారు . అదేంటంటే మన ఊరి ప్రక్కన వున్న పర్వతంపై నీలం రంగు ఆకులు కలిగిన చిన్న మొక్కలు ఉంటాయి వాటిని తీసుకు వచ్చి మన మంచినీటి చెరువు చుట్టుప్రక్కల వేస్తే వాటి ప్రభావం వలన నీటి ద్వారా మనకు వచ్చిన జ్వరాలు అన్ని తగ్గిపోతాయని చెప్పారు . కాబట్టి వాటిని ఎవరు తెస్తారు అన్నాడు .

అప్పుడు ఊరిలో వారందరూ ఆ పర్వతం చుట్టూ పదుల సంఖ్యలో పులులు వున్నాయి అని మనందరికీ తెలుసు అటువంటప్పుడు ఎవరు ప్రాణత్యాగం చేస్తారు అన్నారు .

అది విన్న గ్రామపెద్ద వాటిని తీసుకు వచ్చిన వారిని మన ఊరి గ్రామాధి కారిని చేస్తాను అన్నాడు .

“గ్రామాధికారి” అనే మాట వినేసరికి అప్పటి వరకు స్తబ్దంగా జరిగింది వింటున్న మిత్రులిద్దరూ,అబ్బా!! భలే అవకాశం వచ్చింది అనుకుంటూ … ముందుకు వచ్చి ముక్త కంఠంతో మేము తెస్తాం అన్నారు.

మిగిలిన కథ కోసం


Friends stories in Telugu:

*అసలైన స్నేహితుడు*

ఈ రోజు నాని బర్త్ డే , నానికి చాలా ఆనందంగా ఉంది పొద్దుట లేచింది దగ్గర నుంచి అందరూ బర్త్డే విషెస్ చెబుతూనే ఉన్నారు. నాని వాళ్ళ నాన్నగారు నానికి గేర్ సైకిల్ గిఫ్ట్ గా ఇచ్చారు అమ్మ తనకి ఇష్టమైన గులాబ్ జాములు చేసింది అన్న ఏమో తనకి పెయింట్ బ్రష్షుల సెట్ కొని ఇచ్చాడు ఇంకేముంది ఆనందానికి అసలు హద్దులే లేవు చక్కగా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి చాక్లెట్ బాక్స్  తో సహా స్కూల్ కి వెళ్ళాడు.
స్కూల్లో అడుగుపెట్టగానే మళ్లీ బర్త్ డే విషెస్ , అందరూ దారంతా విషెస్ చెప్తూనే ఉన్నారు క్లాసులోకి వెళ్లాక ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన చిన్న చిన్న గిఫ్ట్ లన్ని తీసుకున్నాడు, ఒక్కొక్కళ్ళు గిఫ్ట్ ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది అన్ని తీసుకొని క్లాస్ లో అందరితో ఒరేయ్!! మీ అందరికీ ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ అందరూ రండి అని చెప్పి చెప్పాడు.
సాయంత్రం నాని వాళ్ళింట్లో తన క్లాస్మేట్స్ అందరితో చాలా సందడిగా పార్టీ జరిగింది వచ్చిన వాళ్ళందరికీ ఇష్టమైన భోజనాన్ని పెట్టి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ తీసుకొని ఆ రోజుకి పార్టీ ముగించాడు నాని.

మరుసటి రోజు నిద్ర లేచి స్కూల్ కి వెళ్దాం అనుకుంటే ఒళ్ళంతా ఎందుకో చాలా నీరసంగా అనిపించింది ఏమిటా అని మళ్లీ నిద్రపోయాడు .ఇంతలో అమ్మ వచ్చి నానీ..  నీకు జ్వరం వచ్చింది నాన్నా … నిన్న ఎక్కువ అలసిపోయావు కదా అందుకు అనుకుంటా.. ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉందువులే అని చెప్పి వెళ్ళిపోయింది .
అమ్మ అన్నట్టే చాలా జ్వరం వచ్చింది చాలా నీరసంగా అనిపించింది రెండు రోజులు అనుకున్నాను కానీ ఈరోజుకి మూడో రోజు డాక్టర్ అంకుల్ ఇంకా రెండు రోజులు తర్వాత గాని జ్వరం తగ్గదు అని చెప్పారు నాకేమో చాలా బోర్ కొడుతుంది ఏం చేయాలి అనుకుంటూ కూర్చున్నాడు నాని. ఇంతలో గేటు దగ్గర ఏదో చప్పుడు అవుతుంది ఎవరు వచ్చి ఉంటారో … రవి గాడు వచ్చి ఉంటాడా సతీష్ వచ్చి ఉంటాడా అని అనుకుంటూ గేటు వైపు వెళ్ళాడు నాని.

మిగిలిన కథ కోసం


Friends stories in Telugu:

*చిన్నారి స్నేహం*

చింటూ,నాని చిన్నప్పటి నుండి చాలా మంచి స్నేహితులు వారి ఇళ్లు కూడా ప్రక్క పక్కనే ఉండేవి . చింటూ,నాని ఒకటే క్లాస్ , వారు ఇద్దరు కలసి చదువు కొనేవారు కలసి ఆడుకొనే వారు .వారి ఇళ్ల  ప్రక్కన  ఒక ఖాళీ  స్థలం ఉండేది ఆ స్థలం లో ఒక పెద్ద చెట్టు దాని క్రింద ఒకప్పటి  పాత  ఎడ్లబండి ఉండేది. చింటూ,నాని ఎక్కువ సమయం  అక్కడే  గడిపేవారు.

రోజులాగే ఆరోజు కూడా బాగా ఆడుకొని అలసి పోయి ఇద్దరు  ఇంటికి వచ్చారు ,అప్పటి కే  ఇంటిదగ్గర పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయి ఎవరా అని చుస్తే చింటూ వాళ్ళ అమ్మ ,నాని వాళ్ళ అమ్మ చాలా గట్టిగా చుట్టుప్రక్కల వాళ్ళు వినేలా దెబ్బలాడుకుంటున్నారు . మొదటి లోఇద్దరి కి ఆ సన్నివేశం చూసి చాలా భయం వేసింది,అదేంటి మా అమ్మ మీ అమ్మ మంచి స్నేహితులు కదా మరేంటి ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకున్నారు అంతలో చింటూ  వాళ్ళ అమ్మ చింటూ  లోపలి కి వెళ్ళు..  అని గట్టి అరిచేసరికి ఇద్దరు భయపడిపోయి వారి వారి ఇళ్ళలోకి వెళ్లి పోయారు.

ఆ రోజు రాత్రి..

చింటూ, వాళ్ళ నాన్నఇద్దరు భోజనం  చేస్తున్నప్పుడు.. చింటూ వాళ్ళ అమ్మ, చూడు చింటూ ఇప్పుడే చెపుతున్నా రేపటి నుండి నువ్వు ఆ నానితో ఆటలు ఆడితే ఊరుకోను అన్నది . ఆ మాటకి చింటూ ఎందుకు అమ్మ అన్నాడు అమాయకంగా ,అందుకు అమ్మ నేను చెప్పానా వాళ్లు మంచి వాళ్ళు కాదు మాట్లాడకు అంది . ఆ మాట విని చింటూకు చాలా  బాధ అనిపించింది, అంటే నేను రేపటి నుండి నాని తో ఆడుకో కూడదా అని తలచుకుంటేనే ఏడుపు వచ్చేసింది చింటూకి అలాగే ఆలోచిస్తూ నెమ్మది గ నిద్రలోకి జారుకున్నాడు.మిగిలిన కథ కోసం


*MY BEST FRIEND*

అనగనగా ఒక వూరిలో ఒక బాబు ఉండేవాడు ఆ బాబు పేరు చెర్రీ,చెర్రీ దగ్గర చాలా బొమ్మలు వున్నాయి కానీ చెర్రీ కి చిన్నప్పటి నుండి తన డాడీ ఇచ్చిన బ్రౌన్ కలర్ కుక్కపిల్ల బొమ్మ  అంటే చాలా ఇష్టం రోజూ దానితోనే ఎక్కువ సేపు ఆడుకొనే వాడు. చెర్రీ కి తాను మాత్రమే బెస్ట్ ఫ్రెండ్ అని కుక్క పిల్ల బొమ్మ చాలా హ్యాపీ గా ఉండేది .

అలా కొన్ని సంవత్సరాలు గడిచాక…

చెర్రీ టాయ్స్ బాక్స్  లోకి చాలా కొత్త కొత్త బొమ్మలు వచ్చాయి ,కదిలేవి,మాట్లాడేవి… ఇలా చాలా . చెర్రీ వాటి తో ఎక్కువ సమయం గడిపేవాడు ,కుక్కపిల్ల బొమ్మ తో  రోజుకు ఒక్కసారి కూడా ఆడేవాడుకాదు . కుక్కపిల్ల బొమ్మ ఈ మధ్య చాలా బాధగా ఉంటుంది ,తనకు కదలడం మాట్లాడం రాదు కదా అందుకే తాను చెర్రీ కి నచ్చడం లేదు అనుకుంటుంది . కుక్కపిల్ల బొమ్మ తో పాటు వున్న ఇంకో పాత గుర్రం బొమ్మ ,కుక్కపిల్లతో బాధ పడకు ఎప్పటికైనా ప్రాణం వున్న వాటికే విలువ ఉంటుంది ఎందుకంటే అవి ఎక్కడికి కావాలంటే  అక్కడికి వెళ్ళగలవు , ఎవరు ప్రేమిస్తే వారిని తిరిగి ప్రేమించగలవు కానీ మనం ఎక్కడ పెడితే  అక్కడ కదలకుండా ఉంటాం కదా అందుకే మనల్ని ఎవరైనా కొంతకాలమే ఇష్టపడతారు అంటుంది .

ఒక రోజు చెర్రీ కి చాలా జ్వరం వస్తుంది ,ఎన్ని రోజులు అయినా  అది తగ్గదు అతను తన మంచం కూడా దిగలేకపోతాడు.మిగిలిన కథ కోసం

 


Friends stories in Telugu:

*చిన్ననాటి నేస్తం*

నాగేశ్వరరావు ఏదో పనిలా పేపర్ తిరగేస్తున్నాడే కానీ మనసు ఏమాత్రం పేపర్ చదవడం మీద అస్సలు లేదు, చాలా నిరాశగా అనిపిస్తుంది మనసుకు. ఏంటీ … ఈ పేపర్లో ఒక విషయమైనా నాకు ఉపయోగకరంగా ఉందా, రోజూ.. ఏమిటీ బాధ ,రిటైర్డ్ అయిన దగ్గర్నుంచి ఉదయమే లేచి వాకింగ్ కి వెళ్లడం ఇంటికి వచ్చి గంభీరంగా కూర్చుని పేపరు చదవడం, అదేదో ముంచుకొస్తున్నట్టు టీవీలో వార్తలు వినడం ఒక ఛానల్ లో అయిపోయిన వెంటనే ఇంకో ఛానల్ లో మళ్లీ మళ్లీ అవే వార్తలు వినడం , మధ్యాహ్నం అవ్వగానే భోజనం చేయడం.

వెంటనే నిద్రపోకపోతే ఎవరో కొడతారు అనే అంత ఇబ్బందిగా పడుకోవడం మళ్ళీ సాయంత్రం వాకింగ్ కి వెళ్లడం వచ్చి రొటీన్ టీవీ సీరియల్స్ భారంగా చూడడం, తినడం హమ్మయ్య ఈ రోజు గడిచింది అనుకుంటా మళ్లీ నిద్రపోవడం మరుసటి రోజు మళ్ళీ షరామామూలే. ఏమిటీ… జీవితంఎటువంటి కొత్తదనం లేకుండా ఇంత చప్పగా ఉంది అనుకుంటూ చేతిలో ఉన్నపేపర్ ని విసుగ్గా టీపాయ్ మీద విసిరేసి పెరటి వైపు నడిచాడు అక్కడ ఉన్న పూల మొక్కలతో కొంత సమయం గడిపాక భార్య బయటికి వెళ్లి కూరగాయలు తీసుకురమ్మని చెప్పడంతో సంచి పట్టుకుని బయటికి బయలుదేరాడు .

మార్కెట్ నడిచే అంత దూరంలో ఉండడంతో నెమ్మదిగా నడక ప్రారంభించాడు నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటే నాలుగు ఇ ళ్ళు దాటాక రోడ్డు పక్కన ఉన్న చిన్న పాడుబడిన ఇల్లు కనబడింది దాని ముందు గేట్ పక్కన ఎప్పటినుంచో తాను వద్దనుకుని మళ్లీ మళ్లీ వెళ్ళినప్పుడల్లా చూస్తున్నమిగిలిన కథ కోసం

 

error: Content is protected !!