Chinna Pillala Neethi Katha in Telugu || మానవ నైజం ||
Spread the love

Chinna Pillala Neethi Katha

Contents

మానవ నైజం

 

కొంతకాలం క్రితం ఒక చిత్రకారుడు ఒక చక్కని చిత్రాన్ని గీశాడు ,అది అతనికి ఎంతగానో నచ్చింది దీనిలో ఎటువంటి లోపం ఉండి ఉండదు అని తనలో తాను అనుకున్నాడు.
ఇంతలో మరొక ఆలోచన వచ్చింది అసలు దీనిలో ఏమన్నా లోపం ఉందా అని వేరొకరిని అడిగితే ఎలా ఉంటుంది … అని భావించి ఆ చిత్రాన్ని తీసుకువెళ్లి ఒక మార్గం పక్కన ఉంచి దానిపై దీనిలో ఏమన్నా లోపం కనబడితే గుర్తించండి అని రాసి అక్కడనుండి వెళ్ళిపోయాడు .
అదే రోజు సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ చిత్రం మొత్తం రకరకాల పెన్నులతో కొట్టివేసిన గుర్తులున్నాయి.అది చూసి మొదటగా ఆశ్చర్యపోయి తర్వాత చాలా బాధపడిన చిత్రకారుడు ఆ చిత్రాన్ని తీసుకొని తన గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఇంతకాలం మంచి చిత్రకారుడిని అని భావించాను కానీ ఈ రోజుతో అదంతా నా ఊహా అని తేలిపోయింది.
నా చిత్రంలో ఇన్ని లోపాలు ఉంటాయని నేనెప్పుడూ ఊహించలేదు కాబట్టి ఇక మీదట నేను ఎటువంటి చిత్రాన్ని గీదలుచుకోలేదు అని చాలా బాధగా విన్నవించుకున్నాడు.

అప్పుడు ఆ చిత్రాన్ని పరిశీలనగా చూసిన గురువుగారు చిన్నగా నవ్వి సరే నీవు ఇలాంటిదే మరొక చిత్రాన్ని గీసి దాని క్రింద ఈ చిత్రంలో లోపాలను గుర్తించి వాటిని సరి చేయండి అని రాయి అన్నారు.
చిత్రకారుడు గురువుగారు చెప్పిన విధంగా మళ్ళీ ఇంకొక చిత్రాన్ని గీసి దాని క్రింద ఆయన చెప్పిన విధంగా రాసి మళ్ళీ అదే ప్రదేశంలో ఉంచాడు.

Chinna Pillala Neethi Katha..

మరుసటి రోజు…

వచ్చేసరికి చిత్రం యధావిధిగా తను గీసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. దానిని చూచిన చిత్రకారుడు ఈ చిత్రాన్ని ఇంకా ఎవరు చూసినట్లు లేరు అనుకొని దానిని అక్కడే వదిలేసి మరుసటి రోజు అదే సమయానికి వచ్చి చూశాడు అప్పుడు కూడా ఆ చిత్రం తను గీసినప్పుడు ఎలా ఉందో అలాగే ఇటువంటి మార్పు లేకుండా ఒక్క గీత కూడా లేకుండా అలాగే ఉంది .
ఆశ్చర్యానికి గురైన చిత్రకారుడు ఆ చిత్రాన్ని తీసుకొని గురువుగారు దగ్గరికి వెళ్లి చూపించాడు అది చూసిన గురువుగారు మళ్లీ ఒక చిరునవ్వు నవ్వారు అప్పుడు ఆ చిత్రకారుడు అయ్యా! మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగినప్పుడు గురువుగారు మొదట నువ్వు గీసిన చిత్రంపై “ఈ చిత్రంలో లోపాలు గుర్తించండి” అని రాశావు అప్పుడు చూసిన వారందరూ చాలా ఉత్సాహంగా నీ చిత్రంలోని లోపాలను సూచించారు కానీ మరుసటి రోజు గీసిన చిత్రంపై నీవు “దీనిలో లోపాలను గుర్తించి వాటిని సవరించండి “అని రాశావు
సాధారణంగా వ్యక్తులు ఎవరిలోనైనా లోపాలు గుర్తించడానికి ఇష్టపడతారు గాని వారు వాటిని సరి చేసే అంత ఓర్పు, బాధ్యత చూపించరు అది మనిషి నైజం అందుకే మరుసటి రోజు నీవు గీసిన చిత్రాన్ని ఎవరూ తాకలేదు అని వివరించారు .

 

Chinna Pillala Neethi Katha in Telugu || మానవ నైజం ||

 

నీతి : ఎవరిలోనైనా లోపాలు సరిదిద్దగలిగే సామర్థ్యం మీలో ఉంటేనే వాటిని విమర్శించండి.

 

 

 

 

For small moral stories please visit: Small stories

Sumathi Sathakam with Bhavam: Sumathi sathakam

What is Depression : How to overcome  Depression

Stories for kids to read: Aanandam

Inspirational women in India: Great Women

Success full people stories: Neeraj Chopra

Riddles For Every one: Riddles 1

Kids Riddles For Every one: Riddles 2

small Riddles For Every one: Riddles 3

Riddles For Every one: Riddles 4

error: Content is protected !!