Inspirational stories about nature
Spread the love

Contents

మంచి మాట

Mana Ooru Mana Chettu…

Inspirational stories about nature in Telugu this article explain how precious nature is

 

Inspirational stories about nature

రవి స్కూల్లో 4వ తరగతి చదువుతూ వుంటాడు, ఒక రోజు వాళ్ళ క్లాస్ టీచర్ క్లాస్ లో అందరు పిల్లల్ని రేపు న్యూస్ పేపర్ చదివి దానిలో ఏదన్న మంచి విషయం ఒకటి చెప్పమంటారు . మొదటిసారి రవి టీచర్ చెప్పారు అని న్యూస్ పేపర్ చదువుదాం అనుకుంటాడు కానీ అస్సలు చదవబుద్ధికాదు ,అలా పేపర్లు తిరగేస్తు వుంటే దానిలో ఎరుపురంగు లో వున్నఅక్షరాలు రవి కంటబడతాయి . దానిలో “చెట్లను మనం కాపాడితే చెట్లు మనలను కాపాడతాయి” అని రాసివుంది… రవి కి ఆ మాటలు అర్థం కావు ,అప్పుడు అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మా ఈ మాటకు అర్థం ఏమిటి అంటాడు . అందుకు అమ్మ చెట్లు మనకు కావలసిన ఆహారాన్ని, ప్రాణవాయువుని ఇస్తాయి ,అంతే కాక మన అనేక అవసరాలు తీరుస్తాయి మనకు అండగా ఉంటాయి . మనం ఒక మొక్కనాటితే పదిమంది ప్రాణాలు కాపాడిన వారితో సమానం అంటుంది . ఆ మాటలు రవి మనసులో బలంగా నాటుకుంటాయి .

ఆ రోజునుండి రవి మొక్కను మనిషితో సమానంగా భావిస్తాడు , తనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎక్కడ కుదిరితే అక్కడ మొక్కలు నాటుతూ విత్తనాలు జల్లుతూ ఉంటాడు . రవి విధానం ఊరిలో చాలా మందికి నచ్చదు,వారంతా రవి అమ్మ దగ్గరకు వచ్చి మీ అబ్బాయి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వేస్తున్నాడు మాకు చాలా  అడ్డుగా ,యిబ్బందిగా ఉంటుంది . ఇలా చేయవద్దు అని చెప్పండి అంటారు ,అప్పుడు రవి వచ్చి అందరికి మొక్కలు నాటడం వలన ప్రయోజనాలు ,మొక్కలు మనిషి కి ఎంత సాయంచేస్తాయో చెపుతాడు . ఆ మాటలు కొందరి కి అర్థమవుతాయి కొంతమంది కి అర్థం కావు కానీ చేసేది మంచిపని అనిపించి , రవి తో సరే నీవు మొక్కలు వేసుకోవాలి అనిపిస్తే ఊరి పొలిమేరలో వేసుకో ఊరిలో అక్కడ పడితే అక్కడ వేస్తే ఊరుకోము అంటారు . రవి ద్యేయం మొక్కలు నాటడం కాబట్టి సరే అంటాడు.

కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత

రవి మంచి ఉద్యోగం లో స్థిరపడతారు కానీ మొక్కలు నాటడం అనే తన అలవాటు మార్చుకోడు ,ఊరి లో అందరు రవిని మొక్కల పిచ్చోడు అని అవహేళన చేస్తూ వుంటారు . ఆ మాటలు రవి అమ్మని చాలా భాద పెడుతూ ఉంటాయి కానీ రవి ఎవరి మాటలు పట్టిచుకోడు . ఒక సంవత్సరం వర్షాలు బాగా పడతాయి ,వర్షాల కారణంగా  చుట్టుపక్కవున్న నది పొంగి వరదలు వస్తాయి . చుట్టు  ప్రక్కల వున్న గ్రామాలు అన్ని వరద బారిన పడి మునిగిపోతాయి ,కానీ ఊరి పొలిమేరలో వున్న పెద్ద పెద్ద వృక్షాలు అడ్డుకోవడం వలన వరద రవి వాళ్ళ గ్రామం లోనికి రాదు. గ్రామం సురక్షితంగా ఉంటుంది , గ్రామం లో వున్న వాళ్ళందరూ తాము క్షేమంగా ఉండడానికి కారణం ఊరి చివర వున్న పెద్ద వృక్షాలు అని గుర్తిస్తారు . వాటిని అక్కడ నాటి ,తమ ప్రాణాలు కాపాడిని రవిని అందరు మెచ్చుకుంటారు.. రవి వాళ్ళ అమ్మ మనసు గర్వంతో నిండిపోతుంది . ఊరి ప్రజలు అందరు మొక్కల ఆవశ్యకత గుర్తించి అందరు రవిని అనుకరిస్తారు..

రవి వాళ్ళ గ్రామాన్ని చూసి చుట్టుప్రక్కల గ్రామాల వారు కూడా మొక్కలు నాటడం ప్రారంభిస్తారు .

Moral : చేసిన మంచి పని ఆలస్యమైనా మంచి ఫలితాన్నిస్తుంది .. 

Sireesha.Gummadi

 


చిప్కో ఉధ్యమం

Inspirational stories about nature in Telugu||chipko movement||

 

chipko movement

ఒక మనిషి వేరొక మనిషి కోసం పోరాడుతాడు లేదా జీవుల కోసం పోరాడుతాడు …ఇక్కడ వరకు మనకు తెలుసు కానీ, కొంతమంది మనలాంటి మనుషులు చెట్లను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టారు అనిమీకు తెలుసా … ఆ  పోరాటాన్నే చిప్కో ఉద్యమం అంటారు .

18 వ శతాబ్దం మొదట్లో రాజస్థాన్ లోని ఖేజార్డి అనే గ్రామం లో అమృత దేవి అనే బిష్ణోయ్ జాతికి చెందిన మహిళ ఉండేది. ఆమెకు చెట్లు అంటే చాలా ఇష్టం, కారణం వారి గ్రామము అంత ఆహారం కోసం ఔషదాల కోసం ఇతరతర అవసరాల కోసం చెట్లపైనే ఆధారపడే వారు. ఆ ప్రాంతాన్ని పరిపాలించే జోద్పూర్ మహారాజు తన మందిరం నిర్మించు కోవడానికి కలప అవసరమని చెట్లు నరకడానికి ఆజ్ఞ యిచ్చాడు . అప్పుడు  కొంతమంది మనుషులు ఖేజార్డి  గ్రామానికి గొడ్డళ్లతో వచ్చారు  వారిని చూసి అమృత విషయం తెలుసుకొని చెట్లను నరకవద్దని  వారిని వారించింది, అమృతకు తోడుగా వారి గ్రామస్థులు కూడా వచ్చారు కాని  నరకడానికి వచ్చినవారు ఎంతకి మాట వినకపోవడం తో అమృత ఒక చెట్టుని గట్టిగ ఆలింగనం చేసుకొని చెట్టును నరకాలి అంటే ముందుగా నా ప్రాణం తీయండి అంది.

ఊరి ప్రజలు అందరు అమృత దేవిని అనుకరించాయారు ,కానీ ఫలితంలేక పోయింది.. తమ పనికి అడ్డుగా వున్నారని చెట్లు నరకడానికి వచ్చిన మనుషులు అమృత దేవి తో సహా అమృతదేవి పిల్లలను ఇంకా 363 మంది ఊరి ప్రజలను నిర్దాక్షిణ్యంగా చంపివేశారు . జరిగిన విషయం అంత తెలుసుకున్న జోద్పూర్ మహారాజు దిగ్బ్రాంతి చెంది ,చెట్ల కోసం మనుషులు తమ ప్రాణాలు పణంగా పెడతారా ,మనుషులు చెట్టుకు ఇంత విలువనిస్తారా అని అనుకొని.. తాను చేసిన పనికి సిగ్గుపడి ఆ ప్రాంతం లో ఎవ్వరు ఎప్పటికి చెట్లు నరకరాదని ఆజ్ఞ జారీ చేశాడు.వృక్ష సంరక్షణ ఉద్యమం ఇలా మొదలయింది .

Inspirational stories about nature in Telugu||chipko movement||

తరువాత..

1973 లో ఉత్తరప్రదేశ్ (ఇప్పటి ఉత్తరాఖండ్) ,ఛమోలీ జిల్లా, గోపేశ్వర్ గ్రామం లో అప్పటి ఉత్తరప్రదేశ్ అటవీశాఖ 300 వృక్షాలను నరికేందుకు  సైమన్ కంపెనీ కి అనుమతి నిచ్చింది. కానీ అప్పటికే 1963 లో జరిగిన చైనా ఇండియా సరిహద్దు వివాదాలు కారణంగా, ఇండియా సరిహద్దు ప్రాంతం అభివృద్ధి ద్రుష్ట్యాఉత్తరప్రదేశ్ లోని  చాలా అటవీ సంపద నాశనం అయింది , అయినప్పటికీ 1973 లో చెట్ల నరికివేతకు మళ్ళి అనుమతి  ఇవ్వడంతో ,అక్కడ గిరిజన తెగకు చెందిన గౌరాదేవి అనే మహిళ మరి కొందరు మహిళలను తీసుకొని వెళ్లి చెట్లను నరకవద్దు అని వాటిని నరకాలి అంటే మమల్ని ముందు నరకండి అని వారు చెట్లను ఆలింగనం చేసుకున్నారు .  వీరి చర్య చూసి భయపడిన  ఉత్తరప్రదేశ్ అటవీశాఖ సైమన్  కంపెనీ తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది . ఈ ఉద్యమాన్ని సుందర్ లాల్ బహుగుణ అనే వ్యక్తి ముందుకు తీసుకు వెళ్ళాడు. ఈయన హిమాల పర్వత ప్రాంతాల్లో పాదయాత్ర చేసి ప్రజలకు చిప్కో ఉద్యమం గురించి అవగాహన కలిపించాడు.

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కలసి చెట్ల నరికివేత వలన నష్టాన్ని వివరించాడు .ప్రధాని  చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా చట్టాన్ని చేశారు . ఈ విదంగా ప్రజలు తమకు ఎంతో సహాయపడే వృక్షాన్ని కాపాడు కొనేందుకు పర్యావరణ సత్యాగ్రహాన్ని చేశారు . మొదటిగా మహిళలు ఇంటి సంరక్షణ  ,పిల్లలు సంరక్షణ నే కాకుండా మన పర్యావరణ సంరక్షణ కూడా తమ భాద్యత అని నిరూపించారు .

“చిప్కో అంటే ఆలింగనం అని అర్థం “

Moral :సమాజానికి నష్టం కలిగించేది ఏదైనా సహించకూడదు .

 

For more stories please visit:బాధ్యత 

error: Content is protected !!