Panchatantra Stories in Telugu
Spread the love

Contents

మూడు వాగ్దానాలు

Panchatantra Stories in Telugu:

ఆదిత్య అనే యువకుడు ఒక అడవి గుండా వెళుతున్నాడు. అతను ఒక బావి దగ్గరగా వచ్చే సరికి అతనికి దాహం వేసి కొంచెం నీళ్ళు తాగాలనిపించింది. అయితే అప్పటికే ఎండిపోయిన బావిలో పులి, పాము, మనిషి చిక్కుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు . ఆ మూడు తమని పైకి లాగమని ఆదిత్యని వేడుకున్నారు.
ఆదిత్య భయంతో ఆలోచనలో పడ్డాడు అమ్మో !! యిప్పుడు నేను వీటిని కాపాడితే . “పులి నన్ను తినేస్తే? పాము నన్ను కాటేస్తే? అనుకున్నాడు. నన్ను కాపాడితే నీకు ఏ హాని చేయనని పులి హామీ ఇచ్చింది. పాము కూడా మాటిచ్చింది .
ముగ్గురికీ సాయం చేసేందుకు ఆదిత్య నిర్ణయించుకొని పొడవాటి తాడును బావి లోపలికి విసిరాడు. ముందుగా పులి బయటకు వచ్చింది. “నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు మిత్రమా. నీకు మళ్ళీ ఎప్పుడైనా ఈ అడవిలో పని ఉంటే, నా ఇంటికి తప్పకుండా రా . నీ సహాయానికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాను” అని పులి చెప్పింది.
ఆ తర్వాత పాము బయటకు వచ్చింది. “నువ్వు ధైర్యవంతుడైన యువకుడివి. నీకు ఎప్పుడు నా సహాయం అవసరమైనా నేను నీకు అండగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నువ్వు చేయవలసిందల్లా నా పేరు నువ్వు పలికితే చాలు” అని పాము చెప్పింది.
చివరకు మానవుడు బయటకు వచ్చి . “ధన్యవాదాలు మిత్రమా , నేను ఈ అడవి ప్రక్కనున్న రాజధాని నగరంలో స్వర్ణకారుడిగా పని చేస్తున్నాను. నేను ఎప్పటికీ నీ స్నేహితుడిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా నగరానికి వస్తే దయచేసి నన్ను సందర్శించు ”అని చెప్పాడు
కొత్త స్నేహితులను సంపాదించుకున్నందుకు ఆదిత్య సంతోషిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

కొన్ని సంవత్సరాల తరువాత…,

అతను అదే అడవి గుండా వెళుతున్నాడు. ఆదిత్యకి పులి మాట గుర్తొచ్చింది, పులి నివసించే గుహ వద్దకు వెళ్ళాడు.
పులి అతన్ని ఆప్యాయంగా పలకరించింది. ఆదిత్యకి పులి అడవి నుండి తాజా పండ్లు మరియు త్రాగడానికి నీరు ఇచ్చింది . ఆదిత్య వెళ్ళబోతుంటే, పులి ఆదిత్యకు విలువైన రత్నాలతో పొదిగిన బంగారు ఆభరణాలను ఇచ్చింది.
ఆదిత్య ఆ బహుమతి చూసి చాలా ఆనందించి పులికి కృతజ్ఞతలు చెప్పాడు , కానీ ఆభరణాలను ఏమి చేయాలో ఆదిత్యకు తెలియలేదు .
అప్పుడు అతనికి తన స్నేహితుడైన స్వర్ణకారుడు గుర్తొచ్చాడు. వెంటనే ఆదిత్య స్వర్ణకారుడి ఇంటికి వెళ్ళాడు .
స్వర్ణకారుడు ఆదిత్యను ఆప్యాయంగా పలకరించాడు. అప్పుడు ఆదిత్య తాను పులిని సందర్శించిన విషయం అది తనకు యిచ్చిన బహుమతి విషయం చెప్పి ,ఆభరణాలు కరిగించి బంగారు నాణేలు చేసి తనకు సహాయం చేయమని స్వర్ణకారుడిని కోరాడు.
అప్పుడు ఆ ఆభరణాలు చూసి స్వర్ణకారుడు అవాక్కయ్యాడు. స్వర్ణకారుడు వాటిని రాజు తమ్ముడి కోసం తన చేతులతో తయారు చేశాడు. అదే తమ్ముడు కొన్ని నెలల క్రితం అడవిలో కనిపించకుండా పోయాడు. తన తమ్ముడు గురించి సమాచారం అందించిన వారికి రాజు బహుమానం ప్రకటించారు.
కానీ స్వర్ణకారుడుజరిగిన విషయాన్నీ దాచిపెట్టి . “ఈ ఆదిత్య రాజు తమ్ముని చంపాడని నేను రాజుతో చెబితే, మహా రాజు ఖచ్చితంగా నాకు బహుమానం ఇస్తాడు,” అనుకున్నాడు.
స్వర్ణకారుడు ఆదిత్యను కొంత సేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి రాజభవనానికి చేరుకున్నాడు. రాజుకి తన తమ్ముడిని చంపిన వ్యక్తి దొరికాడని స్వర్ణకారుడు చెప్పాడు.
ఆదిత్యను బందించడానికి రాజు స్వర్ణకారుని ఇంటికి సైనికులను పంపాడు. రాజు ఆదిత్య చెప్పడానికి ప్రయత్నించిన మాటలు వినడానికి నిరాకరించాడు మరియు అతన్ని జైలులో పడేశాడు.

ఆదిత్య జైలు గదిలో బాధగా కూర్చున్నప్పుడు, అతనికి పాము యిచ్చిన వాగ్దానం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆదిత్య పాము పేరు పిలిచాడు. కొద్దిసేపటికే పాము జైలులోకి దూసుకువచ్చింది . “నా స్నేహితుడా ఎలా ఉన్నావు?”అని ఆదిత్యని పలకరించింది

ఆదిత్య పాముకి కథ మొత్తం చెప్పాడు.అప్పుడు పాము “బాధపడకు ఆదిత్యా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది,అని ” పాము ఆదిత్య చెవుల్లో ఒక పథకం చెప్పింది.

Panchatantra Story Books

మరుసటి రోజు…

మహా రాణి పాము కాటుకు గురైందని రాజభవనం అంతా వ్యాపించింది. ఆమెకు చికిత్స చేయడానికి రాజ్యంలో అత్యుత్తమ వైద్యులను పిలిచారు. కానీ రాణి మాత్రం అపస్మారక స్థితిలో ఉండిపోయింది. రాణికి వైద్యం అందించిన వారికి రాజు బహుమానం ప్రకటించాడు.
రాణిని తాను రక్షించగలనని ఆదిత్య తన చెరసాల బయట ఉన్న సైనికుడికి చెప్పాడు. రాజు వెంటనే అతన్ని పిలిపించాడు.
“నేను ఒక్కడినే మహా రాణి గారి గదిలోకి ప్రవేశించాలి,ఆ గదిలో మరెవ్వరూ ఉండకూడదు… అలా కాక పొతే మంత్రం పనిచేయదు .”అని చెప్పాడు
ఆదిత్యను తప్ప మరెవరినీ గదిలోకి రానివ్వకూడదని రాజు కాపలాదారులతో కఠినమైన సూచనలను యిచ్చాడు .
ఆదిత్య లోపలికి వచ్చేసరికి గది నిశ్శబ్దంగా ఉంది. అతను మరోసారి పాము పేరు నెమ్మదిగా పిలిచాడు . పాము వచ్చి రాణి శరీరం నుండి విషాన్ని బయటకు తీసింది. ఆదిత్య పాము అదృశ్యమయ్యే ముందు దానికి కృతజ్ఞతలు తెలిపాడు.
కొన్ని నిమిషాల తర్వాత, రాణి కళ్ళు తెరిచింది. రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. “యువకుడా, నీకు కావలసిన ప్రతిఫలం కోరవచ్చు.”అని అన్నాడు .

అప్పుడు ఆదిత్య “మహారాజా , నాకు ఏ బహుమతులు అక్కర్లేదు. మీరు నా కథను వినమని మాత్రమే నేను అడుగుతున్నాను. నేను మీ తమ్ముడుకు ఏ హాని చేయలేదు. నన్ను నమ్మమని నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను “అని అన్నాడు .
పులి, స్వర్ణకారుడు మరియు పాము చేసిన మూడు వాగ్దానాలతో సహా ఆదిత్య జరిగినదంతా వివరించాడు.
రాజు ఆదిత్య జైలు శిక్షను రద్దు చేసి , స్వర్ణకారుడిని పిలిపించి శిక్ష విధించాడు. ఆ తర్వాత ఆదిత్యకు అతని నిజాయితీకి బంగారు సంచి ఇచ్చాడు.

Moral :నిజాయితీకి ఎప్పుడూ భగవంతుని అండ ఉంటుంది .

బాటసారి కథ

Panchatantra Stories in Telugu:

ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉండేది, ఆ చెరువు పక్కన వున్న ఒక పొదలో ముసలి పులి నివసిస్తూ ఉండేది . ఒక రోజు దానికి చాలా ఆకలిగా వుంది కానీ వేటాడే ఓపిక లేదు ,ఆకలి ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ వుంది అంతలో అటువైపు ఒక బాటసారి వెళుతూ కనిపించాడు అతనిని ఎలాయినా చంపి తినాలనినిర్ణయిన్చుకుంది  పులి .

అతనిని గట్టిగా పిలుస్తూ యిది గో నాదగ్గర ఒక బంగారు కడియం వుంది దీనిని ఎవరైనా పుణ్యాత్ముడుకి యిద్దాం అనుకుంటున్నాను అలాయినా  ఇంతకాలం నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం జరుగుతుందని నా ఆశ ,అని అంటూ తన చేతిలో వున్న బంగారు కడియాన్ని చూపిస్తుంది అతనికి .

బంగారు కడియం చూడగానే అతనికి ఆశ కలుగుతుంది కానీ బంగారం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టలేదుకదా … అప్పుడు అతను పులి తో నేను నువ్వు ఇచ్చే బంగారం కోసం ఆశపడితే నేను నీకు బలి ఐపోతాను అంటాడు . అప్పుడు పులి నేను యిప్పుడు చాలా ముసలి దానను అయిపోయాను నాశరీరం లో ఎటువంటి సత్తువలేదు పైగా నేను పండ్లు కాయలు మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాను ,నేను నిన్ను ఏవిధంగా చంపగలను . నువ్వు ఏమీ  ఆలోచించకుండా ముందు వచ్చి ఈ చెరువులో స్నానం చేసి రా నేను నీకు ఈ బంగారు కడియాన్ని బహుమతి గా ఇస్తాను అంటుంది .

అతనికి పులి మీద నమ్మకం కంటే బంగారం మీద ఆశ ఎక్కువ ఉండడం తో ,స్నానం కోసం చెరువులో దిగుతాడు . చెరువులో ఎక్కువ బురద ఉండడంతో దానిలో ఇరుక్కుపోయి బయటకు రాలేక పోతాడు రక్షించండి…  రక్షించండి….  అని గట్టిగా అరుస్తాడు . అప్పుడు పులి భయపడకు మిత్రమా నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి వచ్చి అతనిపై అమాంతం పడి చంపివేస్తుంది ,తన క్షుద్బాధ తీర్చుకుంటుంది .

Moral :అత్యాశ వున్నవారు జీవితం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

TOP 10 Short Stories in Telugu with Moral for Kids 2024


నలుగురు మిత్రులు

Panchatantra Stories in Telugu:

ఒక అడవిలో ఒక జింక ,తాబేలు, ఎలుక, కాకి స్నేహంగా ఉండే వారు .  రోజూ  వారు ఒక చోట సమావేశమై మాట్లాడుకుంటూ ఉండేవారు కానీ ఒకరోజు ఆ సమావేశానికి జింక రాలేదు .  వారు అందరూ జింక కోసం  చాలా సేపు ఎదురు చూశారు ,అప్పుడు తాబేలు కాకి తో అయ్యో జింక ఇప్పటివరకు రాలేదు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నదేమో దయచేసి ఒకసారి వెళ్లి జింక ఎక్కడుందో చూసి రాగలవా అని అడుగుతుంది. అప్పుడు కాకి చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి  వలలో చిక్కుకున్న జింకను చూస్తుంది ,చూసి అయ్యో జింక ప్రమాదంలో ఉంది నేను ఈ విషయాన్ని నా మిత్రులందరికీ తెలియజేయాలి అని చెప్పి తాబేలు ,ఎలుక ఉన్న ప్రదేశానికి వస్తుంది . అప్పుడు జరిగిన విషయం అంతా తన మిత్రులతో చెబుతుంది. ఎలుకను తన కాళ్లతో పట్టుకొని ఎగురుకుంటూ జింక ఉన్న ప్రదేశానికి తీసుకు వెళ్తుంది ,అప్పుడు ఎలుక తన పదునైన పళ్ళతో వలను కొరికి వేస్తుంది. అప్పుడు జింక  ప్రమాదం నుంచి బయట పడుతుంది .

తర్వాత…

అందరూ వేటగాడు వచ్చేలోపు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుండగా పొదలనుంచి  నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ తాబేలు వస్తుంది తాబేలు ను చూసి అందరూ అయ్యో వేటగాడు  వచ్చే సమయానికి అందరం ఇక్కడ నుంచి తప్పించుకుందాం  అనుకున్నా కానీ తాబేలు తొందరగా పరిగెత్తలేదు, ఇది వేటగాడికి చిక్కుతుందేమో  అని భయ పడుతూ ఉండగా వేటగాడు వచ్చి వల కొరికి ఉండడం చూసి అయ్యో జింక చేతి నుంచి తప్పించుకుంది అనుకుంటాడు ఇంతలో అక్కడ ఉన్న తాబేలును చూచి ఈ తాబేలు కూడా నాకు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి తాబేలు దగ్గరికి వెళ్లి దానిని ఒక సంచిలో వేసుకుని భుజానికి తగిలించుకొని వెళుతూ  ఉంటాడు .

జరిగిన విషయాన్ని గమనిస్తూ ఉన్న స్నేహితులు ఇప్పుడు ఏ విధంగా అయినా మనం తాబేలుని రక్షించుకోవాలి అని వారు నిర్ణయించుకుంటారు తర్వాత ఒక చెరువు దగ్గర జింక చనిపోయినట్లు పడుకొని ఉంటుంది కాకి దాని మొహం మీద కూర్చొని జింక కనులను పొడుస్తున్నట్లుగా నటిస్తుంది , అదే సమయానికి అక్కడికి వచ్చిన వేటగాడు జింక శరీరాన్ని చూసి ఆహా చనిపోయిన జింక నాకు దొరికింది నాకు వేటాడవలసిన  శ్రమ కూడా  లేదు, ఎలాగన్నా దీనిని నేను తీసుకు వెళతాను అనుకొని తన భుజాల వున్న తాబేలుని క్రింద  పెట్టి జింక శరీరం దగ్గరకు వెళతాడు. అదనుకోసం  కోసం ఎదురుచూస్తున్న ఎలుక వెంటనే తాబీలు దగ్గరకు వెళ్లి సంచిని కొరికి వేసి తాబేలు ను రక్షిస్తుది అప్పుడు తాబీలు నెమ్మదిగా చెరువులోకి జారుకుంటుంది . అదే సమయం కోసం ఎదురు చూస్తున్నకాకి  గట్టిగా అరవడంతో కళ్ళుమూసుకుని చనిపోయినట్టు నటిస్తున్న జింక అక్కడి నుంచి పారిపోతుంది , నిరాశ చెందిన వేటగాడు వెనక్కి తిరిగి తాబేలు తీసుకుందాం అనేసరికి తాబేలు కూడా కన పడకపోవడంతో అక్కడనుంచి వెళ్ళి పోతాడు ఆ విధంగా నలుగురు స్నేహితులు ఒకరికొకరు సహాయం గా ఉండి  వారి మిత్రులను కాపాడుకున్నారు.

Moral : స్నేహబంధానికి విలువకట్టలేము .

For more friendship related stories please click: frienship stories


కొంగ -పులి

Panchatantra Stories in Telugu:

ఒక అడవిలో ఒక పులి ఉండేది  అది రోజూ  రకరకాల జంతువులను వేటాడుతూ జీవనం సాగించేది . ఒకరోజు అలాగే ఒక జంతువును తింటూ ఉంటే దాని ఎముక ఒకటి పులిగొంతు లో అడ్డంగా ఇరుక్కుంది . దానిని బయటకు తీయడానికి పులి శత విధాలుగా ప్రయత్నించింది కానీ ఎముక బయటకు రాలేదు . అలా చాలా సేపు గడచిన తర్వాత పులి అలసిపోయి నీరసించి పోయింది . ఇంకా ఎవరినన్నా  సహాయం  అడుగుదామని  దగ్గరలో వున్న కొంగ వద్దకు వెళ్లి కొంగ బావ నా గొంతులో ఎముక ఇరుక్కుపోయింది అది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ పొడవైన ముక్కు తో దానిని తీయగలవా అని అడిగింది , కొంగ కు సహాయం చేయాలి అనిపించినా గాని పులి తనను తినేస్తాడని భయపడి పులితో నీ నోటిలో  నా తల ఉంచి నేను బ్రతకగలనా అంది .

అప్పుడు పులి కొంగను వేడుకుంటూ నువ్వు ఈ ఎముకను తీసినట్లైతే నువ్వు నా ప్రాణదాతవు అవుతావు అటువంటి నిన్ను నేను ఎలా చంపగలను నన్ను నమ్ము అంటుంది . అప్పుడు కొంగ పులి పై జాలిపడి పులి నోటిలో  వున్న ఎముకను తీసివేస్తుంది . అప్పుడు పులి కొంగకు కృతజ్ఞతలు చెప్పి ఈ రోజు నుండి నువ్వు నేను మంచి మిత్రులం అంటుంది    అమాయకత్వంతో కొంగ కూడా దాని మాటలు నమ్ముతుంది .

అలా కొన్నాళ్ళు  కొంగ పులి స్నేహం గా ఉండి కలసి ఆహారం తింటాయి . ఒకరోజు పులికి తినడానికి ఏమోదొరకదు అది చాలా ఆకలిగా ఉంటుంది . ఏమి చేద్దాం అని ఆలోచిస్తుండగా దానికి కొంగ కనబడుతుంది , కొంగను చూడగానే పులికి ఆకలి ముందు వారి స్నేహం కనబడదు . అది కొంగతో మరలా గొంతులో ఎముక గుచ్చుకుందని చెపుతుంది , మళ్ళీ కొంగ పులిని అమాయకంగా నమ్మి దాని నోటి లో తల పెట్టి ప్రాణం పోగొట్టుకుంటుంది .

Moral : దుష్టులతో సహవాసం ప్రాణాంతకం .

 


తొందరపాటు

ఒక రైతు తన ఇంటిలో ముంగిసను పెంచుకుంటూ ఉండేవాడు . ఆ ముంగిస అతనికి చాలా నమ్మకంగా ఉండేది . రైతుకు ఒక చిన్న బిడ్డ ఉండేది . ఒక రోజు రైతు ,రైతు భార్య  పనిమీద బయటకు వెళుతూ ముంగిసను చిన్నబిడ్డకు కాపలాగా ఉంచి వెళ్లారు . అదే సమయం లో ఒక పాము బిడ్డవుండే ఉయ్యాల దగ్గరకు వచ్చేసరికి ముంగిస దాని తో పోరాడి పాము మీద కొరికి పామును చంపివేసి బయటకు వస్తుంది . రైతు తిరిగి వచ్చేసరికి రక్తం తో వున్న ముంగిస నోరు చూసి అది తన బిడ్డను చంపివేసింది అని భావించి రైతు ముంగిసను రాయితో కొట్టి చంపివేస్తాడు .

ఇంటిలోకి వెళ్లి చూసే సరికి ఉయ్యాలలో ఆడుతున్న బిడ్డను చూస్తాడు దాని ప్రక్కన చచ్చిపోయివున్న పామును చూసి ,జరిగిన విషయం అర్థం చేసుకొని తన తప్పుకు తానె పశ్చాత్తాప పడతాడు .

Moral :ఏదయినా నిర్ణయం తీసుకొనే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.


ద్రోహం

Panchatantra Stories in Telugu:

నందిగుప్తుడు, సుదర్శనగుప్తుడు అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు వారు వేరే రాజ్యాలకు వెళ్ళి వ్యాపారం చేసి బాగా సంపాదించి తిరిగి వారు వారి రాజ్యానికి బయలుదేరారు . మార్గమధ్యంలో నందిగుప్తుడుసుదర్శనగుప్తుడు తో మిత్రమా మనము వేరే చోటకి వెళ్లి ఇంత ఆస్తి సంపాదించాం అంటే అందరూ మనల్ని సహాయం అడుగుతారు ,డబ్బు కావాలని అడుగుతారు పైగా దొంగలు మన వద్ద సొమ్ము దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. అందుకే మనము ఈ బంగారాన్ని దాచిపెట్టి ఊర్లోకి వెళ్లి మనము వ్యాపారంలో చాలా నష్టపోయాం అని చెబుతాము అని అంటాడు.

నంది గుప్తుని ఆలోచన సుదర్శనగుప్తు నికి నచ్చుతుంది ఇద్దరూ కలిసి ఉన్న బంగారాన్నంతా రెండు లంకెబిందెలు లో సర్ది దానిని ఒక మర్రిచెట్టు కింద గొయ్యి తవ్వి దాని లోపలి పెట్టి దానిని మట్టితో కప్పివేసి ఇద్దరూ కలిసి వారి రాజ్యానికి ప్రయాణం అవుతారు.
నందిగుప్తుడు తాను ఏ విధంగా సుదర్శన గుప్తుడిని మోసం చేయాలనుకున్నాడో ఆ విధంగానే సుదర్శన గుప్తుడు తనను నమ్మాడని నందిగుప్తుడు చాలా ఆనందిస్తాడు .

అదే రోజు రాత్రి…

నందిగుప్తుడు ఎవరికీ తెలియకుండా మర్రిచెట్టు క్రింద కి వెళ్లి అక్కడ ఉన్న లంకె బిందెలు తవ్వి తీసి దానిని రహస్యంగా తన ఇంటికి తెచ్చుకుంటాడు . అలా కొంతకాలం గడిచిన తర్వాత సుదర్శన గుప్తుడు వ్యాపారంలో డబ్బు అవసరమై వారు దాచిన బంగారం కోసం మర్రిచెట్టు దగ్గరికి వెళ్తారు ,కానీ వారికి మర్రిచెట్టు కింద ఎటువంటి లంకె బిందెలు కనబడవు బంగారం ఎక్కడికి పోయిందో తెలియక వారు చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా వెతుకుతారు కానీ లంకెబిందెలు ఎక్కడా కనబడవు . అప్పుడు నందిగుప్తుడు సుదర్శనునితో నువ్వు బంగారం అక్కడ దాచావు చెప్పు అని వాగ్వాదానికి దిగుతాడు ,అప్పుడు సుదర్శనుడు నన్ను నమ్ము మిత్రమా మనం ఇక్కడ బిందెలు దాచిపెట్టక మళ్ళీ నేను ఇక్కడకు రాలేదు అంటాడు కానీ నందివర్ధనుడు తన తప్పు బయట పడకూడదని గట్టిగా అడుగుతాడు .

వీరి వాగ్వివాదం చాలా పెద్దది అవుతుంది అప్పుడు సుదర్శనుడు దొంగ అనే ముద్ర భరించలేక , మనము రాజుగారి దగ్గరికి వెళ్లి న్యాయం కోసం అడుగుతాము అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని అంటాడు చేసేది లేక మోసం బయట పడకుండా జాగ్రత్త పడదామని రాజుగారి దగ్గరికి తీర్పు కోసం తను కూడా వెళ్తాడు అప్పుడు నందిగుప్తుడు ,సుదర్శనగుప్తుడు జరిగిన విషయం రాజుగారికి వివరిస్తారు.అప్పుడు రాజు గారు మీరు లంకెబిందెలు మట్టిలో దాచినప్పుడు మీతోపాటు ఎవరైనా ఉన్నారా సాక్ష్యంగా మీరు ఏమన్నా తీసుకొని రాగలరా అని రాజు గారు వీరిని అడుగుతాడు .
అప్పుడు నందిగుప్తుడు ఉన్నారు మహారాజా మేము బంగారం దాచి పెట్టినప్పుడు అక్కడ ఉన్న మర్రిచెట్టు సాక్ష్యం చెబుతుంది అని చెప్పి మహారాజుతో అంటాడు అప్పుడు సభలో ఉన్న వాళ్లంతా మర్రిచెట్టు మాట్లాడమేంటి అంటారు అప్పుడు నందిగుప్తుడు నిజాయితీ గల వాడు తలచుకుంటే ఏమన్నా అవుతుంది మర్రిచెట్టు కూడా మాట్లాడుతుంది అంటాడు . అప్పుడు మహారాజు సరే రేపు ఉదయం మనమందరం వెళ్లి మరి చెట్టు దగ్గరికి వెళ్లి అసలు జరిగిన విషయం ఏమిటో మనం తెలుసుకుందాం అని మహారాజు గారు చెప్తారు.

ఆ రోజు రాత్రి

నందిగుప్తుడు ఇంటికి వెళ్లి తన తండ్రితో జరిగిన విషయమంతా చెప్పాడు ,తండ్రి నువ్వు సుదర్శనుడిని మోసం చేస్తున్నావు మోసం చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుంది అని తనని గద్దిస్తాడు , అప్పుడు నందిగుప్తుడు నువ్వు నేను ఎటువంటి పనిచేసినా ఎప్పుడూ నాకు సహకరించలేదు నన్ను మెచ్చు కోలేదు ఈ సారి మాత్రం నువ్వు నాకు సహాయం చేయాలి అని తండ్రి వేడుకుంటాడు, తండ్రి నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అడుగుతాడు అప్పుడు నందిగుప్తుడు తండ్రి తోటి నువ్వు వెళ్లి మర్రిచెట్టు తొర్రలో దాక్కో రేపు ఉదయం మహారాజుగారు వచ్చే సమయానికి నాకు అనుకూలంగా సమాధానం చెప్పు అంటాడు అందుకు నందిగుప్తును తండ్రి అంగీకరించడు అయినప్పటికీ నందిగుప్తుడు తండ్రిని భుజాన వేసుకుని బలవంతంగా చిన్న మర్రిచెట్టు తొర్రలో వుందుతాడు , తన చుట్టూ చీమలు పురుగులు ఉన్నప్పటికీ తన ఏమీ పట్టించుకోకుండా తండ్రిని ఎవరికీ కనబడను లోపలికి తోసి వేస్తాడు .

Panchatantra Stories in Telugu:

ఉదయం అయిన తర్వాత

మహారాజుగారు సుదర్శణగుప్తుణ్ణి ,నందిగుప్తుడు మిగిలిన సైనికులు ని తీసుకొని మర్రి చెట్టు వద్దకు వస్తారు. నందిగుప్తుడు మరి చెట్టు వద్దకు వచ్చి మర్రిచెట్టుకు జరిగిన విషయమంతా వివరిస్తాడు, మర్రిచెట్టు…. ఈ బంగారాన్ని ఎవరు తీసుకున్నారు అని అడుగుతాడు మరి చెట్టు నుంచి ఎటువంటి సమాధానం రాదు, మరి కొంచెం గొంతు పెంచి మర్రిచెట్టు… ఈ బంగారాన్నంతా ఎవరో తీసుకున్నారు నువ్వు సమాధానం చెప్పకపోతే నేను ఊరుకోను అని గట్టిగా అంటాడు . అప్పుడు . మరి చెట్టు నుంచి నందిగుప్తును తండ్రి “సుదర్శణగుప్తుడు ఈ బంగారం మొత్తం తీసుకున్నాడు” అని నెమ్మదిగా చెప్తాడు మర్రిచెట్టు మాట్లాడడం విని అందరూ ఆశ్చర్యపోతారు కానీ సుదర్శణగుప్తుడు దీనిలో ఏదో రహస్యం దాగి ఉంది మీరు అనుమతిస్తే నేను ఆ రహస్యాన్ని ఛేదిస్తాను అని రాజుగారితో అంటాడు .

సుదర్శణగుప్తుడు మర్రిచెట్టు ఎక్కి కొమ్మ కొమ్మ వెతుకుతాడు కానీ తనకు ఎటువంటి ఆధారం దొరకదు . చెట్టు లో ఒక తొర్ర కనిపిస్తుంది కానీ దాని చుట్టూ చుట్టూ చీమలు ఉండడంవల్ల లోపల ఎవరూ ఉండరు అనుకుంటాడు కానీ ఎందుకన్న మంచిది అని ఒకసారి దాని లో అని తన చెయ్యి పెడతాడు అప్పుడు సుదర్శనుడు కి ఒక మనిషి శరీరం తగులుతుంది అప్పుడు సుదర్శనుడు గట్టిగా మహారాజా దీనిలో ఎవరూ వున్నారు అని చెపుతాడు .
అప్పుడు సైనికులు అందరూ వచ్చి తొర్రలో ఉన్న నన్దిగుప్తుని తండ్రి ని బయటికి బలవంతంగా లాగుతారు చిన్న తొర్రలో తనని తోయడం వలన అక్కడవున్న చీమలు పురుగులు కుట్టడం వలన అతను సగం చచ్చిపోతాడు తర్వాత ఒకేసారి రాజుగారు ముందు నిలబెట్టే సరికి అవమానంతో పూర్తిగా చనిపోతాడు. తండ్రి శవం మీద పడి నందిగుప్తుడు ఏడుస్తూ ఉంటాడు అప్పుడు మహారాజుగారు నందిగుప్తుడు అన్యాయంగా తన తండ్రినిచమపినందుకు సుదర్శనగవుతుని పై నింద వేసినందుకు నందిగుప్తునికి ఉరిశిక్ష వేస్తాడు . రెండు లంకె బిందెల బంగారాన్ని సుదర్శనుడుకి ఇచ్చేస్తాడు.

Moral :చెడపకురా చెడేవు

 

****అతి తెలివి (పంచతంత్ర కథ) ****

****పరమానందయ్య శిష్యుల కథ****

 

 

error: Content is protected !!