Story for Kids to Read in Telugu ||ఆనందం||
Spread the love

Contents

ఆనందం

 

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఎప్పుడూ  కలసిమెలసి ఉండేవారు.  వారు రోజు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి వాటిని తీసుకొచ్చి వారి ఊర్లో ఉన్న సంతలో అమ్మి వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడిపే వారు.

అన్నదమ్ములు  అనుకున్న దానికన్నా ఎక్కువ సంపాదించినప్పటికీ వారు ఎప్పుడు విచారంగా ఉండే వారు . వారికి నచ్చిన ఆహారం తిన్న వారికి నచ్చిన దుస్తులు ధరించిన వారికి నచ్చిన వస్తువు కొనుక్కున్నప్పుడు కూడా వారు ఎప్పుడు ఆనందించేవారు కాదు.

ఒకరోజు అన్నదమ్ములు ముగ్గురు కట్టెలు కొట్టి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ఒక వృద్ధురాలు వారి కంట పడింది ఆమె తన చేతిలో  ఒక  బరువైన సంచి ఉంచుకొని దానిని మోయలేక చాలా బాధపడుతూ భారంగా నడుస్తూ ఉంది. ఆమెను చూసి జాలిపడిన ఈ అన్నదమ్ములు ఆమె దగ్గరికి వెళ్లి అవ్వా మేము నీకు సహాయం చేయాలని అనుకుంటున్నాము, మేము ఈ  సంచిని మీ ఇంటిదాకా తీసుకొని వస్తాము అని అన్నారు .

అప్పుడు…

ఆ వృద్ధురాలు చాలా సంతోషించి మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు, అందుకు మీకు కృతజ్ఞతలు అని తెలిపింది. వారు ఆమెను ఈ సంచిలో ఏమి ఉన్నాయి అని ప్రశ్నించగా ఆమె దానిలో అడవిలో రాలిపోయిన పళ్ళన్ని ఏరుకొని ఆ సంచి లో దాచి వుంచాను  అని చెప్పింది .

అలా కొంతసేపటికి వారు ఆ వృద్ధురాలు ఇంటిని చేరుకున్నారు అప్పుడు ఆమె వారితో మీరు నాకు ఈ రోజు చాలా సహాయం చేశారు అందుకు నా మనస్సు చాలా ఆనందంగా ఉంది, మీకు ఏమి కావాలో కోరుకుంటే నేను మీ కోరికలు తీరుస్తాను అని చెబుతుంది.  అప్పుడు అన్నదమ్ములు ముగ్గురు ఎంతో సంతోషించి, అవ్వ..  మేము ఎంత సంపాదించినప్పటికీ ఎప్పుడూ  విచారంగా ఉంటున్నాము మాకు ఆనందం అంటే ఏంటో అసలు తెలియకుండా ఉంది, అని ఆమెతో అన్నారు .

అప్పుడు ఆమె మీరు మీ  కోరికలు నాతో చెప్పినట్లయితే నేను మీ కోరికలు తీరుస్తాను  ఆ విధంగా మీరు ఆనందాన్ని పొందుతారు అని చెబుతుంది.  అప్పుడు మొదటి వాడు ఆమెతో నాకు చాలా పెద్ద భవంతి దాన్నిండా పనివాళ్ళు కావాలి అని కోరుకున్నాడు.

రెండోవాడు నాకు మా  ఊరిలో అందరి కన్నా చాలా పెద్ద పొలము కావాలి అని అని కోరుకున్నాడు. తరువాత మూడవవాడు  నాకు ఈ ఊరి లో అందరికన్నా పెద్ద అధికారిగా  ఉండాలి అని వుంది ,కాబట్టి ఈ ఊరిలో అందరూ నా మాట వినాలి అని కోరుకున్నాడు.

వృద్ధురాలు ముగ్గురు కోరికలు విన్న తర్వాత మీరు కోరుకున్న విధంగా అంతా జరుగుతుంది అని దీవించింది.  అప్పటినుండి వారు ముగ్గురు వారికి కావలసినవి వారు పొంది అక్కడి నుండి వెళ్లారు.

 అలా కొంతకాలం ….

గడిచిన తర్వాత మొదటి వాడు తన పెద్ద భవంతి లో విశ్రాంతి తీసుకుంటూ ఎటువంటి పని చేయకుండా పనివాళ్ళ మీద దృష్టి పెట్టకుండా బద్ధకం గా తయారయ్యాడు అందువలన పని వాళ్లు ఎప్పుడూ తనని మోసం చేస్తూ ఉండేవారు. వారివలన  అతనికి ఎప్పుడూ చాలా బాధ కలుగుతూ ఉండేది.  రెండవవాడు తనకున్న అతిపెద్ద పొలాన్ని సరిగ్గా చేయలేక సరైన పంట వేయకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నష్టం వచ్చింది అందుకు అతను చాలా విచారంగా ఉండేవాడు .

మూడవ వాడు  తన అధికార బలంతో అందరినీ ఆజ్ఞాపిస్తూ అవమానకరంగా మాట్లాడుతూ ఉండడంవల్ల ఊర్లో ఎవరు తనతో సఖ్యత గా ఉండేవారు కాదు అందువలన అతను ఎప్పుడు విచారంగా ఉండేవాడు.

ఒక రోజు ముగ్గురు అన్నదమ్ములు కలుసుకొని  వారి వారి గురించి మాట్లాడుకుంటూ మనము మళ్లీ ఆ వృద్ధురాలు దగ్గరకు వెళ్లి మన బాధలు చెప్పుకుందాం అనుకుంటూ వారు ముగ్గురూ కలిసి వృద్దురాలు ఉన్న చోటికి వెళ్ళారు .

ఆమె జరిగిన విషయమంతా తెలుసుకుని నేను ఇంకొకసారి గతంలో మీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వగలను కానీ…  దానివల్ల కూడా మీకు సంతోషం కలగదు . ముందు మీరు ఉన్నదానితో తృప్తి పడడం సంతృప్తి చెందడం నేర్చుకున్నట్లు అయితే మీ దగ్గర ఎంత తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ మీరు ఆనందంగా ఉంటారు కాబట్టి ముందు మీరు సంతృప్తి చెందడం నేర్చుకోండి అని వారి  ముగ్గురి  తో చెప్పుతుంది . అప్పుడు అన్నదమ్ములు ముగ్గురూ  వారి లో ఉన్న లోపాన్ని తెలుసుకొని మమ్మల్ని క్షమించండి ఈరోజు నుంచి మేము మా పనులను సక్రమంగా చూసుకుంటూ ఉన్న దానిని అభివృద్ధి చేసుకుంటూ సంతృప్తి గా బతుకుతాము  అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్లారు.

 

For more moral stories please visit: Jeevitham

 

 

 

error: Content is protected !!