kids activities
Spread the love

 

 

 

Contents

Types of Activities to Engage kids at home 

 

హాయ్ అందరు ఎలావున్నారు…

ఈ రోజు చిన్న పిల్లల తల్లిదండ్రులకు నాకు తెలిసిన కొన్ని విషయాలు చెపుతాను ,వాటి ద్వారా పిల్లలను ఎలా వారి పనుల్లో నిమగ్నమయ్యేలా చెయ్యాలో చూద్దాం

ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఇంటిలోనే ఉండి వారి ఆన్లైన్ క్లాస్ లతో చాలా బిజీ గా గడిపేస్తున్నారు , క్లాస్ అయిపోయాక ఇంకేముంది టీవీ లో మునిగిపోయి అలసిపోయి నిద్రపోతున్నారు . ఇంకా ఎన్ని రోజులు ఇలా గడిచిపోతుందో తెలీదు ,కానీ రోజూ వారి పరిస్థితి చూసి మనకు మాత్రం భాధగాను భయం గాను ఉంటుంది .

మామూలు పరిస్థితులలో ఐతే కొంచంసేపు  బయటకు వెళ్ళి ఆడుకొని వస్తారు ,కానీ  ప్రస్తుతం బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు కనుక మనమే మన పిల్లలను ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యేలాగా చేయాలి . అనడానికి చాలా సులభంగా ఉన్నాకూడా ,ప్రయత్నిస్తే చేయడం కూడా సులువే …

 

నాకు తెలిసిన కొన్ని …

పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ :

పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అంటే మళ్ళీ ఆన్లైన్ క్లాస్ లు అనుకుంటే పొరపాటే,మనకు తెలిసినవి కొన్ని చుట్టుప్రక్కల వార్తా పత్రికల్లో కనిపించినవి కొన్ని వారికి నేర్పించవచ్చు అంతే  కాకుండా వారి మనసుకు తోచినవి కొన్ని గీయమంటే వారే గీస్తారు … ఏమో ఎవరికీ తెలుసు ఎవరిలో ఏ విద్య దాగివుందో .

మన పిల్లలకు నేర్పించడానికి మనకు డ్రాయింగ్ అద్భుతంగా రావలసిన పనిలేదు చిన్న చిన్న బొమ్మలు గీసినా సరిపోతుంది … మనము వారికి గీయడం పరిచయం చేయాలి ,వారిని ప్రోత్సహించాలి ఒకవేళ వారికి దానిలో ఇష్టం ఉంటే వారే అల్లుకు పోతారు అద్భుతంగా .

రంగులు వేయడం అంటే ఇష్టపడని పిల్లలు ఎవరువుంటారు చెప్పండి , చక్కగా వారికి పెయింట్ లు ఇచ్చి వారు గీసిన బొమ్మని కలర్ చేయమంటే… వారి ఆనందానికి అవధులు వుండవు . (మొదట్లో వారు ఏది గీసినా చూసి  మెచ్చుకుంటే వారికీ కొంత ఉత్సాహంగా ఉంటుంది ,తరువాత నెమ్మదిగా తప్పులు సరిదిద్దవచ్చు)

For trending painting accessories  click here

 

సింగింగ్ అండ్ డ్యాంసింగ్ :

ఒక వయస్సు వచ్చాక ఎవరైనా పాడడం అంటే సిగ్గుపడతారు కానీ పుట్టుకతోనే అందరికి సంగీతం, నాట్యం అంటే ఆసక్తి ఉంటుందంట. అందుకే మనం ఏది ప్రోత్సహించాలి అన్న చిన్నతనం లోనే మొదలుపెట్టాలి . పాటలు నేర్పించడం అంటే సంగీత పాఠాలు నేర్పించడం అని కాదు మీరు సంగీతం వచ్చినవారైతే  ఎలాగూ నేర్పిస్తారు కానీ రాని  వారు వారికి వచ్చిన పద్యాలు ,సినిమా పాటలు ,దేవుని పాటలు పాడడం ద్వారా పిల్లలకు పాడడం  పై ఇంట్రెస్ట్ కలిగించవచ్చు . పరిచయం చేయడం వరకే మన పని కాదు ప్రోత్సహించాలి కూడా . పాట జీవితం లో చాలా  సందర్భాలలో మనకు తోడుగా వుండి సాంత్వన నిస్తుంది … మీకు తెలుసు కదా

డాన్స్ కూడా అందరు పిల్లలు చాలా ఇష్టపడతారు , దానిలో మంచి ఏదో చెడు ఏదో మనం చిన్నతనం లోనే  చెపితే వారు

చక్కని అందమైన డాన్స్ నేర్చుకుంటారు . (మంచి చెడు అంటే అర్థంఅయింది అనుకుంటున్నాను)

 

 క్రాఫ్టింగ్ :

క్రాఫ్టింగ్ అంటే పిల్లలకే కాదు మనకు కూడా ఇష్టం . వీటిలో చాలా రకాలు వున్నాయి ,క్రాఫ్టింగ్ మొదలు పెడితే టైం ఎలా గడచిపోతుందో  కూడా మనకు, పిల్లలకు తెలీదు . క్రాఫ్టింగ్ చేయడం వల్ల  పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది ,కొత్తవిషయం నేర్చు కోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది . ఎవరివన్నా పుట్టినరోజులు ఉంటే వారి కోసం గ్రీటింగ్ కార్డులు  మరియు చేతితో గిఫ్ట్ లు చేయించవచ్చు .

వీటిలో కొన్ని … క్లే మోల్డింగ్ ,పేపర్ క్రాఫ్టింగ్ , రిబ్బన్ వర్క్ ,…. ఇంకా చాలా

 

రైటింగ్ ,పబ్లిక్ స్పీకింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్:

ఈ ఆక్టివిటీస్ చేయించాలి  అంటే ముందుగా తల్లిదండ్రలమైన మనకు ఆసక్తి ఉండాలి ,ఇవి పిల్లల  జీవితం లో నైపుణ్యం పెంచడానికి చాలా బాగా ఉపయోగ పడతాయి.

మనం పిల్లలకు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చిరాయమనడం  వలన వారిలో సృజనాత్మకత ,భాష మీద పట్టు పెరుగుతుంది ,అదే విషయాన్ని చెప్పమనడం వలన అందరిముందు దైర్యంగా మాట్లాడడం అలవాటుచేసుకుంటారు .

పిల్లలకు రోజు కథలు చెప్పడం వలన వారికి మనకు మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది, వారి స్వభావం మనకు బాగా అర్థం అవుతుంది .. ఏ సందర్భం లో పిల్లలు ఎలా స్పందిస్తారో తెలుస్తుంది . వారిని కూడా సొంతగా కథలు చెప్పమని ప్రోత్సహించాలి అప్పుడు వారిలో క్రియేటివిటీ పెరుగుతుంది . మంచి నీతి  కథల వలన పిల్లల వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది .

 

ప్లాంటేషన్  / నేచర్ టూర్ :

ఇది మన అందరికి అందుబాటులో ఉండేది ,మొక్కల పెంపకం ,మొక్కల పెరుగుదల ,తోట పని   ఇవి అన్ని  మనం రోజు పిల్లలకు చూపించడం వలన పిల్లలకు ప్రకృతి పై అవగాహన పెరుగుతుంది .

 

యుట్యూబ్ \టీవీ :

పిల్లలకు ఇష్టమైన కార్టూన్ లు ,విజ్ఞాన సంభందమైన ప్రోగ్రాం లు వారికి చూపిస్తూ ,వారితో పాటు మనం కూడా కొంతసేపు చూడవచ్చు .

 

కుకింగ్:

మనతో పాటు పిల్లలను వంటగదిలో కూర్చుడి బెట్టు కొని వారికి ఇష్టమైన వంటకాలు చేస్తూ వాటికి సంబందించిన విషయాలు చెప్పవచ్చు . చిన్న చిన్న పనులు వారితో కూడా చేయించవచ్చు .

 

వ్యాయామం/వాకింగ్:

ప్రతి మనిషికి రోజుకి ఒక గంట వ్యాయామం చాలా అవసరం ,మనం కూడా పిల్లలతో కలసి రోజు వ్యాయామం చేయడం వలన శారీరకంగా ,మానసికంగా ఆహ్లాదంగా ఉంటుంది.

 

ఇన్డోర్ గేమ్స్ :

ప్రస్తుతం ఎక్కువ మందికి తెలిసినవి చెస్ ,కేరమ్స్ ,లూడో…  కానీ మనకు  తెలిసిన అష్టాచెమ్మా ,తొక్కుడు బిళ్ళ ,వైకుంఠపాళి ఇంకా కొన్ని పాత ఆటలను పిల్లకు పరిచయం చేసి ఆడించండి . మన బాల్యాన్ని మళ్ళి  గుర్తుచేసుకోండి .

 

అకడమిక్స్:

రోజు చిన్న పిల్లలను ఒక గంట కన్నా  ఎక్కువ చదివించవలసిన అవసరం లేదు ,వారికి ఏ  రోజు పాఠాలు ఆ రోజు చదువు కొనేలాగా అలవాటు చేయండి చాలు . చదువు జ్ఞానం కోసం చదవాలి మార్కుల కోసం కాదు గుర్తించండి .

పిల్లలకు వారి బాల్యాన్ని ,వారికే కానుకగా ఇవ్వండి, … గడిచిన బాల్యం మళ్ళీ  రాదు కదా  . నా ప్రయత్నం కూడా ఇదే ….

 

రోజు కనీసం కొంత సమయమైనా వారితో గడపండి … చిన్న పిల్లలు మన నుండి ఆశించేది ప్రేమతో కూడిన స్పర్శ ,మనం వారి కోసం వెచ్చించే విలువైన సమయం అంతే.

Types of Activities to engage kids at home in Telugu: this article explain how to spend your valuable time with kids .

 

Sireesha.Gummadi

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!