who is che guevara
Spread the love

Contents

చేగువేరా  (విప్లవ కెరటం)

Who is Che Guevara ? Why he is famous? in Telugu this article explains about life of Che Guevara

 

తరచుగా మనకి అక్కడక్కడా కనిపిస్తున్న గంభీరమైన రూపం..

ఎందరో ఆరాధిస్తున్న రూపం..

ఉద్యమం ఎక్కడ మొదలైనా.. అక్కడ కనిపించే రూపం..

ఏముంది ఈ రూపంలో….  ఒక ఉద్యమానికి ఊపిరిపోసే అంత, ఒక నిరాశకు ఆశాభావం జోడించే అంత!!

అనే నా అన్వేషణకి ఫలితం ఈ చేగువేరా (విప్లవ కెరటం).

చేగువేరా ఈయన అసలు పేరు ఎర్నెస్టో గువేరా ,అర్జెంటీనాలో 1928 జూన్ 14న ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. చేగువేరా చిన్నతనం నుండి ఆస్తమాతో బాధపడేవాడు. ఈయన వైద్యవిద్య చదువుతున్నప్పుడు తన స్నేహితుడితో కలసి మోటార్ సైకిల్ మీద దక్షిణ అమెరికా పర్యాటనకు వెళ్లారు. ఈ తొమ్మిదినెలల ప్రయాణం లో చేగువేరా సమాజంలో పేదరికం ఎంత దుర్భరంగా ఉందో, ప్రజలు ధనికుల చేతిలో అధికారుల చేతిలో ఎన్ని యిబ్బందులు పడుతున్నలో ప్రత్యక్షంగా తెలుసుకున్నాడు. విప్లవం ఒక్కటే సమాజం స్థితిగతులు మంచిగా  మార్చగలదని బలంగా నమ్మాడు.

తరువాత మళ్ళ వైద్యవిద్య కొనసాగించి 1953 లో డాక్టర్ పట్టా పొందాడు . ఆ సమయం లో క్యూబా దేశం నియంత బాటిస్టా ఆధీనంలో ఉండేది అక్కడి ప్రజలు బానిసత్వంలో జీవిస్తూ వుండే వారు, వారి విముక్తి  కోసం ఫీడెల్ కాస్ట్రో పోరాటం చేస్తూవుండేవాడు . ఫీడెల్ కాస్ట్రో గురించి తెలుసుకున్న చేగువేరా ఆయన విప్లవ భావాలు నచ్చడంతో , ఫీడెల్ కాస్ట్రోతో కలసి క్యూబా విముక్తి పోరాటంలో పాల్గొన్నాడు . 1956-1959 మధ్యలో నియంత బాటిస్టాకు  ఫీడెల్ కాస్ట్రోకు మధ్య  క్యూబాలో జరిగిన గెరిల్లా పోరాటాల్లో చేగువేరా మిలటరీ కంమాండర్ గా వ్యవహరించాడు అదేవిధంగా డాక్టర్ గాను తన  సేవలు అందించాడు. ఈ సమయం లోనే క్యూబా విప్లవకారులు  ఈయనను చే అనిపిలిచేవారు కారణం  గువేరా ఎవరినన్నా పిలిచే అప్పుడు ‘చే’ అనే అర్జెంటీనా శబ్దం వాడేవాడు అందుకు అందరు ఈయనకు అలా పిలిచేవారు. 1959 లో క్యూబా లో జరిగిన తిరుగుబాటు విజయవంతం అయ్యి క్యూబా స్వతంత్ర అధికారం పొందింది .

స్వతంత్య్ర క్యూబా

కొత్త క్యూబా దేశంలో చేగువేరా జాతీయ బ్యాంకు అధ్యక్షుడుగా పనిచేశాడు తరువాత పరిశ్రమల మంత్రిగా వ్యవహరించారు. 36 ఏళ్ల వయసులో క్యూబా తరపున పాతినిధ్యం వహించి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించారు. తన అసమానమైన భావజాలంతో అక్కడ వున్నవారిని ప్రేరేపించారు . క్యూబా కి ప్రతినిధిగా ఎన్నో దేశాలు పర్యటించారు ,అదేవిధం గా 1959 లో నెహ్రుగారి ఆద్వర్యం లో మన భారత దేశాన్ని సందర్శించారు .

Who is Che Guevara

మళ్ళీ ప్రజలలోకి

క్యూబా దేశం సాధించిన విజయానికి ముగ్దుడై ఈ విజయం , ఈ పోరాట పటిమ , గొరిల్లా యుద్ధ విన్యాసాలు వర్ధమాన దేశాలకు పరిచయం చేయాలని విప్లవ పాఠాలు నేర్పాలనే ఉద్దేశం తో , 1965 లో తన అత్యున్నత స్థానాన్ని , గౌరవాన్ని ,హోదాని వదలి ఫీడెల్ కాస్ట్రో వద్దని వారిస్తున్నా వినకుండా దేశం విడచి వెళ్లి పోయాడు .

కొంతమందితో ఒక సైన్యం ఏర్పాటు చేసి కొంతకాలం ఆఫ్రికాలో వున్నాడు అక్కడ కొన్ని గొరిల్లా పోరాటాల్లో జరిపి విఫలమయ్యాడు.  మళ్ళి 1966 లో దక్షిణ అమెరికాలో బొలివియాలో  నిరంకుశత్వ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్న విప్లవకారులతో   చేతులు కలిపి ఉద్యమానికి నాయకత్వం వహించాడు .  బొలీవియాలో సైనికులకు యుద్ధం లో అంత  నైపుణ్యత లేదు అందుకని చేగువేరా తన  సైన్యం గెలుస్తుంది అనే భావన తో వున్నాడు కానీ బొలివియా సైనికులకు అగ్రరాజ్యం నుండి ఆయుధ బలం లభించడంతో చేగువేరా సైన్యం వారిని  ఎదిరించి లేక పోయింది ఒక్కక్కరుగా చనిపోయారు చేగువేరాకు కూడా బులెట్ గాయం అయింది  , అప్పటి కే  ఆస్తమా వలన చేగువేరా ఆరోగ్యం కూడా క్షీణించింది .

che guevara death :

అదే అదనుగా చేసుకొని బొలివియన్  సైన్యం చెగువేరాని రహస్యంగా  బంధించి ఒక పాడుబడిన గదిలో ఉంచారు . బొలీవియన్ ప్రభుత్వం చెగువేరాను చంపివేయాలని ఆజ్ఞ జారీచేసింది . 1967,అక్టోబర్ 9 న బొలీవియాన్ సైనికుడు  చెగువేరాను చంపడానికి వచ్చాడు అతను చెగువేరాని చూసి మరణం సంభవిస్తుందని అనుకుంటున్నావా అన్నాడు  అందుకు చేగువేరా నేను మరణించినా నా విప్లవ భావాలు ప్రపంచమంతా జీవించేవుంటాయి అన్నాడు గంభీరంగా ,అప్పుడు సైనికుడు చెగువేరాని తొమ్మిది సార్లు తుపాకీతో కాల్చాడు …  ఆ విధంగా చేగువేరా తన తుది శ్వాస విడిచాడు

నిజమైన విప్లవ కెరటం నేలకొరిగింది కానీ ఆయన  యిచ్చిన దైర్యం ,తెగువ జీవించలేక జీవచ్ఛవంలాగ బ్రతికేవాళ్లకు ఆయన యిచ్చిన స్ఫూర్తి మరువలేనిది .

ఒకమనిషి తనకు ఒక స్థిరమైన హోదా కలిగిన లోటులేని  జీవితం  ఉంటే దానిని వదిలి వెళ్లడాన్నికి ఇష్టపడడు ,తాను తన కుటుంబం తన సుఖం అనే భావనలతో వుంటాడు  అని మనం అందరం బలంగా నమ్ముతాం కానీ చేగువేరా ఆ ఆలోచన తప్పులని నిరూపిస్తూ ఒకసారి డాక్టర్ వృత్తిని వదిలి బానిసత్వం లో మగ్గిపోతున్న ప్రజల కోసం  పోరాటం ప్రారంభించాడు మరోసారి తన అత్యున్నతమైన పదవిని తృణప్రాయంగా వదలి నిరంకుశ పాలనలో వున్న ప్రాంతాల లో  ప్రజలకు విప్లవ పాఠాలు నేర్పడానికి వెళ్ళాడు. ఎలా ఎన్నో సార్లు ప్రజలకు ఉన్నత మార్గదర్శాలూ యిచ్చాడు . తన తుది శ్వాసవరకు ప్రజల కొరకు ప్రజల కోసం పోరాడాడు చరిత్రలో విప్లవ పటం  పై తనదయిన ముద్రను వేసి చిరస్ధాయిగా నిలిచాడు .

Who is Che Guevara ? Why he is famous? in Telugu this article explains about life of Che Guevara

చేగువేరా మాటలు: ఒకరి కాలు  క్రింద బానిసలా నీచంగా బ్రతికేకన్నా … లేచి నిలబడి  ప్రాణం విడచి పెట్టడం మేలు .

భయపడడం ఎప్పుడు మానేస్తామో అప్పుడు మన జీవితం మొదలైనట్లు

Sireesha.Gummadi 

Che Guevara Quotes :

“The revolution is not an apple that falls when it is ripe. You have to make it fall.”

“I am not a liberator. Liberators do not exist. The people liberate themselves.”

“At the risk of seeming ridiculous, let me say that the true revolutionary is guided by great feelings of love.”

“Silence is argument carried out by other means.”

“We cannot be sure of having something to live for unless we are willing to die for it.”

“Let me say, at the risk of seeming ridiculous, that the true revolutionary is guided by great feelings of love.”

“The life of a single human being is worth a million times more than all the property of the richest man on earth.”

“If you tremble with indignation at every injustice, then you are a comrade of mine.”

“Words that do not match deeds are unimportant.”

“Every day People straighten up the hair, why not the heart?”

 

T shirt with che guevara

who is che guevara

 

 

who is Elon musk ??

 

error: Content is protected !!