kids story in telugu
Spread the love

Contents

“Yes”మరియు “No”  కథ

Childerns Storie’s in Telugu

“Yes and No ” Story in Telugu for kids|| తెలుగు లో ||

అనగనగా చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న రాజ్యం లో, చిన్న ఊరు వుండేది ఆ ఊరు లో ఒక వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉండేవారు.  వారిలో ఒక అతని పేరు YES, అతను ఊరిలో అందరితో చాలా మంచిగా ఉంటూ వారికి ఎటువంటి అవసరాలైన సహాయం చేస్తూ ఉండేవాడు, ఊర్లో వాళ్ళందరూ YES ను చాలా ఇష్టపడేవారు .

రెండవ కొడుకు పేరు  NO  అతను ఎప్పుడూ పక్క వారి మీద అసూయ పడుతూ, ఎటువంటి పని చేయకుండా, ఎవరికీ సహాయం చేయకుండా ఎప్పుడు బద్దకంగా కూర్చుని ఉండేవాడు.  అతనికి తండ్రి ఏ పని చెప్పినా లేదు ,కాదు అనే సమాధానం చెప్పేవాడు . ఒకరోజు వారి తండ్రి వ్యాపారం పని మీద కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది, అప్పుడు ఆయన తన ఇద్దరు కుమారులు YES మరియు NO ను  దగ్గరకు పిలిచి నేను వేరే ఊరికి వ్యాపార నిమిత్తం కొన్ని రోజులు వెళ్లి వస్తాను ,అప్పటివరకు మీరు మన వద్ద ఉన్న ఆవులను ,గొర్రెలను ఇతర జంతువులను  జాగ్రత్తగా చూసుకో వలసిందిగా చెప్పి అతను వూరు బయలుదేరాడు .

మొదటి రెండు రోజులుYES మాత్రమే ఆవులను మిగిలిన జంతువులను జాగ్రత్తగా చూసుకున్నాడు కానీ NO  మాత్రం చెరువు వద్ద కూర్చొని దానిలో రాళ్ళు విసురుతూ తన సమయాన్నంతా అక్కడే గడిపేవాడు. మరో  రెండు రోజులు గడిచాక వారి వద్ద ఆహారం అంతా అయిపోవడంతో YES ,NO  వద్దకు వచ్చి నేను మన కోసం ఆహారం తీసుకురావడానికి  బయటికి వెళ్తున్నాను నువ్వు ఈ ఆవులను మిగిలిన జంతువులను  జాగ్రత్తగా చూసుకోవలసిన దిగా NO  తో చెప్పి అక్కడి నుంచి ఆహారం కోసం బయలుదేరుతాడు.

YES చెప్పిన మాటలు  NO  ఏమాత్రం పట్టించుకోకుండా ఆవులను బయట వదిలేసి తను మాత్రం వేరే దగ్గరికి వెళ్లి ఖాళీగా కూర్చుని ఉంటాడు.

అప్పుడు..

ఆవులు అన్నీ  అక్కడ ఉన్న రహదారుల మీద పొలాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, అదే సమయానికి ఆ రాజ్యం యొక్క రాజు తన గుర్రపు బండిలో విహారానికి వస్తాడు.  వీరి  ఆవులు వెళ్లి రాజుగారి వాహనానికి అడ్డు  పడే సరికి రాజుగారి గుర్రం బండి క్రిందపడి పోయి, బండి లో ఉన్న రాజు గారు కూడా నేలమీద పడిపోతారు. ఈ పరిణామానికి కంగారు పడిన రాజుగారు అసలు ఏమైంది! అనుకుంటూ ఉండగా ఆయనకు ఆవులు అడ్డు రావడం వల్ల బండి అదుపు తప్పి క్రింద పడిపోయింది అని అర్థమవుతుంది . ఆయన కోపంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలతో ఈ ఆవులు ఎవరివి అని అడగగా ,వారు అప్పుడే అక్కడికి వచ్చిన YES  వైపు చూపిస్తారు ,అక్కడ జరిగిన విషయం అర్థం చేసుకున్న  YES, తాను రాజు ఆగ్రహానికి గురి అవుతానేమో అని భయపడి జరిగిన విషయమంతా పూసగుచ్చినట్లు రాజుగారికి వివరిస్తాడు . విషయం తెలుసుకున్న రాజుగారు జరిగిన దాంట్లో  YES యొక్క తప్పేమీ లేదని గ్రహించినప్పటికీ , ఇదివరకు ఎప్పుడూ రాజుగారు ఇటువంటి ప్రమాదానికి గురి లేదు కనుక   YES మరియు NO పై కోపంతో  తన రాజభవనంలో వారిరువురికి సేవ చేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు .

ఆ క్షణం…

నుంచి  YES మరియు NO  రాజుగారి రాజభవనంలో పని చేయడం ప్రారంభిస్తారు.  YES ప్రతి పనిలోనూ చాలా చురుకుగా ఉంటూ అందరి మన్ననలు పొందుతూ ఉంటాడు కానీ NO మాత్రం తనలో ఎటువంటి మార్పులేకుండా యధావిధిగా ప్రతి పనిని చెడగొడుతూ , ఏ పని సవ్యంగా చేయకుండా అందరి ఆగ్రహానికి లోనవుతూ ఉంటాడు. NO  గురించి ఆరాతీసిన రాజు గారు ఈ ప్రపంచంలో ఇంతకన్నా అయోగ్యుడైన పని వాడు ఎవరికీ దొరకడు అని అనుకుంటూ ఉంటారు .

For more kids stories please visit: తెలుగు కథలు

రోజులు అలా గడుస్తూ  ఉన్నప్పుడు ,ఒక రోజు రాజు గారు తన రాజ భవనంలో ఒక విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంటారు . దానిలో భాగంగా విందుకు కావలసిన రకరకాల వంటకాలు చేయడం కోసం రాజ్యం లో చాటింపు వేయిస్తాడు . ఆ చాటింపు ప్రకారం రకరకాల ప్రదేశాల నుంచి ఎందరో వంటవాళ్ళు వారి రుచికరమైన వంటకాలు తీసుకొనివచ్చి రాజుగారి ద్వారం వద్ద రాజు గారి పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

అప్పుడు రాజుగారికి వారు తీసుకువచ్చిన వంటకాల రుచి చూడ వలసిన సమయం వచ్చినది కనుక వాటిని తీసుకురావడానికి YES మరియు NO ను నియమిస్తారు. ద్వారం దగ్గరవున్న ఏ  వంటవాడు ఐతే  రాజు గారి కి ఇష్టమైన వంటకం పేరు పలుకుతాడో అప్పుడు  రాజుగారు దానిని జాగ్రత్తగా తన వద్దకు తీసుకుని రావడానికి YES ను  వారి వద్దకు పంపుతారు.  ఒకవేళ ద్వారం వద్ద వున్న వంటవాడు రాజుగారికి ఇష్టంలేని వంట పేరు చెప్పినప్పుడు, రాజుగారు దానిని తిరస్కరించాలి అనే  ఉద్దేశంతో వారి వద్దకు NO ను పంపిస్తారు. ఎందుకంటే  NO ఆ వంటకాన్ని తీసుకున్న రాజు గారి వద్దకు వచ్చే సరికి  తన చేతిలో ఉన్న వంటకం మొత్తం నేలపాలు అయిపోతుంది కనుక అప్పుడు రాజుగారు సులభంగా ఆ వంటకాన్ని తిరస్కరించవచ్చు కాబట్టి రాజు గారు ఈ పనికి NO ను ఎంచుకుంటారు .

ఆ విధంగా రాజు గారికి నచ్చిన వంటకం వచ్చిన ప్రతిసారి YES ను పంపిస్తూ ,ఇష్టం లేనిది వచ్చినప్పుడు NO ను పంపిస్తూ వుంటారు . జరిగే విషయమంతా గమనించిన ప్రజలు ఏది అంగీకారం అయితే దానిని YES అనడం ,ఏది అంగీకారం కాకపోతే NO  అని అనడం ప్రారంభించారు.

ఆ విధంగా YES మరియు NO యొక్క వాడుక మొదలయిందని ఒక వ్యక్తి చాలాకాలం క్రితం తన కథలో రాశారు .

నేను ఆ కథను మీకు నచ్చేవిధంగా కొన్ని మార్పులు చేసి రాసాను.

కథ నచ్చితే నా బ్లాగ్ ను తప్పని సరిగా Follow అవ్వండి . ఇంకా చాలా మంచి ,కొత్త కథలు మీకోసం పోస్ట్ చేస్తాను.

 

“Yes and No ” Story in Telugu for kids|| తెలుగు లో ||

3 thoughts on ““Yes and No ” Story in Telugu for kids|| తెలుగు లో ||”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!